oil imports
-
రష్యాపై యూఎస్ ఆంక్షలు.. చమురుపై ప్రభావం
అమెరికా కొత్తగా ఆంక్షలు విధించినప్పటికీ మరో రెండు నెలల పాటు రష్యా నుంచి చమురు(Crude Oil) సరఫరాకి సమస్యేమీ ఉండదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మార్చి 12 వరకు అమలయ్యే కాంట్రాక్టులకు వచ్చిన ఇబ్బందేమీ లేదని తెలిపాయి. ఆ తర్వాత నుండి వర్తించే కాంట్రాక్టులపైన కూడా ప్రభావం పడకుండా రష్యా ఈలోగానే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునే అవకాశం ఉందని వివరించాయి. భారత్ తదితర దేశాలకు చమురును చేరవేస్తున్న రెండు రష్యా సంస్థలపై అమెరికా కొత్తగా ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఈ వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది.ఆంక్షలు ఎదుర్కొంటున్న రెండు సంస్థల్లో ఒకటి మాత్రమే కాస్త చెప్పుకోతగ్గ స్థాయిలో సరఫరా చేస్తుండగా రెండో దాన్నుంచి నామమాత్రంగానే ఉంటోందని సీనియర్ ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు. భారత్‌కు సరఫరా చేసే ఇతర రష్యన్ సంస్థలు, ట్రేడర్లపై ఆంక్షలు లేవని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం నేపథ్యంలో ఆ దేశాన్ని ఆర్థికంగా కట్టడి చేసేందుకు పాశ్చాత్య దేశాలు చమురు సరఫరాలపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. కానీ, ప్రత్యామ్నాయ పద్ధతుల్లో భారత్ తదితర దేశాలకు రష్యా చమురు సరఫరా చేస్తోంది.ఇదీ చదవండి: డిసెంబర్లో టోకు ద్రవ్యోల్బణం అప్గాజ్ ప్రోమ్ నెఫ్ట్, సుర్గుట్నెఫ్టెగాస్తో సహా రష్యా చమురు ఉత్పత్తిదారులపై, రష్యన్ చమురును రవాణా చేసే సుమారు 180 ట్యాంకర్లపై అమెరికా ఆంక్షలు విధించింది. దీంతో భవిష్యత్తులో రష్యా ముడిచమురు దిగుమతుల్లో 15 శాతం భారత్‌పై ప్రభావం పడనుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. రష్యా క్రూడ్ సరఫరాకు తక్షణ ముప్పు లేనప్పటికీ, ఆంక్షలు సరుకు రవాణా ఖర్చులను పెంచుతాయని, ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకునే చమురును మరింత ఖరీదవుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత రిఫైనరీలు మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, యూఎస్ నుంచి ముడి చమురును దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. -
వంటనూనె ధరలు పెంపు..?
వంటనూనెల దిగుమతి సుంకాన్ని పెంచుతూ కేంద్రం నిర్ణయిం తీసుకుంది. ప్రాథమిక దిగుమతి సుంకాన్ని 20 శాతం పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. దాంతో వచ్చే పండగ సీజన్లో వీటి ధరలు పెరుగుతాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.భారత్‌లో ఎక్కువగా వినియోగిస్తున్న పామాయిల్, సోయానూనె, సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతులు తగ్గితే వాటి ధర పెరిగే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. రానున్న పండగ సీజన్లో సగటు వినియోగదారులపై ఈ భారం పడనుందని అంచనా వేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా వంటనూనెలను దిగుమతి చేసుకుంటున్న భారత్‌లో దిగుమతి సుంకాన్ని పెంచడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.దేశీయ నూనెగింజల రైతులను ఆదుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దేశంలో ముడి పామాయిల్, సోయానూనె, సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్‌ను వసూలు చేస్తుండడంతో గతంలో ఉన్న దిగుమతి సుంకం 5.5 శాతాన్ని 27.5 శాతానికి పెంచారు. రిఫైన్డ్ పామాయిల్, సోయా ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతులపై గతంలో ఉన్న 13.75% సుంకాన్ని 35.75%కు మారుస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.భారత్ వంటనూనెల దిగుమతిపై ఎక్కువగా ఆధారపడుతోంది. ఏటా దేశీయంగా వినియోగించే వంటనూనెల్లో 70 శాతం కంటే ఎక్కువ ఇతర దేశాల నుంచే కొనుగోలు చేస్తున్నారు. ప్రధానంగా ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్ నుంచి పామాయిల్ దిగుమతి చేసుకుంటున్నారు. అర్జెంటీనా, బ్రెజిల్, రష్యా, ఉక్రెయిన్ నుంచి సోయాఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతి అవుతోంది.ఇదీ చదవండి: ప్రపంచంలోని బెస్ట్ కంపెనీలుఉల్లి ఎగుమతులపై నిషేధం ఎత్తివేతఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దేశీయంగా ఉల్లి ధరలు పెరగకుండా ఎగుమతులపై కేంద్రం గతేడాది ఆంక్షలు విధించింది. తాజాగా వీటిని ఎత్తేయడంతో తిరిగి ఎగుమతులు పెరిగే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రభుత్వం తొలుత ఆంక్షలు పెట్టిన సమయంలో 40 శాతం ఎగుమతి సుంకం చెల్లించాలనే నిబంధన తీసుకొచ్చారు. ప్రస్తుతం అది 20 శాతంగా ఉంది.పెట్రోల్, డీజిల్ రేట్ల తగ్గింపు..?మహారాష్ట్ర, హరియాణా, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది. సమీప భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని యోచిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. -
పెరిగే కార్ల అమ్మకాలతో ఆయిల్‌కు డిమాండ్
న్యూఢిల్లీ: చమురు దిగుమతులు, వినియోగంలో భారత్ ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉంది. ఎకానమీ వేగంగా వృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఆయిల్ డిమాండ్ గణనీయంగా పెరుగుతోందని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ) ఒక నివేదికలో పేర్కొంది. ఐఈఏ నివేదిక ప్రకారం, 2024లోనూ ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఎకానమీగా భారత్ నిలుస్తుందన్న అంచనాలు నెలకొన్నాయి. దేశీయంగా వినియోగ మార్కెట్ భారీగా పెరుగుతున్న నేపథ్యంలో తయారీ, పారిశ్రామిక కార్యకలాపాలు పుంజుకుంటున్నాయి. రహదారి రవాణాకు భారత్‌లో డీజిల్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. 2023–2030 మధ్య కాలంలో ఆయిల్ వినియోగ వృద్ధిలో రహదారి రవాణా విభాగం వాటా 5,20,000 బీపీడీగా (మొత్తం వినియోగంలో 38 శాతం) ఉండగలదు. అలాగే కార్ల కొనుగోళ్లు పెరిగే కొద్దీ పెట్రోల్ వినియోగం 2,70,000 బీపీడీ మేర (మొత్తంలో 20 శాతం) వృద్ధి చెందవచ్చు. మిగతా ప్రపంచ దేశాలతో పోలిస్తే ఈ డిమాండ్ అత్యధికం. 2000తో పోలిస్తే 2023లో భారత్‌లో కార్ల సంఖ్య ఎనిమిది రెట్లు పెరిగింది. దేశీయంగా కార్ల సంఖ్య 2030 నాటికి 40 శాతం మేర పెరగొచ్చు. ఇక మొత్తం వాహనాల సంఖ్యలో మూడొంతుల వాటా ఉండే ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు కూడా కీలకంగా ఉండగలదు. నివేదికలో మరిన్ని అంశాలు.. ⇢ పెట్రోకెమికల్స్ ఉత్పత్తిలో ఎల్పీజీ, ఈథేన్ వినియోగం 40,000 బీపీడీ స్థాయిలో పెరగొచ్చు. ⇢ 2023లో 58 లక్షల బీపీడీగా ఉన్న భారత్ రిఫైనింగ్ సామర్థ్యం 2030 నాటికి 68 లక్షల బీపీడీకి చేరవచ్చు. ⇢ భారత్ దిగుమతి అవసరాలు దాదాపు 10 లక్షల బీపీడీ స్థాయిలో 46 లక్షల బీపీడీ నుంచి 56 లక్షల బీపీడీకి చేరవచ్చు. రిఫైనరీలను వేగవంతంగా విస్తరిస్తుండటంతో క్రూడ్ ప్రాసెసింగ్ సామర్థ్యాలు 10 లక్షల బీపీడీ స్థాయిలో పెరగవచ్చు. ⇢ ఈ దశాబ్దం ద్వితీయార్థంలో అంతర్జాతీయంగా ముడిచమురు డిమాండ్‌కు భారత్ చోదకంగా ఉండగలదు. ⇢ 2023–2030 మధ్య కాలంలో భారత్‌లో చమురు వినియోగం చైనాను మినహాయించి మిగతా అన్ని దేశాలకన్నా అధికంగా ఉంటుంది. ఇది ఏకంగా రోజుకు 13 లక్షల బ్యారెళ్ల (బీపీడీ) మేర పెరిగే అవకాశం ఉంది. ⇢ 2023లో రోజుకు 54 లక్షల బ్యారెళ్లుగా (బీపీడీ) ఉన్న చమురు డిమాండ్ 2030 నాటికి 3.2 శాతం పెరిగి (రోజుకు 13 లక్షల బ్యారెళ్లు) 67 లక్షల బీపీడీకి చేరగలదని అంచనా. ⇢ 2025–2030 మధ్య కాలంలో భారత్‌లో చమురుకు డిమాండ్ 9,00,000 బీపీడీ మేర పెరగనుండగా, చైనాలో ఇది 5,70,000 బీపీడీగా ఉండనుంది. అంతర్జాతీయంగా చూస్తే 2029 నాటికి ఆయిల్ డిమాండ్ తారస్థాయికి చేరుకోగలదు. అయితే అటు తర్వాత తగ్గే అవకాశం ఉంది. -
భారత్ చమురు ఉత్పత్తుల జోరు
న్యూఢిల్లీ: చౌక ధరలో ఆఫర్ చేస్తుండటంతో రష్యా నుంచి భారత్ చమురును భారీగా దిగుమతి చేసుకుంటోంది. దిగుమతైన చమురుతో కొంతమేర పెట్రోలియం ప్రొడక్టులను రూపొందిస్తోంది. వీటిని తిరిగి ఎగుమతి చేస్తోంది. అయితే వీటిలో మూడో వంతు ప్రొడక్టులను జీ–7 తదితర సంపన్న దేశాలకు ఎగుమతి చేస్తుండటం ప్రస్తావించదగ్గ అంశం! ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా పలు యూరోపియన్ దేశాలు రష్యన్ చమురు ధరలపై పరిమితులు విధించాయి. అయితే శుద్ధి చేసిన చమురు ఉత్పత్తులను ఆయా దేశాలు కొనుగోలు చేసేందుకు విధానాలు అనుమతిస్తున్నాయి. వెరసి చట్టబద్ధంగా భారత్ నుంచి చమురు ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్నాయి. నిజానికి రష్యా చమురు కొనుగోలుపై జీ7, ఈయూ, ఆ్రస్టేలియా ఎలాంటి ఆంక్షలనూ అమలు చేయనప్పటికీ 2022 డిసెంబర్లో బ్యారల్ ధర 60 డాలర్లకు మించి కొనుగోలు చేయకుండా పరిమితి విధించుకున్నాయి. తద్వారా రష్యాకు అధిక ఆదాయం లభించకుండా అడ్డుకునేందుకు నిర్ణయించాయి. రష్యా– ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో చమురు ధరలు జోరందుకోవడంతో రష్యా అదనపు లబ్ధి చేకూరకుండా చెక్ పెట్టేందుకు తీర్మానించాయి. అయితే ఆపై భారత్ నుంచి రష్యా చమురు ద్వారా తయారైన 6.65 బిలియన్ డాలర్ల(6.16 బిలియన్ యూరోలు) విలువైన చమురు ఉత్పత్తులు ఆయా దేశాలకు ఎగుమతి అయినట్లు ఫిన్లాండ్ సంస్థ సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్(సీఆర్ఈఏ) వెల్లడించింది. వీటిలో రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన గుజరాత్ జామ్‌నగర్ రిఫైనరీ నుంచి 5.2 బిలియన్ యూరోల ఎగుమతులున్నట్లు ఒక నివేదికలో పేర్కొంది. -
రష్యా నుంచి భారీగా దిగుమతులు
న్యూఢిల్లీ: రష్యా నుంచి దిగుమతులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గణనీయంగా పెరిగాయి. ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య 36.27 బిలియన్ డాలర్లు విలువైన (రూ.3.01లక్షల కోట్లు) దిగుమతులు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే దిగుమతుల్లో 65 శాతం వృద్ధి కనిపిస్తోంది. 2022 ఏప్రిల్–అక్టోబర్ మధ్య రష్యా నుంచి దిగుమతులు 22.13 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ముడి చమురు, ఎరువులు ప్రధాన దిగుమతులుగా ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఏడు నెలల కాలంలో భారత్ దిగుమతులకు రష్యా రెండో అతిపెద్ద కేంద్రంగా నిలిచింది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధానికి ముందు మన దేశ దిగుమతుల్లో రష్యా వాటా కేవలం ఒక్కశాతమే. కానీ, ప్రస్తుతం భారత చమురు దిగుమతుల్లో రష్యా 40 శాతం వాటా ఆక్రమించేసింది. ఉక్రెయిన్‌పై దాడికి ప్రతీకారంగా పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. దీంతో భారత్‌కు మార్కెట్ కంటే తక్కువ ధరకే చుమురు సరఫరాకు రష్యా ముందుకు వచ్చింది. అప్పటి నుంచి భారత్ భారీగా చమురును రష్యా నుంచి కొనుగోలు చేస్తోంది. దేశాల వారీగా.. ► ఇక ఏప్రిల్–అక్టోబర్ మధ్య చైనా నుంచి దిగుమతులు 60.02 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇవి రూ.60.26 బిలియన్ డాలర్ల వద్దే ఉన్నాయి. ► అమెరికా నుంచి దిగుమతులు క్రితం ఏడాది ఇదే కాలంతో పోలి్చచూసినప్పుడు 16 శాతం తగ్గి 24.89 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ► యూఏఈ నుంచి దిగుమతులు 21 శాతం తగ్గి 24.91 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ► అంతేకాదు సౌదీ అరేబియా, ఇరాక్, ఇండోనేíÙయా, సింగపూర్, కొరియా నుంచి కూడా దిగుమతులు క్షీణించాయి. ► స్విట్జర్లాండ్ నుంచి దిగుమతులు క్రితం ఏడాది మొదటి ఏడు నెలల్లో 10.48 బిలియన్ డాలర్లుగా ఉంటే, అవి ఈ ఆర్థిక సంవత్సరం అదే కాలంలో 13.97 బిలియన్ డాలర్లకు వృద్ధి చెందాయి. ► మరో వైపు భారత్ ఎగుమతులకు కేంద్రంగా ఉన్న టాప్–10 దేశాలలో, ఆరు దేశాలకు ఏప్రిల్–అక్టోబర్ మధ్య ఎగుమతులు ప్రతికూలంగా నమోదయ్యాయి. అమెరికా, యూఏఈ, సింగపూర్, జర్మనీ, బంగ్లాదేశ్, సౌదీ అరేబియాకు తగ్గాయి. ► బ్రిటన్, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్‌కు ఎగుమతులు వృద్ధి చెందాయి. ► చైనాకు ఎగుమతులు 8.92 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది మొదటి ఏడు నెలల్లో ఇవి 8.85 బిలియన్ డాలర్లు. -
రష్యా తిరస్కరణ.. పెట్రోల్, డీజిల్ ధరలతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి!
పాకిస్తాన్లో ఆర్థిక సంక్షోభం మరింత ముదురుతోంది. ఆ దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. అధిక ధరలతో ప్రజలు అల్లాడుతున్నారు. భారీ నగదు కొరతను ఎదుర్కొంటున్న పాకిస్థాన్ రష్యాపై ఆశలు పెట్టుకుంది. ఇప్పటికే రాయితీపై ముడి చమురు సరఫరా చేసిన రష్యాను మరింత తగ్గించాలని కోరగా రష్యా తిరస్కరించింది. పాకిస్తాన్‌కు చెందిన ‘ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్’ నివేదిక ప్రకారం.. రష్యాను దీర్ఘకాల చమురు ఒప్పందాన్ని ఖరారు చేయాలని కోరింది. దీర్ఘకాలిక ప్రాతిపదికన తమకు బ్యారెల్ ముడి చమురు గరిష్టంగా 60 డాలర్లకే విక్రయించాలని అభ్యర్థించింది. ఇది భారత్ విక్రయించిన దానికంటే దాదాపు 6.8 డాలర్లు తక్కువ. భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. గత జులైలో రష్యా చమురు సగటు ధర బ్యారెల్‌కు 68.09 డాలర్లు. ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించేందుకు చమురు ధరలపై మరిన్ని తగ్గింపులను పొందాలని పాకిస్తాన్ తాత్కాలిక ప్రభుత్వం భావిస్తున్నట్లుగా ‘ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్’ నివేదించింది. దీర్ఘకాలిక ప్రాతిపదికన ముడి చమురును దిగుమతి చేసుకునేందుకు, ఓడరేవులో వసూలు చేసే వాస్తవ ధర అయిన 'ఫ్రీ ఆన్ బోర్డ్' (FOB) ఒక బ్యారెల్‌కు 60 డాలర్లు బెంచ్‌మార్క్‌గా నిర్ణయించాలని పాకిస్తాన్ కోరింది. అంటే పాకిస్థాన్‌కు ఎగుమతి చేసే చమురు సరుకు రవాణా ఖర్చును కూడా భరించాలని అభ్యర్థించింది. భారీగా పెట్రోల్, డీజిల్ ధరలు పాకిస్తాన్లో ఆగస్ట్‌లో ఆపద్ధర్మ ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి పెట్రోల్, డీజిల్, కిరోసిన్ ధరలను రెండుసార్లు పెంచడం గమనార్హం. సెప్టెంబర్ ప్రారంభంలో, అన్వర్ ఉల్ హక్ కకర్ నేతృత్వంలోని ప్రభుత్వం పెట్రోల్, హై-స్పీడ్ డీజిల్ ధరలను లీటరుకు (పాకిస్తానీ రూపాయల్లో) రూ.14.91, రూ.18.44 చొప్పున పెంచింది. ప్రస్తుతం (అక్టోబర్ 19) ఆ దేశంలో సూపర్ పెట్రోల్ ధర లీటరు రూ. 283.38, హైస్పీడ్ డీజిల్ ధర లీటరు రూ. 304.05 ఉంది. గతంలో రాయితీ ఈ ఏడాది జూన్‌లో అప్పటి ప్రధాని షెహబాజ్ షరీఫ్ రష్యాతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. రాయితీపై రష్యా ముడి చమురు మొదటి రవాణా కరాచీకి చేరుకుంది. మీడియా నివేదిక ప్రకారం.. మాస్కో ఒక నెలలో 1,00,000 మెట్రిక్ టన్నుల ముడి చమురుతో ఒక కార్గోను రవాణా చేసింది. ఆ చమురు కోసం సరుకు రవాణా ఖర్చు కూడా రష్యా చెల్లించింది. -
భారీగా పెరిగిన వంట నూనెల దిగుమతులు
న్యూఢిల్లీ: వెజిటబుల్ నూనెల దిగుమతులు (వంట నూనెలు, వంటకు వినియోగించనివి) ఆగస్ట్ నెలలో భారీగా పెరిగాయి. క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూసినప్పుడు 33 శాతం పెరిగి 18.66 లక్షల టన్నులుగా నమోదయ్యాయి. సుంకాలు తగ్గడం, డిమాండ్ పుంజుకోవడం దిగుమతులు గణనీయంగా పెరగడానికి దారితీసినట్టు సాల్వెంట్ ఎక్స్ట్రాక్షర్స్ అసోసియేషన్ (ఎస్ఈఏ) తెలిపింది. 2022 ఆగస్ట్ నెలలో వెజిటబుల్ నూనెల దిగుమతులు 14 లక్షల టన్నులుగా ఉన్నాయి. (ఎస్బీఐ మాజీ చైర్మన్ రజనీష్ సంపాదన ఎంతో తెలిస్తే!) 2022-23 మొదటి పది నెలల్లో (నూనెల సీజన్ నవంబర్-అక్టోబర్) నూనెల దిగుమతులు 24 శాతం పెరిగి 141.21 లక్షల టన్నులుగా ఉన్నాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఇవి 113.76 లక్షల టన్నులుగా ఉండడం గమనార్హం. ఆగస్ట్ నెలలో దిగుమతులను పరిశీలిస్తే.. 18.52 లక్షల టన్నులు వంట నూనెలు కాగా, నాన్ ఎడిబుల్ నూనెలు 14,008 టన్నులుగా ఉన్నాయి. పామాయిల్ దిగుమతులు 11.28 లక్షల టన్నులు ఉండడం గమనించొచ్చు. ‘‘మొదటి పది నెలల్లో 141 లక్షల టన్నుల దిగుమతులను పరిశీలిస్తే.. అక్టోబర్‌తో ముగిసే నూనెల సంవత్సరంలో మొత్తం దిగుమతులు 160–165 లక్షల టన్నులకు చేరినా ఆశ్చర్యం అక్కర్లేదు’’అని ఎస్ఈఏ పేర్కొంది.దేశీయంగా నూనెల లభ్యత తగినంత ఉందని, అయినప్పటికీ ధరలు గణనీయంగా తగ్గడంతో డిమాండ్ బాగా పెరిగినట్టు ఎస్ఈఏ తెలిపింది. 2016-17 నూనెల సంవత్సరంలో భారత్ అత్యధికంగా 151 లక్షల టన్నుల వెజిటబుల్ నూనెలను దిగుమతి చేసుకుంది. -
ఇథనాల్ కలిపిన పెట్రోలుతో ఎవరికి ప్రయోజనం?
దేశీయ ఇంధన అవసరాలు తీర్చడానికీ, ఇంధన దిగుమతి భారం తగ్గించడానికీ, వాయు, కర్బన కాలుష్యాలను తగ్గించడానికీ ఇథనాల్ కలిపిన పెట్రోలు పరిష్కారమని భారత ప్రభుత్వం ఎన్నో వెసులు బాట్లు కల్పించి ప్రోత్సహిస్తున్నది. ఆహార ధాన్యాలైన బియ్యం, గోధుమలు, మొక్కజొన్నల నుండి ఇథనాల్ ఉత్పత్తి చేయడానికి సత్వర పర్యావరణ అనుమతులూ, సబ్సిడీలూ, వడ్డీ రాయితీతో రుణాలూ మంజూరు చేసి 2025 నాటికి 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోలు అందుబాటులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నది. ఇథనాల్‌ను పెట్రోలుకు కలపడం కొత్తేమీ కాదు. రెండో ప్రపంచ యుద్ధ కాలం నుండీ వాడుతున్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, యూకే, ఇతర ఐరోపా దేశాలూ; కెనడా, చైనా కూడా మిశ్రమ ఇంధనాన్ని ప్రస్తుతం వాడుతున్నాయి. శాస్త్రీయ అధ్యయనాలు ఇథనాల్‌ను ఇంధనంగా వాడడం లోని నష్టాలను వెలుగులోకి తెచ్చాయి. 2023 మార్చి13న ఐపీసీసీ విడుదల చేసిన నివేదిక, తాపం పెరుగుదల 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు మించకుండా నిరోధించడానికి శిలాజ ఇంధనాలకు సత్వర ముగింపు పలకాలని స్పష్టం చేసింది. కొత్తగా నిర్మిస్తున్న ఇథనాల్ ప్లాంట్లు కనీసం 30 ఏళ్లు పని చేస్తాయి. మరి 2070 నాటికి నికర జీరో కర్బన ఉద్గారాలెలా సాధ్యమవుతాయి? అమెరికా ప్రభుత్వ శక్తి (ఎనర్జీ) విభాగం ‘ఇ20... పెట్రోల్ కంటే 7.7 శాతం తక్కువ ఇంధన శక్తి కలిగి ఉంటుందని’ నిర్ధారించింది. ఒక లీటరు పెట్రోల్... 1.073 లీటర్ల మిశ్రమ ఇంధనానికి సమానం. పరిశీలనల్లో పెట్రోలునూ, మిశ్రమ ఇంధనాన్నీ వాడినప్పుడు దాదాపు కర్బన ఉద్గారాలు అదేస్థాయిలో ఉంటాయని తేలింది. ప్రతి ఇథనాల్ ప్లాంట్కీ ఒక బొగ్గుతోకానీ, బయోమాస్‌తో కానీ నడిచే పవర్ ప్లాంట్‌కు అనుమతిస్తున్నారు. వాటి ఉద్గారాలు అదనం. ఇంకా ప్రతి లీటరు ఇథనాల్ ఉత్పత్తికి 0.76 కిలోల కార్బన్– డై–ఆక్సైడ్ విడుదలవుతుంది. దానిని పూర్తిగా పట్టి గాలిలో చేరకుండా ఆపే వ్యవస్థ లేదు. అంటే మొత్తం ఉత్పత్తయిన కార్బన్– డై–ఆక్సైడ్ చివరికి గాలిలోకి చేరుతుంది. భూతాపానికి దోహద పడుతుంది. అంటే లక్ష్యం తిరగబడుతుందన్న మాట. చమురు దిగుమతుల ఆర్థిక భారం తగ్గించడానికి ఇథనాల్ ఇంధనం పరిష్కారంగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఇ10 ఇంధనం అందుబాటులోకి వచ్చింది. అయినా పెరుగుతున్న డిమాండ్ వల్ల చమురు దిగుమతి భారం తగ్గ లేదన్నది స్పష్టం. విదేశీ మారక ద్రవ్యం ఖర్చు పెరిగింది కాని తగ్గ లేదు. ఇంకా తగిన ఇథనాల్ ఉత్పత్తి లేక ఇథనాల్ దిగుమతి కూడా పెరిగింది. దేశీయ చమురు ఉత్పత్తులు గణనీ యంగా క్షీణిస్తున్నందునా, చమురు వినియోగం పెరుతున్నందునా, ఇథనాల్ కలపడం చమురుపై ఆధారపడడం నుండి విముక్తం చేయదు. కర్బన ఉద్గారాలు పారిస్ ఒప్పందానికి అనుగుణంగా తగ్గవు. చెరకు, బియ్యం, మొక్క జొన్నల నుండి ఇథనాల్ ఉత్పత్తి నీటి వనరులపై భారం పెంచుతుంది. ఇథనాల్ ప్లాంట్ల ప్రతిపాదనలు లీటర్ ఇథనాల్‌కు 8 నుండి 10 లీటర్ల నీరు కావాలంటున్నాయి. చెరకు నుండి లీటరు ఇథనాల్ ఉత్పత్తికి దాదాపు మూడు వేల లీటర్ల నీరు అవసరమవుతుంది. ఆహార పంటలను ఇంధన ఉత్పత్తికి తరలించడం వల్ల అదనపు భూమిని సాగులోకి తేవలసి వస్తుంది. దానివల్ల భూవిని యోగం మార్పు వస్తోంది. అందువల్ల ఉద్గారాలు పెరుగుతాయి. భూతాపం వల్ల పంటల దిగుబడి గణనీయంగా తగ్గడంతో ఆహార కొరత సమస్య ఉత్పన్నమవుతుంది. రైతులకు ఇథనాల్ ఉత్పత్తితో ఒరిగేదేమీ లేదు. ప్రభుత్వమే సబ్సిడీ ధరకు కంపెనీలకు బియ్యం సరఫరా చేస్తుంది. కిలో బియ్యం రూ. 20కు ఇస్తున్నది. అంటే కిలోకు రూ.17 సబ్సిడీ ఇస్తున్నది. ఒక లీటరు ఇథనాల్ ఉత్పత్తికి 2.22 కిలోల బియ్యం సబ్సిడీ ధరకు ఇస్తున్నారు. లీటరు ఇథనాల్ ఉత్పత్తికి బియ్యంపై రాయితీ రూ. 37.74. ఎఫ్‌సీఐ సరఫరా ధర రూ. 37 కు బియ్యం కొంటే లీటరు ఇథనాల్‌కు కావలసిన బియ్యం ధర రూ. 83.78. ప్రభుత్వం నిర్ణయించిన ఇథనాల్ ధర లీటరుకు 56.87. లీటరు పెట్రోలుకు ఇంధన శక్తిలో సమాన మైన 1.51 లీటర్ల ఇథనాల్ ఉత్పత్తికి వాడే బియ్యం ఖరీదు రూ.126.5. ఆ పైన ఉత్పత్తి ఖర్చులు ఎటూ ఉంటాయి. అంటే మిశ్రమ ఇంధనం పెట్రోలు కంటే ప్రియమన్న మాట. ప్రస్తుతం రోడ్డుపైనున్న వాహనాలేవీ ఇ20 ఇంధనాన్ని వాడ డానికి పనికిరావు. కొత్తగా వచ్చే వాహనాలను అందుకు అను వుగా రూపొందించినా ఇ20 అవసరం తక్కువే ఉంటుంది. అనువుగా మార్చని వాహనాలలో ఇ20 వాడితే ఇంజన్‌కు జరిగే నష్టం గణనీయం. ఇథనాల్ ఇంధనంతో జాతికీ, వాతావరణానికీ ప్రయోజనమేమిటో చర్చ జరగాలి. – డా‘‘ కలపాల బాబూరావు, విశ్రాంత శాస్త్రవేత్త -
తగ్గేదేలే! భారత్‌కు చమురు సరఫరాలో రష్యానే టాప్
భారత్‌కు ముడి చమురు సరఫరా చేయటంలో సౌదీ అరేబియా, ఇరాక్లను వెనక్కి నెట్టింది రష్యా. ఈ ఏడాది అక్టోబరులో అత్యధిక చమురు సరఫరా చేసిన దేశంగా నిలిచింది. 2022 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో భారత చమురు దిగుమతుల్లో రష్యా వాటా కేవలం 0.2 శాతం. అదే ఈ ఏడాది అక్టోబరులో రోజుకు 9,35,556 పీపాల చమురును దిగుమతి చేసుకోవడం గమనార్హం. దీంతో దేశ చమురు దిగుమతుల్లో రష్యా వాటా 22 శాతానికి చేరింది. మరోవైపు.. ఇరాక్ నుంచి 20.5 శాతం, సౌదీ అరేబియా నుంచి 16 శాతం మాత్రమే ముడి చమురును దిగుమతి చేసుకుంది భారత్. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య చేపట్టిన తర్వాత మాస్కో నుంచి భారత్‌కు ముడి చమురు దిగుమతి గణనీయంగా పెరిగింది. పశ్చిమ దేశాలు రష్యా చమురు ఎగమతులపై ఆంక్షలు విధించడంతో రాయితీ ధరకు విక్రయించేందుకు ముందుకొచ్చింది మాస్కో. అందిపుచ్చుకున్న భారత్ భారీ ఎత్తున దిగమతులను పెంచుకుంది. డిసెంబరు 2021లో రష్యా నుంచి భారత్‌కు రోజుకి 36,255 పీపాల చమురు మాత్రమే వచ్చింది. అదే ఇరాక్ నుంచి 1.05 మిలియన్లు, సౌదీ అరేబియా 9,52,625 బ్యారెళ్ల చమురు దిగుమతి జరిగింది. ఈ ఏడాది మార్చిలో రష్యా నుంచి భారత్‌కు రోజుకు 68,600 పీపాల ముడి చమురు రాగా.. మే నెలలో అది 2,66,617 పీపాలకు పెరిగింది. జూన్ నాటికి గరిష్ఠంగా 9,42,694కు చేరింది. మరోవైపు.. ఆ నెలలో రోజుకు 1.04 మిలియన్ బీపీడీలతో ఇరాక్ అతిపెద్ద చమురు సరఫరాదారుగా నిలిచింది. రష్యా రెండో స్థానానికి చేరింది. ఇదీ చదవండి: చుక్కలనంటుతున్న అద్దెలు, కట్టలేక ఖాళీ చేస్తున్న జనాలు -
భారత్‌కు రష్యా క్రూడ్.. 50 రెట్లు అప్
న్యూఢిల్లీ: భారత్‌కు రష్యా నుంచి చమురు దిగుమతులు ఏప్రిల్ నుండి దాదాపు 50 రెట్లు పెరిగాయి. ప్రస్తుతం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే మొత్తం క్రూడాయిల్ పరిమాణంలో 10 శాతానికి చేరాయి. ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధానికి దిగడానికి ముందు ఆ దేశం నుంచి భారత్‌కు చమురు దిగుమతులు 0.2 శాతం మాత్రమే ఉండేవి. రష్యా ప్రస్తుతం టాప్ 10 సరఫరా దేశాల్లో ఒకటిగా మారిందని సీనియర్ ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు. రిలయన్స్ ఇండస్ట్రీస్, నయారా ఎనర్జీ వంటి ప్రైవేట్ రిఫైనరీ సంస్థలు దాదాపు 40 శాతం మేర రష్యన్ ఆయిల్‌ను కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. మేలో దేశీ రిఫైనర్లు 2.5 కోట్ల బ్యారెళ్ల చమురును రష్యా నుంచి దిగుమతి చేసుకున్నాయి. ఇక, ఏప్రిల్ నెలకు చూస్తే సముద్రమార్గంలో భారత్‌కు వచ్చే మొత్తం దిగుమతుల్లో రష్యన్ క్రూడాయిల్ వాటా 10 శాతానికి పెరిగింది. ఇది 2021 ఆసాంతం, 2022 తొలి త్రైమాసికంలో 0.2 శాతమే. ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో రష్యాపై పలు దేశాలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. దీంతో తమ ముడిచమురును డిస్కౌంటుకే రష్యా విక్రయిస్తోంది. క్రూడాయిల్ ధరలు బ్యారెల్‌కు 100 డాలర్ల పైనే తిరుగాడుతున్న తరుణంలో 30 డాలర్ల వరకూ డిస్కౌంటు లభిస్తుండటంతో దేశీ రిఫైనర్లు పెద్ద ఎత్తున రష్యా చమురును కొనుగోలు చేస్తున్నాయి. -
Russia Ukraine war: రష్యాపై ఆంక్షలకు ఈయూ ఆమోదం
కీవ్/మాస్కో: రష్యా నుంచి చమురు దిగుమతిపై నిషేధంతో సహా పలు ఆంక్షలను యూరోపియన్ యూనియన్(ఈయూ) శుక్రవారం అధికారికంగా ఆమోదముద్ర వేసింది. రాబోయే ఆరు నెలల్లో రష్యా నుంచి చమురు దిగుమతులను పూర్తిగా నిలిపివేస్తామని ఈయూ ప్రధాన కార్యాలయం వెల్లడించింది. ఇతర పెట్రోలియం ఉత్పత్తులపై నిషేధాన్ని వచ్చే ఎనిమిది నెలల్లో పూర్తిగా నిషేధిస్తామని పేర్కొంది. హంగేరి, చెక్ రిపబ్లిక్, స్లొవేకియా, బల్గేరియా, క్రొయేషియా తదితర దేశాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని తాత్కాలికంగా కొన్ని మినహాయింపులు ఇచ్చినట్లు తెలిపింది. ఈ ఏడాది ఆఖరు నాటికి రష్యా నుంచి చమురు దిగుమతులను 90 శాతం నిలిపేస్తామని ఈయూ నేతలు ప్రకటించారు. అంతర్జాతీయ బ్యాంకు లావాదేవీలకు వేదిక అయిన ‘స్విఫ్ట్’ వ్యవస్థను రష్యా ఉపయోగించుకోకుండా ఈయూ ఇప్పటికే కట్టడి చేసింది. రష్యా టీవీ చానళ్లను కూడా ఈయూ నిషేధించింది. రష్యా క్రూర దాడులు: జెలెన్స్కీ తూర్పు డోన్బాస్లో భీకర యుద్ధం కొనసాగుతోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు. రష్యా క్రూరంగా దాడులు చేస్తోందని ఆరోపించారు. సీవిరోడోంటెస్క్‌లో రష్యా దాడులను తిప్పికొట్టడంలో తాము కొంత పురోగతి సాధించామని అన్నారు. సమీపంలోని లీసిచాన్స్క్, బఖ్‌ముత్‌లో పరిస్థితి సంక్లిష్టంగానే ఉందని తెలిపారు. పలు నగరాలు, పట్టణాలపై రష్యా సేనలు క్షిపణి దాడులు కొనసాగిస్తున్నాయని పేర్కొన్నారు. డోన్బాస్లో రష్యా అనుకూల వేర్పాటువాదుల ఆధీనంలో ఉన్న ప్రాంతాల నుంచి జనాన్ని సమీకరించి, యుద్ధ రంగంలోకి దించుతున్నారని జెలెన్స్కీ ఆరోపించారు. సాధారణ ప్రజలను ముందు వరుసలో ఉంచి, వారి వెనుక రష్యా సైనికులు వస్తున్నారని వెల్లడించారు. మున్ముందు మరింత సిగ్గుమాలిన, హేయమైన పరిణామాలను చూడబోతున్నామని వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్‌కు అత్యాధునిక రాకెట్ సిస్టమ్స్ ఇచ్చేందుకు అంగీకరించిన అమెరికాకు జెలెన్స్కీ కృతజ్ఞతలు తెలిపారు. లీసిచాన్స్క్.. 60 శాతం ధ్వంసం తూర్పు ఉక్రెయిన్‌లోని రెండు ప్రధాన నగరాల్లో ఒకటైన లీసిచాన్‌స్క్‌లో రష్యా సేనలు క్షిపణుల మోత మోగిస్తున్నాయి. సిటీలో 60 శాతం మౌలిక సదుపాయాలు, నివాస భవనాలు ధ్వంసమయ్యాయి. రష్యా నిరంతర దాడుల వల్ల విద్యుత్, సహజ వాయువు, టెలిఫోన్; ఇంటర్నెట్ సర్వీసులు నిలిచిపోయినట్లు స్థానిక అధికారి ఒలెగ్జాండ్రా జైకా చెప్పారు. బఖ్ముత్–లీసిచాన్స్క్ రహదారిపై రాకపోకలకు అంతరాయం కలుగుతోందన్నారు. లీసిచాన్స్క్ నుంచి ఇప్పటిదాకా 20,000 మంది పౌరులకు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. గతంలో ఇక్కడ 97,000 జనాభా ఉండేది. షోల్జ్‌తో ఉక్రెయిన్ పార్లమెంట్ స్పీకర్ భేటీ ఉక్రెయిన్ పార్లమెంట్ స్పీకర్ రుస్లాన్ స్టెఫాన్చుక్ జర్మనీ చాన్సలర్ ఒలాఫ్ షోల్జ్‌తో బెర్లిన్‌లో సమావేశమయ్యారు. తమ పార్లమెంట్ సభ్యులను ఉద్దేశించి మాట్లాడాలని కోరారు. జర్మనీ పార్లమెంట్ సమావేశంలో స్టెఫాన్చుక్ పాల్గొన్నారు. జర్మనీ పార్లమెంట్ స్పీకర్ బెయిర్బెల్ బాస్ ఆయనకు స్వాగతం పలికారు. ఉక్రెయిన్‌లో పౌర మరణాలు 4,945: ఐరాస రష్యా దాడుల వల్ల ఉక్రెయిన్‌లో 9,094 మంది సాధారణ పౌరులు బాధితులుగా మారారని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్ కార్యాలయం తాజా నివేదికలో వెల్లడించింది. 4,149 మంది ప్రాణాలు కోల్పోయారని, 4,945 మంది క్షతగాత్రులయ్యారని తెలియజేసింది. బలమైన పేలుడు సంభవించే ఆయుధాల వల్లే ఎక్కువ మంది మరణించారని, గాయపడ్డారని పేర్కొంది. ఉక్రెయిన్‌పై రష్యా సైన్యం భారీ వైమానిక దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. రష్యా ప్రారంభించిన యుద్ధంలో తమ దేశంలో 243 మంది చిన్నారులు బలయ్యారని, 446 మంది గాయాలపాలయ్యారని ఉక్రెయిన్ ప్రాసిక్యూటర్ జనరల్ కార్యాలయం వివరించింది. -
వచ్చే ఆర్నెల్లలో 90 శాతం... రష్యా చమురుపై నిషేధం
బ్రసెల్స్: రష్యాపై ఆంక్షలకు కొనసాగింపుగా యూరోపియన్ యూనియన్ కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా నుంచి చమురు దిగుమతులను వచ్చే ఆర్నెల్లలో ఏకంగా 90 శాతం తగ్గించుకునేందుకు యూరప్ దేశాలన్నీ అంగీకరించాయి. మంగళవారం జరిగిన ఈయూ కీలక భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. ఇతర సరఫరా మార్గాలను వెదుక్కోవడం, వీలైనంత త్వరగా సంప్రదాయేతర ఇంధన వనరులకు మళ్లడం తదితరాల ద్వారా కొరతను అధిగమించాలని నిర్ణయించాయి. ఈ నిర్ణయంతో రష్యా నుంచి సముద్ర మార్గాన జరిగే యూరప్‌కు ఇంధన సరఫరా పూర్తిగా నిలిచిపోనుంది. హంగరీ వంటి మధ్య, తూర్పు యూరప్ దేశాలకు పైప్‌లైన్ ద్వారా జరుగుతున్న సరఫరాలు మాత్రం కొనసాగుతాయి. తాజా నిర్ణయానికి ఈయూ త్వరలో తుది రూపు ఇవ్వనుంది. దీంతోపాటు రష్యాలోని మరో అతి పెద్ద బ్యాంకుపైనా, ఆ దేశ మీడియాపైనా ఈయూ ఆంక్షలు విధించింది. యూరప్ తన చమురు అవసరాల్లో 25 శాతం, గ్యాస్ అవసరాల్లో ఏకంగా 40 శాతం రష్యాపైనే ఆధారపడ్డ విషయం తెలిసిందే. అందుకే ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి దిగినప్పటి నుంచీ ఆ దేశం నుంచి చమురు, గ్యాస్ దిగుమతుల్ని పూర్తిగా నిలిపేయాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నా చాలా యూరప్ దేశాలు సమ్మతించలేదు. ఈ నేపథ్యంలో తాజా నిర్ణయం విశేషమనే చెప్పాలి. అయితే తమ ఇంధన భద్రతకు హామీ ఇస్తేనే నిషేధానికి మద్దతిస్తామని రష్యా నుంచి 60 శాతానికి పైగా చమురు దిగుమతి చేసుకుంటున్న హంగరీ ప్రకటించింది. ఈయూ నిర్ణయాన్ని రష్యా తేలిగ్గా తీసుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు డిమాండ్‌కు కొదవ లేదని, ఇతర దిగుమతిదారులను చూసుకుంటామని చెప్పింది. బల్గేరియా, పోలండ్, ఫిన్లండ్లకు చమురు ఎగుమతులను రష్యా ఇప్పటికే నిలిపేసింది. డెన్మార్క్‌కు కూడా మంగళవారం నుంచి సరఫరాలు ఆపేస్తున్నట్టు రష్యా ప్రభుత్వ రంగ ఇంధన దిగ్గజం గజ్ప్రోమ్ ప్రకటించింది. తమ పట్ల విద్వేషమే ఏకైక ప్రాతిపదికగా ఈయూ ఈ నిర్ణయం తీసుకుందని రష్యా మాజీ అధ్యక్షుడు మెద్వదెవ్ దుయ్యబట్టారు. మరోవైపు ఉక్రెయిన్ నుంచి ఆహార ఎగుమతులు ఆగిపోవడంపై ఆఫ్రికన్ యూనియన్ ఆందోళన వెలిబుచ్చింది. ఆఫ్రికా దేశాలు తీవ్ర కొరతతో అల్లాడుతున్నాయని యూనియన్ చీఫ్, సెనెగల్ అధ్యక్షుడు మెకీ సల్ చెప్పారు. పశ్చిమ దేశాల మొండి వైఖరే ఇందుకు కారణమని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఆరోపించారు. ఉక్రెయిన్ తన తీర జలాలను మందుపాతరలతో నింపేసిందన్నారు. -
తగ్గేదేలే.. భారత్ డబుల్ డోసు!
అమెరికా ప్రత్యక్ష, పరోక్ష హెచ్చరికలను.. భారత్ తేలికగా తీసుకుంది. పైగా రష్యా ముడి చమురు కొనుగోళ్లను భారతదేశం రెట్టింపు చేస్తోంది. ఉక్రెయిన్ యుద్ధం మూడో నెలకు చేరుకున్న దరిమిలా.. ఓపెక్ ఉత్పత్తిదారుల నుంచి కొనుగోళ్లను పెంచుకుంటూ పోతోంది భారత్. రష్యా-భారత్‌కు మధ్య ఎప్పటినుంచో ఆయుధాలు, ఆయిల్ కొనుగోళ్లకు సంబంధించిన లావాదేవీలు నడుస్తున్నాయి. ఈ తరుణంలో ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలు, రష్యాపై ఆంక్షల వంకతో భారత్‌ను రష్యాకు దూరం చేయాలని అమెరికా భావించింది. అవసరమైతే ఎనర్జీ విషయంలో సాయం చేస్తామంటూ స్వయంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ప్రధాని మోదీకి ఆఫర్ కూడా ఇచ్చాడు. క్లిక్: Viral Video: బతుకుతుందని అనుకోలేదు.. ఇది ఆమెకు కచ్చితంగా పునర్జన్మే! కానీ, తక్కువ ధర, ఒప్పందాలు ఆకర్షనీయంగా ఉండడంతో రష్యా వైపే భారత్ మొగ్గు చూపిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వ ఆధీనంలోని చమురు శుద్ధి సంస్థలు.. మంచి ధరలను పొందడానికి పబ్లిక్ టెండర్ల ద్వారా కొనుగోలు చేయడానికి బదులుగా ప్రైవేట్‌గా చర్చల ఒప్పందాలను చూస్తున్నాయి. రష్యన్ చమురు ఇప్పుడు మరింత చౌకగా పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే భారత్, దిగుమతి ఉత్పత్తులను రెట్టింపు చేస్తోంది. ఒకవైపు యూరోపియన్ యూనియన్ సైతం రష్యా నుంచి చమురును విపరీతంగా కొనుగోలు చేస్తుండగా.. ఆపేయాలంటూ అమెరికా, మిత్రపక్షాల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఇక చైనాలో క్రూడ్ డిమాండ్ కరోనా విజృంభణతో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. మరోవైపు రష్యా దిగుమతులను నిషేధిస్తామని యూఎస్, యూకేలు ఇప్పటికే ప్రతిజ్ఞ చేశాయి. కానీ, భారత్ మాత్రం ఆంక్షలు, హెచ్చరికలను తేలికగా తీసుకుంటూ రష్యా ఆయిల్‌ను దిగుమతి చేసుకుంటోంది. -
రష్యాతో వాణిజ్యం.. భారత్ సాలిడ్ కౌంటర్
రష్యాతో వాణిజ్య ఒప్పందాల విషయంలో అగ్రరాజ్యానికి భారత్ గట్టి కౌంటరే ఇచ్చింది. రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్ల విషయమై ప్రశ్నించిన అమెరికా.. ఉక్రెయిన్ పరిణామాల నేపథ్యంలో రష్యాను ఎందుకు వ్యతిరేకించడం లేదంటూ నిలదీసింది. అయితే.. ప్రతీ దానికి భారత్‌ను ప్రశ్నించే బదులు, ముందు యూరప్ దేశాలను నిలదీయాస్తే బాగుంటుందని అమెరికాను సున్నితంగా కౌంటర్ ఇచ్చింది భారత్. మంగళవారం భారత్-అమెరికా 2+2 భేటీ తర్వాత ప్రశ్నల సమయంలో.. భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఈ మేరకు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘రష్యాతో ఆయిల్ కొనుగోళ్ల గురించి మీరు ప్రస్తావించినట్లు నా దృష్టికి వచ్చింది. రష్యా నుంచి కొనుగోళ్లను గనుక పరిశీలిస్తే.. ముందు యూరప్ మీద మీరు దృష్టి పెడితే బాగుంటుందని అనుకుంటున్నాం. మేం కేవలం ఎనర్జీ సెక్యూరిటీ కోసమే కొనుగోలు చేస్తున్నాం. కానీ, గణంకాలు మీకు ఆశ్చర్యంగా అనిపించొచ్చు. ఒక నెలలో మొత్తం మేం కొనుగోలు చేస్తే ఎనర్జీ.. యూరప్ దేశాలు ఒక్క పూటలోనే చేస్తున్నాయని. కాబట్టి, ఆ అంశంపై ఆలోచిస్తే మంచిదని జైశంకర్, అగ్రరాజ్యానికి కౌంటర్ ఇచ్చారు. రష్యా చర్యలను భారత్ ఎందుకు వ్యతిరేకించడం లేదన్న ప్రశ్నకూ.. ఆయన స్పందించాడు. సెక్రటరీ బ్లింకెన్ ఎత్తి చూపినట్లుగా.. మేము ఐక్యరాజ్యసమితిలో, చట్ట సభల్లో, ఇతర వేదికలపైనా మా స్థానాన్ని వివరించే దిశగా అనేక ప్రకటనలు చేశాం. అన్నింటా మేం చెప్పింది ఒక్కటే.. ‘మేము యుద్ధ వాతావరణానికి వ్యతిరేకం. చర్చలు, దౌత్యం కొరుకుంటున్నాం. ఏ నేల పైన అయినా సరే.. హింసను తక్షణమే విరమించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ మార్గాలన్నింటిలో మేం సిద్ధంగానే ఉన్నాం’ అని ఆయన స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. భారత్-అమెరికా 2+2 సమావేశం అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఈ మేరకు అమెరికా కార్యదర్శి ఆంటోనీ జే బ్లింకెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ యుద్ధ పరిణామాల నేపథ్యంలో.. మరోసారి ప్రపంచ దేశాలకు అగ్రరాజ్యం తరపున పిలుపు ఇచ్చాడాయన. రష్యాతో ఒప్పందాలకు.. ప్రత్యేకించి ఆయుధ ఒప్పందాలకు సంబంధించి దూరంగా ఉండడం మంచిదని సూచించాడాయన. ఇక భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలు పెరిగిపోతున్నాయని, అమెరికా ఇది నిశితంగా పరిశీలిస్తోందని బ్లింకెన్ వ్యాఖ్యలు చేశారు. అమెరికా ప్రతినిధి ఇల్హాన్ ఒమర్.. మోదీ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేసిన దరిమిలా.. బ్లింకెన్ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ వ్యాఖ్యలపై ఇటు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌గానీ, అటు జైశంకర్‌గానీ స్పందించకపోవడం గమనార్హం. -
రష్యా- ఉక్రెయిన్ యుద్ధం, భారత్‌కు భారీ షాక్!
ముంబై: రష్యా–ఉక్రెయిన్ యుద్ధం భారత్‌కు భారీ షాక్ తగలనుంది. యుద్ధం కారణంగా ముడి పొద్దు తిరుగుడు నూనె (సన్‌ఫ్లవర్ ఆయిల్) సరఫరాపై ప్రభావం ఉంటుందని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ వెల్లడించింది. ‘భారత్‌కు దిగుమతి అవుతున్న ముడి పొద్దు తిరుగుడు నూనెలో ఉక్రెయిన్ వాటా 70 శాతం, రష్యా నుంచి 20 శాతం సమకూరుతోంది. ఇరు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంతో 2022–23 ఆర్థిక సంవత్సరంలో దేశంలోకి ముడి సన్‌ఫ్లవర్ అయిల్ సరఫరా 25 శాతం తగ్గనుంది. అంటే 4–6 లక్షల టన్నుల కొరత ఏర్పడుతుంది. దేశీయంగా వంట నూనెలను ప్రాసెస్ చేసే సంస్థల జమ, ఖర్చుల పట్టీ సరఫరా అంతరాయాలను తట్టుకునేంత పటిష్టంగా ఉంటుంది. కానీ వీటి ఉత్పత్తి ప్రణాళికపై ప్రభావం చూపుతాయి’ అని క్రిసిల్ వివరించింది. ముడి వంట నూనెల దిగుమతుల్లో 75 శాతం వాటా సోయాబీన్, పామాయిల్ కైవసం చేసుకున్నాయి. శుద్ధి చేసిన వంట నూనెల సగటు ధర ఏడాదిలో 25 శాతం అధికమైంది. ఇతర నూనెలపై.. దేశంలో ఏటా 230–240 లక్షల టన్నుల వంట నూనెల వినియోగం అవుతోంది. ఇందులో సన్‌ఫ్లవర్ వాటా 10 శాతం. డిమాండ్‌లో 60 శాతం దిగుమతులే దిక్కు. దేశీయ ప్రాసెసింగ్ కంపెనీలు సాధారణంగా 30–45 రోజులకు సరిపడ ముడి పదార్థాలను నిల్వ చేస్తాయి. ఇది తక్షణ కాలంలో సరఫరా ఇబ్బందులను అధిగమించడంలో సహాయపడుతుంది. యుద్ధం కొనసాగితే సరఫరా, ధరలు దెబ్బతింటాయి. ఈ నేపథ్యంలో అర్జెంటీనా నుంచి ముడి సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతి చేసుకునే అవకాశం ఉంది. బ్రెజిల్లో పంట దిగుబడి లేక ముడి సోయాబీన్ నూనె ధర చాలా పెరిగింది. ఇండేనేషియా, మలేషియాలో ఉత్పత్తి తగ్గి ముడి పామాయిల్ ధర దూసుకెళ్లింది. అయితే కొరతను అధిగమించే స్థాయిలో సరఫరా లేకపోవడంతో ప్రాసెసింగ్ కంపెనీలు ఇతర నూనెలపై దృష్టిసారించే అవకాశాలు ఉన్నాయి. రష్యా, ఉక్రెయిన్ సంయుక్తంగా ఏటా 100 లక్షల టన్నుల ముడి పొద్దు తిరుగుడు నూనెను వివిధ దేశాలకు ఎగుమతి చేస్తున్నాయి’ అని క్రిసిల్ తన నివేదికలో తెలిపింది. -
చెప్తుంటే వినరా.. ఆయిల్ కొనుగోళ్లపై అమెరికా ఆగ్రహం, భారత్‌పై ఆంక్షలు!
రష్యా - భారత్‌ల మైత్రిపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దేశ అవసరాల దృష్ట్యా కేంద్రం సన్ ఫ్లవర్ ఆయిల్‌ను దిగుమతి చేయాలని ఉక్రెయిన్ను కోరింది. కానీ ఉక్రెయిన్ అందుకు కాదనడంతో భారత్..,రష్యా నుంచి సుమారు 45వేల టన్నలు సన్ ఫ్లవర్ ఆయిల్‌ను కొనుగోలు చేసింది. ఇప్పుడీ ఆయిల్ కొనుగోళ్లతో అమెరికా భారత్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. రష్యా నుంచి ఆయిల్ దిగుమతులు చేసుకుంటే భారత్‌కు 'గ్రేట్ రిస్క్' అంటూ అభివర్ణించింది. ఇప్పటి వరకు చేసిన ఆయిల్ దిగుమతులు చాలని, ఇకపై ఎలాంటి దిగుమతులు చేయరాదని హుకుం జారీ చేసింది. ఉక్రెయిన్- రష్యా యుద్ధం సంక్షోభానికి తెర పడవచ్చన్న ఆశలపై రష్యా నీళ్లు చల్లింది. తాజాగా జరిపిన చర్చల్లో (మంగళవారం) పెద్ద పురోగతేమీ లేదంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ అధికార ప్రతినిధి ద్మిత్రీ పెస్కోవ్ పెదవి విరిచారు. అదే సమయంలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ గురు, శుక్రవారం భారత్‌లో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా భారత్ - రష్యాల మధ్య వ్యాపార సంబంధమైన ఒప్పొందాలు జరగడం అగ్నికి ఆజ్యం పోసినట్లైంది అమెరికాకు. ఈ నేపథ్యంలో రష్యా- భారత్ స్నేహంపై అమెరికా హెచ్చరికలు జారీ చేసింది. రష్యా నుంచి భారత్ ఆయిల్‌ను దిగుమతులు చేసుకోకూడదని అమెరికా ప్రభుత్వ అధికార ప్రతినిధి వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రష్యాతో వాణిజ్యం భారత్‌కు ప్రమాదమేనన్న సంకేతాలు మొదలయ్యాయి. ఒకవేళ అమెరికా కాదన్నా రష్యా నుంచి ఆయిల్‌ను కొనుగోలు చేస్తే భారత్‌పై అమెరికా ఆంక్షలు విధించే అవకాశం ఉందని, అందుకు ఈ తాజా పరిణామాలు ఊతం ఇస్తున్నాయి. రాయిటర్స్ కథనం ప్రకారం..గతంలో భారత్ రష్యా నుంచి డిస్కౌంట్లో ఆయిల్‌ను కొనుగోలు చేస్తే ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. కానీ యుద్ధం సంక్షోభ సమయంలో ఆయిల్ ఉత్పత్తులపై అమెరికా అడ్డు చెబుతోంది. ఓవైపు భారత్‌తో తాము స్నేహంగా ఉంటామని అదే సమయంలో రష్యాకు సపోర్ట్ చేస్తే సహించబోమని అమెరికా..,భారత్‌కు సంకేతాలు పంపిస్తుంది. ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధం వీలైనంత త్వరగా ముగించేందుకు పుతిన్ పై ఒత్తిడి తెస్తామని, ఇందుకు భారత్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భాగస్వాములతో సంప్రదింపులు జరుపుతున్నట్లు యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి ఒకరు చెప్పారు. అప్పటి వరకు భారత్‌కే మా మద్దతు: అమెరికా భారత్ రూపాయి-రూబుల్ చెల్లింపుల అంశంపై అమెరికా ప్రభుత్వానికి ఎలాంటి ఆందోళన కలిగించదు."వారు ఏమి చెల్లిస్తున్నా, వారు ఏమి చేస్తున్నా, వారు ఆంక్షలకు అనుగుణంగా ఉండాలి. ఆంక్షలకు కట్టుబడి, కొనుగోళ్లను గణనీయంగా పెంచనంత కాలం అమెరికా మద్దతు ఉంటుందని, అమెరికా ప్రభుత్వ ప్రతినిధి చెప్పారంటూ రాయిటర్స్ హైలెట్ చేసింది. భారత్ పై అమెరికా, ఆస్ట్రేలియా ఆగ్రహం క్వాడ్ భాగస్వాములైన అమెరికా, ఆస్ట్రేలియాలు..రష్యాతో భారత్ వాణిజ్య ఒప్పందాల్ని వ్యతిరేకిస్తున్నాం. రష్యా ఒకవైపు..ఉక్రేనియన్ ప్రజలకు స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, సార్వభౌమాధికారం అందించేందుకు అమెరికా వైపు నిలబడే సమయం ఆసన్నమైంది. పుతిన్ చేస్తున్న మారణ హోమానికి నిధులు, ఇంధనంతో పాటు ఇతర సహాయం చేయోద్దు అంటూ యూఎస్ వాణిజ్య కార్యదర్శి గినా రైమోండో అన్నారు. ఆస్ట్రేలియా వాణిజ్య మంత్రి డాన్ టెహన్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశాలు "నిబంధనల ఆధారిత విధానాన్ని కొనసాగించడానికి" కలిసి పనిచేయాలని అన్నారు. పెరిగిన ఆయిల్ ఉత్పత్తులు ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం కొనసాగుతుంది. ఫిబ్రవరి నుంచి ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంతో ప్రపంచ దేశాలన్నీ రష్యాపై ఆంక్షలు విధిస్తున్నాయి. అదే సమయంలో భారత్ మాత్రం ఆయిల్ దిగుమతులు పెంచుతుంది. 2021లో భారత్ రష్యా నుంచి 16 మిలియన్ బ్యారళ్లను కొనుగోలు చేసింది. కానీ ఈ ఏడాది ఫిబ్రవరి 24నుండి కనీసం 13 మిలియన్ బ్యారెళ్ల రష్యన్ చమురును కొనుగోలు చేసింది. -
అన్నంతపని చేసిన అమెరికా.. మిగిలిన దేశాలకు ఇబ్బందులు
న్యూయార్క్: అమెరికా రష్యాల మధ్య ఆధిపత్య పోరుతో క్రూడ్ ధర అంతర్జాతీయంగా సెగలు పుట్టిస్తోంది. ఉక్రెయిన్‌పై రష్యా తీవ్ర దాడుల నేపథ్యంలో ఆ దేశం నుంచి దిగుమతులను నిషేధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించడంతో చమురు మంట మరింత ఎగసింది. మంగళవారం బ్రెంట్ క్రూడ్ బ్యారల్ ధర క్రితం ముగింపుతో పోల్చితే 8 శాతం పైగా (దాదాపు 9 డాలర్లు) లాభంతో 132 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక అమెరికా నైమెక్స్ క్రూడ్ కూడా ఇదే స్థాయిలో ఎగసి 129 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. 2008 తరువాత ఇంత తీవ్ర స్థాయిలో క్రూడ్ ధరలు చూడటం ఇదే తొలిసారి. ఇప్పటి వరకూ క్రూడ్ గరిష్ట స్థాయి 147 డాలర్లు. ప్రపంచ ఆర్థిక సంక్షోభం సమయంలో 2008 జూలైలో క్రూడ్ ఈ స్థాయిని చూసింది. సందిగ్ధంలో యూరప్ ప్రపంచ ముడి చమురు సరఫరాల్లో రష్యా వాటా 7 శాతం ఉండగా, ఉత్పత్తిలో 10 శాతం ఉంది. అమెరికా దిగుమతి చేసుకున్న ముడి చమురులో రష్యా వాటా కేవలం 10 శాతమే. ఇదే యూరప్ దేశాల విషయానికి వస్తే అధికంగా ఉంది. ఒక్క జర్మనినీ పరిశీలిస్తే ఆ దేశ అవసరాల్లో 40 శౠతం ముడిచమురు, సహాజవాయువుని రష్యా నుంచి దిగుమతి చేసుకుంటుంది. దీంతో అమెరికా తరహాలో రష్యా నుంచి సరఫరాలపై నిషేధంపై యూరోపియన్ యూనియన్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోతోంది. 200 డాలర్లకు రష్యా నుంచి ముడిచమురు, గ్యాస్ దిగుమతులపై ఆంక్షలు విధిస్తే బ్యారెల్ ముడిచమురు ధర 300 డాలర్ల వరకు చేరుకోవచ్చంటూ రష్యా ఉప ప్రధాని అలెగ్జాండ్ నోవాక్ ఇప్పటికే హెచ్చరించారు. అయితే అంతర్జాతీయ చమురు మార్కెట్ విశ్లేషకులు, ట్రేడర్లు మాత్రం త్వరలోనే క్రూడ్ 200 డాలర్లను తాకొచ్చన్న అంచనాలు వెలిబుచ్చుతున్నారు. రూపాయి మరింత పతనం అంతర్జాతీయంగా తీవ్ర ప్రతికూల పరిణామాల నేపథ్యంలో ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ వరుసగా రెండవరోజూ కొత్త కనిష్టాన్ని తాకింది. ట్రేడింగ్‌లో 7 పైసలు నష్టపోయి జీవితకాల కనిష్టం 77 వద్ద ముగిసింది. వరుసగా ఐదు ట్రేడింగ్ సెషన్ల నుంచి రూపాయి జారుడుబల్లపై కొనసాగుతోంది. ట్రేడింగ్‌లో 77.02 వద్ద ప్రారంభమైన రూపాయి విలువ 76.71 గరిష్ట–77.05 కనిష్ట స్థాయిలను చూసింది. రూపాయికి ఇంట్రాడే కనిష్టం (77.05)–ముగింపుల్లో (77) సోమవారం స్థాయిలే రికార్డులు. చదవండి: భారీ డిస్కౌంట్‌కు రష్యా ఆయిల్ -
Russia- Ukraine War: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక ప్రకటన
US President Biden To Announce Ban On Russian Oil Imports: రష్యాపై మరిన్ని ఆంక్షలు విధిస్తూ అమెరికా నిర్ణయం తీసుకుంది. రష్యా నుంచి గ్యాస్, ఆయిల్ దిగుమతులపై నిషేదం విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటన చేశారు. 'రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు అమెరికా చర్యలు తీసుకుంటోంది. పుతిన్ వార్ మనిషిలా మారాడు. పోలండ్, ఉక్రెయిన్ పరిస్థితులపై సమీక్షిస్తున్నాం. ఉక్రెయిన్‌కు అండగా ఉంటాం నిధులిస్తూనే ఉంటాం. ఆయుధాలు కూడా ఇస్తూనే ఉంటాం' అని జో బైడెన్ స్పష్టం చేశారు. -
భారీగా పామాయిల్ సాగు
న్యూఢిల్లీ: దేశీ రైతులు పండించిన నూనెగింజలను కొనుగోలు చేస్తూ వారికి మద్దతుగా నిలవాలని ప్రైవేటు కంపెనీలను ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. అదే సమయంలో వంట నూనెల దిగుమతులు తగ్గించుకోవాలని సూచించారు. ఇది ఇరు వర్గాలకు ప్రయోజనకరమన్నారు. భారత్ వచ్చే 3–4 ఏళ్లలో వంట నూనెల ఉత్పత్తిని 50 శాతం పెంచుకునే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు చెప్పారు. ‘నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్’ కార్యక్రమం కింద పెద్ద ఎత్తున పామాయిల్ సాగుకు పుష్కలంగా అవకాశాలున్నట్టు పేర్కొన్నారు. ‘వ్యవసాయ రంగంపై బడ్జెట్ 2022 సానుకూల ప్రభావం’ అనే అంశంపై ఢిల్లీలో నిర్వహించిన ఒక కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాని మాట్లాడారు. ‘‘వీటికి (కాయధాన్యాలు, నూనె గింజలకు) దేశంలో భారీ డిమాండ్ ఉంది కార్పొరేట్ ప్రపంచం ముందుకు రావాలి. మీకు భరోసానిచ్చే మార్కెట్ ఉంది. దిగుమతులు చేసుకోవాల్సిన అవసరం ఎందుకు? ఎంత పరిమాణంలో కాయధాన్యాలు, నూనె గింజలను కొనుగోలు చేస్తారో రైతులకు ముందే చెప్పండి’’అని మోదీ అన్నారు. పంట నష్టానికి రక్షణగా వ్యవసాయ బీమా యంత్రాంగం ఉన్నట్టు చెప్పారు. మనమంతా కలసి పనిచేయడం ద్వారా మన దేశ అవసరాలకు కావాల్సిన ఆహార ఉత్పత్తులను స్థానికంగానే పండించేలా చూడాల్సి ఉందన్నారు. దేశ వంట నూనెల అవసరాల్లో 60–65 శాతాన్ని దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితిని ప్రధాని గుర్తు చేశారు. వంట నూనెల దిగుమతి బిల్లు 2020–21 సీజన్లో రూ.1.17 లక్షల కోట్లుగా ఉన్నట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. చిరుధాన్యాల సంవత్సరం 2023 అధిక పోషక విలువలు కలిగిన భారతీయ మిల్లెట్స్ (చిరు ధాన్యాలు)కు బ్రాండింగ్, ప్రచారానికి సహకారం అందించాలని కార్పొరేట్ సంస్థలను ప్రధాని కోరారు. 2023 సంవత్సరాన్ని మిల్లెట్స్ ఆఫ్ ద ఇయర్‌గా ప్రకటించారు. నానో ఫెర్టిలైజర్ విభాగంలో కంపెనీలకు అపార అవకాశాలున్నట్టు గుర్తు చేశారు. దీనితోపాటు ఆహారశుద్ధి, ఇథనాల్ తయారీ సాగు ముఖచిత్రాన్ని మార్చేవిగా అభివర్ణించారు. దేశవ్యాప్తంగా భూసార పరీక్షా కేంద్రాల నెట్వర్క్ ఏర్పాటుకు స్టార్టప్‌లు, ఇన్వెస్టర్లు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. భూముల సారాన్ని పరీక్షించుకోవాల్సిన అవసరంపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. 2022–23 బడ్జెట్ భారత్ వ్యవసాయ రంగాన్ని ఆధునికంగా, స్మార్ట్‌గా మార్చడంపై దృష్టి సారించినట్టు ప్రధాని పేర్కొన్నారు. 21వ శతాబ్దంలో సాగు, వాణిజ్య అంశాలను ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పూర్తిగా మార్చేస్తుందన్నారు. అగ్రి స్టార్టప్‌లను ప్రోత్సహించినప్పుడే సాగులో డ్రోట్ టెక్నాలజీ మరింత అందుబాటులోకి వస్తుందని అభిప్రాయపడ్డారు. గత మూడు నాలుగేళ్లలో 700 వ్యవసాయాధారిత స్టార్టప్‌లు ప్రారంభమైనట్టు చెప్పారు. రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యం ‘‘రైతుల ఆదాయం పెంచడం, ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడం, రైతులకు ఆధునిక సదుపాయాలను కల్పించడమే ప్రభుత్వ ఉద్దేశ్యం. రైతులకు అద్దెపై వ్యవసాయ పనిముట్లు, యంత్రాలను అందించే వ్యవస్థను కార్పొరేట్లు ఏర్పాటు చేయాలి. సహజ, సేంద్రీయ పద్ధతుల్లో సాగు చేయడంపై అవగాహన పెంచేందుకు యూనివర్సిటీలు, శాస్త్రవేత్తలు కృషి చేయాలి’’ అని ప్రధాని కోరారు. గడిచిన ఆరేళ్లలో వ్యవసాయానికి బడ్జెట్ ఎన్నో రెట్లు పెంచామని, వ్యవసాయ రుణాలు ఏడేళ్లలో రెండున్నర రెట్లు పెరిగినట్టు ప్రదాని గుర్తు చేశారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం చిన్న రైతులకు మద్దతుగా నిలుస్తోందంటూ.. 11 కోట్ల మంది రైతులకు రూ.1.75 లక్షల కోట్ల రుణాలను ఈ పథకం కింద అందించినట్టు ప్రకటించారు. చమురులో 20 శాతం ఇథనాల్‌ను కలిపే లక్ష్యం దిశగా పనిచేస్తున్నట్టు, ఇప్పటికే ఇది 8 శాతానికి చేరినట్టు గుర్తు చేశారు. కేంద్ర బడ్జెట్ 2022: వ్యవసాయ రంగంపై సానుకూల ప్రభావం అన్న అంశంపై జరిగిన వెబినార్‌లో ప్రసంగిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ -
ఇంధన భద్రతకు చర్యలు: భారత్
న్యూఢిల్లీ: నవంబర్ 4 తర్వాత మిత్రదేశాలు ఇరాన్ నుంచి చమురు దిగుమతి చేసుకోవద్దంటూ అమెరికా చేసిన హెచ్చరికల నేపథ్యంలో భారత్ స్పందించింది. దేశంలో ఇంధన భధ్రతకు సంబంధించిన చర్యలు చేపడుతున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం అన్ని భాగస్వామ్య పక్షాలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను అన్వేషించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ‘అమెరికా విదేశాంగ శాఖ జారీచేసిన ప్రకటన కేవలం భారత్‌ను ఉద్దేశించి చేసింది కాదు. అన్ని దేశాలకూ వర్తిస్తుంది. ఈ దిశగా భారత్ అవసరమైన చర్యలు చేపడుతుంది’ అని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ గురువారం ఢిల్లీలో తెలిపారు. అంతకుముందు, పరిశ్రమల శాఖ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇరాన్ నుంచి చమురు దిగుమతులను తగ్గించుకునేందుకు ప్రయత్నించడంతోపాటు, సౌదీ అరేబియా, కువైట్ నుంచి దిగుమతులు పెంచుకునేలా భారత్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. ఇరాక్, సౌదీ అరేబియా తర్వాత భారత్‌కు చమురు సరఫరా చేస్తున్న మూడో అతిపెద్ద దేశం ఇరాన్. -
అమెరికా ఒత్తిడితోనే..
సాక్షి, న్యూఢిల్లీ : అమెరికా నుంచి ఎదురైన ఒత్తిళ్ల మేరకే ఇరాన్ నుంచి చమురు దిగుమతుల్లో భారత్ కోత విధిస్తోందని భావిస్తున్నారు. ఇరాన్ నుంచి చమురు దిగుమతులను భారీగా తగ్గించాలని చమురు మంత్రిత్వ శాఖకు ఆదేశాలు వచ్చాయని అధికారులు తెలిపారు. ఇరాన్‌తో వాణిజ్య సంబంధాలు తెంచుకోవాలన్న అమెరికా ఒత్తిడికి భారత్ తలొగ్గిందనేందుకు ఇవి తొలి సంకేతాలని పరిశ్రమ వర్గాలు సైతం భావిస్తున్నాయి. అమెరికా ఏకపక్షంగా విధించిన నియంత్రణలను గుర్తించబోమని, ఐరాస ఆంక్షలను మాత్రం అనుసరిస్తామని భారత్ చెబుతోంది. అయితే అమెరికా ఒత్తిడి మేరకే చైనా తర్వాత అత్యధికంగా చమురు దిగుమతుల కోసం ఇరాన్‌పై ఆధారపడుతున్న భారత్ ఈ విషయంలో పునరాలోచిస్తోందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థతో మన ప్రయోజనాలు పెనవేసుకున్న నేపథ్యంలోనూ భారత్ ఈ తీరుగా వ్యవహరిస్తోందని చెబుతున్నాయి. మరోవైపు ఇరాన్ చమురుకు ప్రత్యామ్నాయాలను అన్వేషించాలని గురువారం రిఫైనర్లతో భేటీ అయిన చమురు మంత్రిత్వ శాఖ వర్గాలు స్పష్టం చేశాయి.గతంలో ఐరాస, యూరప్ ఆంక్షల నేపథ్యంలోనూ ఇరాన్ నుంచి చమురు దిగుమతులను భారత్ గణనీయంగా తగ్గించింది. అయితే ఈసారి పూర్తిగా ఇరాన్ చమురు దిగుమతులను నిరోధించాలన్న నిర్ణయంతో పరిస్థితిపై అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్ చమురు దిగుమతులపై ఆధారపడటం తగ్గించాలని ఐరాస అమెరికా రాయబారి నిక్కీ హాలీ ప్రధాని నరేంద్ర మోదీకి సూచించారు. -
2022కల్లా చమురు దిగుమతులు...
10 శాతానికి తగ్గింపే లక్ష్యం * ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడి.. * ఐఓసీ పారాదీప్ రిఫైనరీ జాతికి అంకితం పారాదీప్: విదేశాల నుంచి ముడిచమురు దిగుమతులను భారత్ భారీగా తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 2022లో మనం 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోనున్నామని.. అప్పటికల్లా క్రూడ్ దిగుమతులను 10 శాతానికి తగ్గించాలన్నది తమ లక్ష్యమని చెప్పారు. ప్రస్తుతం భారత్ ముడి చమురు అవసరాల్లో 79 శాతం మేర దిగుమతులపైనే ఆధారపడుతుండటం గమనార్హం. 2014-15లో 112.7 బిలియన్ డాలర్ల విలువైన 189.4 మిలియన్ టన్నుల ముడిచమురును భారత్ దిగుమతి చేసుకుంది. ఆదివారమిక్కడ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ) పారాదీప్‌లో నిర్మించిన రిఫైనరీని జాతికి అంకితం చేసిన సందర్భంగా మాట్లాడుతూ ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంధన రంగంలో భారత్‌ను స్వయం సమృద్ధి దేశంగా నిలబెట్టేందుకు ఆయిల్ కంపెనీలు కృషిచేయాలని, దీన్ని ఒక సవాలుగా తీసుకోవాలని ఆయన సూచించారు. ఐఓసీ పారాదీప్ రిఫైనరీ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 15 మిలియన్ టన్నులు. 2000 సంవత్సరం మే 24న అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి దీనికి శంకుస్థాపన చేశారు. దాదాపు 16 ఏళ్ల తర్వాత ఇది అందుబాటులోకి వచ్చింది. దీని ఏర్పాటు కోసం ఐఓసీ రూ.34,555 కోట్లను పెట్టుబడిగా వెచ్చిం చింది. కాగా, పారాదీప్ రిఫైనరీ జతకావడంతో ఇప్పటిదాకా దేశంలో నంబర్ వన్ రిఫైనరీ సంస్థగా ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను వెనక్కినెట్టి ఐఓసీ ఆ స్థానాన్ని చేజిక్కించుకోనుంది. ప్రపంచంలో అత్యంత అధునాతన రిఫైనరీల్లో ఒకటిగా ఇది నిలవనుంది. అధిక సల్ఫర్ మోతాదు ఉన్న హెవీ క్రూడ్ ఆయిల్‌ను సైతం శుద్ధి చేసే సామర్థ్యం దీనికి ఉంది. ఇక్కడ ఏడాదికి 5.6 మిలియన్ టన్నుల డీజిల్, 3.79 మిలియన్ టన్నుల పెట్రోలు, 1.96 మిలియన్ టన్నుల కిరోసిన్/ఏటీఎప్ను ఉత్పత్తి చేయనున్నట్లు కంపెనీ అధికారి ఒకరు తెలిపారు. దీంతోపాటు 7,90,000 టన్నుల వంటగ్యాస్(ఎల్పీజీ), 1.21 మిలియన్ టన్నుల పెట్‌కోక్ కూడా ఉత్పత్తి అవుతుందని చెప్పారు. ఈ రిఫైనరీ ఏర్పాటు కోసం 2.8 లక్షల టన్నుల స్టీల్‌ను వినియోగించామని.. ఇది 30 ఈఫిల్ టవర్లు/350 రాజధాని రైళ్లతో సమానమని ఆయన వివరించారు. అంతేకాదు ఇక్కడ వాడిన 11.6 లక్షల ఘనపు మీటర్ల కాంక్రీటు.. ప్రపంచంలోనే ఎత్తయిన దుబాయ్ బుర్జ్ ఖలీఫా టవర్‌కు మూడింతలతో సమానమని కూడా పేర్కొన్నారు. ఇంకా ఇక్కడ వాడిన పైపుల పొడవు 2,400 కిలోమీటర్లు(దాదాపు గంగా నది అంత పొడవు) కావడం విశేషం. రూ. లక్ష కోట్ల ముద్రా రుణాల మంజూరు... ప్రధాన మంత్రి ముద్రా యోజన కింద చిన్న ఎంట్రప్రెన్యూర్లకు ఇప్పటివరకూ దాదాపు రూ. లక్ష కోట్ల విలువైన రుణాలను మంజూరు చేసినట్లు మోదీ తెలిపారు. చాలా తక్కువ కాలంలోనే ఇంత భారీ స్థాయిలో రుణాలివ్వడం సామాన్యమైన విషయం కాదన్నారు. దేశంలో యువతను ఉద్యోగాల కోసం ఎదురుచూసేవారిగా కాకుండా వాళ్లే మరింత మందికి ఉద్యోగాలను కల్పించేవిధంగా చేయాలన్నది తమ ప్రభుత్వ సంకల్పమని ఆయన చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగంతో పాటు పర్సనల్ రంగాన్ని కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. దీనిద్వారా యువత సొంతంగా వ్యాపారాలను ప్రారంభించి, ఉద్యోగావకాశాలను కల్పించే స్థాయికి ఎదుగుతారని చెప్పారు. -
వాణిజ్యలోటు జూమ్!
నవంబర్‌లో ఏడాదిన్నర గరిష్ట స్థాయి 16.8 బిలియన్ డాలర్లుగా నమోదు న్యూఢిల్లీ: ఎగుమతులు-దిగుమతుల విలువ మధ్య ఉన్న నికర వ్యత్యాసం- వాణిజ్యలోటు నవంబర్‌లో భారీగా పెరిగింది. ఇది 16.8 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. సోమవారం ప్రభుత్వం ఈ గణాంకాలను విడుదల చేసింది. దీని ప్రకారం, నవంబర్‌లో ఎగుమతులు 2013 ఇదే నెలతో పోల్చిచూస్తే, 7.27 శాతం వృద్ధితో 25.96 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు ఇదే నెలలో 26.79 శాతం పెరుగుదలతో 42.82 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఫలితం దేశానికి 16.8 బిలియన్ డాలర్ల వాణిజ్యలోటు ఏర్పడింది. ఇది దాదాపు ఏడాదిన్నర గరిష్ట స్థాయి. అక్టోబర్‌లో ఈ లోటు 13.4 బిలియన్ డాలర్లు. 2013 నవంబర్‌లో ఈ పరిమాణం 9.2 బిలియన్ డాలర్లు. తాజా సమీక్షా నెల నవంబర్‌లో చమురు దిగుమతులు 9.7 శాతం తగ్గి, 11.71 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. చమురుయేతర దిగుమతుల విలువ 49.6 శాతం వృద్ధితో 31.10 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఎనిమిది నెలల్లో... కాగా 2014 ఏప్రిల్ నుంచి నవంబర్ వరకూ గడిచిన ఎనిమిది నెలల్లో గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే ఎగుమతుల విలువ 5.02 శాతం వృద్ధితో 215.75 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతుల విలువ 4.65 శాతం వృద్ధితో 316.37 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. దీనితో వాణిజ్యలోటు 100.61 బిలియన్ డాలర్లుగా ఉంది. -
ఎగుమతులు నిరుత్సాహం
న్యూఢిల్లీ: భారత ఎగుమతులు ఈ ఏడాది అక్టోబర్‌లో నిరాశపరిచాయి. గత ఏడాది ఇదే నెలతో పోల్చితే ఎగుమతుల్లో అసలు వృద్ధిలేకపోగా ఈ విలువ 5.04 శాతం క్షీణించింది. ఆరు నెలల తరువాత ఎగుమతుల రంగంలో ఇలాంటి పరిణామం చోటుచేసుకుంది. విలువ రూపంలో కేవలం 26.09 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరిగాయి. ఇక దిగుమతుల విషయానికి వస్తే- ఇవి 3.62 శాతం పెరిగాయి. ఈ విలువ 39.45 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. దీనితో ఎగుమతులు-దిగుమతులకు మధ్య ఉన్న వ్యత్యాసానికి సంబంధించిన వాణిజ్యలోటు ఈ నెలలో 13.35 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. గత ఏడాది ఇదే నెలలో వాణిజ్యలోటు 10.59 బిలియన్ డాలర్లు. బంగారంపై ఆంక్షలు కొనసాగింపు!? బంగారం దిగుమతులు పెరగడం వాణిజ్యలోటు భారీగా ఉండడానికి కారణాల్లో ఒకటి. 2013 అక్టోబర్‌లో బంగారం దిగుమతుల విలువ 1.09 బిలియన్ డాలర్లు. అయితే 2014 అక్టోబర్‌లో ఈ విలువ ఏకంగా 4.17 బిలియన్ డాలర్లకు ఎగసింది. బంగారం, వెండి రెండింటినీ చూస్తే ఈ విలువ 1.38 బిలియన్ డాలర్ల నుంచి 4.85 బిలియన్ డాలర్లకు చేరింది. అయితే ఆయిల్ దిగుమతులు తగ్గడం వల్ల వాణిజ్య లోటు ఈ స్థాయిలో ఉందికానీ, లేదంటే ఈ లోటు మరింత పెరిగేదని నిపుణుల వ్యాఖ్య. నెలవారీగా చూస్తే అంటే సెప్టెంబర్‌తో పోల్చిచూస్తే- వాణిజ్యలోటు 14.25 బిలియన్ డాలర్ల నుంచి 13.36 బిలియన్ డాలర్లకు తగ్గింది. పండుగల సీజన్లో డిమాండ్ పెరగడమే పసిడి దిగుమతుల పెరుగుదలకు కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దేశ కరెంట్ అకౌంట్ లోటు కట్టడిలో భాగంగా ప్రభుత్వం గత కొన్ని నెలలుగా కనకం దిగుమతుల కట్టడికి తీసుకుంటున్న చర్యల వల్ల ఈ మెటల్ దిగుమతులు గణనీయంగా తగ్గిపోయిన సంగతి తెలిసిందే. కాగా వరుసగా రెండవ నెల (సెప్టెంబర్ 4.22 బిలియన్ డాలర్లు) బంగారం దిగుమతులు 4 బిలియన్ డాలర్లు పైగా నమోదుకావడం- తాజా ఆందోళనకు కారణమవుతోంది. ఈ మెటల్ దిగుమతుల కట్టడికి ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ ఎస్ఎస్ ముంద్రా సోమవారం తెలిపారు. పరిమాణం రూపంలో 2014 అక్టోబర్‌లో బంగారం దిగుమతుల పరిమాణం 150 టన్నులుగా ఉంది. 2013 ఇదే నెలలో ఈ పరిమాణం 24 టన్నులు. తాజా పరిణామం చూస్తుంటే... బంగారం దిగుమతులపై ఆంక్షలు మరికొంతకాలం తప్పేట్లు లేదని నిపుణుల వ్యాఖ్య. అమెరికా, యూరప్‌ల స్థితికి అద్దం! అమెరికా, యూరప్‌లలో మందగమన పరిస్థితులే ఎగుమతుల క్షీణతకు ప్రధాన కారణమని భారత ఎగుమతిదారుల సంఘం (ఎఫ్ఐఈఓ) ప్రెసిడెంట్ రఫీక్ అహ్మద్ పేర్కొన్నారు. ఎగుమతిదారులకు సహాయం చేయడానికి ప్రభుత్వం కూడా ఇంకా ముందుకు రాకపోవడం పట్ల ఆయన నిరాశను వెలిబుచ్చారు. ఎగుమతిదారులకు సానుకూలమైన కొత్త విదేశీ వాణిజ్య విధానాన్ని ప్రభుత్వం ప్రకటించాలని సీఐఐ జాతీయ కమిటీ (ఎగుమతులు, దిగుమతుల విభాగం) చైర్మన్ సంజయ్ బుధియా అన్నారు. ఇంట్రస్ట్ సబ్వెన్షన్ స్కీమ్‌ను మళ్లీప్రవేశపెట్టాలని ఈ రంగం కోరుతోంది.