ద్రవ్యోల్బణం ఎఫెక్ట్‌తో ఇప్పటికే అనేక వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడి దీనికి తోడు కావడంతో పరిస్థితి మరింతగా దిగజారుతోంది. ఈ తరుణంలో ఇండియా ప్రపంచ వాణిజ్యంలో ధైర్యంగా అడుగులు వేస్తోంది. మన దేశ ప్రయోజనాలే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటోంది.
కరోనా సంక్షోభం, ఒపెక్ దేశాల మొండిపట్టు, ఉక్రెయిన్‌పై రష్యా దాడి, మిడిల్ ఈస్ట్‌లో రెచ్చిపోతున్న రెబల్స్ గ్రూపులతో ముడి చమురు ధరలు పెరిగిపోతున్నాయి. ఇదే సమయంలో ప్రపంచ వాణిజ్యంలో రష్యాను ఒంటరిని చేసే లక్ష్యంతో అమెరికా, నాటో దేశాలతో పాటు యూరప్ కంట్రీస్ అనేక ఆర్థిక ఆంక్షలు విధించాయి. రష్యాతో వాణిజ్య లావాదేవీలు క్లోజ్ చేస్తున్నాయి. అంతేకాదు మిగిలిన ప్రపంచ దేశాలు తమ బాటలోనే ప్రయాణించాలని కోరుతున్నాయి.
పెరుగుతున్న ముడి చమురు కారణంగా దేశంలో పెట్రో మంట మొదలైంది. ఇదే తీరుగా పెట్రోలు ధరలు పెరిగితే ద్రవ్యోల్బణం తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంది ఇండియాలో. దీంతో ప్రపంచ దేశాలు చేస్తున్న సూచనలకు పక్కన పెట్టి నుంచి డిస్కౌంట్ ధరకు ముడి చమురు కొనేందుకు రెడీ అవుతోంది భారత్. ఈ మేరకు గతంలో జరిగిన ఒప్పందాలతో పాటు కొత్తవి చేసుకునే దిశగా పావులు కదుపుతోంది.
రష్యా నుంచి ముడి చమురుతో పాటు ఇప్పుడు కుకింగ్ కోల్‌ను భారీ ఎత్తున దిగుమతి చేసుకునే అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తోంది భారత్. స్టీలు తయారీలో ఉపయోగించే కుకింగ్ కోల్‌ను ఎక్కువగా విదేశాల నుంచి ఇండియా దిగుమతి చేసుకుంటోంది. కుకింగ్ కోల్‌ను భారత్‌కి ఎక్కువగా ఎగుమతి చేస్తున్న దేశాల్లో రష్యా ఆరవ స్థానంలో ఉంది. అయితే తాజాగా యూరప్, అమెరికా ఆంక్షల కారణంగా ఆయా దేశాలకు ఎగుమతి చేయాల్సిన కుకింగ్ కోల్‌ని తక్కువ ధరకే అందించేందుకు రష్యా రెడీగా ఉంది. దీంతో క్రూడ్ ఆయిల్‌తో పాటు కుకింగ్ కోల్‌ని రష్యా నుంచి దిగుమతి చేసుకునే అంశాన్ని పట్టాలెక్కించేందుకు రెడీ అవుతోంది.
అమెరికా, యూరప్‌తో పాటు ఏషియాలోని జపాన్ సైతం రష్యాపై ఆంక్షలు విధించి వాణిజ్య సంంబంధాలు కట్ చేసుకుంటున్నాయి. తమ బాటలోనే ప్రయాణించాలంటూ ఒత్తిడి తెస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ నేరుగా ఇండియాని ఉద్దేశించి మాట్లాడుతూ.. రష్యాపై ఆంక్షలు విధించే విషయంలో ఇండియా తడబడుతోంది అంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో బైడెన్ మాటలను భారత్ బేఖారు చేస్తోంది. తక్కువ ధరకు ముడి సరుకు లభించే రష్యా నుంచి అధికంగా కుకింగ్ కోల్, ముడి చమురు దిగుమతి చేసుకోవాలని ఇండియా డిసైడ్ అవుతోంది. ఈ మేరకు అమెరికా సూచనలు, సుతిమెత్తని హెచ్చరికలను పక్కన పెట్టింది.
చదవండి: Russia Ukraine War: భారత్ వణుకుతోంది.. బైడెన్ సంచలన వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment