న్యూఢిల్లీ: నవంబర్ 4 తర్వాత మిత్రదేశాలు ఇరాన్ నుంచి చమురు దిగుమతి చేసుకోవద్దంటూ అమెరికా చేసిన హెచ్చరికల నేపథ్యంలో భారత్ స్పందించింది. దేశంలో ఇంధన భధ్రతకు సంబంధించిన చర్యలు చేపడుతున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం అన్ని భాగస్వామ్య పక్షాలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను అన్వేషించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ‘అమెరికా విదేశాంగ శాఖ జారీచేసిన ప్రకటన కేవలం భారత్‌ను ఉద్దేశించి చేసింది కాదు. అన్ని దేశాలకూ వర్తిస్తుంది.
ఈ దిశగా భారత్ అవసరమైన చర్యలు చేపడుతుంది’ అని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ గురువారం ఢిల్లీలో తెలిపారు. అంతకుముందు, పరిశ్రమల శాఖ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇరాన్ నుంచి చమురు దిగుమతులను తగ్గించుకునేందుకు ప్రయత్నించడంతోపాటు, సౌదీ అరేబియా, కువైట్ నుంచి దిగుమతులు పెంచుకునేలా భారత్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. ఇరాక్, సౌదీ అరేబియా తర్వాత భారత్‌కు చమురు సరఫరా చేస్తున్న మూడో అతిపెద్ద దేశం ఇరాన్.
Comments
Please login to add a commentAdd a comment