ఆర్థిక ఆంక్షల నేపథ్యంలో రష్యా వెలుపల భారీగా ఆస్తులు కలిగి ఉన్న రష్యన్ బిలియనీర్లు బిక్కుబిక్కుమంటున్నారు. తమ వ్యాపార సామ్రాజ్యాలకు ఎక్కడ బీటుల వారుతాయోనని, తమ ఆస్తులు జప్తు చేస్తారేమోననే భయాలు వెంటాడుతున్నాయి.
ప్రపంచం మొత్తం వారిస్తున్నా ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించారు రష్యా అధ్యక్షుడు పుతిన్. రష్యన్ సైనిక దళాల తీరుతో ఉక్రెయిన్‌లోని నగరాలపై బాంబుల వర్షం కురుస్తోంది. మరోవైపు రష్యా తీరును నిరసిస్తూ అమెరికా, యూరోపియన్ యూనియన్‌తో పాటు అనేక దేశాలు ఆర్థిక ఆంక్షలు విధిస్తున్నాయి. వీటి ప్రభావం రష్యన్ బిలియనీర్లపై భారీగా పడనుంది. ఆర్థిక ఆంక్షల వల్ల ఎక్కువగా ప్రభావితమయ్యే రష్యన్ కుబేరుల్లో ఈ నలుగురు ముందు వరుసలో ఉన్నారు.
అలిషర్ ఉస్మానోవ్
రష్యన్ మెటల్ టైకూన్‌గా పేరున్న అలిషర్ ఉస్మానోవ్ 14 బిలియన్ డాలర్ల సంపద కలిగి ఉన్నారు. భవిష్యత్తును ముందుగానే ఊహించిన ఆయన ప్రారంభం దశలో ఉన్నప్పుడే అమెరికన్ కంపెనీ ఫేస్‌బుక్‌లో భారీగా ఇన్వెస్ట్ చేశారు. లండన్‌లో 300 మిలియన్ డాలర్ల విలువ చేసే ఎస్టేట్స్‌ని కలిగి ఉన్నారు. అదృష్టవశాత్తు ఇటీవల బ్రిటిష్ సాకర్ క్లబ్‌లో తన వాటాలు అమ్ముకుని 700 మిలియన్ డాలర్ల సొమ్మును వెనక్కి తీసుకున్నాడు.
మిఖైల్ మరాటోవిచ్ ఫ్రిడ్‌మ్యాన్
రష్యలో ప్రైవేట్ బ్యాంకర్‌గా ఫేమస్ మిఖైల్ మరాటోవిచ్ ఫ్రిడ్‌మ్యాన్. 11.4 బిలియన్ డాలర్ల సంపద కలిగిన ఈ బిజినెస్ టైకూన్‌కి పాటు ఇజ్రాయిల్ సిటిజన్‌షిప్ ఉంది. ఆది నుంచి ఉక్రెయిన్‌పై రష్యా దాడిని విమర్శిస్తున్న బిజినెస్‌మ్యాన్‌గా ముద్ర పడ్డారు. ఎక్కువ కాలం రష్యా వెలుపలే జీవిస్తుండటంతో పుతిన్ పాలనకు వ్యతిరేకంగా చాలా సార్లు గళం విప్పారు. ఈయనకు రష్యా లోపల వెలుపల విలువైన ఆస్తులు ఉన్నాయి. అమెరికా మిత్ర పక్షాలతో పాటు రష్యా ప్రభుత్వం నుంచి కూడా మిఖైల్‌కి ఇబ్బందులు తప్పవని నిపుణులు అంటున్నారు.
పీటర్ అవెన్
రష్యా దేశంలో రాజకీయ ప్రాబల్యం కలిగిన వ్యాపారవేత్తల్లో పీటర్ అవెన్ ఒకరు. ఆల్ఫా బ్యాంక్ గ్రూపుని నిర్వహిస్తున్న ఈయన సంపద 4.3 బిలియన్ డాలర్లుగా ఉంది. ఎకామిస్ట్, రైటర్‌గా అనే విభాగాల్లో ప్రావీణ్యం కలిగిన పీటర్ అవెన్ మరో వివాస్పద బిజినెస్ టైకూన్ మిఖైల్ మరాటోవిచ్‌తో అనేక వ్యాపారాల్లో భాగస్వామిగా ఉన్నారు. రష్యా దాడి కారణంగా ఇంటా బయట ఈయనకు ఉక్కపోత ఎదురువుతోంది
అలెక్సీ మర్ధాషోవ్
రష్యాలో స్టీలు ఉత్పత్తిదారుల్లో ఒకటైన సివర్‌స్టాల్‌లో భాగస్వామిగా ఉన్నారు లెక్సీ మర్దాషోవ్. మరో ప్రముఖ కంపెనీ టీయూఐలో 30 శాతం వాటాలు ఉన్నాయి. ప్రపంచలోనే అతి పెద్ద ట్రావెల్ టూరిజం కంపెనీలు ఆయన సొంతం. ఈయన నికర సంపద 29 బిలియన్ డాలర్లుగా ఉంది. ట్రావెల్ కంపెనీ యజమానిగా, స్టీలు ఉత్పత్తిదారుడిగా పలు దేశాలతో అలెక్సీ కంపెనీలు లావాదేవీలు నిర్వహిస్తుంటాయి. ప్రస్తుత పరిస్థితుల్లో బ్యాంకులు సైతం రష్యాతో సంబంధాలు తెంచుకోవడం అలెక్సీకి మింగుడుపడటం లేదు.
చదవండి: రష్యా ఆర్థిక పరిస్థితి అతలాకుతలం
Comments
Please login to add a commentAdd a comment