sanctions on russia
-
రష్యా ఔట్! అన్ని దారులు మూసేస్తున్న యూఎస్
US Treasury announced To Close: రష్యా గత కొన్ని నెలలుగా ఉక్రెయిన్ పై నిరవధిక దాడులతో దురాక్రమణకు దిగుతున్న సంగతి తెలిసిందే. దీంతో అమెరికా వంటి ప్రపంచ దేశాలు, ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ న్యాయస్థానం సైతం ముందుకు వచ్చి యుద్ధాన్ని ఆపేయమన్నా ససేమిరా అంటూనే వచ్చింది. రష్యా ఆటకట్టించేలా ఆర్థిక పరంగా ఇబ్బంది పెట్టేలా ప్రపంచ దేశాలు అంతర్జాతీయ లావాదేవీలపై ఆంక్షలు విధించాయి కూడా. అయినా రష్యా ఏ మాత్రం దూకుడు తగ్గించపోగా, యుద్ధ నేరాలకు పాల్పడుతోంది. దీంతో రష్యాను ఆంక్షల నుంచి తప్పించుకోకుండా ఉండేలా దారులన్నింటిని మూసేసింది యూఎస్. అందులో భాగంగానే అమెరికా యూఎస్ ట్రెజరీని మూసేసినట్లు ప్రకటించింది. దీంతో రష్యా విదేశీ రుణాన్ని చెల్లించటానికి యూఎస్ బ్యాంకులోని నిధులను యాక్సెస్ చేసుకునే సామార్థ్యాన్ని నిరోధించింది. ఐతే రష్యా కూడా తన విదేశీ రుణాన్ని రూబెళ్లలోనే చెల్లిస్తానని పేర్కొనడం గమనార్హం. అంతేకాదు రష్యన్ ఆర్థిక వ్యవస్థను ఏజెంట్‌గా ఉంచి చెల్లింపులు నిర్వహిస్తామని రష్యా మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటికే పాశ్చాత్య ఆంక్షలతో రష్యాను అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ నుంచి వేరే చేసింది. మళ్లీ అమెరికా ఈ ప్రకటనతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ని ప్రభుత్వ చెల్లింపులు చేయనీకుండా విదేశీ కరెన్సీ నిల్వల పై యూఎస్ షాకిచ్చింది. ఈ మేరకు రష్యా ఆర్థిక మంత్రి ఆంటోన్ సిలువానోవ్ మాట్లాడుతూ..."రష్యాకు ఎలాంటి స్నేహ పూర్వ వాతావరణం లేకుండా ఒంటరిని చేసింది. ప్రధానంగా రష్యన్ రుణ సాధనాల్లో విదేశీ పెట్టుబడిదారుల హక్కులను కూడా యూఎస్ దెబ్బతీసింది. అయినా మా వద్ద డబ్బు ఉంది. చెల్లింపులు చేయగలం. ఇదేమీ రష్యన్ జీవన నాణ్యతను పెద్దగా ప్రభావితం చేయలేదు" అని చెప్పారు. ఏదీఏమైన రష్యా విదేశీ రుణాన్ని చెల్లించాలంటే చాలా బాండ్లు రూబెళ్లలో చెల్లించడానికి అనుమతించవు. మే 27న రష్యా చెలించాల్సిన తదుపరి విదేశీ రుణం రెండు బాండ్ల పై 100 డాలర్లు వడ్డీ. అందులో ఒక బాండ్‌కి రష్యా డాలర్లు, యూరోలు, పౌండ్లు లేదా స్విస్ ఫ్రాంక్లలో మాత్రమే చెల్లించాలి, మరోదానికి రూబెళ్లలో చెల్లించవచ్చు. మరోవైపు రష్యా కూడా విదేశీ రుణ ఎగవేత (డీఫాల్ట్) తలెత్తకుండా ఉండేలా ఇప్పటికే త్వరితగతిన దేశం నుంచి నిధులను బదిలీ చేసింది. ప్రస్తుతం రష్యా జూన్ చివరినాటి కల్లా 400 డాలర్లు విదేశీ రుణం చెల్లించాలి. ఒకవేళ గ్రేస్ పిరియడ్ లోపు చెల్లించకపోతే డీఫాల్ట్‌గా ప్రకటిస్తుంది. 1918లో బోల్షివిక్ విప్లవ నాయకుడు వ్లాదిమిర్ లెనిన్ పదవీచ్యుతుడైన సమయంలో తొలిసారిగా రష్యాని డీఫాల్ట్‌గా ప్రకటించారు. (చదవండి: పుతిన్‌పై హత్యాయత్నం.. తృటిలో తప్పించుకున్న రష్యా అధ్యక్షుడు?) -
రష్యాతో వాణిజ్యం.. భారత్ సాలిడ్ కౌంటర్
రష్యాతో వాణిజ్య ఒప్పందాల విషయంలో అగ్రరాజ్యానికి భారత్ గట్టి కౌంటరే ఇచ్చింది. రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్ల విషయమై ప్రశ్నించిన అమెరికా.. ఉక్రెయిన్ పరిణామాల నేపథ్యంలో రష్యాను ఎందుకు వ్యతిరేకించడం లేదంటూ నిలదీసింది. అయితే.. ప్రతీ దానికి భారత్‌ను ప్రశ్నించే బదులు, ముందు యూరప్ దేశాలను నిలదీయాస్తే బాగుంటుందని అమెరికాను సున్నితంగా కౌంటర్ ఇచ్చింది భారత్. మంగళవారం భారత్-అమెరికా 2+2 భేటీ తర్వాత ప్రశ్నల సమయంలో.. భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఈ మేరకు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘రష్యాతో ఆయిల్ కొనుగోళ్ల గురించి మీరు ప్రస్తావించినట్లు నా దృష్టికి వచ్చింది. రష్యా నుంచి కొనుగోళ్లను గనుక పరిశీలిస్తే.. ముందు యూరప్ మీద మీరు దృష్టి పెడితే బాగుంటుందని అనుకుంటున్నాం. మేం కేవలం ఎనర్జీ సెక్యూరిటీ కోసమే కొనుగోలు చేస్తున్నాం. కానీ, గణంకాలు మీకు ఆశ్చర్యంగా అనిపించొచ్చు. ఒక నెలలో మొత్తం మేం కొనుగోలు చేస్తే ఎనర్జీ.. యూరప్ దేశాలు ఒక్క పూటలోనే చేస్తున్నాయని. కాబట్టి, ఆ అంశంపై ఆలోచిస్తే మంచిదని జైశంకర్, అగ్రరాజ్యానికి కౌంటర్ ఇచ్చారు. రష్యా చర్యలను భారత్ ఎందుకు వ్యతిరేకించడం లేదన్న ప్రశ్నకూ.. ఆయన స్పందించాడు. సెక్రటరీ బ్లింకెన్ ఎత్తి చూపినట్లుగా.. మేము ఐక్యరాజ్యసమితిలో, చట్ట సభల్లో, ఇతర వేదికలపైనా మా స్థానాన్ని వివరించే దిశగా అనేక ప్రకటనలు చేశాం. అన్నింటా మేం చెప్పింది ఒక్కటే.. ‘మేము యుద్ధ వాతావరణానికి వ్యతిరేకం. చర్చలు, దౌత్యం కొరుకుంటున్నాం. ఏ నేల పైన అయినా సరే.. హింసను తక్షణమే విరమించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ మార్గాలన్నింటిలో మేం సిద్ధంగానే ఉన్నాం’ అని ఆయన స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. భారత్-అమెరికా 2+2 సమావేశం అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఈ మేరకు అమెరికా కార్యదర్శి ఆంటోనీ జే బ్లింకెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ యుద్ధ పరిణామాల నేపథ్యంలో.. మరోసారి ప్రపంచ దేశాలకు అగ్రరాజ్యం తరపున పిలుపు ఇచ్చాడాయన. రష్యాతో ఒప్పందాలకు.. ప్రత్యేకించి ఆయుధ ఒప్పందాలకు సంబంధించి దూరంగా ఉండడం మంచిదని సూచించాడాయన. ఇక భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలు పెరిగిపోతున్నాయని, అమెరికా ఇది నిశితంగా పరిశీలిస్తోందని బ్లింకెన్ వ్యాఖ్యలు చేశారు. అమెరికా ప్రతినిధి ఇల్హాన్ ఒమర్.. మోదీ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేసిన దరిమిలా.. బ్లింకెన్ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ వ్యాఖ్యలపై ఇటు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌గానీ, అటు జైశంకర్‌గానీ స్పందించకపోవడం గమనార్హం. -
అమెరికా వార్నింగ్స్.. భారత్ బేఖాతర్..
ద్రవ్యోల్బణం ఎఫెక్ట్‌తో ఇప్పటికే అనేక వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడి దీనికి తోడు కావడంతో పరిస్థితి మరింతగా దిగజారుతోంది. ఈ తరుణంలో ఇండియా ప్రపంచ వాణిజ్యంలో ధైర్యంగా అడుగులు వేస్తోంది. మన దేశ ప్రయోజనాలే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటోంది. కరోనా సంక్షోభం, ఒపెక్ దేశాల మొండిపట్టు, ఉక్రెయిన్‌పై రష్యా దాడి, మిడిల్ ఈస్ట్‌లో రెచ్చిపోతున్న రెబల్స్ గ్రూపులతో ముడి చమురు ధరలు పెరిగిపోతున్నాయి. ఇదే సమయంలో ప్రపంచ వాణిజ్యంలో రష్యాను ఒంటరిని చేసే లక్ష్యంతో అమెరికా, నాటో దేశాలతో పాటు యూరప్ కంట్రీస్ అనేక ఆర్థిక ఆంక్షలు విధించాయి. రష్యాతో వాణిజ్య లావాదేవీలు క్లోజ్ చేస్తున్నాయి. అంతేకాదు మిగిలిన ప్రపంచ దేశాలు తమ బాటలోనే ప్రయాణించాలని కోరుతున్నాయి. పెరుగుతున్న ముడి చమురు కారణంగా దేశంలో పెట్రో మంట మొదలైంది. ఇదే తీరుగా పెట్రోలు ధరలు పెరిగితే ద్రవ్యోల్బణం తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంది ఇండియాలో. దీంతో ప్రపంచ దేశాలు చేస్తున్న సూచనలకు పక్కన పెట్టి నుంచి డిస్కౌంట్ ధరకు ముడి చమురు కొనేందుకు రెడీ అవుతోంది భారత్. ఈ మేరకు గతంలో జరిగిన ఒప్పందాలతో పాటు కొత్తవి చేసుకునే దిశగా పావులు కదుపుతోంది. రష్యా నుంచి ముడి చమురుతో పాటు ఇప్పుడు కుకింగ్ కోల్‌ను భారీ ఎత్తున దిగుమతి చేసుకునే అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తోంది భారత్. స్టీలు తయారీలో ఉపయోగించే కుకింగ్ కోల్‌ను ఎక్కువగా విదేశాల నుంచి ఇండియా దిగుమతి చేసుకుంటోంది. కుకింగ్ కోల్‌ను భారత్‌కి ఎక్కువగా ఎగుమతి చేస్తున్న దేశాల్లో రష్యా ఆరవ స్థానంలో ఉంది. అయితే తాజాగా యూరప్, అమెరికా ఆంక్షల కారణంగా ఆయా దేశాలకు ఎగుమతి చేయాల్సిన కుకింగ్ కోల్ని తక్కువ ధరకే అందించేందుకు రష్యా రెడీగా ఉంది. దీంతో క్రూడ్ ఆయిల్‌తో పాటు కుకింగ్ కోల్ని రష్యా నుంచి దిగుమతి చేసుకునే అంశాన్ని పట్టాలెక్కించేందుకు రెడీ అవుతోంది. అమెరికా, యూరప్‌తో పాటు ఏషియాలోని జపాన్ సైతం రష్యాపై ఆంక్షలు విధించి వాణిజ్య సంంబంధాలు కట్ చేసుకుంటున్నాయి. తమ బాటలోనే ప్రయాణించాలంటూ ఒత్తిడి తెస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ నేరుగా ఇండియాని ఉద్దేశించి మాట్లాడుతూ.. రష్యాపై ఆంక్షలు విధించే విషయంలో ఇండియా తడబడుతోంది అంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో బైడెన్ మాటలను భారత్ బేఖారు చేస్తోంది. తక్కువ ధరకు ముడి సరుకు లభించే రష్యా నుంచి అధికంగా కుకింగ్ కోల్, ముడి చమురు దిగుమతి చేసుకోవాలని ఇండియా డిసైడ్ అవుతోంది. ఈ మేరకు అమెరికా సూచనలు, సుతిమెత్తని హెచ్చరికలను పక్కన పెట్టింది. చదవండి: Russia Ukraine War: భారత్ వణుకుతోంది.. బైడెన్ సంచలన వ్యాఖ్యలు -
Russia Ukraine War: రష్యా జనజీవనం ఆగమాగం!
‘‘ఇది పూర్తిగా కొత్త తరహా సంక్షోభం. బహుశా మాకిది కొత్తేమో!. కంపెనీలు మూతపడి ఉద్యోగాలు ఊడాయి. ఉపాధి లేక ఆదాయం కోల్పోయాం. నిత్యావసరాలు ప్రియంగా మారాయి. బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. కనీసం అయిన వాళ్లను కూడా ఆప్యాయంగా పలకరించుకోలేకపోతున్నాం..’’ అంటూ అందుబాటులో ఉన్న సోషల్ మీడియా యాప్స్ ద్వారా తమ ఆవేదనను పంచుకుంటున్నారు రష్యన్ ప్రజలు. ఉక్రెయిన్ సంక్షోభ Ukraine Crisis పరిణామాలను ఖండిస్తూ.. ఆంక్షలతో రష్యాను, ఆ దేశ అధ్యక్షుడు పుతిన్‌ను ఇరకాటంలోకి నెట్టేసినట్లు సంబురపడిపోతున్నాయి పాశ్చాత్య దేశాలు, ప్రత్యేకించి అమెరికా. కానీ, ఆ ప్రభావం రష్యన్ సాధారణ ప్రజానీకాన్ని ఆగమాగం చేస్తోంది. ఆంక్షల్ని ఎదుర్కొంటూనే.. ప్రత్యామ్నాయ మార్గాల్లో ముందుకెళ్లాలని భావించిన పుతిన్‌కు విరుద్ధ ఫలితాలే దర్శనమిస్తున్నాయి. ‘సెల్ఫ్ రష్యా’ ప్రణాళిక బెడిసి కొట్టడంతో పాటు ఆ ప్రభావం ఆర్థిక వ్యవస్థను నానాటికీ దిగజారుస్తోంది. ధరలు విపరీతంగా పెరిగిపోయి.. వ్యాపారాలు పడిపోయి.. అయినవాళ్లతో సంబంధాలకు అన్నిమార్గాలు తెగిపోయి నిరాశనిస్పృహలకు లోనవుతున్నారు. ఉద్యోగాల నుంచి.. ► రష్యా దండయాత్రపై ఆగ్రహిస్తూ.. ఆ దేశంపై పాశ్చాత్య దేశాలు పెద్ద ఎత్తున, రికార్డు స్థాయిలో ఆర్థిక ఆంక్షలు విధించాయి. విదేశీ కంపెనీలు తమ తమ కార్యాలయాలు, వ్యాపారాలు మూసేసి వెళ్లిపోతున్నాయి. దీంతో ఉపాధి పోయి లక్షల మంది రోడ్డున పడ్డారు. రష్యాలో మూతపడ్డ కంపెనీలు తెరిపించి ఉపాధి కల్పించాలనుకున్న పుతిన్ ప్రభుత్వ ప్రయత్నాలకు తీవ్ర విఘాతం ఎదురవుతోంది. ముఖ్యంగా ధనికులు తమకు అనుకూల నిర్ణయాలు పుతిన్ నుంచి రాకపోవడంతో సహకారం అందించడం లేదు. ► నిత్యావసరాలకు కొరత ఏర్పడింది. దీంతో ధరలు కొండెక్కాయి. పాల ధరలు రెట్టింపు కాగా, నిత్యావసరాల ధరలు 50-100 శాతం వరకు పెరిగాయి. వాటిని కొనే స్థోమత సామాన్యులకు లేదు. ఔషధాలకూ కొరత ఏర్పడింది. కొన్ని అయితే దొరకట్లేదు కూడా. స్టాక్‌లు లేకపోవడంతో కొన్నింటిపై పరిమితులు విధిస్తున్నారు. ► రష్యాపై ఆంక్షలతో అయినా దారికి తీసుకురావాలన్నది పాశ్చాత్య దేశాల వ్యూహం. అయినా పుతిన్ వెనక్కి తగ్గడం లేదు. ఇది రష్యన్ల రోజువారీ జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తోంది. ► ఏటీఎంల నుంచి రోజువారీ ఉపసంహరణలపై రష్యా సర్కారు ఆంక్షలు అమలు చేసింది. విత్‌డ్రా క్యూలు పెరిగిపోతున్నాయి. దళారులు కమీషన్ బేస్డ్తో కరెన్సీ అందిస్తూ.. అందినంతా జనాల నుంచి లాగేస్తున్నారు. ► పాశ్చాత్య దేశాల ఆంక్షలతో.. రష్యన్ వ్యాపారాలు మనుగడ ఇబ్బందికరంగా మారింది. కరోనా టైం కంటే.. ఈ యుద్ధ సమయంలోనే రష్యా ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. కస్టమర్లు తగ్గిపోతుండడంతో.. ఖర్చులు పెరిగి ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థిక ఆంక్షలతో రష్యాలోని వ్యాపార సంస్థలకు ఆదాయం పడిపోయింది. దీంతో చాలా కంపెనీలు ఉద్యోగులకు వేతనాలను నిలిపివేశాయి. కనెక్షన్ కట్.. కట్.. అమెరికాకు చెందిన సామాజిక మాధ్యమాల సేవలు కూడా రష్యాలో కొన్ని నిలిచిపోగా, మిగిలినవీ పూర్తిగా ఆగిపోయాయి. దీంతో రష్యన్లు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయినట్లుగా భావిస్తున్నారు. గ్లోబల్ సోషల్ మీడియాపై ఎఫెక్ట్ పడడంతో.. రష్యా ఇప్పుడు సొంత మీడియా సంస్థల మీదే ఆధారపడి ఉంది. యుద్ధంతో ఉక్రెయిన్‌పై తమ అధ్యక్షుడు పుతిన్ ఏం సాధిస్తుందో తెలియదుగానీ.. తాము మాత్రం చెప్పుకోలేని కష్టాలు అనుభవిస్తున్నామని వాపోతున్నారు రష్యా ప్రజలు. ఉక్రెయిన్ ప్రజలు ఒకవైపు తినడానికి తిండి లేక అల్లాడిపోతుంటే.. భారీగా పెరిగిపోయిన ధరలతో నిత్యావసరాలను కొనుగోలు చేయలేని ఇబ్బందికర పరిస్థితులు రష్యా ప్రజలకు ఎదురవుతున్నాయి. నాలుగో దశ చర్చలతోనైనా ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదరాలని రష్యాతో పాటు చాలా దేశాలు కోరుకుంటున్నాయి ఇప్పుడు. -
ఉక్రెయిన్ ఆక్రమణ.. రష్యా ఖాతాలో కొ(చె)త్త రికార్డు!
Russia Faced Most Sanctions In The World: ఉక్రెయిన్‌పై యుద్ధం(మిలిటరీ చర్యల) నేపథ్యంలో.. రష్యా అరుదైన రికార్డును ఖాతాలో వేసుకుంది. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ ఆంక్షలు ఎదుర్కొంటున్న దేశంగా ఘనత సొంతం చేసుకుంది(ఇప్పటివరకు). గతంలో ఈ జాబితాలో ఇరాన్, ఉత్తర కొరియా ఉండగా వాటిని ఇప్పుడు దాటేసింది. ఉక్రెయిన్‌పై దాడికి దిగిన పదిరోజుల్లోనే.. ప్రపంచంలో అత్యధిక ఆంక్షలు ఎదుర్కొంటున్న దేశాల జాబితాలో అగ్రస్థానానికి చేరుకుంది రష్యా. ప్రపంచవ్యాప్తంగా ఆంక్షలను లెక్కించే కాస్టెలమ్.ఏఐ (Castellum.ai) గణాంకాల ప్రకారం.. రష్యా.. ప్రస్తుతానికి 5,530 (కొనసాగింపు) ఇరాన్.. అణు కార్యక్రమం, తీవ్రవాదానికి మద్దతు ఇస్తుందన్న ఆరోపణలతో ఇరాన్ గత దశాబ్ద కాలంగా 3,616 ఆంక్షలను ఎదుర్కొంటోంది. సిరియా ఉత్తరకొరియా వెనిజులా మయన్మార్ క్యూబా.. ఇలా ఉంది లిస్ట్. ► ఉక్రెయిన్‌పై సైనిక చర్యకు ఫుల్స్టాప్ పెట్టాలని అమెరికా, యూరోపియన్ దేశాలన్నీ చేస్తున్న విజ్ఞప్తిని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బేఖాతరు చేస్తూ వస్తున్నాడు. అందుకే.. తమ పొదిలో ఉన్న ఆంక్షలనే ఆయుధాలతో విరుచుకుపడుతున్నాయి పాశ్చాత్య దేశాలు. అయినప్పటికీ రష్యా మాత్రం తగ్గేదేలే అంటోంది. ► ఫిబ్రవరి 22 నుంచి అమెరికా, యూరోపియన్ మిత్రదేశాలు రష్యాపై 2,778 కొత్త ఆంక్షలను విధించాయి. దీంతో మొత్తంగా రష్యాపై ఆంక్షల సంఖ్య 5,530ని దాటేసింది. ► రష్యా ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితిపై ‘ఇది ఆర్థిక అణుయుద్ధం, చరిత్రలో అతిపెద్ద ఆంక్షల ఘటన’.. అంటూ ఒబామా, ట్రంప్ హయాంలో మాజీ ట్రెజరీ డిపార్ట్మెంట్ అధికారి పీటర్ పియాట్స్కీ అభివర్ణిస్తున్నారు. ► ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించిన రెండు వారాల్లోనే రష్యా ప్రపంచ దేశాల ఆంక్షలకు లక్ష్యంగా మారడం గమనార్హం. రష్యా, ఇరాన్ తర్వాత అత్యధిక ఆంక్షలు ఎదుర్కొంటున్న దేశాల జాబితాలో సిరియా, ఉత్తరకొరియా, వెనిజులా, మయన్మార్, క్యూబా ఉన్నాయి. ఓవైపు శాంతి చర్చలు కొనసాగిస్తూనే.. మరోవైపు ఉక్రెయిన్ నగరాలపై క్షిపణి దాడులతో విరుచుకుపడుతోంది రష్యా. చదవండి: అయ్యా పుతిన్..మనదగ్గర బేరాల్లేవమ్మా! -
పుతిన్‌తో సంబంధాలు.. ఆస్తులు అమ్ముకుంటున్న రష్యన్ బిలియనీర్లు
ప్రపంచం మొత్తం వారిస్తున్న వినకుండా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌పై దాడికి దిగాడు. దీంతో అతనికి దగ్గరి వారిగా పేరొందిన అందరినీ టార్గెట్ చేస్తున్నాయి వెస్ట్రన్ కంట్రీస్. ముఖ్యంగా రష్యన్ బిలియనీర్లు పుతిన్‌తో ఉన్న సంబంధాల కారణంగా చిక్కుల్లో పడుతున్నారు. ఇంగ్లండ్ దేశంలో ఫుట్‌బాల్ ఆటకు ఎనలేని క్రేజ్ ఉంది. అక్కడ క్లబ్ స్థాయిల్లో జరిగే లీగ్‌లకు ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ స్థాయిలో హడావుడి ఉంటుంది. ప్రతీ క్లబ్‌కి పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ ఉంటారు. ఇలా ఫుల్ క్రేజ్ ఉన్న ఫుట్‌బాల్ క్లబ్స్‌లో చెల్సియా ఒకటి. లండన్‌లో ఈ క్లబ్‌ని 1905లో నెలకొల్పారు. ఈ క్లబ్‌ని రష్యాకి చెందిన అబ్రామోవిచ్ అనే బిలియనీర్ 2003లో కొనుగోలు చేశాడు. అబ్రామోవిచ్ చేతికి వెళ్లిన తర్వాత ఈ క్లబ్ జాతకం మారిపోయింది. ఇంగ్లండ్ ఫుట్‌బాల్ క్లబ్లో ఫుల్ క్రేజ్ సొంతం చేసుకుంది. 19 ఏళ్ల కాలంలో అనేక లీగుల్లో సత్తా చాటింది. 19 ట్రోఫీలను గెలుచుకుంది. క్లబ్‌ను విజయ ప్రస్థానంలో నడిపించడంలో దాని ఓనర్ రష్యన్ బిలియనీర్ అబ్రామోవిచ్ మనసు పెట్టి పని చేశారు. అయితే ఉక్రెయిన్‌పై రష్యా ఏకపక్ష దాడులను నాటో సభ్య దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా, యూకేలు రష్యాపై గరంగరంగా ఉన్నాయి. వరుస పెట్టి రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధిస్తున్నారు. తమ దేశంలో ఉన్న రష్యన్ దేశస్థుల ఖాతాలను స్థంభింపజేస్తున్నారు. పలు బ్యాంకులు రష్యన్ సంస్థలకు సంబంధించిన లావాదేవీలు ఆపేస్తున్నాయి. రష్యా దాడితో ఒక్కసారిగా ఆ దేశ బిలియనీర్లు జాతకం మారిపోయింది. వారి బ్యాంకు ఖాతాలు పని చేయడం లేదు. ముఖ్యంగా పుతిన్‌కి దగ్గర వాడిగా పేరున్న అబ్రామోవిచ్పై కఠిన చర్యలకు యూకే అథారిటీలు రెడీ అయ్యాయి. ఈ పరిస్థితుల్లో చెల్సియా క్లబ్‌ను విజయవంతంగా నడిపించడం కష్టమని అబ్రమోవిచ్ భావించారు. దీంతో చెల్సియా క్లబ్‌ని అమ్మేయాలని నిర్ణయం తీసుకున్నాడు. ఆర్థిక సమస్యలు, ఆంక్షల ప్రభావం చెల్సియాపై పడకూడదనే ఉద్దేశంతోనే ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని, రష్యా దాడుల ప్రభావంతో ఒక్క సారిగా పరిస్థితులు మారిపోయాయని అబ్రామోవిచ్ అంటున్నారు. తాజా నిర్ణయం మనసుకు ఎంతో కష్టంగా ఉన్నా తప్పడం లేదంటూ వాపోతున్నారు. రష్యా అధ్యక్షుడికి సన్నిహంతా మెలుగుతూ ఇంత కాలం ప్రభను అనుభవించిన బిలియనీర్లు ఇప్పుడు కష్టాలు ఎదుర్కొంటున్నారు. రెండు రోజుల క్రితం స్పెయిన్‌లో రష్యాకు చెందిన ఆయుధాల సరఫరా వ్యాపారికి చెందిన రూ. 59 కోట్ల విలువైన అధునాతన యాచ్‌ని అందులో పని చేసే సిబ్బంది సముద్రంలో ముంచి వేసేందుకు ప్రయత్నించారు. రష్యా దాడులకు నిరసనగా ఆ యాచ్ మెయింటనెన్స్ పనులు చూస్తున్న ఉక్రెయిన్ ఇంజనీరు ఈ పని చేసినట్టు దర్యాప్తులో తేలింది. మొత్తంగా రష్యన్ బిలియనీర్లు ప్రపంచ వ్యాప్తంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. -
క్రూడ్ మోత.. పెట్రో వాత..
ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీని ప్రభావంతో దేశీయంగా కూడా పెట్రోల్, డీజిల్ రేట్లకు రెక్కలు రానున్నాయి. అయిదు రాష్ట్రాల ఎన్నికలు ముగిశాక వచ్చే వారం నుంచి మళ్లీ రోజువారీ పెట్రో వాత మొదలు కావచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. రేట్ల పెంపు రూ. 6–10 శ్రేణిలో ఉండొచ్చని అభిప్రాయపడుతున్నాయి. న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌తో ఉద్రిక్తతల వల్ల కావచ్చు లేదా పాశ్చాత్య దేశాలు విధించే ఆంక్షల వల్ల కావచ్చు రష్యా నుంచి ముడి చమురు, గ్యాస్ సరఫరా దెబ్బతినే అవకాశం ఉందని అంతర్జాతీయంగా మార్కెట్లో ఆందోళన నెలకొంది. దీంతో క్రూడాయిల్ రేటు బ్యారెల్‌కు ఏకంగా 110 డాలర్ల పైకి ఎగిసింది. 2014 తర్వాత ముడి చమురు ధర ఈ స్థాయికి ఎగియడం ఇదే ప్రథమం. ఇక భారత్ కొనుగోలు చేసే రకం క్రూడాయిల్ రేటు, ఎన్నికల హడావిడి ప్రారంభం కావడానికి ముందు .. అంటే.. గతేడాది నవంబర్‌లో పెట్రోల్, డీజిల్ రేట్లను రోజువారీ సవరించడం నిలిపివేసే నాటికి, సగటున 81.5 డాలర్ల స్థాయిలో ఉండేది. తాజాగా చమురు శాఖ గణాంకాల ప్రకారం ఇండియన్ బాస్కెట్ క్రూడాయిల్ ధర మార్చి 1న బ్యారెల్‌కు 102 డాలర్ల పైకి చేరింది. ఈ నేపథ్యంలోనే దేశీయంగా పెట్రోల్, డీజిల్ రేట్లకు రెక్కలు రానున్నాయని భావిస్తున్నారు. క్రూడాయిల్ 1 డాలర్ పెరిగితే.. సాధారణంగా ముడిచమురు ధర బ్యారెల్‌కు 1 డాలర్ మేర పెరిగితే .. లీటరు ఇంధనం రేటు 48–52 పైసల చొప్పున పెరుగుతుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ రంగ ఇంధన రిటైలింగ్ సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్), హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్)లకు పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు సాధారణంగా లభించే రూ. 2.5 మార్జిన్ కాకుండా రూ. 5.7 మేర నష్టం వస్తోంది. దీంతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల మార్కెటింగ్ మార్జిన్లు తిరిగి మామూలు స్థాయికి రావాలంటే ఇంధనాల రిటైల్ ధరలను లీటరుకు రూ. 9 (10 శాతం) మేర పెంచాల్సి రావచ్చని బ్రోకరేజీ సంస్థ జేపీ మోర్గాన్ పేర్కొంది. ‘ఈ పరిస్థితిని నెగ్గుకు రావాలంటే ఎక్సయిజ్ డ్యూటీ స్వల్పంగా (లీటరుకు రూ.1–3) తగ్గించి, రిటైల్ రేట్ల పెంచే వ్యూహం అనుసరించే అవకాశం ఉంది. రాష్ట్రాల ఎన్నికలు వచ్చే వారం ముగియనుండటంతో అప్పట్నుంచి రోజువారీగా రేట్ల పెంపు మళ్లీ మొదలు కావచ్చు‘ అని తెలిపింది. మరికొన్ని వర్గాలు రేట్ల పెంపు రూ. 6–10 స్థాయిలో ఉండొచ్చని అంచనా వేశాయి. ఉత్తర్ ప్రదేశ్‌లో తుది విడత పోలింగ్ ఫిబ్రవరి 7న ముగియనుండగా, ఓట్ల లెక్కింపు మార్చి 10న జరగనుంది. సాధారణంగా ఆయిల్ కంపెనీలు.. పెట్రోల్ రేట్లను రోజువారీ ప్రాతిపదికన మారుస్తుంటాయి. కానీ అయిదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి రికార్డు స్థాయిలో దాదాపు 118 రోజులుగా పెంచలేదు. ఢిల్లీలో ప్రస్తుతం పెట్రోల్ ధర లీటరుకు రూ. 95.41, డీజిల్ రేటు రూ. 86.67గా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఎక్సయిజ్ డ్యూటీ, వ్యాట్ రేటును కొంత తగ్గించడంతో ఈ రేట్లు అమలవుతున్నాయి. లేకపోతే పెట్రోల్ ధర ఆల్ టైమ్ గరిష్ట స్థాయి రూ. 110.04, డీజిల్ రేటు రూ. 98.42గా ఉండేది. అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడాయిల్ రేటు గతేడాది అక్టోబర్ 26న 86.40 డాలర్ల గరిష్ట స్థాయికి చేరినప్పుడు దానికి అనుగుణంగా ఈ రేట్లను సవరించారు. రూపాయికి చమురు సెగలు అంతర్జాతీయంగా బ్యారెల్ చమురు ధర 110 డాలర్లకు చేరుకోవడం ఫలితంగా డాలర్ మారకంలో రూపాయి విలువ భారీగా క్షీణిస్తోంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధ అనిశ్చితుల నేపథ్యంలో భగ్గుమన్న చమురు ధరలతో భార త్ దిగుమతుల బిల్లు మరింత భారంగా మారుతోంది. తద్వారా కరెంట్ ఖాతా లోటు పెరుగుతుందనే భయాలతో రూపాయి ఒత్తిళ్లను ఎదుర్కొంటోంది. ఈ పరిణామాల నేపథ్యంలో రూపాయి బుధవారం 47 పైసలు పతనమై 75.80 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 53 పైసలు నష్టపోయి 75.86 కనిష్టాన్ని తాకింది. రష్యా ఎఫెక్ట్ .. అంతర్జాతీయంగా చమురు ఉత్పత్తిలో రష్యా వాటా 10 శాతం వరకూ ఉంటుంది. యూరప్‌లో సహజ వాయువు ఉత్పత్తిలో మూడో వంతు వాటా రష్యాదే. భారత్ దాదాపు 85 శాతం క్రూడాయిల్ అవసరాల కోసం దిగుమతులపైనే ఆధారపడుతున్నప్పటికీ .. రష్యా నుంచి కొనుగోలు చేస్తున్నది చాలా తక్కువే. 2021లో రష్యా నుంచి కేవలం 43,400 బ్యారెళ్లు (మొత్తం చమురు దిగుమతుల్లో సుమారు 1 శాతం) దిగుమతి చేసుకుంది. రష్యా నుంచి బొగ్గు దిగుమతులు 1.8 మిలియన్ టన్నులుగా (మొత్తం బొగ్గు దిగుమతుల్లో 1.3 శాతం) ఉంది. రష్యా నుంచి భారత్ 2.5 మిలియన్ టన్నుల ద్రవీకృత సహజ వాయువు కూడా దిగుమతి చేసుకుంది. భారత్ ఎక్కువగా సౌదీ అరేబియా, ఇరాక్, ఇతర మధ్య ప్రాచ్య, ఆఫ్రికా, ఉత్తర అమెరికా దేశాల నుంచి క్రూడాయిల్‌ను కొనుగోలు చేస్తోంది. కాబట్టి ప్రస్తుతం సరఫరాపరమైన సమస్యలేమీ భారత్‌కు లేవు. కానీ రష్యా నుంచి వచ్చే క్రూడాయిల్, గ్యాస్ తగ్గిపోవడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో వీటికి డిమాండ్, దానికి అనుగుణంగా రేటూ పెరిగిపోతోంది. ఇదే ప్రస్తుతం భారత్‌ను కలవరపర్చే అంశం. సరఫరా ఉన్నా .. తగ్గని ఆందోళన.. రష్యా నుంచి సరఫరాకు అవాంతరాల వల్ల వినియోగదారులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో అమెరికా సహా అంతర్జాతీయ ఇంధన ఏజెన్సీ (ఐఈఏ)లోని 31 సభ్య దేశాలు తమ దగ్గరున్న నిల్వల్లో 60 మిలియన్ బ్యారెళ్ల ఆయిల్‌ను అందుబాటులోకి తేవాలని నిర్ణయించాయి. అయినా క్రూడ్ రేటు పరుగు ఆగలేదు. ఫ్యూచర్స్ మార్కెట్లో బ్రెంట్ ధర బుధవారం ఒక దశలో 6.50% ఎగిసి 111.7 డాలర్లకు చేరింది. దేశీయంగా మల్టీ కమోడిటీ ఎక్సే్చంజీలోను మార్చి డెలివరీ కాంట్రాక్టు రూ. 436 (5.5 శాతం) పెరిగి రూ. 8,341 వద్ద ట్రేడయ్యింది. ఐఈఏ అదనంగా అందించే క్రూడాయిల్ ఏ మూలకూ సరిపోదని, రష్యా ఆరు రోజుల్లో 60 మిలియన్ బ్యారెళ్లకు మించి ఉత్పత్తి చేస్తుందని అంచనా. 150 డాలర్లకూ పెరగొచ్చు.. అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికానికి ముడిచమురు రేటు 86 డాలర్లకు దిగి రావచ్చని జేపీ మోర్గాన్ అంచనా వేస్తోంది. అయితే, రష్యా నుంచి ఇంధన ఎగుమతులు నిల్చిపోతే ధర 150 డాలర్లకు కూడా ఎగియవచ్చని పేర్కొంది. ‘స్థూలంగా చెప్పాలంటే రష్యా ఆయిల్ సరఫరా పూర్తిగా నిల్చిపోతే (ఇరాన్ ఎగుమతులు మళ్లీ పునరుద్ధరించి, వ్యూహాత్మక చమురు నిల్వలను వాడుకుంటే పాక్షికంగా తగ్గవచ్చు) ముడి చమురు రేటు బ్యారెల్‌కు 150 డాలర్లకు పెరగొచ్చు. అలా కాకుండా ఇంధన లావాదేవీలను వదిలేసి.. ఆంక్షలను మిగతా విభాగాలకే పరిమితం చేస్తే మాత్రం ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో రేటు సగటున 110 డాలర్ల స్థాయిలో తిరుగాడవచ్చు. అప్పుడప్పుడు 120 డాలర్ల స్థాయినీ తాకుతుండవచ్చు‘ అని జేపీ మోర్గాన్ పేర్కొంది. ఉత్పత్తి పెంపుపై ఒపెక్ మల్లగుల్లాలు.. ఇంధన కొరత పరిస్థితిని చక్కదిద్దేందుకు చమురు ఉత్పత్తి దేశాల కూటమి ఒపెక్ దృష్టి పెట్టింది. ఉత్పత్తిని ఎంత మేర పెంచాలన్న దానిపై కసరత్తు చేస్తోంది. రేటు పెరగడమనేది ఉత్పత్తి దేశాలకు లాభదాయకమే అయినప్పటికీ దీనివల్ల వినియోగ దేశాలపై భారం పెరిగి అవి మాంద్యంలోకి జారుకుంటే, ఆయిల్‌కు డిమాండ్ పడిపోయే ప్రమాదం కూడా ఉందనే అభిప్రాయం నెలకొంది. ఒపెక్ దేశాలు చాలా ఆచి తూచి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని టఫ్ట్స్ యూనివర్సిటీలోనిక్లైమేట్ పాలసీ ల్యాబ్ ఎండీ అమీ మయర్స్ అభిప్రాయపడ్డారు. అటు ఉక్రెయిన్‌పై దాడుల కోసం రష్యాకు భారీగా ఇంధనం అవసరం అవుతుంది కాబట్టి అది ఎక్కువగా ఎగుమతులు కూడా చేయలేకపోవచ్చని ఆమె తెలిపారు. అలాంటప్పుడు ఆ కొరతను ఎవరు భర్తీ చేస్తారన్నది కూడా ఆలోచించాల్సిన అంశమన్నారు. ప్రస్తుతానికైతే సౌదీ అరేబియాకు భారీ ఉత్పత్తి సామర్థ్యం ఉందని పేర్కొన్నారు. -
ఆర్థిక యుద్ధాలే.. అసలైన యుద్ధాలు
మాస్కో: ఉక్రెయిన్‌పై రష్యా భీకర పోరు చేస్తూ ఉంటే, నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రష్యాపై ఆర్థిక యుద్ధం మొదలైందన్న ఫ్రాన్స్ ఆర్థిక మంత్రి బ్రూనో లే మేరి ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. రష్యా ఆర్థిక వ్యవస్థని కుప్పకూలుస్తామన్నారు. దీనిపై రష్యా మాజీ అధ్యక్షుడు, రష్యా భద్రతా మండలి డిప్యూటీ చైర్మన్ దిమిత్రి మెద్వెదెవ్ తీవ్రంగా ప్రతిస్పందించారు. ‘‘రష్యాపై ఆర్థిక యుద్ధమని అంటున్నవారు కాస్త నోరు అదుపులో ఉంచుకోవాలి. ఆర్థిక యుద్ధాలే అసలైన యుద్ధాలకి దారితీస్తాయి. చరిత్ర ఇదే నిరూపించింది’’ అని ట్విట్టర్లో హెచ్చరించారు. -
రష్యాపై ఆంక్షలు.. అమెరికాకు గట్టి షాక్!
ఉక్రెయిన్ పరిణామాల్లో ఆర్థిక, ఇతర ఆంక్షలతో రష్యాను ఇరుకున పెడుతున్నామని అమెరికా సహా పాశ్చాత్య దేశాలన్నీ సంబుర పడుతున్నాయి. ఈ తరుణంలో అగ్రరాజ్యానికి ఊహించని షాక్ తగిలింది. ఊహించని మద్దతు రష్యాకు లభించింది. ఉత్తర అమెరికా దేశం మెక్సికో.. రష్యాపై ఆర్థిక ఆంక్షలను తీవ్రంగా ఖండించింది. అంతేకాదు ఉక్రెయిన్‌పై దాడులకుగానూ రష్యాపై తమ ప్రభుత్వం ఎలాంటి ఆర్థిక ఆంక్షలు విధించబోదని మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడోర్, మంగళవారం ఒక స్పష్టమైన ప్రకటన చేశారు. ‘‘ప్రపంచంలోని అన్ని ప్రభుత్వాలతో మేం(మెక్సికో) మంచి సంబంధాలను కొనసాగించాలని అనుకుంటోంది. ఈ సంక్షోభానికి సంబంధించి అందరితో చర్చించే స్థితిలో మేం ఉన్నాం’’ అని లోపెజ్ తెలిపారు. అంతేకాదు రష్యా మీడియా ఉక్రెయిన్ దాడుల విషయంలో అసత్య కథనాలు ప్రసారం చేస్తోందన్న ఆరోపణలను సైతం మెక్సికో అధ్యక్షుడు తోసిపుచ్చారు. ఆ వాదనతో నేను అంగీకరించను. రష్యానే కాదు.. ఏ దేశం అలా చేయదు. మీడియా స్వేచ్ఛను గొంతు నొక్కే అధికారం ఏ ప్రభుత్వానికి లేదు అని లోబెజ్ బబ్రాడోర్ స్పష్టం చేశారు. అంతేకాదు అమెరికా, యూరోపియన్ దేశాలు తీసుకుంటున్న పలు నిర్ణయాలపైనా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశాడు. తద్వారా మెక్సికో వాణిజ్యానికి తీవ్ర అవాంతరం ఎదురవుతోందని ఆయన అంటున్నారు. ఇక ఉక్రెయిన్‌లో బలప్రయోగాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించిన మెక్సికో.. రాజకీయ పరిష్కారానికి పిలుపునిస్తోంది. ఇదిలా ఉండగా.. మెక్సికోలో రష్యా పెట్టుబడి దాదాపు 132 మిలియన్ డాలర్లుగా ఒక అంచనా. ఇక ద్వైపాక్షిక వాణిజ్యం విలువ 2.4 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువే అని అంచనా. చదవండి: జనాల్ని చంపేస్తున్నాం.. భయంగా ఉందమ్మా! -
పుతిన్ యుద్దోన్మాదం.. బిక్కుబిక్కుమంటున్న రష్యన్ బిలియనీర్లు
ఆర్థిక ఆంక్షల నేపథ్యంలో రష్యా వెలుపల భారీగా ఆస్తులు కలిగి ఉన్న రష్యన్ బిలియనీర్లు బిక్కుబిక్కుమంటున్నారు. తమ వ్యాపార సామ్రాజ్యాలకు ఎక్కడ బీటుల వారుతాయోనని, తమ ఆస్తులు జప్తు చేస్తారేమోననే భయాలు వెంటాడుతున్నాయి. ప్రపంచం మొత్తం వారిస్తున్నా ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించారు రష్యా అధ్యక్షుడు పుతిన్. రష్యన్ సైనిక దళాల తీరుతో ఉక్రెయిన్‌లోని నగరాలపై బాంబుల వర్షం కురుస్తోంది. మరోవైపు రష్యా తీరును నిరసిస్తూ అమెరికా, యూరోపియన్ యూనియన్‌తో పాటు అనేక దేశాలు ఆర్థిక ఆంక్షలు విధిస్తున్నాయి. వీటి ప్రభావం రష్యన్ బిలియనీర్లపై భారీగా పడనుంది. ఆర్థిక ఆంక్షల వల్ల ఎక్కువగా ప్రభావితమయ్యే రష్యన్ కుబేరుల్లో ఈ నలుగురు ముందు వరుసలో ఉన్నారు. అలిషర్ ఉస్మానోవ్ రష్యన్ మెటల్ టైకూన్‌గా పేరున్న అలిషర్ ఉస్మానోవ్ 14 బిలియన్ డాలర్ల సంపద కలిగి ఉన్నారు. భవిష్యత్తును ముందుగానే ఊహించిన ఆయన ప్రారంభం దశలో ఉన్నప్పుడే అమెరికన్ కంపెనీ ఫేస్బుక్లో భారీగా ఇన్వెస్ట్ చేశారు. లండన్‌లో 300 మిలియన్ డాలర్ల విలువ చేసే ఎస్టేట్స్‌ని కలిగి ఉన్నారు. అదృష్టవశాత్తు ఇటీవల బ్రిటిష్ సాకర్ క్లబ్లో తన వాటాలు అమ్ముకుని 700 మిలియన్ డాలర్ల సొమ్మును వెనక్కి తీసుకున్నాడు. మిఖైల్ మరాటోవిచ్ ఫ్రిడ్మ్యాన్ రష్యలో ప్రైవేట్ బ్యాంకర్‌గా ఫేమస్ మిఖైల్ మరాటోవిచ్ ఫ్రిడ్మ్యాన్. 11.4 బిలియన్ డాలర్ల సంపద కలిగిన ఈ బిజినెస్ టైకూన్‌కి పాటు ఇజ్రాయిల్ సిటిజన్‌షిప్ ఉంది. ఆది నుంచి ఉక్రెయిన్‌పై రష్యా దాడిని విమర్శిస్తున్న బిజినెస్‌మ్యాన్‌గా ముద్ర పడ్డారు. ఎక్కువ కాలం రష్యా వెలుపలే జీవిస్తుండటంతో పుతిన్ పాలనకు వ్యతిరేకంగా చాలా సార్లు గళం విప్పారు. ఈయనకు రష్యా లోపల వెలుపల విలువైన ఆస్తులు ఉన్నాయి. అమెరికా మిత్ర పక్షాలతో పాటు రష్యా ప్రభుత్వం నుంచి కూడా మిఖైల్కి ఇబ్బందులు తప్పవని నిపుణులు అంటున్నారు. పీటర్ అవెన్ రష్యా దేశంలో రాజకీయ ప్రాబల్యం కలిగిన వ్యాపారవేత్తల్లో పీటర్ అవెన్ ఒకరు. ఆల్ఫా బ్యాంక్ గ్రూపుని నిర్వహిస్తున్న ఈయన సంపద 4.3 బిలియన్ డాలర్లుగా ఉంది. ఎకామిస్ట్, రైటర్‌గా అనే విభాగాల్లో ప్రావీణ్యం కలిగిన పీటర్ అవెన్ మరో వివాస్పద బిజినెస్ టైకూన్ మిఖైల్ మరాటోవిచ్తో అనేక వ్యాపారాల్లో భాగస్వామిగా ఉన్నారు. రష్యా దాడి కారణంగా ఇంటా బయట ఈయనకు ఉక్కపోత ఎదురువుతోంది అలెక్సీ మర్ధాషోవ్ రష్యాలో స్టీలు ఉత్పత్తిదారుల్లో ఒకటైన సివర్స్టాల్లో భాగస్వామిగా ఉన్నారు లెక్సీ మర్దాషోవ్. మరో ప్రముఖ కంపెనీ టీయూఐలో 30 శాతం వాటాలు ఉన్నాయి. ప్రపంచలోనే అతి పెద్ద ట్రావెల్ టూరిజం కంపెనీలు ఆయన సొంతం. ఈయన నికర సంపద 29 బిలియన్ డాలర్లుగా ఉంది. ట్రావెల్ కంపెనీ యజమానిగా, స్టీలు ఉత్పత్తిదారుడిగా పలు దేశాలతో అలెక్సీ కంపెనీలు లావాదేవీలు నిర్వహిస్తుంటాయి. ప్రస్తుత పరిస్థితుల్లో బ్యాంకులు సైతం రష్యాతో సంబంధాలు తెంచుకోవడం అలెక్సీకి మింగుడుపడటం లేదు. చదవండి: రష్యా ఆర్థిక పరిస్థితి అతలాకుతలం -
రష్యాపై అమెరికా ఆంక్షలు.. మనోడిదే కీలక పాత్ర
ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో రష్యా, పుతిన్ స్వతంత్ర్య రాజ్యాలుగా గుర్తించిన తూర్పు ఉక్రెయిన్ తిరుగుబాటు ప్రాంతాలపై అమెరికా ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఆంక్షల విధింపులో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ తరపున కీలకంగా వ్యవహరించింది భారత సంతతికి చెందిన వ్యక్తే కావడం విశేషం. ఆయనే ఆర్థిక సలహాదారు దలీప్ సింగ్. ఇండో-అమెరికన్ అయిన దలీప్ సింగ్.. నేషనల్ ఎకనమిక్ కౌన్సిల్ డిప్యూటీ డైరెక్టర్‌గా, ఇంటర్నేషనల్ ఎకనమిక్స్ విభాగానికి డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్‌గా ఉన్నారు. గత కొన్నిరోజులు ఉక్రెయిన్ ఉద్రిక్తతల నేపథ్యంలో వైట్ హౌజ్ ప్రెస్ రూమ్‌లో దలీప్ రెండుసార్లు కనిపించారు. రష్యాపై ఆర్థిక ఆంక్షల వ్యవహారంలో బైడెన్‌కు ప్రతీది దగ్గరుండి క్షుణ్ణంగా వివరించడంతో పాటు, ఏ మేర అమలు చేయాలనే విషయాలపై కీలక సూచనలు ఇచ్చింది ఈయనే. అంతేకాదు ఆ అమలును బైడెన్ తర్వాత ప్రపంచానికి ప్రకటించింది దలీప్ సింగ్ కావడం విశేషం. దలీప్ ఏం చెప్పాడంటే.. ‘‘ఉక్రెయిన్‌పై రష్యా దీర్ఘకాలంగా సమీక్ష తర్వాత దండయాత్ర మొదలుపెట్టింది. దానికి మా స్పందనే ఇది. ఇవాళ అధ్యక్షుడు (జో బైడెన్) మిత్రదేశాలు.. భాగస్వాములతో చర్చించి త్వరగతిన ప్రతిస్పందించారు. ఈ చర్యలు చరిత్రలో నిలిచిపోయేవి. ఒక నిర్ణయాత్మక ప్రతిస్పందన కోసం వారాల నుంచి నెలలు పట్టింది.. అంటూ మొదలుపెట్టి సుదీర్ఘంగా ప్రసంగించారు దలీప్ సింగ్. జర్మనీతో రాత్రికి రాత్రే సంప్రదింపులు జరిపి.. పైప్లైన్ల ఆపరేషన్లను నిలిపివేయించాం. ఆపై ఆర్థిక ఆంక్షలు విధించాం. బిలియన్ల డాలర్లు విలువ చేసే ఆస్తుల్ని, ఆర్థిక లావాదేవీలను ఆపేశాం. తద్వారా అమెరికా, యూరప్ దేశాలతో ఎలాంటి లావాదేవీలు ఉండబోవు. పైగా కొత్త అప్పులు పుట్టవు. రష్యా ఉన్నత కుటుంబాలు, ధనికులపై అదనపు చర్యలూ ఉంటాయి. ఇవేం పొరపాటుగా తీసుకున్న నిర్ణయాలు కావు. పరస్సర సహకారంతోనే ముందుకెళ్లాం. ఈరోజు మేము తీసుకున్న చర్యలు మొదటి విడత మాత్రమే. మేము ఇంకా వెల్లడించనివి చాలానే ఉన్నాయి. పుతిన్ గనుక మొండిగా ముందుకెళ్తే.. ఆర్థిక ఆంక్షల్ని, ఎగుమతి నియంత్రణలను ఉపయోగించి ఒత్తిడి పెంచుతాము. మిత్రదేశాల సహకారంతో పూర్తిస్థాయిలో ఆంక్షల్ని అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం’’ అని దలీప్ సింగ్ స్పష్టం చేశారు. రష్యా పాలనా విధానంలో సింగ్ కీలక పాత్ర పోషిస్తున్నందునే.. తాను కీలక బాధ్యతలు చేపట్టాల్సిన వచ్చిందంటూ వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకీకి చెప్పడం.. రష్యా ఆంక్షల వ్యవహారంలో దలీప్ సింగ్ ప్రాధాన్యం ఏపాటిదో చెప్పనకనే చెప్తుంది. దలీప్ సింగ్ నేపథ్యం.. దలీప్ సింగ్ పుట్టింది మేరీల్యాండ్ ఓల్నీ, పెరిగింది నార్త్ కరోలినా రాలేయిగ్‌లో. కాంగ్రెస్(అమెరికా చట్ట సభ)కు ఎంపికైన తొలి ఏషియన్ అమెరికన్ దలీప్ సింగ్ సౌంధుకి బంధువు ఈ దలీప్ సింగ్. ఆర్థిక శాస్త్రంలో డీగ్రీ చేసిన దలీప్, పలు ఇంటర్నేషనల్ యూనివర్సిటీల్లో ఉన్నత విద్యల్ని అభ్యసించాడు. గతంలో ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్‌కి వైస్ ప్రెసిడెంట్‌గా, ఒబామా హయాంలోనూ పలు కీలక బాధ్యతలు నిర్వహిచాడు. ప్రస్తుతం బైడెన్ అడ్మినిస్ట్రేషన్‌లో డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్‌గా ఉన్నారు 47 ఏళ్ల దలీప్ సింగ్. -
ట్రంప్ ఆంక్షలు.. పుతిన్ వార్నింగ్
మాస్కో : సిరియా.. దాని మిత్ర పక్షాలపై ఆంక్షలు విధించే దిశగా అమెరికా అడుగులు వేస్తున్న తరుణంలో రష్యా తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. సిరియాపై మరోసారి దాడులకు తెగ బడితే చూస్తూ ఊరుకోబోమన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ .. ఆంక్షల దిశగా అగ్రరాజ్యం అడుగులు వేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. సిరియా పరిణామాలపై ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహనీతో ఫోన్లో మాట్లాడిన పుతిన్.. ఆంక్షల నిర్ణయంపైనే ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. ‘సిరియాపై పశ్చిమ దేశాల దాడులు.. శాంతి చర్చలకు విఘాతాన్ని కలిగించేవిగా ఉన్నాయని పుతిన్-రౌహనీ అభిప్రాయపడ్డారు. ఆంక్షలు యూఎన్ ఛార్టర్ను ఉల్లంఘించేవిగా ఉంటే మాత్రం అంతర్జాతీయంగా తీవ్ర ప్రతికూలతను అమెరికా ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇరువురు నేతలు భావిస్తున్నారు. ఆంక్షలపై తక్షణమే అమెరికా వెనక్కి తగ్గాలని పుతిన్ డిమాండ్ చేస్తున్నారు’ అని క్రెమ్లిన్(రష్యా అధ్యక్ష భవనం) ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇదిలా ఉంటే అమెరికా మాత్రం ఆంక్షల విషయంలో వెనక్కి తగ్గేలా కనిపించటం లేదు. సిరియాకు రసాయనిక ఆయుధాల సరఫరాను చేస్తున్న సంస్థలను(అందులో రష్యాకు చెందినవి కూడా ఉన్నాయన్నది ప్రధాన ఆరోపణ) దృష్టిలో ఉంచుకునే తాము ఆంక్షలు విధించినట్లు ఐరాస అమెరికా రాయబారి నిక్కీ హేలీ ప్రకటించారు. ఇదిలా ఉంటే ఏప్రిల్ 7వ తేదీన డౌమా పట్టణంలో జరిగిన విష వాయు ప్రయోగంలో పదుల సంఖ్యలో(లెక్క స్పష్టంగా తేలలేదు) మృత్యువాత పడ్డారు. దీనికి వెనుక సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ ప్రమేయం ఉందని.. జరిగింది రసాయనిక దాడులేనని ఆరోపిస్తూ అమెరికా-ఫ్రాన్స్-యూకే దళాలు శనివారం డమాస్కస్ పట్టణంపై విరుచుకుపడ్డాయి. ఈ నేపథ్యంలో అమెరికా చేష్టలను రష్యా.. దాని మిత్ర పక్షాలు తీవ్రంగా ఖండించాయి. -
అమెరికా, ఈయూలకు పుతిన్ చెప్పుదెబ్బ సమాధానం
''తమలపాకుతో మీరొకటంటే తలుపు చెక్కతో నే రెండంటా'' అంటూ తమ మీద ఆంక్షలు విధించిన పాశ్చాత్య దేశాలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ దీటుగా సమాధానం ఇచ్చారు. అమెరికా, యూరోపియన్ యూనియన్ నుంచి తమ దేశంలోకి మొత్తం అన్ని రకాల పండ్లు, కూరగాయలు, ఆహార దిగుమతులను నిషేధించారు. అటు అమెరికాకు, ఇటు యూరోపియన్ దేశాలకు కూడా రష్యాయే అతిపెద్ద ఆహార పదార్థాల కొనుగోలుదారు. దాంతో ఇప్పుడు ఆ దేశాలన్నింటికి గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్లు అయ్యింది. కుక్కకాటుకు చెప్పుదెబ్బ అన్నట్లుగా పుతిన్ తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రచ్ఛన్నయుద్ధం నాటి పరిస్థితులు దాదాపుగా మళ్లీ ఏర్పడేలా ఉన్నాయి. తమ దేశం మీద ఆంక్షలు విధించిన దేశాల నుంచి ఆహార, వ్యవసాయోత్పత్తుల దిగుమతులను నిషేధించే డిక్రీ మీద పుతిన్ బుధవారం నాడు సంతకం చేశారు. ఏడాది పాటు ఈ నిషేధం కొనసాగుతుంది. యూరోపియన్ యూనియన్ నుంచి వచ్చే కూరగాయల్లో 21.5 శాతం, పండ్లలో 28 శాతం రష్యాయే దిగుమతి చేసుకుంటుంది. ఇది అతిపెద్ద మార్కెట్ కావడంతో అదంతా ఆగిపోతే ఇప్పుడు ఆ దేశాల ఆర్థిక పరిస్థితే అతలాకుతలం అవుతుంది. అలాగే, అమెరికా నుంచి ఎగుమతి అయ్యే చికెన్‌లో 8శాతం ఒక్క రష్యాకే వెళ్తుంది. దాంతో అమెరికా ఆదాయానికి కూడా బాగానే గండిపడుతుంది.