అమెరికా కొత్తగా ఆంక్షలు విధించినప్పటికీ మరో రెండు నెలల పాటు రష్యా నుంచి చమురు(Crude Oil) సరఫరాకి సమస్యేమీ ఉండదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మార్చి 12 వరకు అమలయ్యే కాంట్రాక్టులకు వచ్చిన ఇబ్బందేమీ లేదని తెలిపాయి. ఆ తర్వాత నుండి వర్తించే కాంట్రాక్టులపైన కూడా ప్రభావం పడకుండా రష్యా ఈలోగానే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునే అవకాశం ఉందని వివరించాయి. భారత్ తదితర దేశాలకు చమురును చేరవేస్తున్న రెండు రష్యా సంస్థలపై అమెరికా కొత్తగా ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఈ వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది.
ఆంక్షలు ఎదుర్కొంటున్న రెండు సంస్థల్లో ఒకటి మాత్రమే కాస్త చెప్పుకోతగ్గ స్థాయిలో సరఫరా చేస్తుండగా రెండో దాన్నుంచి నామమాత్రంగానే ఉంటోందని సీనియర్ ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు. భారత్‌కు సరఫరా చేసే ఇతర రష్యన్ సంస్థలు, ట్రేడర్లపై ఆంక్షలు లేవని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం నేపథ్యంలో ఆ దేశాన్ని ఆర్థికంగా కట్టడి చేసేందుకు పాశ్చాత్య దేశాలు చమురు సరఫరాలపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. కానీ, ప్రత్యామ్నాయ పద్ధతుల్లో భారత్ తదితర దేశాలకు రష్యా చమురు సరఫరా చేస్తోంది.
ఇదీ చదవండి: డిసెంబర్‌లో టోకు ద్రవ్యోల్బణం అప్
గాజ్ ప్రోమ్ నెఫ్ట్, సుర్గుట్నెఫ్టెగాస్తో సహా రష్యా చమురు ఉత్పత్తిదారులపై, రష్యన్ చమురును రవాణా చేసే సుమారు 180 ట్యాంకర్లపై అమెరికా ఆంక్షలు విధించింది. దీంతో భవిష్యత్తులో రష్యా ముడిచమురు దిగుమతుల్లో 15 శాతం భారత్‌పై ప్రభావం పడనుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. రష్యా క్రూడ్ సరఫరాకు తక్షణ ముప్పు లేనప్పటికీ, ఆంక్షలు సరుకు రవాణా ఖర్చులను పెంచుతాయని, ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకునే చమురును మరింత ఖరీదవుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత రిఫైనరీలు మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, యూఎస్ నుంచి ముడి చమురును దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment