రష్యాతో వాణిజ్య ఒప్పందాల విషయంలో అగ్రరాజ్యానికి భారత్ గట్టి కౌంటరే ఇచ్చింది. రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్ల విషయమై ప్రశ్నించిన అమెరికా.. ఉక్రెయిన్ పరిణామాల నేపథ్యంలో రష్యాను ఎందుకు వ్యతిరేకించడం లేదంటూ నిలదీసింది. అయితే.. ప్రతీ దానికి భారత్‌ను ప్రశ్నించే బదులు, ముందు యూరప్ దేశాలను నిలదీయాస్తే బాగుంటుందని అమెరికాను సున్నితంగా కౌంటర్ ఇచ్చింది భారత్.
మంగళవారం భారత్-అమెరికా 2+2 భేటీ తర్వాత ప్రశ్నల సమయంలో.. భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఈ మేరకు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘రష్యాతో ఆయిల్ కొనుగోళ్ల గురించి మీరు ప్రస్తావించినట్లు నా దృష్టికి వచ్చింది. రష్యా నుంచి కొనుగోళ్లను గనుక పరిశీలిస్తే.. ముందు యూరప్ మీద మీరు దృష్టి పెడితే బాగుంటుందని అనుకుంటున్నాం. మేం కేవలం ఎనర్జీ సెక్యూరిటీ కోసమే కొనుగోలు చేస్తున్నాం. కానీ, గణంకాలు మీకు ఆశ్చర్యంగా అనిపించొచ్చు. ఒక నెలలో మొత్తం మేం కొనుగోలు చేస్తే ఎనర్జీ.. యూరప్ దేశాలు ఒక్క పూటలోనే చేస్తున్నాయని. కాబట్టి, ఆ అంశంపై ఆలోచిస్తే మంచిదని జైశంకర్, అగ్రరాజ్యానికి కౌంటర్ ఇచ్చారు.
రష్యా చర్యలను భారత్ ఎందుకు వ్యతిరేకించడం లేదన్న ప్రశ్నకూ.. ఆయన స్పందించాడు. సెక్రటరీ బ్లింకెన్ ఎత్తి చూపినట్లుగా.. మేము ఐక్యరాజ్యసమితిలో, చట్ట సభల్లో, ఇతర వేదికలపైనా మా స్థానాన్ని వివరించే దిశగా అనేక ప్రకటనలు చేశాం. అన్నింటా మేం చెప్పింది ఒక్కటే.. ‘మేము యుద్ధ వాతావరణానికి వ్యతిరేకం. చర్చలు, దౌత్యం కొరుకుంటున్నాం. ఏ నేల పైన అయినా సరే.. హింసను తక్షణమే విరమించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ మార్గాలన్నింటిలో మేం సిద్ధంగానే ఉన్నాం’ అని ఆయన స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా.. భారత్-అమెరికా 2+2 సమావేశం అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఈ మేరకు అమెరికా కార్యదర్శి ఆంటోనీ జే బ్లింకెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ యుద్ధ పరిణామాల నేపథ్యంలో.. మరోసారి ప్రపంచ దేశాలకు అగ్రరాజ్యం తరపున పిలుపు ఇచ్చాడాయన. రష్యాతో ఒప్పందాలకు.. ప్రత్యేకించి ఆయుధ ఒప్పందాలకు సంబంధించి దూరంగా ఉండడం మంచిదని సూచించాడాయన.
ఇక భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలు పెరిగిపోతున్నాయని, అమెరికా ఇది నిశితంగా పరిశీలిస్తోందని బ్లింకెన్ వ్యాఖ్యలు చేశారు. అమెరికా ప్రతినిధి ఇల్‌హాన్ ఒమర్.. మోదీ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేసిన దరిమిలా.. బ్లింకెన్ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ వ్యాఖ్యలపై ఇటు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌గానీ, అటు జైశంకర్‌గానీ స్పందించకపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment