Ramesh Kumar
-
స్కెచ్ మొత్తం నిహారిక నేతృత్వంలోనే!
సాక్షి, హైదరాబాద్: మొదటి భర్తను వదిలేసింది..రెండో భర్తను మోసం చేసింది..మూడో భర్తను ఏకంగా చంపేసింది.. నాలుగో భర్తగా చేసుకోవాలనుకున్న డాక్టర్‌ను జైలుకు పంపింది..పోచారం ఐటీ కారిడార్‌కు చెందిన వ్యాపారి రమేష్ కుమార్ హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న నిహారిక వ్యవహారమిది. తన స్నేహితుడు అంకుర్ రాణాతో కలిసి పీర్జాదిగూడలో ఈ హత్య చేసిన నిహారిక ప్రియుడు నిఖిల్ సూచనల మేరకు మృతదేహాన్ని 850 కిలోమీటర్లు తీసుకువెళ్లి, కర్ణాటకలోని కొడగు ప్రాంతంలో ఉన్న కాఫీ ఎస్టేట్‌లో కాల్చేసిన విషయం విదితమే. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సిటీకి తీసుకువచ్చినప్పుడే అంకుర్ కర్ణాటక పోలీసుల నుంచి తప్పించుకోవడం, మళ్లీ చిక్కడం జరిగాయి. త్వరలో నిందితులపై అభియోగపత్రాలు దాఖలు చేయాలని నిర్ణయించిన కొడగు పోలీసులు ప్రధాన నిందితురాలు నిహారిక గత చరిత్రను తవ్వితీశారు.రెండో భర్తకు రూ.70 లక్షల టోకరా..నగర శివార్లలోని భువనగిరికి చెందిన ఆకుల శ్రీలతకు (29) ఇక్కడ ఉండగానే ఓ వ్యక్తితో వివాహమైంది. ఓ కుమార్తె కలిగిన తర్వాత డబ్బుపై ఆశ, జల్సాల కోసం శ్రీలత మొదటి భర్తను వదిలేసి, బెంగళూరుకు మకాం మార్చింది. ఓ మల్టీ నేషనల్ కంపెనీలో పని చేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా ప్రచారం చేసుకుంది. తన పేరును పంతుల నిహారికగా మార్చుకుని..కొన్నేళ్ల క్రితం హర్యానాలోని కర్నాల్ ప్రాంతానికి చెందిన కమల్‌దీప్ శైనీ అనే వ్యక్తితో ‘మీట్4యూ’ అనే డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైంది. సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా బిల్డప్ ఇచ్చిన నిహారిక కమల్‌ను 2019 జూన్ 22న రెండో పెళ్లి (అతడికి మొదటి వివాహం) చేసుకుంది. తనకు అప్పటికే పెళ్లి కావడం, భర్త నుంచి విడిపోవడాన్ని దాచి ఉంచింది.ల్యాప్‌టాప్‌లో కనిపించిన ఫొటోతో..వీళ్లిద్దరూ బెంగళూరులో నివసిస్తుండగానే తన కుమార్తెను మేనకోడలు అంటూ చెప్పి తమ వద్దకు తెచ్చుకుంది. అనారోగ్యం సహా వివిధ రకాలైన కారణాలు చెప్తూ కమల్‌దీప్ నుంచి రూ.70 లక్షలు తీసుకుంది. కరోనా సీజన్లో వీళ్లిద్దరూ తమ మకాంను కర్నాల్‌కు మార్చారు. నిహారిక తనతో పాటు తన కుమార్తెను తీసుకువెళ్లింది. ఓ రోజు నిహారిక ల్యాప్‌టాప్‌లో ఆమె మొదటి భర్తకు సంబంధించిన ఫొటోలు చూసిన కమల్‌దీప్ అసలు విషయం తెలుసుకున్నారు. తాను మోసపోయానని గుర్తించిన కమల్‌దీప్ 2021 జనవరిలో కర్నాల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న అక్కడి పోలీసులు అదే ఏడాది ఫిబ్రవరి 4న నిహారికను అరెస్టు చేశారు. ఆ ఏడాది డిసెంబర్ వరకు కర్నాల్ జైల్లో గడిపిన ఆమెకు బెయిల్ వచ్చింది. జైల్లో ఉండగా వేధింపుల కేసులో జైలుకు వచ్చిన సభా అనే మహిళతో నిహారికకు పరిచయం ఏర్పడింది. సభాను ములాఖత్‌లో కలవడానికి వచ్చే ట్యాక్సీ డ్రైవర్ అంకుర్ రాణాతోనూ ఈమెకు స్నేహం ఏర్పడింది.కోర్టుకు హాజరుకాకపోవడంతో వారెంట్..మోసం కేసులో బెయిల్ పొందిన నిహారిక కోర్టు వాయిదాలకు దాదాపు రెండేళ్ల పాటు హాజరుకాలేదు. దీంతో ఆమైపె న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. దీని ఆధారంగా కర్నాల్ పోలీసులు ఈ ఏడాది మేలో మరోసారి అరెస్టు చేయగా..ఆగస్టులో బెయిల్ పొంది బయటకు వచ్చింది. ఇదిలా ఉండగా..నగరంలోని తుకారాంగేట్ ప్రాంతానికి చెందిన చెందిన రమేష్ కుమార్ భార్య, కుమార్తెకు దూరంగా పోచారంలో ఉన్న సంస్కృతి టౌన్షిప్లో ఒంటరిగా నివసించారు. నిహారికకు మాట్రిమోనియల్ సైట్ ద్వారా రమేష్‌తో పరిచయం ఏర్పడింది. 2018లో రిజిస్టర్ వివాహం చేసుకున్న వీళ్లు సంస్కృతి టౌన్‌షిప్‌లోనే కాపురం పెట్టారు. నిహారిక మాత్రం ఉద్యోగ నిమిత్తం అంటూ ఎక్కువ రోజులు బెంగళూరులోనే ఉండేది. ఈ కారణంగానే ఆమె వివాహాలు, అరెస్టులు రమేష్‌కు తెలియలేదు.వెటర్నరీ డాక్టర్ నిఖిల్‌తో ప్రేమాయణం..ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా వాసవీనగర్ నుంచి బెంగళూరులోని రామమూర్తి నగర్ వెటర్నరీ డాక్టర్‌గా స్థిరపడిన నిఖిల్ మైరెడ్డితో నిహారికకు ఏవర్పడిన పరిచయం ప్రేమగా మారింది. కొన్నాళ్లుగా వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు. కొన్ని రోజులుగా నిహారిక తనకు జర్మనీలోని ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థలో ఉద్యోగం వచ్చిందని, దాని నిమిత్తం రూ.2 కోట్లు చెల్లించాల్సి ఉందంటూ రమేష్‌తో చెప్తోంది. అయితే కొన్నాళ్లుగా ఆమె ప్రవర్తన, మాటలపై సందేహాలు రావడంతో ఈ మొత్తం ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో గత నెల్లో నగరానికి వచ్చిన నిహారిక, అంకుర్ పథకం ప్రకారం రమేష్‌ను చంపి, నిఖిల్ సలహాతోనే మృతదేహాన్ని కొడగు వరకు తీసుకువెళ్లి కాల్చేశారు. ఈ ముగ్గురూ అరెస్టు కాగా..దర్యాప్తు కోసం నగరానికి తీసుకురాగా తప్పించుకున్న అంకుర్ మళ్లీ అరెస్టు అయ్యాడు. కొడగు పోలీసులు తమ దర్యాప్తులో ఈ హత్యలో నిహారిక కీలకమని గుర్తించారు. ఈ మేరకు త్వరలోనే అక్కడి కోర్టులో అభియోగపత్రాలు దాఖలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
బాబు నుంచి షర్మిలకు రూ. 60 కోట్లు
కడప కార్పొరేషన్: ఎన్నికల్లో పీసీసీ అధ్యక్షురాలు షర్మిలకు చంద్రబాబు భారీగా ఫైనాన్స్ చేశారని, సుమారు రూ. 60 కోట్లు ఇచ్చినట్లు తమ వద్ద సమాచారం ఉందని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే ఆర్. రమేష్‌కుమార్ రెడ్డి తెలిపారు. వైఎస్సార్ జిల్లాలో 10 మంది టీడీపీ అభ్యర్థులకు మొండిచేయి చూపి షర్మిలకు డబ్బులిచ్చి కడప పార్లమెంటుకు పోటీ చేయిస్తున్నారని చెప్పారు. డా. చైతన్యరెడ్డితో కలిసి బుధవారం ఇక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు ఫైనాన్స్ చేయకపోతే షర్మిలకు అంత డబ్బు ఎక్కడిదని ప్రశ్నించారు. రోజురోజుకు ప్రజాదరణ పెరుగుతున్న వైఎస్సార్సీపీపై బురద జల్లేందుకు వైఎస్ కుటుంబంలో షర్మిల, సునీతను చంద్రబాబు పావులుగా మార్చారని చెప్పారు. ఇందులో భాగంగానే షర్మిల పీసీసీ అద్యక్షురాలయ్యారని తెలిపారు. అరుంధతి సినిమాలోలాగా వారిని పశుపతి ఆవహించారని ఎద్దేవా చేశారు. కుటుంబాలను విడదీయడంలో చంద్రబాబు దిట్ట అని, తల్లీబిడ్డలకు కూడా తగవు పెట్టే సమర్థుడని చెప్పారు. సునీత లక్ష్యం వైఎస్ వివేకా హత్య కేసులో నిజమైన నేరస్తులను వెలికితీయడమా లేక తప్పు చేయని వారిని శిక్షించడమా అని ప్రశ్నించారు. ఆమె సైకో ఆలోచనకు ఇది నిదర్శనమన్నారు. ఒక పథకం ప్రకారం కథ అల్లుతూ వారు అనుకున్న వ్యక్తులను నిందితులుగా చేరుస్తూ కేసును పూర్తిగా పక్కదారి పట్టించారన్నారు. సిట్ దర్యాప్తును సీబీఐ పరిగణనలోకి తీసుకొని ఉంటే అసలు నేరస్తులు దొరికేవారని చెప్పారు. బాబు ఇచ్చిన తప్పుడు సమాచారంతో, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అవినాశ్‌రెడ్డిపై ఉన్న కోపంతో షర్మిల, సునీత ఇష్టారీతిన మాట్లాడుతున్నారన్నారు. కేసు ట్రయల్‌కు వచ్చాక నిజాలు బయటికి వస్తాయని, ఆ లోపే ఒకరిని లక్ష్యం చేసుకొని దుష్ప్రచారం చేయడం సరైంది కాదన్నారు. వేరే సంబంధాలతోనే వివేకా హత్య వేరే సంబంధాలతోనే వివేకా హత్య జరిగిందని, రాజకీయ కోణం లేదని తెలిపారు. హత్యకు ఒక రోజు ముందు ఇంట్లో పని చేసే పందింటి రాజశేఖర్‌ను సౌభాగ్యమ్మ, నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి కాణిపాకం పంపించారని, చెవులు వినపడని వాచ్‌మేన్ రంగయ్య ఇంటి బయట ఉన్నారని చెప్పారు. అదే సమయంలో దుండగులు వివేకా ఇంటి తలుపులు పగులగొట్టి ఇంట్లోకి చొరబడినట్లు ఆధారాలు ఉన్నాయన్నారు. సీబీఐని ఎవరో మేనేజ్ చేశారని, అందువల్లే వీటిని సీబీఐ పరిగణనలోకి తీసుకోలేదని చెప్పారు. వైఎస్ వివేకాతో ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్‌రెడ్డి, సునీల్ యాదవ్, దస్తగిరికి సాన్నిహిత్యం ఉందని, తరచూ కలిసి భోజనం చేస్తారని సీబీఐకి సాక్షులు చెప్పారని గుర్తుచేశారు. అవినాశ్‌రెడ్డిని ఎంపీగా చేసేందుకు వివేకా కష్టపడ్డారని తొలుత చెప్పిన సునీత.. ఆ తర్వాత మాటమార్చిందన్నారు. హార్ట్ ఎటాక్ డ్రామా ఆడింది కూడా సునీతేనని చెప్పారు. కేసును పక్కదారి పట్టించేందుకే వివేకా రాసిన లేఖను దాచిపెట్టారని ఆరోపించారు. సునీత, నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి చెబితేనే లేఖను దాచిపెట్టినట్లు పీఏ కృష్ణారెడ్డి చెప్పారన్నారు. వారికి నార్కో అనాలసిస్ టెస్టులు చేస్తే నిజాలు వెలుగులోకి వస్తాయన్నారు. రక్తపు మరకలను ఎవరూ తుడవలేదని, బెడ్ వద్ద మాత్రమే తుడిచారని, ఆ వస్త్రం కూడా అక్కడే ఉందని అన్నారు. కడప ఎంపీగా పోటీ చేయాలని వైఎస్ వివేకా బలవంతపెట్టారని షర్మిల చెప్పడంలో అర్థం లేదన్నారు. 2014లో వైఎస్ జగన్మోహన్రెడ్డి కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ అవినాశ్‌రెడ్డిని నిర్ణయించారని, 2019లోనూ ఆయన్నే కొనసాగించారని చెప్పారు. పబ్లిక్ ఫోరం, మీడియాలో ట్రయల్స్ ఆపండి : డా. చైతన్యరెడ్డి వివేకా హత్య కేసులో పబ్లిక్ ఫోరం, మీడియా ట్రయల్స్ ఆపాలని దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి కుమారుడు డా. చైతన్యరెడ్డి విజ్ఞప్తి చేశారు. వైఎస్ భాస్కర్‌రెడ్డికి హార్ట్ చెకప్ చేసి, సర్జరీ చేయాలని, బెయిలివ్వాలని కోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తే, సీబీఐ వ్యతిరేకించకపోయినా సునీత మాత్రం వ్యతిరేకించిందన్నారు. ఉమాశంకర్‌రెడ్డి, సునీల్ యాదవ్‌ల బెయిల్‌ను వ్యతిరేకించకుండా, తన తండ్రి శంకర్‌రెడ్డి బెయిల్‌ను మాత్రం వ్యతిరేకించారన్నారు. ఇది కక్ష సాధింపు కాక మరేమిటని ప్రశ్నించారు. గూగుల్ టేకౌట్‌కు ఎలాంటి శాస్త్రీయత లేదని, ఖచ్చితత్వం అంతకంటే లేదన్నారు. సీబీఐ పేర్కొన్నది వాట్సాప్ చాట్స్ అని, వాట్సాప్ కాల్స్ కానేకాదన్నారు. అందులో ఔట్‌గోయింగ్ చాట్స్ అసలే లేవన్నారు. -
‘వివేకా’ కేసు.. బాబు ప్రయోజనాల కోసమే..
కడప కార్పొరేషన్: మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసమే ఉపయోగపడుతోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే ఆర్. రమేష్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. కడపలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో రీజనల్ కో–ఆర్డినేటర్ కె. సురేష్‌బాబు, డా. చైతన్యరెడ్డిలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిత్యం నీచ రాజకీయాలు చేయడమే చంద్రబాబు సంస్కృతి అని, అన్ని వ్యవస్థలను ధ్వంసంచేసి తనకు అనుకూలంగా మలుచుకోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. లక్ష్మీపార్వతిని సాకుగా చూపి ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడవడమేగాక, ఆయన మరణానికి కూడా బాబు కారణమయ్యారన్నారు. ఎన్నికలొచ్చిన ప్రతిసారీ ఒక కొత్త కూటమి ఏర్పాటుచేయడం బాబుకు అలవాటుగా మారిందన్నారు. 2014లో నరేంద్ర మోదీ, పవన్‌కళ్యాణ్‌తో.. 2019లో లోపాయికారిగా జనసేనతో, ఇప్పుడు బీజేపీ, జనసేనతో పాటు కాంగ్రెస్‌తో లోపాయికారీ ఒప్పందం చేసుకున్నారన్నారు. తన రాజకీయ ప్రయోజనాల కోసం ఆయన అందరి కుటుంబాల్లో చిచ్చుపెడతారన్నారు. ‘హూ కిల్డ్ బాబాయ్’ అంటూ కేసును పక్కదారి పట్టిస్తున్నారని రమేష్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. రెండు చానెళ్లు, రెండు పత్రికలైతే అదేపనిగా సీఎం జగన్, ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిలపై బురదజల్లుతూ తప్పుదోవ పట్టిస్తున్నాయన్నారు. వైఎస్ వివేకా కేసు కోసం రూ.వందల కోట్లు ఖర్చుచేశారని, కోట్ల రూపాయలు వెచ్చించి లూథ్రా అనే ఖరీదైన న్యాయవాదిని నియమించుకున్నారన్నారు. ఇక ‘వివేకం’ అనే సినిమాలో క్యారెక్టర్లను చాలా నీచంగా చూపించడం దారుణమన్నారు. అవినాశ్ ఎలాంటివారో షర్మిల, సునీతలకు తెలీదా? ఇక అవినాశ్ ఎలాంటి వారో షర్మిల, సునీత ఇద్దరూ చిన్నప్పటి నుంచి చూసి ఉంటారు కదా, వారికి తెలీదా.. ఎప్పుడైనా ఆయనలో నేరప్రవృత్తి గమనించారా.. దౌర్జన్యాలు, రాజకీయ హత్యలు, ఫ్యాక్షన్ గొడవలతో ఆయనకు సంబంధం ఉందేమో గుండెలపై చేయివేసుకుని చెప్పాలన్నారు. నిష్కళంకమైన జీవితం గడుపుతున్న అవినాష్‌రెడ్డిపై దుష్ప్రచారం చేయడం సరికాదని హితవు పలికారు. వైఎస్ జగన్ ప్రజాసేవ చేయాలని ఇష్టపడి రాజకీయాల్లోకి వచ్చారని.. ఏ రకమైన ఫ్యాక్షన్‌ను, గొడవలను ఆయన ప్రేరేపించలేదన్నారు. చంద్రబాబుది క్రిమినల్ బ్రెయిన్ అని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకానందరెడ్డిని ఓడించేందుకు రూ.కోట్లు ఖర్చుచేసి చార్టెర్డ్ ఫ్లయిట్లు పెట్టి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలను కొనుగోలు చేశారని రమేష్‌రెడ్డి గుర్తుచేశారు. ఈ ఎన్నికల్లో సుమారు 40 సీట్లను రూ.వందల కోట్లకు అమ్ముకున్నారని ఆరోపించారు. కడప జిల్లాలో కూడా చాలామంది డబ్బులిచ్చి టికెట్లు కొన్నారన్నారు. మరోవైపు.. షర్మిల, సునీత న్యాయపోరాటం చేస్తున్నారో, రాజకీయ పోరాటం చేస్తున్నారో తెలుసుకోవాలన్నారు. రాజకీయ పోరాటమైతే కోర్టు తీర్పు వచ్చేవరకూ దయచేసి నోరు విప్పవద్దని ఆయన సూచించారు. ఇక చంద్రబాబు చెబుతున్న ‘సూపర్ సిక్స్’ ఒక ఫ్లాప్సిక్స్ అని రమేష్‌కుమార్‌రెడ్డి ఎద్దేవా చేశారు. టీడీపీకి ఓటేస్తే కాంగ్రెస్, బీజేపీలకు వేసినట్లేనని తెలిపారు. సునీతవి అర్థంలేని ఆరోపణలు డా. చైతన్యరెడ్డి మాట్లాడుతూ.. డాక్టరేట్ పొందిన సునీత అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. హత్య జరిగిన రోజు రాత్రి ఏ–1 ఎర్ర గంగిరెడ్డి, వైఎస్ అవినాశ్‌రెడ్డి వాట్సాప్ కాల్స్ చేసుకున్నారని చెప్పడం అబద్ధమన్నారు. సీబీఐ చార్జిషీట్లో వాట్సాప్ చాట్‌లో ఉన్నారని చెప్పిందే తప్పా వాట్సాప్ కాల్స్ అని ఎక్కడా చెప్పలేదన్నారు. ఎన్నికల సమయం కాబట్టి వాట్సాప్‌కు మెసేజ్‌లు వస్తూ ఉంటాయని, ఫోన్ ఆన్‌చేసి ఉంచితే ఎవరి వాట్సాప్ అయినా యాక్టివ్‌లో ఉన్నట్లేనని చెప్పారు. ఇక గూగుల్ టేకౌట్‌కు శాస్త్రీయతలేదని, దాన్ని గూగుల్ కంపెనీ దానిని సర్టిఫై చేయలేదని, న్యాయమూర్తి కూడా అంగీకరించలేదన్నారు. కోర్టులో నేరం రుజువు కాకుండా ఆరోపణలు చేయడం సరికాదని షర్మిల, సునీతకు చైతన్యరెడ్డి హితవు పలికారు. -
బ్రో..చేవారెవరురా?.. టీడీపీలో అసమ్మతి ప్రకంపనలు
సాక్షి రాయచోటి/ఏలూరు/అనంతపురం: రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీకి స్వపక్షం నుంచే వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ కూటమి కుదేలవుతోంది. టికెట్లు ఆశించి భంగపడిన నేతలు తిరుగు బావుటా ఎగరేస్తున్నారు. కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న తమను నమ్మించి మోసం చేస్తున్నారంటూ ఆ పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలోనే బాహాబాహీకి దిగుతూ ఆయన్నే ఎదురిస్తున్నారు. దీంతో ఆ పార్టీ వరుస దెబ్బలతో తేరుకోలేకపోతోంది. అన్నమయ్య జిల్లాలో తెలుగుదేశం పార్టీ రోజురోజుకు దిగజారిపోతోంది. సీనియర్ నాయకులు పార్టీని వీడుతుండటంతో అధిష్టానంలో కలవరం మొదలైంది. టీడీపీ రాయచోటి ఇన్చార్జిగా ఉన్న రమేష్ కుమార్‌రెడ్డి రాజీనామా చేయడం పార్టీలో గుబులు రేపుతోంది. అంతేకాకుండా బుధవారం పల్నాడు జిల్లాలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో రమేష్ కుమార్‌రెడ్డి తో పాటు ఆయన వర్గం భారీగా వైఎస్సార్సీపీలో చేరడంతో అక్కడ వైఎస్సార్సీపీ తిరుగులేని రీతిలో బలపడింది. ఇటీవలే సీఎం సమక్షంలో రాజంపేట పార్లమెంటు టీడీపీ ఇన్‌ఛార్జి గంటా నరహరి చేరారు. తంబళ్లపల్లెలో టీడీపీ అభ్యర్థి జయచంద్రారెడ్డిని మార్చకపోతే ఆ పార్టీని వీడేందుకు నియోజకవర్గ నేత శంకర్ యాదవ్ సిద్ధమవుతున్నారు. రాజంపేటకు సంబం«ధించి రాయచోటి టీడీపీ నాయకుడు సుగవాసి బాలసుబ్రమణ్యం అభ్యర్థిత్వాన్ని మాజీ ఎమ్మెల్సీ, రాజంపేట ఇన్చార్జి బత్యాల చెంగల్రాయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రైల్వేకోడూరులో జనసేనకు సీటు కేటాయించి, తర్వాత మార్చడంతో ఆయా వర్గాల నేతలు లోలోపల కత్తులు దూసుకుంటున్నారు. మదనపల్లెలో టీడీపీ అభ్యర్థికి వ్యతిరేకంగా అక్కడ ఆ పార్టీ నేత దొమ్మలపాటి రమేష్ ప్రజా సంఘాల మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా రంగంలో నిలిచేందుకు సిద్ధపడుతున్నారు. ఉండిలో మూడు ముక్కలాట పశ్చిమగోదావరి జిల్లా ఉండిలో టీడీపీ సంకట స్థితిలో పడింది. మాజీ ఎమ్మెల్యే శివరామరాజు టికెట్ ఆశించి భంగపడి రెబల్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. టికెట్ దక్కించుకున్న సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజు ఆనందం పట్టుమని పది రోజులు కూడా నిలవలేదు. ఇప్పుడు రామరాజును కాదని ఎంపీ రఘురామకృష్ణరాజుకు టికెట్ కేటాయించారన్న సమాచారంతో ఆ నియోజకవర్గ టీడీపీలో రాజకీయ ప్రకంపనలు చెలరేగాయి. రఘురామకృష్ణరాజు అభ్యర్థిత్వం అధికారికంగా ప్రకటించకపోయినా తీవ్రస్థాయిలో అసమ్మతి స్వరం వినిపిస్తోంది. అందరూ సహకరిస్తే ఇండిపెండెంట్‌గా తాను బరిలో ఉంటానని మరోవైపు రామరాజు చెబుతున్నారు. పదిహేను రోజుల నుంచి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. తాజాగా నరసాపురం ఎంపీ టికెట్ ఆశించి కూటమి చేతిలో భంగపడ్డ ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఉండి టికెట్ హామీ రావడంతో రామరాజు వర్గం తేరుకోలేకపోతోంది. చంద్రబాబు నుంచి రఘురామకృష్ణరాజు అభ్యర్థిత్వంపై పరోక్ష సంకేతాలు ఇవ్వడంతో రామరాజు వర్గం ఐదు రోజులుగా వివిధ రకాలుగా నిరసనలు వ్యక్తం చేసి తీవ్రస్థాయిలో పార్టీపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు సాగిస్తోంది. ఈ క్రమంలో రామరాజుకు ఎలాంటి హామీ రాకపోవడంతో కంటితడి కూడా పెట్టారు. ఆయన వర్గీయులు బుధవారం నుంచి ఆమరణదీక్ష ప్రారంభించారు. బాలకృష్ణ ఓటమి ఖాయం హిందూపురం అసెంబ్లీ స్థానం నుంచి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాలకృష్ణ ఈ దఫా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వివిధ వర్గాలు ఆయనకు పూర్తిగా దూరమయ్యాయి. ఆయన అందుబాటులో ఉండకపోవడం, పీఏలే ఎమ్మెల్యేలుగా చలామణి అవుతుండడం వల్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. 2014లో తొలిసారి హిందూపురం నుంచి పోటీచేసి గెలుపొందిన ఆయన.. తన బావ చంద్రబాబు సీఎంగా ఉన్నా నియోజకవర్గానికి పైసా పని చేయలేకపోయారు. ఈ క్రమంలో ఓటర్లు స్థానిక అభ్యర్థి వైపు మొగ్గు చూపుతున్నారు. ఏడాదికి ఒకటి రెండుసార్లు వచ్చే బాలకృష్ణ కావాలా, స్థానికంగా ఉండే ఎమ్మెల్యే కావాలా అన్న అంశంపై ఇప్పుడు హిందూపురంలో చర్చ జరుగుతోంది. గతంలో బాలకృష్ణ పీఏ బాలాజీ పేకాట ఆడుతూ పట్టుబడ్డారు. ఇప్పటికీ ఆ కేసు నడుస్తోంది. దీంతో టీడీపీ నాయకులే కాకుండా, ప్రజలు కూడా పీఏలపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. మళ్లీ ఎన్నికలొస్తే తప్ప బాలకృష్ణ నియోజకవర్గానికి రారని స్థానికులు అభిప్రాయ పడుతున్నారు. బీజేపీ తరపున టికెట్ ఆశించిన పరిపూర్ణానందస్వామి కూడా బాలకృష్ణ ఇక్కడికి ఎన్నిసార్లు వచ్చారని వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా ఉంది. మొత్తంగా ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సారి బాలకృష్ణ ఓటమి ఖాయం అని .. ఈ దిశగా పలువురు ఒకటికి రెండంటూ బెట్టింగులకు దిగుతున్నారు. -
డబ్బుతో వస్తేనే టీడీపీ టికెట్లు
రాయచోటి టౌన్: తెలుగుదేశం పార్టీలో సూట్‌కేసుల్లో డబ్బు తీసుకొచ్చినవారికే టికెట్లు కేటాయిస్తున్నారని, ఎన్నో ఏళ్లుగా జెండామోసినవారికి, పార్టీకోసం అహరి్నశలు కష్టపడినవారికి మొండిచెయ్యి చూపుతున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి(వాసు) సోదరుడు, అన్నమయ్య జిల్లా రాయచోటి టీడీపీ నేత, లక్కిరెడ్డిపల్లి మాజీ ఎమ్మెల్యే ఆర్.రమేష్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. రాయచోటిలోని తన కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాతికేళ్లుగా అధికారంలో ఉన్నా, లేకున్నా పార్టీ కోసం పని చేశానని, నియోజక వర్గంలోని అన్ని ప్రాంతాలు తిరుగుతూ జెండాలను మోశానని, టికెట్ ప్రకటించేటప్పుడు కనీసం తనను సంప్రదించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. టికెట్లు కేటాయింపులో ఏకపక్షంగా వ్యవహరించిందని మండిపడ్డారు. పార్టీ నాయకులకు గ్యారంటీ ఇవ్వలేని చంద్రబాబు ప్రజలకు ఏం గ్యారెంటీ ఇస్తారని నిలదీశారు. ముఖ్యమంత్రి సీటు కోసం చంద్రబాబు నాయుడు లేని హైప్ సృష్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. కొత్త కొత్త వ్యక్తులతో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. ఎంపీ అభ్యర్థిగా మాగంటి శ్రీనివాసులరెడ్డి, నెల్లూరు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, పెమ్మసాని చంద్రశేఖర్ ఇలా విదేశాల నుంచి అప్పటికప్పుడు సూట్ కేసులతో దిగిన వారికి టికెట్లు ఇస్తున్నారన్నారు. రాయచోటి, రాజంపేట, ప్రొద్దుటూరు, మదనపల్లె ఇలా చాలా అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను రెచ్చగొట్టి రేసులో పెట్టారని వాపోయారు. అందుకే ఆ పార్టీకి, పార్టీ సభ్యత్వానికి, ఇన్చార్జి పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. నేడు వైఎస్సార్సీపీలో చేరిక వినుకొండ దగ్గర జరుగుతున్న మేం సిద్ధం బస్సుయాత్రలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు వైఎస్సార్సీపీలో చేరనున్నట్టు రమేష్‌కుమార్ రెడ్డిప్రకటించారు. తన వ్యక్తిత్వం తెలిసినవారు, తన పనితీరు నచ్చి నవారు తనతో కలసి వస్తారని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకుసమాధానంగా తెలిపారు. వైఎస్సార్సీపీలో పదవులకోసం కాకుండా తెలుగు దేశం పార్టీ ఓటమే ధ్యేయంగా పని చేస్తానని, అందుకోసం అహరి్నశలు కృషి చేస్తానని స్పష్టం చేశారు. -
రాజకీయ భవిష్యత్తు కోసం వంగవీటి రంగాను చంపేశారు
-
Rayachoty: ఔను ఆయనకు టికెట్ లేదు !
సాక్షి ప్రతినిధి, కడప : రాయచోటి టీడీపీ ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే రమేష్‌కుమార్‌రెడ్డి పార్టీ వీడనున్నారా..? కుటుంబ సభ్యుడే అన్యాయానికి ఒడిగట్టారని విశ్వసిస్తు న్నారా.. చంద్రబాబు నియంతృత్వ, ఏకపక్ష ధోరణిపై ప్రతీకారం తీర్చుకునేందుకు రగిలిపోతున్నారా? అని ప్రశ్నిస్తే విశ్లేషకులు ఔను అనే సమాధానం ఇస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే రమేష్‌కుమార్‌రెడ్డి వ్యవహారశైలి కన్పి స్తోంది. సోమవారం లక్కిరెడ్డిపల్లె కేంద్రంగా కార్యకర్తలు, అనుచరులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. టికెట్ లేదంటూ తేల్చి చెప్పిన అధిష్టానంపై ప్రతీకారం తీర్చుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఆరు మండలాల నాయకులతో సమావేశం నిర్వహించి తదుపరి కార్యాచర ప్రకటించేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఇరువైఏళ్లుగా పార్టీనే అంటిపెట్టుకున్నాం, నిరంతరం కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నాం. ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చిత్తశుదిత్ధో చేపట్టాం. అయినప్పటీకీ టీడీపీ అధిష్టానం టికెట్ ఇవ్వడానికి నిరాకరిస్తోంది. ఎవరి విజయం కోసం పనిచేయాలని చెబుతోంది. ఇక పార్టీలో ఉండలేం, మనదారి మనం చూసుకోవాలని సన్నిహితులతో మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలివి. ఆదివారం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, రీజనల్ ఇన్చార్జి దీపక్‌రెడ్డిలు మాజీ ఎమ్మెల్యే రమేష్‌కుమార్‌రెడ్డిని పిలిపించుకొని మాట్లాడారు. ఈమారు ఎన్నికల్లో టికెట్ ఇవ్వడం లేదని తేల్చి చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. అందుకు ప్రత్యామ్నాయంగా మీకేమి పదవి కావాలో చెప్పండి, అధినేత చంద్రబాబుతో చర్చిస్తామని చెప్పుకొచ్చినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో పోటీ చేయడం మినహా మరే పదవి వద్దని రమేష్ కుండ బద్దలు కొట్టినట్లు సమాచారం. ఒక్కసారి అధినేత చంద్రబాబుతో మాట్లాడించండి, తర్వాత నిర్ణయం తీసుకోవాలని కోరినా నిష్ప్రయోజనమే అయినట్లు తెలుస్తోంది. కాగా సోమవారం మండలాల వారీగా కార్యకర్తలు, అనుచరులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. తొలుత లక్కిరెడ్డిపల్లె మండల నాయకులతో ప్రత్యేకంగా సమావేశమైన రమేష్ నియోజకవర్గంలో అభివృద్ధి చేపట్టలేదని వివరిస్తూనే, ఎన్నికల్లో పోటీ చేసి తీరుతామని ప్రకటించారు. సోదరుడు శ్రీనివాసులరెడ్డిపై గుర్రు.. చంద్రబాబు టికెట్ నిరాకరణకు సోదరుడు, పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి కారకుడని మాజీ ఎమ్మెల్యే రమేష్‌కుమార్‌రెడ్డి విశ్వసిస్తున్నట్లు తెలుస్తోంది. రాయచోటి టికెట్ మా అన్నకు ఇవ్వకపోతే తాను కూడా పోటీ చేయలేనంటూ టీడీపీ అధిష్టానం తేల్చి చెప్పలేదనే ఆవేదనతో ఉన్నట్లు సమాచారం. చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు తల ఊపి వచ్చాడని, ఎన్నికల్లో ఓడిపోతే రాజ్యసభ సీటు ఇస్తామనే హామీ మేరకే శ్రీనివాసులరెడ్డి మౌనం వహించారని తెలుస్తోంది. కుటుంబం, సోదరుడు కంటే శ్రీనివాసులరెడ్డికి పదవే ముఖ్యమైందా? ఇక తనతో కూడా తెగదెంపులు చేసుకోవాలనే దిశగా రమేష్ అడుగులు వేస్తున్నట్లు సమాచారం. రెడ్డెప్పగారి కుటుంబ సభ్యులు, బంధువులంతా మాజీ ఎమ్మెల్యే రమేష్ నిర్ణయానికే అనుగుణంగా నిలిచేందుకు సంసిద్ధులైనట్లు తెలుస్తోంది. చంద్రబాబు ఫొటో ఎత్తేశారు సోమవారం సాయంత్రం లక్కిరెడ్డిపల్లె మండల టీడీపీ కేడర్‌తో సమావేశమైన మాజీ ఎమ్మెల్యే రమేష్‌కుమార్‌రెడ్డి చంద్రబాబు ఫోటో ఫ్లెక్సీలో లేకుండా ఏర్పాటు చేశారు. ఎన్టీ రామారావు, తన తండ్రి మాజీ మంత్రి రాజగోపాల్‌రెడ్డి ఫొటోలు మాత్రమే ఫ్లెక్సీలో వాడుకున్నారు. ఎక్కడ కూడా టీడీపీ జెండా ఏర్పాటు చేయలేదు. పైగా తన సోదరుడు పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి ఫొటో కూడా ఫ్లెక్సీలో లేదు. ఇవన్నీ రమేష్‌కుమార్‌రెడ్డి టీడీపీ వీడేందుకు చిహ్నాలుగా స్పష్టం చేస్తున్నాయని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఆరు మండలాలకు చెందిన కేడర్‌తో సమావేశం పూర్తయిన తర్వాత టికెట్ విషయమై బహిర్గత పర్చనున్నట్లు సమాచారం. ఇరువై ఏళ్లుగా మీకు తోడు నీడగా ఉంటున్నా, ఇప్పుడేమి చేయాలో మీరే చెప్పాలని కార్యకర్తల అభిప్రాయాలు కోరనున్నట్లు తెలుస్తోంది. కలిసివచ్చే వారందరీతో టీడీపీ పార్టీ పదవులకు రాజీనామా చేయాలనే ఆలోచన దిశగా అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. -
దయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదే!
అధికారంలో ఉన్నప్పుడు కళ్లు మూసుకుని, పదవీ విరమణ తర్వాత తగుదునమ్మా అంటూ టీడీపీకి రాజకీయ ప్రయోజనం కలిగించేందుకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు ఊరూరా తిరుగుతున్నారు. హింసలేని ఎన్నికలు, స్వేచ్ఛ అంటూ పెద్ద మాటలు చెబుతున్నారు. కాపాడే అధికారం ఉన్నప్పుడు ఏం చేశారని పౌర సమాజం ప్రశ్నిస్తోంది.ఇటీవల కాలంలో ‘సిటిజన్స్ ఫర్ డెమొక్రసీ’ (సీఎఫ్‌డీ) పేరుతో ఏపీ ఎన్నికల మాజీ ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేశ్‌కుమార్, ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎల్వీ సుబ్రహ్మణ్యం తదితరులు సమా వేశాలతో హడావిడి చేస్తున్నారు. సిటిజన్స్ ఫర్ డెమొక్రసీ ప్రధాన లక్ష్యం స్వేచ్ఛగా, ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్ని కల్లో ఓటు హక్కును ఉపయోగించుకోవడం అని ప్రకటించారు. ఇదే నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ఏపీ రాష్ట్ర ఎన్నికల అధికారిగా ఉన్న కాలంలో, స్థానిక సంస్థల్లో ఏకగ్రీవాలు ఎక్కువయ్యాయనీ, అలాగే నామినేషన్లు వేయనివ్వడం లేదనీ, దౌర్జన్యాలు నెరిగాయనీ పెద్ద ఎత్తున విపక్షాలు ఫిర్యాదు చేయడం గమనార్హం. ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని ప్రభుత్వ ప్రధాన కార్య దర్శిగా తొలగించడంతో ఆయనకు ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ లాంటివి గుర్తు కొస్తున్నాయి. ఈయన అప్రజాస్వా మికంగా వ్యవహరిస్తున్నారని గతంలో ఎన్నికల సమయంలో చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేశారనే విష యాన్ని మరిచిపోతే ఎలా? సీఈసీ విడుదల చేసిన వివరాల ప్రకారం 2019లో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో 79.74 శాతం ఓట్లు పోలయ్యాయి. నరసరావుపేట పార్లమెంటరీ నియోజక వర్గంలో అత్యధికంగా 85.53 శాతం పోలయ్యాయి. అలాగే 2014 ఎన్నికల్లో రాష్ట్రంలో 74.64 శాతం ఓట్లు పోలయ్యాయి. బాపట్ల పార్లమెంటరీ నియోజకవర్గంలో అత్యధికంగా 85.16 శాతం ఓట్లు పోలయ్యాయి. అంటే, రాష్ట్ర విభజన జరిగిన మొదటి ఐదేళ్లకే ఇక్కడి ప్రజల్లో కలిగిన చైతన్యం కారణంగా 2019 ఎన్నికల్లో చంద్ర బాబును ఇంటికి పంపడం కోసం, మరో ఐదు శాతం మంది కొత్తగా ఓటింగ్‌లో పాల్గొన్నారన్నమాట. ఇక్కడి గణాంకాలు ఇలా ఉన్నప్పుడు, ‘ప్రజాస్వామ్య పరిరక్షణ’ పేరుతో మళ్ళీ ఓటు–హక్కు అంటూ, వీరి కసరత్తు ఎందుకు? ఈ ఐఏఎస్ అధికారులతో పీవీ రమేష్ అనే మరొక ఐఏఎస్ కలిశారు. వీరు కలిగించే చైతన్యం అంతా బెజ వాడ కేంద్రంగానే సాగడం గమనార్హం. ‘ప్రజాస్వామ్య పరిరక్షణ’ పేరుతో నిమ్మగడ్డ బృందం నిర్వహిస్తున్న సభల్లో గెస్ట్ పాత్రల్లో పాల్గొంటున్నవారి విషయమై పౌరులు బాధపడుతున్నారు. రిటైర్ అయ్యాక కూడా ౖవై సీపీ ప్రభుత్వంలో చక్రం తిప్పబోయి క్షతగాత్రు లైన ఈ ముగ్గురు అధికారులు తమకంటూ ఇక్కడ ఒక విలువ లేక, ‘మీడియా అటెన్షన్’ కోసం, మాజీ భారత ఎన్నికల కమిషనర్ వీఎస్ సంపత్, కేబినెట్ సెక్రటరీ కె. పద్మనాభయ్యలను తమ పక్కన పెట్టుకుంటున్నారు. ఎందుకు ఈ మాజీ అధికారులను క్షతగాత్రులు అనవలసివచ్చిందో తెలియాలి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ కేడర్‌లో ఏదో ఒక ప్రధాన శాఖలో కాకుండా, చంద్రబాబు కోసం తన సర్వీస్ చివరి రోజు వరకూ రాజ్ భవన్లో గవర్నర్ సెక్రటరీగా పనిచేశారు. రాష్ట్ర విభజనకు ముందు 4 నెలల పాటు రాష్ట్రపతిపాలన ఉండడం మనకు తెలిసిందే. అప్పట్లో గవర్నర్ ఇ.ఎస్.ఎల్. నరసింహన్ ఆఫీస్ కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల్లో అన్ని కీలక నిర్ణయాలకు కేంద్రం అయింది. ఇలా టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేయడం మొదటి నుంచి నిమ్మగడ్డకు కొత్తకాదు. అందుకే 2016లో రిటైర్ అయిన మరుసటి రోజు ఇతణ్ణి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పోస్ట్‌లో చంద్రబాబు నియమించారు. అదే నెలలో ఆయన కుమార్తె నిమ్మగడ్డ లావణ్యను ఏపీ ‘ఎకనమిక్ డెవలప్మెంట్ బోర్డ్’లో సీనియర్ కన్సల్టెంట్‌గా నెలకు రూ 1.50 లక్షల జీతంతో నియమించారు. అయితే ప్రభుత్వం మారడంతో ఉపాధి కోల్పోయి, పౌర వేదిక ముసుగులో జగన్ మోహన్ రెడ్డి ప్రత్యర్థి తరహాలో ఇప్పుడు నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం మారితే, మళ్ళీ ‘ఫ్యామిలీ ప్యాకేజి’ ప్రయోజ నాలు పొందడం ఆయన లక్ష్యం. అందుకోసం ‘ఈ ప్రభుత్వంలో సలహాదారులు ఎంతమంది? వీరు కేబినెట్ హోదాలో ఉంటూ రాజకీయాలు ఎలా మాట్లాడతారు?’ అంటూ రమేష్ టీడీపీ తరఫున విమర్శలు చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వంలో ఇప్పటికంటే ఎక్కువమంది సలహా దారులు, ‘కన్సల్టెంట్లు’ ఉన్న విషయం తెలియనిది కాదు. ‘స్కిల్ స్కామ్’లో అరెస్టయిన ‘ఏ 1’ గంటా సుబ్బా రావు, ముందస్తు బెయిల్ తెచ్చుకున్న ‘ఏ 2’ ఐఏఎస్ లక్ష్మీనారాయణలు ఇద్దరూ ఇదే తరహాలో బయట నుంచి ప్రభుత్వం ‘కన్సల్టెంట్స్’గా నియమించిన వారేకదా! ప్రభుత్వంలో సలహాదారులు రాజకీయాలు మాట్లాడ్డం నేరమా? లేక నమ్మకంగా ప్రభుత్వంలో ఉంటూ, దొంగ దారుల్లో నిధులు బయటకు పంపడం నేరమా? ఈ రెండింటిలో ఏది ప్రజాస్వామ్యానికి చేటు? అని రాష్ట్ర ప్రజలు ఈ నిమ్మగడ్డ బృందాన్ని నిలదీయొద్దూ? ‘రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం...’ అంటూ పెద్దపెద్ద మాటలు మాట్లా డుతున్న నిమ్మగడ్డ, బెజవాడలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సీటులో కూర్చుని, తన తప్పుడు చర్యలకు తగిన శిక్ష నుంచి తప్పించుకోవడానికి క్రింది ఉద్యోగులతో‘కంప్యూటర్ హార్డ్ డిస్క్’లు ధ్వంసం చేయించడం ఏ స్ఫూర్తి అవుతుందో చెప్పగలరా? అసలు ఎల్వీ సుబ్రహ్మణ్యంను సీఎస్‌గా నియమించడమే ఓ ప్రహసనం! ఎన్నికల కోడ్ అమలులో ఉన్న ప్పుడు సీఎస్‌గా ఉన్న అనిల్ చంద్ర పునేఠా చంద్రబాబు కనుసన్నల్లో పనిచేస్తూ ఉండడంతో, భారత ఎన్నికల కమిషనర్ వెంటనే అయన్ని తొలగించి, క్రీడలు యువజన సర్వీసులు సెక్రటరీగా ఉన్న సుబ్రహ్మణ్యంను సీఎస్ పోస్టులో నియమించింది. అయితే, జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక, సీఎం పరిపాలనా శైలి వేగాన్ని అందుకోలేని స్థితిలో ఉన్న ఎల్వీ స్థానంలో మరొకరిని సీఎస్ పోస్టులో నియమించారు. అదీ ఎల్వీ ఆక్రోశానికి కారణం. దాంతో, నిమ్మగడ్డ వెనుక తిరుగుతూ జగన్ ప్రభుత్వం మీద ముసుగు దాడికి దిగారు. ఇందులో ముఖ్యుల ఎంపిక ఎవరిదోగానీ, ఆసక్తి కరంగా ఉంది. అంబేడ్కరిస్టుల కుటుంబం నుంచి మాజీ ఐఏఎస్ పీవీ రమేష్ కొంచెం ఆలస్యంగా ఇందులోకి దిగారు. ‘స్కిల్ స్కామ్’ జరిగినప్పుడు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ఈయన కేస్ సమయంలో ‘మీడియా’ ముందు వివాదాస్పదంగా మాట్లాడి వార్తల్లో వ్యక్తి అయ్యారు. సర్వీసులో ఎక్కువకాలం పలుదేశాల్లో ‘వరల్డ్ బ్యాంక్’లో పనిచేశానని చెప్పుకునే రమేష్, ప్రస్తుతం‘ఇండియన్ బిజినెస్ స్కూల్’లో ‘ఫ్యాకల్టీ’గా పనిచేస్తూ, మధ్యలో ప్రజాస్వామ్య పరిరక్షణకు బెజవాడ వస్తున్నారు. అయితే, ఇక్కడ ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహం గురించి ఈయన ఒక్క మాటా మాట్లాడరు! వీరంతా ‘పొలిటికల్ జేఏసీ’గా ఏర్పడి, దానికి ‘సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ’ అని పేరుపెట్టి ఏపీలో తటస్థ ఓటరును ప్రభావితం చేయాలనే రహస్య ‘ఎజెండా’తో పనిచేస్తున్నారు. వీరికి ‘మీడియా’ కవరేజి కోసం ‘బాబు మీడియా ఎటూ ఉండనే ఉంది. ఏతా వాతా చెప్పొచ్చేది ఏమిటంటే... ప్రజలు అంతా గమనిస్తున్నారు. తగిన సమ యంలో తగినవిధంగా స్పందిస్తారు. - వ్యాసకర్త మాజీ ఎమ్మెల్యే ‘ 98481 28844 - అడుసుమిల్లి జయప్రకాష్ -
‘సాగర్’ విద్యుత్ కేంద్రాలకు ఎన్డీఎస్ఏ
నాగార్జునసాగర్: నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నిపుణుల బృందం బుధవారం నాగార్జునసాగర్ డ్యామ్ దిగువన గల ప్రధాన, కుడికాల్వ విద్యుదుత్పత్తి కేంద్రాలను సందర్శించింది. బృందం సభ్యులు ముందుగా విజయవిహా ర్ బోర్డురూమ్‌లో సీడబ్ల్యూసీ డైరెక్టర్ రమేశ్‌కు మార్ అధ్యక్షతన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సాగర్ ప్రాజెక్టు నీటినిల్వ సామర్థ్యం, భద్రత, నీటి వినియోగం, విద్యుదుత్పత్తి, జలా శయంలో ఎంత నీరున్నపుడు కుడి కాల్వపై విద్యు త్ ఉత్పత్తి అవుతుంది, ప్రధాన విద్యుదుత్పాదన కేంద్రంలో టర్బైన్ల సంఖ్య, ఏయే టర్బైన్ నుంచి ఎంత విద్యుత్ ఉత్పత్తి అవుతుంది? దిగువ టెయిల్‌పాండ్‌లోకి నీటిని విడుదల చేస్తూ విద్యు దుత్పాదన అనంతరం తిరిగి నీటిని జలాశయంలోకి ఎత్తిపోసేందుకు టర్బైన్లను పంప్మోడ్కు ఎప్పుడు మార్చారు వంటి అంశాలపై చర్చించారు. జెన్కో చీఫ్ ఇంజనీర్ మంగేశ్‌కుమార్ సభ్యు ల సందేహాలకు సమాధానాలు చెప్పారు. అనంతరం రూట్‌మ్యాప్‌తో జల విద్యుదుత్పాదన కేంద్రాలను సందర్శించారు. సాయంత్రం వారు లాంచీలో నాగార్జునకొండకు వెళ్లారు. ఈ కార్యక్రమంలో సీడబ్ల్యూసీ మరో డైరెక్టర్ ఆశిశ్‌కుమార్, నేష నల్ డ్యామ్‌సేఫ్టీ అథారిటీ డైరెక్టర్ మహేంద్రసింగ్, డిప్యూటీ డైరెక్టర్ మహ్మద్జిషన్, సాంకేతిక నిపు ణులు రాకేశ్, స్టేట్డ్యామ్ సేఫ్టీ అథారిటీ చీఫ్ ఇంజనీర్ కుమార్, ఎస్ఈ మురళీకృష్ణ, ఆర్గనైజేషన్ సీఈ ప్రమీల, ఎస్ఈ శ్రీనివాసులు, ఈఈ విజ యలక్ష్మి, డీఈ సతీశ్, నాగార్జుసాగర్ ప్రాజెక్టు సీఈ అజయ్‌కుమార్, ఎస్ఈ నాగేశ్వర్రావు, ఈఈ మల్లికార్జున్‌రావు, ఆంధ్రప్రదేశ్ సీఈ మురళీ«ధర్ రెడ్డి, కృష్ణా రివర్‌బోర్డు ఎస్ఈ వరలక్ష్మీదేవి, ఈఈ హరి పాల్గొన్నారు. -
స్మార్ట్ ఫోన్లా ట్యాబ్‌లను వాడలేరు
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లోని 8వ తరగతి విద్యార్థులకు టెక్నాలజీ విద్యను చేరువ చేస్తూ ఉచితంగా అందించిన బైజూస్ కంటెంట్‌తో కూడిన ట్యాబ్‌ల వినియోగాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు పాఠశాల విద్యా శాఖ ఐటీ సెల్ డిజిటల్ ఇనీషియేటివ్స్ రాష్ట్ర నోడల్ అధికారి సీహెచ్‌వీఎస్ రమేష్‌కుమార్ చెప్పారు. గురువారం గుంటూరులో ట్యాబ్‌ల యాక్టివేషన్‌పై ఉపాధ్యాయులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన రమేష్‌కుమార్ ‘సాక్షి’తో మాట్లాడారు. ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన ట్యాబ్‌లను స్మార్ట్‌ఫోన్‌లా ఉపయోగించేందుకు ఆస్కారం లేదని, ప్రీ లోడెడ్ యాప్స్‌ను గూగుల్ సంస్థ ద్వారా బ్లాక్ చేయించినట్లు తెలిపారు. బైజూస్ కంటెంట్‌తో కూడిన యాప్‌తో పాటు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో కూడిన స్విఫ్ట్‌చాట్, ఈ–పాఠశాల, డ్యూలింగో, డిక్షనరీ యాప్‌లు మినహా మరే ఇతర యాప్‌లు ట్యాబ్‌లు ఉండవని స్పష్టం చేశారు. ఇంటర్నెట్తో పనిలేకుండా బైజూస్ కంటెంట్‌ను విద్యార్థులు చూడవచ్చని.. మిగిలిన 4 యాప్స్‌ను చూడాలంటే పాఠశాలల్లోని వైఫై ద్వారా కనెక్ట్ కావాలని చెప్పారు. సిమ్‌కార్డ్ స్లాట్‌ను బ్లాక్ చేశామని, 256 జీవీ సామర్ధ్యం కలిగిన ఎస్డీ కార్డు ద్వారా 4వ తరగతి నుంచి 12వ తరగతి వరకు సీబీఎస్ఈ సిలబస్‌లో అన్ని పాఠ్యాంశాలను లోడ్ చేశామని తెలిపారు. డ్యూలింగో యాప్ ద్వారా విద్యార్థులు విదేశీ భాషలు నేర్చుకోవచ్చన్నారు. స్విఫ్ట్ చాట్ యాప్ ద్వారా విద్యార్థి ఏ సబ్జెక్టుకు సంబంధించిన సమాచారాన్నైనా తెలుసుకోవచ్చని.. సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని చెప్పారు. ట్యాంపరింగ్ చేస్తే కఠిన చర్యలు.. ట్యాబ్‌లలో ఇన్‌బిల్ట్‌గా ఉన్న మొబైల్ డివైజ్ మేనేజ్మెంట్ వ్యవస్థ ద్వారా విద్యార్థుల ట్యాబ్‌లను ఐటీ సెల్ నుంచి నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు రమేష్‌కుమార్ చెప్పారు. ట్యాబ్‌లలో ఆధునిక భద్రతా వ్యవస్థ ఇమిడి ఉందన్నారు. ఈ ట్యాబ్‌లను విద్యార్థులు, ఉపాధ్యాయులు మినహా ఇతరులెవ్వరూ వినియోగించేందుకు అవకాశం లేదన్నారు. బ్లాక్ చేసిన యాప్‌లను అన్‌లాక్ చేసేందుకు సెల్‌ఫోన్ షాపులవాళ్లు, ప్రైవేటు వ్యక్తులు ప్రయత్నిస్తే వారిపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. దీనిపై అన్ని జిల్లాల ఎస్పీలకు ప్రభుత్వం సమాచారం చేరవేసిందని తెలిపారు. విద్యార్థులు ట్యాబ్‌లలో ఏ సబ్జెక్టు ఎంతసేపు చూశారనే సమాచారం కూడా నమోదవుతుందని వివరించారు. సర్వీస్ సెంటర్ల ద్వారా ఉచిత సేవలు ట్యాబ్‌లలో ఏదైనా సాంకేతిక సమస్య ఎదురైతే.. ఆ సంస్థ సర్వీసు సెంటర్ల ద్వారా ఉచిత సేవలు పొందవచ్చని రమేష్‌కుమార్ చెప్పారు. పని చేయని ట్యాబ్‌ను సమీపంలోని గ్రామ, వార్డు సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్‌కు అందిస్తే, వాళ్లు ఆన్లైన్లో నమోదు చేసి టోకెన్ ఇస్తారని పేర్కొన్నారు. అనంతరం ఆ ట్యాబ్‌ను సర్వీసు కేంద్రానికి పంపించి.. బాగు చేయించి మూడు రోజుల వ్యవధిలో తిరిగి అందజేస్తారని చెప్పారు. ట్యాబ్ కింద పడినా పాడవకుండా సురక్షితమైన కవర్ కేస్‌తో పాటు స్క్రీన్ గార్డు, చార్జర్, ఇయర్ ఫోన్ అందిస్తున్నట్లు చెప్పారు. -
జరిమానా చెల్లించేందుకు కోర్టులోనే చోరీ
సంగారెడ్డి అర్బన్: కోర్టు విధించిన జరిమానా చెల్లించేందుకు అదే కోర్టులో గంజాయిని దొంగతనం చేసిన నిందితుడి నిర్వాకమిది. సంగారెడ్డి డీఎస్పీ రమేష్ కుమార్ కథనం మేరకు.. ఈ నెల 19వ తేదీన కోర్టు హాలులోని న్యాయమూర్తి చాంబర్లో ఓ కేసుకు సంబంధించిన గంజాయి సంచిని సీజ్ చేసి ఉంచారు. గుర్తు తెలియని వ్యక్తులు తాళం పగులగొట్టి గంజాయి సంచిని ఎత్తుకెళ్లారు. దీనిపై కోర్టు సీనియర్ సూపరింటెండెంట్ విజయ్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీ, షూ గుర్తుల ఆధారంగా నిందితుడు మగ్దూమ్‌నగర్‌కు చెందిన షేక్ మహబూబ్‌గా గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా నేరం ఒప్పుకున్నాడు. నిందితుడు ఇదివరకు ఒక దొంగతనం, యాక్సిడెంట్ కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చాడు. 14 ఏళ్లుగా స్థానిక జిల్లా కోర్టు ఆవరణలో ఎవరైనా నిందితులకు బెయిల్ జామీను కావాలంటే డబ్బులు తీసుకొని పూచీకత్తు ఇస్తుంటాడు. అందులో భాగంగా సంగారెడ్డి టౌన్ పీఎస్ పరిధిలో జరిగిన ఓ ఏటీఎం దొంగతనం కేసులో నిందితులకు జామీను ఇచ్చాడు. అయితే వారు కోర్టుకు రానందున మహబూబ్ రూ.30వేలు కట్టాల్సి వచ్చింది. ఈ డబ్బు ఎలా కట్టాలో తెలియక కోర్టు హాలులో ఉన్న గంజాయి మూటను అమ్మి డబ్బు చేసుకోవాలని భావించి దొంగతనం చేశాడు. గంజాయి మూటను స్వాదీనం చేసుకుని నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. -
గాంధీల పేరుతో తరాలు తిన్నా తరగనంత సంపాదించాం: కాంగ్రెస్ ఎమ్మెల్యే
బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే రమేశ్ కుమార్ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది అసెంబ్లీ వేదికగానే అత్యాచారంపై మాట్లాడి వివాదాల్లో చిక్కుకున్న ఆయన.. తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించాయి. గాంధీలు, నెహ్రూ పేరుతో కాంగ్రెస్ నేతలు కావాల్సినంత డబ్బు సంపాదించారని పేర్కొన్నారు. సోనియా గాంధీని ఈడీ ప్రశ్నించటాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ చేపట్టిన ఆందోళనల వేదికగా ఈ వ్యాఖ్యలు చేశారు. ‘జవహార్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, సోనియా గాంధీల పేరుతో మనము 3-4 తరాలకు సరిపడా డబ్బు సంపాదించుకున్నాం. మనం ఈమాత్రం త్యాగం చేయలేకపోతే.. అది మనకే మంచిది కాదు.’ అని పేర్కొన్నారు. ఎమ్మెల్యే రమేశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు గుప్పించారు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్ కే. ‘కాంగ్రెస్ పార్టీ గత 60 ఏళ్లలో ఏ విధంగా దేశాన్ని దోచుకుందనే విషయాన్ని ఎంతో అందంగా వివరించిన తెలివైన నేతకు నా శుభాకాంక్షలు’ అని ట్విట్టర్ వేదికగా విమర్శించారు. ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷದ 60 ವರ್ಷಗಳ #LootIndia ಕಾರ್ಯಕ್ರಮವನ್ನ ಅತ್ಯಂತ ಸೊಗಸಾಗಿ ವರ್ಣಿಸಿದ ಮೇಧಾವಿ ನಾಯಕರಿಗೆ ಅಭಿನಂದನೆಗಳು! ನಿಮ್ಮ ಪಕ್ಷದ ಹಿರಿಯ ನಾಯಕರೇ ಇಷ್ಟು ಪ್ರಾಮಾಣಿಕವಾಗಿ ಬ್ರಹ್ಮಾಂಡ ಭ್ರಷ್ಟಾಚಾರವನ್ನ ಒಪ್ಪಿಕೊಂಡಮೇಲೆ ಯಾವ ಮುಖ ಇಟ್ಟುಕೊಂಡು ಜನರ ಬಳಿ ಮತ ಕೇಳುತ್ತೀರಿ @INCIndia ನಾಯಕರೇ? pic.twitter.com/r0Kqt3OZpZ — Dr Sudhakar K (@mla_sudhakar) July 21, 2022 నేషనల్ హెరాల్డ్‌కు సంబంధించిన కేసులో గురువారం ఈడీ ముందు హాజరయ్యారు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ. ఈడీ విచారణను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఇందులో భాగంగానే బెంగళూరులోని పార్టీ కార్యాలయం నుంచి క్వీన్స్ రోడ్ వరకు ర్యాలీ నిర్వహించారు మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డీకే శివకుమార్ నేతృత్వంలోని కాంగ్రెస్ కార్యకర్తలు. అనంతరం ఫ్రీడమ్ పార్క్‌లో సమావేశం ఏర్పాటు చేసి నేతలు మాట్లాడారు. ఇదీ చదవండి: National Herald Case: ముగిసిన సోనియా గాంధీ ఈడీ విచారణ -
నాకు జీవం లేదు.. 4 రోజుల క్రితమే చనిపోయాను: కాంగ్రెస్ ఎమ్మెల్యే
సాక్షి, బెంగళూరు: ప్రాణం ఉన్న వారు మాట్లాడాలి. నాకు జీవం లేదు. నాలుగురోజుల క్రితమే చనిపోయానని కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ రమేశ్‌కుమార్ అన్నారు. సోమవారం బెళగావిలో ఎంఈఎస్ విధ్వంసకాండపై స్పందించాలని రమేశ్‌కుమార్‌ను విలేకరులు కోరగా, చేతులెత్తి నమస్కరించారు. నేను జీవించిలేను. నాలుగురోజుల క్రితం మృతి చెందానంటూ అక్కడ నుంచి వెళ్లిపోయారు. మహిళలపై అత్యాచారాల గురించి ఆయన అసెంబ్లీలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, దీనిపై మహిళా సంఘాలు తీవ్ర నిరసనలు చేయడం తెలిసిందే. చదవండి: పెళ్లి కాలేదని జీవితం మీద విరక్తితో.. -
ఏఎస్ఐ వర్సెస్ మాజీ స్పీకర్: సిగ్గుండాలి.. మీకు పిల్లలు లేరా?
సాక్షి, బెంగళూరు/బనశంకరి: కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ రమేశ్‌కుమార్‌పై బెంగళూరు జేపీ నగర పోలీస్‌స్టేషన్‌లో పనిచేసే గోపి అనే ఏఎస్ఐ మండిపడ్డారు. ఆదివారం గోపి మాట్లాడిన ఆడియో క్లిప్ వైరల్ అయింది. ‘‘మాజీ సభాధ్యక్షునికి మొదటి నుంచీ గౌరవం ఇస్తున్నాం. కానీ ఆయన అందరు రాజకీయనేతల కంటే భిన్నంగా ఉంటారు. ప్రవర్తన సరిగాలేదు’’ అని ఆడియో క్లిప్‌లో విమర్శలు చేశాడు. ‘‘ఇతను (రమేశ్‌కుమార్) రోడ్డులో వెళుతుండగా ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఏమి చెబుతారంటే రహదారుల్లో సక్రమంగా వాహనాలు తనిఖీలు చేయడం లేదంటారు. మా కుటుంబాల గురించి మాట్లాడతారు. మేం ఇతని కుటుంబం గురించి మాట్లాడామా? మా విధుల గురించి మాట్లాడాలి. ఇతనిపై ఉన్న గౌరవం కూడా పోయింది’’ అని ఏఎస్ఐ అన్నారు. తనిఖీలు చేయడం మీ భార్యపిల్లలకు మంచిది కాదని ఆయన చెప్పడం ఎంతవరకు సమంజసం అని మాజీ స్పీకర్‌పై మండిపడ్డారు. వివాదం ఎక్కడ మొదలైంది రోడ్డుపై వాహనాలను నిలిపి జరిమానా విధిస్తున్న చింతామణి పట్టణ పోలీసులను ఎమ్మెల్యే రమేశ్‌కుమార్ మందలించారు. ఇది వివాదానికి దారితీసింది. కాగా శుక్రవారం, ఎస్ఐ ముక్తియార్ సిబ్బందితో తాలూకాలోని మడికెరి క్రాస్‌లో వాహనాలను అడ్డుకుని జరిమానా విధిస్తున్నారు. ఈ సమయంలో శ్రీనివాసపుర నుంచి బెంగళూరుకు వెళుతున్న రమేశ్‌కుమార్ తన వాహనాన్ని నిలిపి.. ‘‘పోలీసులను పిలిచి రోడ్ల మధ్యలో వాహనాలను నిలిపి జరిమానా విధించరాదని ఇటీవల హోంమంత్రి ఆదేశాలు జారీచేశారు కదా. మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, ఇది మీ కుటుంబానికి మంచిదికాదు. ఏం డాక్యుమెంట్లను చెక్ చేస్తారు? సిగ్గుండాలి మీకు. హోంమంత్రి చెప్పినా వినిపించుకోరా?, ఇదే మీ ఉద్యోగమా మీకు’’ అని ఘాటుగా ప్రశ్నించారు. ఈ వీడియోలు వైరల్ అయ్యాయి. ఏఎస్ఐ ఆడియోపై రమేశ్‌కుమార్ స్పందిస్తూ టోల్గేట్ వద్ద పోలీసుల ప్రవర్తన బాధ కలిగించడంతో మీకు పిల్లలు లేరా? వెళ్లండి అని అన్నాను అని చెప్పారు. ఈ వివాదంపై పోలీసు ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి మరి! చదవండి: Karnataka: రూపాయికే రొట్టె, అన్నం, సాంబార్ -
ఒక మెట్టు కాదు... వంద మెట్లు పైకెదిగాం
మనదేశానికి స్వాతంత్య్రం వచ్చి 74 ఏళ్లు పూర్తయింది. 75వ ఏడాదిలోకి అడుగు పెట్టాం. ఇన్నేళ్లలో భారత్ అన్ని రంగాల్లోనూ పురోగతి సాధించింది. అలాగే రక్షణ రంగంలో కూడా గొప్ప పురోగతిని సాధించింది. పాకిస్తాన్, చైనాలతో తొలినాళ్లలో జరిగిన యుద్ధాలతో పోలిస్తే ఇప్పుడు మనదేశ రక్షణ రంగం పూర్తి స్థాయిలో బలోపేతం అయింది. మనం శత్రువును దీటుగా ఎదుర్కోగలిగిన సామర్థ్యాన్ని పెంచుకున్నాం. బరువు తగ్గింది: మన రక్షణరంగం ఇప్పుడు ప్రపంచ స్థాయి నైపుణ్యాలను సంతరించుకుంది. సైనికుల దుస్తుల దగ్గర నుంచి ఆయుధాల వరకు ప్రతిదీ అధునాతనమైంది. బరువైన హెల్మెట్ల స్థానంలో బుల్లెట్ ప్రూఫ్ ఫైబర్ హెల్మెట్లు వచ్చాయి. తేలికపాటి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లున్నాయి. మైనస్ నలభై డిగ్రీల ఉష్ణోగ్రతలో డ్యూటీ చేయడానికి వీలుగా షూస్, కళ్లద్దాల వంటివి గతంలో ఉండేవి కాదు. ఇప్పుడవన్నీ ఉన్నాయి. నైట్ విజన్ గాగుల్స్, బైనాక్యులర్స్, గుడారాల మెటీరియల్ నుంచి పారాషూట్ల వరకు ప్రతిదీ అధునాతనమైనదే. ఒక్కమాటలో చెప్పాలంటే టెక్నాలజీ అభివృద్ధి చెందినంత వేగంగా రక్షణ రంగం కూడా మెరుగవుతూ వచ్చింది. ఎంత కఠినమైన ప్రదేశాల్లో అయినా ప్రయాణించగలిగిన వాహనాలను, అదికూడా తక్కువ బరువు కలిగి, ఎక్కువ మైలేజీనిచ్చే ప్రత్యేక లక్షణాలతో వాహనాలను దేశీయంగా తయారు చేసు కున్నాం. పాకిస్తాన్, చైనా సరిహద్దుల్లో కొండల మధ్య ఇరుకుదారులను రహదారులుగా మార్చుకున్నాం. ఒకప్పుడు... ప్రత్యర్థి మన భూభాగంలోకి వచ్చినట్లు తెలిసిన తర్వాత మన సైన్యం ఆ ప్రదేశానికి చేరడానికి రోజులు పట్టేది. ఇప్పుడు గంటలో చేరి పోగలుగుతున్నాం. గురి పెరిగింది: ఆయుధ సంపత్తి విషయానికి వస్తే... రైఫిల్స్ నుంచి యుద్ధట్యాంకుల వరకు ప్రతిదీ ఒక మెట్టు... రెండు మెట్లు కాదు... వందమెట్లు పై స్థాయికి చేరినట్లు చెప్పుకోవాలి. మొదట్లో మనం బోల్ట్ యాక్షన్ రైఫిల్స్ వాడే వాళ్లం. తర్వాత వచ్చిన 7.62 ఎంఎం రైఫిల్స్ కూడా బరువుగానే ఉండేవి. ఇప్పుడున్న 5.56 ఎంఎం రైఫిళ్లు తేలికగా ఉండడంతోపాటు సమర్థవంతమైనవి. టూ ఇంచ్ మోటార్లు, రాకెట్ లాంచర్లు, మెషీన్‌గన్, మిస్సైల్స్... అన్నీ అప్‌గ్రేడ్ అయ్యాయి. ట్యాంకులయితే టీ 55, టీ 72 నుంచి అత్యుత్తమ శ్రేణి అర్జున్ ట్యాంకులున్నాయి. మనం రాడార్ వ్యవస్థ మీద ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించడంతో... మన సరిహద్దుకు ఇవతల ఎంతో లోపల ఉండి కూడా సరిహద్దు అవతల ప్రత్యర్థి కదలికలను అంచనా వేయగలుగుతున్నాం. బ్యాటిల్ ఫీల్డ్‌లో ఉన్న సైనికులకు కచ్చితమైన సమాచారాన్ని ఇవ్వగలుగుతున్నాం. మన సైనికులు సురక్షితమైన రహస్య ప్రదేశం నుంచి దూరాన ఉన్న లక్ష్యాన్ని ఛేదించగలిగిన ఆయు ధాలున్నాయి. నీటి నుంచి నింగి వరకు: నేవీ రంగం... మిస్సైల్ షిప్‌లు, సబ్మెరైన్లు, న్యూక్లియర్ సబ్మెరైన్ల సంఖ్యను బాగా పెంచుకుంది. ఎక్కడ అవసరం వస్తే తక్షణం అక్కడ మోహరించగలిగినంత శక్తిమంతంగా ఉంది. ఎయిర్‌ఫోర్స్‌లో విక్రాంత్, విరాట్ ఉండేవి. ఇప్పుడు ఐఎన్ఎస్ విక్రమాదిత్య వంటి ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్లు మన యుద్ధ సామర్థ్యాన్ని పెంచుతున్నాయి. మిగ్ 21, 23, 27, జాగ్వార్‌తోపాటు రఫెల్ ఎయిర్‌క్రాఫ్ట్ వంటి ఫిఫ్త్ జనరేషన్ సిస్టమ్ యుద్ధ సామగ్రిని సమకూర్చుకున్నాం. పైగా ప్రస్తుతం మన సైనికులకు ప్రపంచ స్థాయి నాణ్యతతో శిక్షణ నిస్తున్నాం. గెలుపు ధీమా: ఇన్ని ప్రత్యేక చర్యల ద్వారా మన సైనికుల్లో గెలిచి తీరుతామనే ధైర్యం పెరిగింది. ఒక తరం కనీస సదుపాయాలు కూడా లేని పరిస్థితుల్లో యుద్ధం చేస్తూ... ‘ఎలాగైనా సరే మనం గెలిచి తీరాలి’ అనే పట్టుదలతో పోరాడింది. ఇప్పుడు మనదేశం సాధించిన యుద్ధనైపుణ్యం సైనికులకు భరోసానిస్తోంది. సైనికుల్లో ‘ఎంతటి ప్రత్యర్థి మీద అయినా సరే ఒక మెట్టు మెరుగ్గా పోరాడి విజయం సాధించగలం. భారత్‌ను గెలుపు పీఠం మీద నిలబెట్టగలం’ అనే ఆత్మవిశ్వాసాన్ని పెంచుతోంది. - కల్నల్ పి. రమేష్ కుమార్ (రిటైర్డ్) వ్యాసకర్త డైరెక్టర్, సైనిక్ వెల్ఫేర్, తెలంగాణ (సంభాషణ: వాకా మంజులారెడ్డి) -
తెరుచుకోనున్న వైష్ణోదేవి ఆలయం
జమ్మూ: జమ్మూకశ్మీర్‌లో ఉన్న వైష్ణోదేవి ఆలయం ఆదివారం నుంచి తెరుచుకోనున్నట్లు అధికారులు తెలిపారు. కరోనా కారణంగా మార్చి 18న ఆలయం మూతబడగా, దాదాపు 5 నెలల తర్వాత తెరుచుకోనుంది. మొదటి వారంలో రోజుకు 2,000 మందిని మాత్రమే అనుమతించనున్నామని ఆలయాధికారి రమేశ్‌కుమార్ తెలిపారు. వారిలో 1,900 మందిని జమ్మూకశ్మీర్ నుంచి మరో 100 మందిని బయట రాష్ట్రాల నుంచి అనుమతిస్తామని చెప్పారు. సందర్శకులు ముందుగానే రిజిస్టర్ చేసుకోవాలని స్పష్టంచేశారు. ఫేస్ మాస్క్, ఫేస్ కవర్ తప్పనిసరి అని చెప్పారు. వచ్చేవారంతా ఆరోగ్య సేతు యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారు తప్పనిసరిగా కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ తీసుకొని రావాలన్నారు. -
ఏపీ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్‌గా రమేష్ కుమార్
సాక్షి, అమరావతి: రాష్ట్ర సమాచార హక్కు(ఆర్టీఐ) చీఫ్ కమిషనర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పి.రమేష్‌కుమార్ నియమితులయ్యారు. వైఎస్సార్ జిల్లాకు చెందిన ఆయన పశ్చిమ బెంగాల్ కేడర్ ఐఏఎస్ అధికారిగా వివిధ హోదాల్లో పనిచేశారు. పదవీ విరమణ తర్వాత పశ్చిమబెంగాల్ పరిపాలనా ట్రిబ్యునల్ సభ్యునిగా కూడా సేవలందించారు. ఉత్తమ అధికారిగా మన్ననలు అందుకున్న ఆయన్ను రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రధాన సమాచార కమిషనర్‌గా నియమించింది. పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మూడేళ్లు లేదా 65 ఏళ్ల వయస్సు (ఈ రెండింటిలో ఏది ముందయితే అదే వర్తిస్తుంది) వరకు పదవిలో ఉంటారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, రమేష్‌కుమార్ తండ్రి అబ్బయ్య కూడా ఐఏఎస్ అధికారిగా పనిచేయడం విశేషం. (ఏపీలో అన్‌లాక్ 2.0 అమలు ఉత్తర్వులు జారీ) కమిషనర్‌గా శ్రీనివాసరావు రాష్ట్ర సమాచార కమిషనర్‌గా రేపాల శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి మూడేళ్లుగానీ లేదా 65 ఏళ్ల వయస్సు వరకు గానీ(ఈ రెండింటిలో ఏది ముందయితే అదే వర్తిస్తుంది) ఈ పదవిలో కొనసాగుతారు. ఈ మేరకు సీఎస్ జీవో జారీ చేశారు. -
ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ అరెస్ట్
-
ఏపీ డీజీపీకి ఎంపీ విజయసాయిరెడ్డి లేఖ
-
ఏపీ డీజీపీకి విజయసాయిరెడ్డి లేఖ
సాక్షి, అమరావతి : రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ ఎన్. రమేశ్ కుమార్ కేంద్ర హోంశాఖ కార్యదర్శికి రాసిన లేఖపై విచారణ జరిపించాలని ఎంపీ విజయసాయిరెడ్డి డీజీపీ గౌతమ్‌సవాంగ్‌కి రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్ర హోంశాఖకు రాసిన లేఖలో ఉన్నది పోర్జరీ సంతకాలు, నకిలీ డాక్యుమెంట్లని పేర్కొన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ జారీ సందర్భంగా రమేశ్ కుమార్ చేసిన సంతకానికి, ఇప్పుడు లేఖలో ఉన్న సంతకానికి అసలు పొంతన లేదన్నారు. సంతకం ఫోర్జరీ చేసిన లేఖ కచ్చితంగా టీడీపీ ఆఫీసులోనే తయారయిందని తమ దగ్గర సమాచారం ఉన్నట్లు తెలిపారు. (‘ఆ లేఖపై రమేష్‌కుమార్ మౌనం వీడాలి’) ఇది కచ్చితంగా ఉద్దేశపూర్వకంగా చేశారని, ఇందులో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్, వర్ల రామయ్య, టీడీ జనార్థన్ల హస్తం ఉందని వెల్లడించారు. వీరంతా కలిసే ఈ లేఖను సృష్టించారని, అయితే ఈ తతంగమంతా రమేశ్ కుమార్కకు తెలిసే జరిగిందని విమర్శించారు. ఫోర్జరీ సంతకాలు, కల్పిత డాక్యుమెంట్లపై డీజీపీ విచారణ చేయాల్సిందిగా లేఖలో పేర్కొన్నారు. వెంటనే ఆ లేఖను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించాలని, దీనిపై వచ్చే నివేదిక ఆధారంగా క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందిగా వెల్లడించారు. ఐపీ ఆధారంగా ఈ లేఖను ఎవరు పంపారో గుర్తించి చర్యలు తీసుకోవాలని విజయసాయిరెడ్డి డీజీపీని కోరారు. -
అందుకే చంద్రబాబు బాధపడుతున్నాడు : అంబటి
సాక్షి, తాడేపల్లి : రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిష్పక్షపాతంగా వ్యవహరించుకుంటే ప్రజాస్వామ్యం కూలిపోతుందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. ఎన్నికల సంఘాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల కమిషనర్ వ్యవహారం విధానపరమైన నిర్ణయమని అంబటి స్పష్టం చేశారు. అలాంటి నిర్ణయంపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు గగ్గోలు పెడుతున్నారని విమర్శించారు. ఆయన మనిషి పోతున్నాడని చంద్రబాబు బాధపడుతున్నారని అన్నారు. విధానపరమైన నిర్ణయంపై టీడీపీ నేతలకు ఉన్న అభ్యరంతమేమిటని ప్రశ్నించారు. గతంలో ఏకసభ్య కమిషన్ ఉండేదని.. ఇప్పుడు ముగ్గురు సభ్యులు ఉండేలా నిర్ణయించారని తెలిపారు. వ్యక్తులను టార్గెట్ చేసి ఈ నిర్ణయాలు తీసుకోలేదని స్పష్టం చేశారు. వ్యవస్థ బాగుకోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. 243కె నిబంధన ప్రకారం ఎన్నికల కమిషనర్‌ను గవర్నర్ నియమిస్తారని గుర్తుచేశారు. ఇప్పుడు ఆయన పదవి మూడేళ్లకు తగ్గిస్తూ గవర్నర్ ఆర్డినెన్స్ ఆమోదించారని తెలిపారు. ప్రభుత్వం ప్రజాస్వామికంగా, రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించిందని వెల్లడించారు. ఎన్నికల సంస్కరణలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. మంచి జరుగుతుంటే చంద్రబాబు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కొంపలు మునిగిపోయినట్టు గగ్గోలు పెడుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల సంఘంలో మార్పులు సహజం అని చెప్పారు. -
రూ.వెయ్యి పంపిణీ కోడ్ ఉల్లంఘన కాదు
సాక్షి, అమరావతి: లాక్డౌన్ విపత్కర పరిస్థితుల్లో పేద ప్రజలకు ప్రయోజనం చేకూర్చే రూ. 1,000 పంపిణీ ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకు రాదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్. రమేష్‌కుమార్ స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో లేదని చెప్పారు. రూ. వెయ్యి పంపిణీపై ఫిర్యాదు చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తనకు రాసిన లేఖలకు ఆయన బదులిచ్చారు. ఇదే విషయంపై ఆయన ప్రకటన విడుదల చేశారు. ► నగదు పంపిణీ విషయాన్ని ఎన్నికల కమిషన్ క్షుణ్ణంగా పరిశీలించిందని పేర్కొన్నారు. ► అయితే ఎన్నికల ప్రచారంపై నిషేధం కొనసాగుతుందని, పోటీ చేసే అభ్యర్థులు స్వప్రయోజనం కోసం ప్రచారం, ఓటర్లను ప్రభావితం చెయ్యడం వంటివి ఎన్నికల ప్రక్రియ ఉల్లంఘనగా పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. ► అటువంటి సంఘటనపై క్షేత్రస్థాయిలో నిజానిజాలను విచారించి, ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకుని రావాలంటూ జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల పరిశీలకులకు లేఖ రాశారు. ► సంబంధిత అధికారులందరూ పర్యవేక్షణ ద్వారా అటువంటి సంఘటనలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో పేర్కొన్నారు. -
‘అందులో తప్పేముంది’
సాక్షి, అమరావతి: ‘రాజ్యాంగ బద్ధమైన పోస్టులో ఉండి తప్పుడు ప్రచారం చేస్తారా’ అంటూ ఈసీ తీరుపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా అప్రజాస్వామికం అని ధ్వజమెత్తారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో కరోనాపై అధికారికంగా ఈసీ సమీక్ష చేసిందా.. రాష్ట్రంలో కరోనాపై అంచనా వేయకుండా ఎన్నికలను ఎందుకు వాయిదా వేశారు. స్థానిక ఎన్నికలు వాయిదా వేసినప్పుడు వైద్యాధికారులను సంప్రదించారా? రాష్ట్రంలో పరిస్థితిపై వైద్యాధికారుల నుంచి వివరాలు తెప్పించుకున్నారా? ఈసీకి సీఎస్ లేఖ రాసిన తర్వాత కూడా సీఎస్‌తో ఎందుకు మాట్లాడలేదు? కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా వేస్తే కోడ్ ఎందుకు కొనసాగించారు’’ అని పలు ప్రశ్నలను మంత్రి రాజేంద్రనాథ్ సంధించారు. (ఆక్వా రైతుల్లో కరోనా కల్లోలం) దురుద్దేశం అర్థమవుతుంది.. క్యావియేట్ పిటిషన్ దాఖలు చేయడంతో మీ దురుద్దేశం అర్థమవుతుందని దుయ్యబట్టారు. అధికార పార్టీ ఒత్తిడి ఉంటే ప్రతిపక్షాలు భారీ స్థాయిలో నామినేషన్లు ఎలా వేసాయన్నారు. టీడీపీ వాళ్లు నామినేషన్లు వేయకుంటే దానికి అధికారపార్టీ బాధ్యత వహిస్తుందా అని ప్రశ్నించారు. కరోనాపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందస్తు చర్యలకు ఆదేశించారని తెలిపారు. కరోనా నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందన్నారు. (‘కరోనాపై పోరాటం టెస్టు క్రికెట్‌లాంటిది’) ఏకగ్రీవం కావడంలో తప్పేముంది.. అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ జిల్లాలో వైఎస్సార్సీపీ వంద శాతం సీట్లు గెలిచిందని.. ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు ఏకగ్రీవం కావడంలో తప్పేముందన్నారు. ప్రజా మద్దతు తమకుంది కాబట్టే మెజార్టీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయని పేర్కొన్నారు. సీఎంను టార్గెట్ చేస్తూ ఎన్నికల కమిషనర్ మాట్లాడిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని బుగ్గన రాజేంద్రనాథ్ పేర్కొన్నారు. -
బాబు మరో డ్రామాకు తెరలేపారు : సజ్జల
సాక్షి, అమరావతి : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్న తీరుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన గెలిస్తే దేశంలో ప్రజస్వామ్యం ఉన్నట్టుగా, గెలవకపోతే ప్రజాస్వామ్యమే లేదన్నట్టుగా చిత్రీకరించి దాన్ని ఎల్లో మీడియాలో చూపించడం చంద్రబాబుకు అలవాటేనని విమర్శించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ట్విటర్లో ఓ పోస్ట్ ఉంచారు. స్థానిక ఎన్నికలు జరిగితే ప్రజలిచ్చే తీర్పు, ఆ తర్వాత పరిస్థితులు దారుణంగా ఉంటాయనేదే చంద్రబాబు భయమని సజ్జల తెలిపారు. అందుకే చంద్రబాబు మరో డ్రామాకు తెరలేపారని మండిపడ్డారు. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో జరగని ఘటనలు జరిగినట్టుగా సృష్టించి, పచ్చ ఫిర్యాదుల కట్టను తన మనిషైనా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్‌కుమార్‌కు పంపించాలని చంద్రబాబు టీడీపీ కేడర్‌ను ఆదేశించారని సజ్జల విమర్శించారు. వాటికి నంబరింగ్ ఇచ్చి మరో రచ్చకు సిద్దం కావాలన్నదే చంద్రబాబు పథకమని ఆయన అన్నారు. -
లేఖపై ఈసీ నోరు మెదపరెందుకు?
-
‘ఆ లేఖపై రమేష్‌కుమార్ మౌనం వీడాలి’
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఎదుర్కొనే దమ్ము లేక టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈసీని అడ్డం పెట్టుకుని కుట్ర చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను గురువారం మంగళగిరి పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల బృందం కలిసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్‌కుమార్ పేరుతో సర్క్యూలేట్ అయిన లేఖపై ఈ సందర్భంగా వారు డీజీపీ ఫిర్యాదు చేశారు. డీజీపీని కలిసిన వారిలో ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, జోగి రమేష్, కైలే అనిల్ కుమార్, పార్థసారథి, మల్లాది విష్ణులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిర పరిచే కుట్రలో భాగంగా ఈ లేఖను సర్క్యూలేట్ చేసినట్టుగా నేతలు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ లేఖ ఎక్కడి నుంచి బయటకు వచ్చిందో దర్యాప్తు చేయాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల బృందం డీజీపీని కోరింది. రమేష్‌కుమార్ పేరిట ప్రచారంలోకి వచ్చిన లేఖతోపాటు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక సమాచారాన్ని ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు డీజీపీకి అందజేశారు. ఈ సమావేశం అనంతరం అంబటి రాంబాబు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వంపై ఒక మనిషి అడ్డమైన రాతలు రాస్తే.. ధ్రువీకరణ లేకపోయినా దానిని పత్రికలు ప్రచురించడం దారుణమని అన్నారు. రాజ్యంగ వ్యసవ్థలో ఉన్న వ్యక్తి ఇలా వ్యవహరించడం సరైనాదేనా అని ప్రశ్నించారు. ఆ లేఖ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ రాస్తే ధైర్యంగా ఒప్పుకోవాలన్నారు. రమేష్‌కుమార్ మౌనంతో ఆ లేఖపై తమ అనుమానాలు బలపడుతున్నాయని తెలిపారు. నిమ్మగడ్డ రమేష్‌కుమార్ మౌనం వీడాలని డిమాండ్ చేశారు. ఆ లేఖకు సంబంధించి వాస్తవాలు బయటికొచ్చే వరకు పోరాడతామన్నారు. అధికారులపై దౌర్జన్యం చేసే అలవాటు తమకు లేదని స్పష్టం చేశారు. చదవండి : రమేష్ కుమార్‌ను ఎస్ఈసీ నుంచి తప్పించాలి ఆ లేఖ పెద్ద కుట్ర.. -
సుప్రీం ప్రశ్నలపై ఈసీ సమాధానం చెప్పాలి
-
‘ఆయన్ని దుష్టశక్తులు ఆవహించాయి’
సాక్షి, తిరుపతి: ఎన్నికల కమిషనర్ రమేష్‌కుమార్‌ను దుష్టశక్తులు ఆవహించాయని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు విమర్శించారు. మంగళవారం ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికలను కరోనా సాకుతో వాయిదా వేయడాన్ని తప్పుబట్టారు. చంద్రబాబుతో ఈసీ కుమ్మక్కై వాయిదా నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ధ్వజమెత్తారు. అమరావతిలో గుంపు గుంపులుగా ధర్నాలు చేస్తున్నారని అక్కడ కరోనా లేదా అని శ్రీనివాసులు ప్రశ్నించారు. ‘ఆ నిర్ణయం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు’ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా వైఎస్సార్సీపీకి సహకరిస్తున్నారని తెలిపారు. రైల్వేకోడూరులో టీడీపీ మాజీ ఎమ్మెల్సీ దారుణాలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ దౌర్జన్యాలకు పాల్పడి ఉంటే టీడీపీ నేతలు ఇంత పెద్ద ఎత్తున నామినేషన్లు వేసేవారా అని ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం చిత్తశుద్దితో కృషి చేస్తున్న సీఎం వైఎస్ జగన్‌పై టీడీపీ విమర్శలను శ్రీనివాసులు ఖండించారు. (పల్లె ప్రగతికి విఘాతం ) -
‘ఆ నిర్ణయం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు’
సాక్షి, తాడేపల్లి: ఎన్నికలను వాయిదా వేసే హక్కు ఈసీ రమేష్‌కుమార్‌కు ఎవరిచ్చారని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రశ్నించారు. మంగళవారం ఆయన వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎన్నికల నిలుపుదల అనేది రాష్ట్ర చరిత్రలో చీకటి రోజుగా మిగిలిపోతుందన్నారు. ఎన్నికలను వాయిదా వేయడాన్ని ప్రజలు కూడా తప్పు పడుతున్నారని పేర్కొన్నారు. గవర్నర్ చేత ఆమోదం పొందిన షెడ్యూల్‌ను గౌరవించకుండా.. ఎన్నికల కమిషనర్ రమేష్‌కుమార్ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని దుయ్యబట్టారు. ఆయన తన పరిధి దాటి వ్యవహరించి.. రాజ్యాంగ వ్యవస్థలను కాల రాశారని మండిపడ్డారు. (ఫైల్ లేకుండానే నిర్ణయం?) చంద్రబాబు దిగజారి ప్రవర్తిస్తున్నారు.. స్థానిక సంస్థలను బలోపేతం చేయాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచన అని సురేష్ పేర్కొన్నారు. ఎన్నికల కమిషనర్ నిర్ణయం ప్రజాస్వామ్యానికి గొడలిపెట్టు అని ధ్వజమెత్తారు. కరోనా నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. చంద్రబాబు రోజురోజుకు దిగజారి ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. 90 రోజుల్లో ఎన్నికలు నిర్వహించాలని 2018లో కోర్టు ఆదేశిస్తే ఎందుకు నిర్వహించలేదని సురేష్ ప్రశ్నించారు. ఈసీ రమేష్‌కుమార్ తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. (ఎన్నికల నిలిపివేత ఉత్తర్వు రద్దు చేయండి) -
ఎన్నికలు వాయిదా: సుప్రీంను ఆశ్రయించిన సర్కార్
సాక్షి, న్యూఢిల్లీ : రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ తీసుకున్న ఉద్దేశపూర్వక నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశ అత్యున్నత న్యాయస్థానంలో సవాల్ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను యథావిధిగా కొనసాగించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేసింది. ఎన్నికలను వాయిదా వేస్తూ కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలని పిటిషన్లో పేర్కొంది. రమేష్ కుమార్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారని తెలిపింది. ఏపీ ప్రభుత్వం తమ పిటిషన్లో పేర్కొన్న ప్రధాన ఆంశాలు ఇలా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా కమిషనర్ ఎన్నికల వాయిదా నిర్ణయం తీసుకున్నారని, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంతో సమీక్ష సమావేశం నిర్వహించలేదని.. ఇది ఎన్నికల నిర్వహణకు సంబంధించి సుప్రీం తీర్పుకు విరుద్ధమని పేర్కొన్నారు. ఇక కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు స్థానిక ప్రజా ప్రతినిదులు అవసరం ఉంటుందని, ఎన్నికలు జరిగితే కరోనా వైరస్ కట్టడి చర్యలకు మరింత ఊతం ఇస్తుందని ప్రస్తావించారు. హైకోర్టు ఆదేశం మేరకు జరుగుతున్న ఎన్నికలను కనీసం వారిని సంప్రదించకుండా ఆపడం తగదని, దాంతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఉత్తర్వులు నిలిపివేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. (హైకోర్టులో దాఖలైన లంచ్‌మోషన్ పిటిషన్) మరోవైపు ఎన్నికలను షెడ్యూల్ ప్రకారమే నిర్వహించాలని కోరుతూ ఏపీ హైకోర్టులో దాఖలైన లంచ్‌మోషన్ పిటిషన్ హైకోర్టు విచారణకు స్వీకరించింది. కాగా ఎన్నికల ప్రక్రియ ఈనెల 31లోగా ముగించకపోతే.. స్థానిక సంస్థలకు కేంద్రం నుంచి రావాల్సిన 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.5 వేల కోట్లకు పైగా రాకుండా ఆగిపోయే ప్రమాదం ఉందని రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిర్ణయం వల్ల రాష్ట్రానికి నష్టం తప్పదని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన నిర్ణయంపై న్యాయపోరాటానికి దిగింది. (ఎన్నికల కమిషనర్‌కు సీఎస్ లేఖ) -
ఎన్నికల కమిషన్ చర్య విడ్దూరమైంది
-
గవర్నర్‌కు వివరణ ఇచ్చుకున్న ఈసీ
-
ఎన్నికల వాయిదాపై వివరణ కోరిన గవర్నర్
సాక్షి, అమరావతి : స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను రాష్ట్ర గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్ రాజ్ భవన్‌కు పిలిపించుకుని వివరణ కోరారు. గవర్నర్ పిలుపుమేరకు రాజ్ భవన్‌కు చేరుకున్న ఈసీ ఎన్నికల వాయిదాపై వివరణ ఇచ్చారు. సుమారు గంటకుపైగా సాగిన వీరిభేటీలో.. ఎన్నికల వాయిదాపై సుదీర్ఘంగా చర్చించారు. ఎన్నికలను ఏకపక్షంగా వాయిదా వేయడంపై రమేష్ కుమార్ నుంచి గవర్నర్ వివరణ కోరినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం సరైనది కాదని ఈసీకి తెలిపినట్లు సమాచారం. అయితే గవర్నర్‌తో భేటీ వివరాలను మీడియాకు వెల్లడించడానికి ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ నిరాకరించారు. సమావేశానికి సంబంధించిన వివరాలను ప్రెస్‌నోట్ ద్వారా విడుదల చేస్తానని తెలిపారు. గవర్నర్‌తో భేటీ అనంతరం రమేష్ కుమార్ ఎన్నికల సంఘం కార్యదర్శి, ఐజీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. -
ఎన్నికల కమిషనర్‌కు సీఎస్ లేఖ
-
‘ఈసీకి అంతుపట్టని వైరస్ సోకింది’
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు అంతుపట్టని వైరస్ సోకిందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విమర్శించారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ..ఎన్నికలను వాయిదా వేయించడం ద్వారా కేంద్రం నుంచి వచ్చే నిధులను అడ్డుకోవాలన్నదే ప్రతిపక్షాల కుట్ర అని మండిపడ్డారు. కరోనా వైరస్‌ను ఎదుర్కోనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేయాలని రమేష్‌కుమార్ ఎలా నిర్థారణకు వచ్చారని సురేష్ ప్రశ్నించారు.స్థానిక ఎన్నికలను అడ్డుకోవడానికి చంద్రబాబుతో పాటు ఎవరెవరు చేతులు కలిపారో ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేయటంతో చంద్రబాబు దిట్ట అని దుయ్యబట్టారు. అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోవడం వల్ల పేదలు ఇబ్బందులు పడతారని తెలిపారు. (ఎన్నికల కమిషనర్‌కు సీఎస్ లేఖ) పెద్ద కుట్రే జరిగింది.. తూర్పుగోదావరి: ఎన్నికలను నిలుపుదల చేయించి..రాష్ట్రానికి నిధులు రాకుండా చేయడానికి పెద్ద కుట్రే జరిగిందని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్పర్సన్ పెదపాటి అమ్మాజీ మండిపడ్డారు. చంద్రబాబు కుల రాజకీయాన్ని ఇంకా ప్రోత్సహిస్తూనే ఉన్నారని ఆమె విమర్శించారు. ఎన్నికల్లో మరోసారి చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. (ఎన్నికలకు ఎల్లో వైరస్) -
ఎన్నికల వాయిదా విరమించుకోండి: సీఎస్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలను యథాతథంగా కొనసాగించాలని కోరతూ రాష్ట్ర ప్రధాన కార్యదర్మి నీలం సాహ్ని ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. కరోనా వైరస్ సాకుతో ఎన్నికలు ఆరు వారాల పాటు వాయిదా వేయాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సీఎస్ కోరారు. రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు సర్వసన్నద్ధంగా ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బంది శిక్షణ, బ్యాలెట్ బాక్సుల సేకరణ, ఓటర్ల జాబితా ముద్రణతో పాటు మిగతా కార్యక్రమాలు సైతం పూర్తి అయ్యాయని వివరించారు. ప్రజారోగ్యం బాధ్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధిందని, కరోనా వ్యాప్తి కట్టడికి ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలను చేపట్టిందని లేఖ ద్వారా ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. (ఎన్నికల వాయిదాపై సుప్రీంకోర్టుకు) స్థానిక ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేస్తూ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదివారం అనూహ్య నిర్ణయం తీసుకున్న విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో సీఎస్ లేఖస్తూ. ‘ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపివుంటే కరోనాపై వాస్తవ నివేదికను అందించేవాళ్ళం. వైద్య శాఖ స్పెషల్ సీఎస్ ఇచ్చిన నివేదికను కూడా పంపించేందుకు సిద్ధం చేశాం. విదేశాల నుంచి వచ్చిన ప్రతి ప్రయాణికుడికి స్క్రీంనింగ్ చేసి, ఇంటింటికి వెళ్లి వైద్యసేవలు అందించే ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది. ఇలాంటి తరుణంలో స్థానిక సంస్థల పాలకవర్గాలు కీలక పాత్ర పోషిస్తాయి. కరోనా నియంత్రణ చర్యలకు స్థానిక సంస్థలు చాలా ఉపయోగపడతాయి. మరో 3, 4 వారాల్లో కరోనా రాష్ట్రంలో వ్యాప్తి చెందకుండా ముందస్తుగా అవసరమైన చర్యలు తీసుకున్నాం. ఎన్నికల సంఘం తీసుకున్న ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. ముందుగా ప్రకటించిన తేదీ ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలి’ అని కోరారు. (ఎన్నికలు జరిపేలా ఆదేశించండి). గవర్నర్‌తో ఈసీ భేటీ.. ఎన్నికలను వాయిదా నిర్ణయంపై ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తున్న తరుణంలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌తో భేటీ కానున్నారు. సోమవారం ఉదయం పదిగంటల తరువాత వారి భేటీ జరిగే అవకాశం ఉంది. కాగా ఎన్నికలను షెడ్యూల్ ప్రకారమే నిర్వహించే విధంగా ఈసీకి ఆదేశాలు ఇవ్వాలంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇదివరకే గవర్నర్‌ను కోరిన విషయం తెలిసిందే. దీంతో వీరి భేటీపై ప్రాధాన్యత సంతరించుకుంది. -
‘కుట్రలకు చంద్రబాబు మారుపేరు’
సాక్షి,అనంతపురం: కుట్రలకు మారుపేరు చంద్రబాబు అని.. స్థానిక ఎన్నికలను ఆయనే వాయిదా వేయించారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ ప్రభంజనం చూసి చంద్రబాబు భయపడ్డారని తెలిపారు. ‘‘రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్‌కుమార్ చౌదరి చంద్రబాబు మనిషి. కావాలనే ఇంటిపట్టాల పంపిణీ ఆపించి వేశారు. ఏపీలో సంక్షేమ పథకాలు ప్రజలకు అందకుండా చంద్రబాబు సైంధవుడిలా అడ్డుకున్నారని’’ నిప్పులు చెరిగారు. చంద్రబాబు కనుసన్నల్లో పనిచేసే సీపీఐ నేతలు ముఖానికి మాస్క్‌లు కట్టుకుని నిన్ననే ప్రెస్ మీట్ పెట్టారన్నారు. కరోనా వైరస్‌పై ఎల్లో మీడియాతో ప్రముఖంగా వార్తలు రాయించారని విమర్శించారు. వ్యూహాత్మకంగానే స్థానిక ఎన్నికలను చంద్రబాబు వాయిదా వేయించారని ఆయన మండిపడ్డారు. (కరోనాకు, ఎన్నికల వాయిదాకు సంబంధమేమిటి?) దేశ ఎన్నికల చరిత్రలో చీకటి రోజు: తలారి రంగయ్య.. దేశ ఎన్నికల చరిత్రలోనే నేడు చీకటి రోజు అని..చంద్రబాబు డైరెక్షన్లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పనిచేయడం దురదృష్టకరమని ఎంపీ తలారి రంగయ్య అన్నారు. స్థానిక ఎన్నికలు జరిగితేనే ఏపీకి ఐదువేల కోట్లు వస్తాయని పేర్కొన్నారు. ఇళ్ల పట్టాల పంపిణీని ఆపే అధికారం ఎన్నికల కమిషనర్‌కు లేదన్నారు. సంక్షేమ పథకాలను ప్రజలకు అందకుండా చేయడానికి టీడీపీ కుట్రలు చేస్తోందని ధ్వజమెత్తారు. ఏపీ అభివృద్ధి చంద్రబాబుకు ఇష్టం లేదా.. వైఎస్సార్సీపీ మెజార్టీ స్థానాల్లో ఏకగ్రీవం అయితే ఎన్నికలు నిలిపేస్తారా అంటూ ఎంపీ రంగయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. (చంద్రబాబు కనుసన్నల్లో రమేష్ కుమార్.. ) -
‘ఆ ఇద్దరు వ్యవస్థను భ్రష్టు పట్టించారు’
సాక్షి, విజయవాడ: కరోనా వైరస్ కారణంగా ఎన్నికలు ఆరు వారాల పాటు వాయిదా వేస్తున్నామని ఎన్నికల కమిషన్ ప్రకటించడం దారుణమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఏపీలో కరోనా వైరస్ ప్రభావం అంతగా లేదన్నారు. చంద్రబాబుతో ఎన్నికల కమిషనర్ రమేష్‌కుమార్ కుమ్మక్కయ్యారని ఆరోపించారు. ‘కరోనా’పై సంబంధిత శాఖాధికారులు, సీఎస్ తో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలన్నారు. అలా కాకుండా రహస్య ఎజెండా తో ఎలా నిర్ణయం తీసుకున్నారో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే విష్ణు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతోందన్నారు. శాంతి భద్రతలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు పటిష్టమైన ఏర్పాటు చేశారన్నారు. (రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌పై సీఎం జగన్ ఆగ్రహం) ఎన్నికలు జరగకపోతే రాష్ట్రానికి రావాల్సిన ఐదువేల కోట్ల నిధులు ఆగిపోతాయని ఎమ్మెల్యే విష్ణు చెప్పారు. ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని మరింత ఆర్థికంగా ఇబ్బందులపాలు చేస్తున్నారని మండిపడ్డారు. పేదలకు ఇచ్చే ఇళ్ల పట్టాలకు అడ్డు తగలడం సరికాదన్నారు. చంద్రబాబు, రమేష్‌బాబు కలిసి వ్యవస్థనే భ్రష్టు పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పటికే గవర్నర్‌కు ఫిర్యాదు చేశారని.. స్థానిక సంస్థ ఎన్నికల వాయిదాపై ఆయన వెంటనే స్పందించాలని విష్ణు కోరారు (చంద్రబాబు కనుసన్నల్లో రమేష్ కుమార్..) -
చంద్రబాబు కుట్రలో ఎన్నికల అధికారి భాగమయ్యారు
-
పానిక్ బటన్ నొక్కాల్సిన అవసరం లేదు..
-
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌పై సీఎం జగన్ ఆగ్రహం
సాక్షి, తాడేపల్లి : కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. అయితే కరోనా సాకుతో స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం వాయిదా వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇలాంటి పరిస్థితుల్లో ప్రెస్ మీట్ పెట్టాల్సి వస్తుందని అనుకోలేదన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వ్యవస్థలను దగ్గరుండి వ్యవస్థలను నీరుగారుస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో ఆయన సామాజిక వర్గానికి చెందిన రమేష్ కుమార్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమించారని గుర్తుచేశారు. రమేష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు బాధ కలిగించాయని అన్నారు. నిష్పాక్షికంగా ఉండాల్సిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ విచక్షణ కోల్పోయారని అన్నారు. అధికారులు కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, పార్టీలకూ అతీతంగా పనిచేసినప్పుడే వారికి గౌరవం వస్తుందన్నారు. ఒకవైపు కరోనా సాకుతో ఎన్నికలు వాయిదా వేశామని చెబతూనే.. మరోవైపు అధికారులను తప్పిస్తున్నామని ప్రకటించడం ఏ విధంగా సబబని ప్రశ్నించారు. ప్రజలు ఓట్లేసి 151 సీట్లు ఇస్తేనే వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిందని గుర్తుచేశారు. ఇటీవల కాలంలో కొందరు విచక్షణాధికారం పేరుతో కొత్త పద్ధతికి తెరలేపుతున్నారని మండిపడ్డారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తే సంతోషించాల్సింది పోయి.. ఎన్నికలు ప్రక్రియ పూర్తయ్యే వరకు వాటిని ఆపేయమని శనివారం ఎన్నికల కమిషనర్ అధికారులకు ఆదేశాలు జారీచేశారని గుర్తుచేశారు. అలాంటి కమిషనర్ మరుసటి రోజే ఎన్నికల వాయిదా వేశారని.. ఆయనకు నిన్నటికి, ఈరోజుకి తేడా ఏం కనిపించిందని ప్రశ్నించారు. ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేస్తోందనే విషయమే కొందరికి దుర్వార్తగా తోచిందన్నారు. టీడీపీ దెబ్బతింటుందనే.. ఎన్నికల ప్రక్రియ నిలుపుదల చేస్తున్నట్టు 4 పేజీల ఆర్డర్ వచ్చిందన్నారు. ఇంత పెద్ద ఆర్డర్ తయారవుతున్నట్టు ఎన్నికల కమిషన్‌లో ఉన్న సెక్రటరీకే తెలియదన్నారు. ఎవరో రాస్తున్నారు.. ఎవరో ఇస్తున్నారు.. రమేష్ కుమార్ దానిని చదువుతున్నారని విమర్శించారు. కరోనా పేరు చెప్పి ఎన్నికలు వాయిదా వేసే ముందు ఎవరినైనా సంప్రదించారా అని సూటిగా ప్రశ్నించారు. కనీసం హెల్త్ సెక్రటరీ, చీప్ సెక్రటరీలను అయినా పిలిచి మాట్లాడారా అని నిలదీశారు. రమేష్‌కు చంద్రబాబు పదవి ఇచ్చి ఉండొచ్చు, వారిద్దరు ఒకే సామాజిక వర్గం కావొచ్చు.. కానీ ఇంత వివక్ష చూపడం ధర్మమేనా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 43 చోట్ల మాత్రమే చిన్నపాటి గొడవలు జరిగాయని తెలిపారు. గతంలో ఇలాంటి ఘటనలు జరగకుండా ఎన్నికలు జరిగాయా అని ప్రశ్నించారు. అత్యంత నిబద్ధతతో పోలీసులు పనిచేస్తున్నారని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. పోలీసులు ఎక్కడ ప్రేక్షక పాత్ర పోషించలేదని తెలిపారు. రమేష్ కుమార్ ఒక రాక్షస క్రీడకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. 2013లో జరిగిన స్థానిక సంస్థల్లో టీడీపీ సత్తా చాటిందని ఈనాడు పత్రికలో రాశారని గుర్తుచేశారు. ఏకగ్రీవాలు అనేవి ఇప్పుడు కొత్తేమీ కాదన్నారు. 9 నెలల్లో ప్రజలు హర్షించదగ్గ పాలన ఇచ్చామని గుర్తుచేశారు. కొద్ది నెలల్లోనే మేనిఫెస్టోలో చెప్పిను 90 శాతం అంశాలను పూర్తిచేశామని తెలిపారు. ప్రజలకు మేలు జరుగుతుంటే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. మార్చి 31లోగా ఎన్నికలు జరగకపోతే 14వ ఆర్థిక సంఘం నుంచి వచ్చే దాదాపు రూ. 5వేల కోట్ల నిధులు ఆగిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ డబ్బులను ఎందుకు నష్టపోవాలని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో పరిస్థితిలో ఏమైనా మార్పు వస్తుందని చెప్పగలరా అని ప్రశ్నించారు. కరోనా బాధిత దేశాల నుంచి ఇంకా వస్తారు. కరోనాను ఎదుర్కొవడం నిరంతర ప్రక్రియ అవుతుందన్నారు. ఇలాంటప్పుడు 10 రోజుల్లో ఎన్నికలు జరిపితే సరిపోయేదన్నారు. రమేష్ కుమార్ వైఖరిపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. ఆయనలో మార్పు రాకపోతే.. పై స్థాయికి దీనిని తీసుకెళ్తామని చెప్పారు. పానిక్ బటన్ నొక్కాల్సిన అవసరం లేదు.. అంతకుముందు సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘కరోనా వైరస్‌పై కొన్ని విషయాలు అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. చైనాలో 80 వేల మందికి కరోనా వైరస్ సోకిందని గుర్తుచేశారు. కరోనా వల్ల మనుషులు చనిపోతారని.. ఇదొక భయానక పరిస్థితి అని పానిక్ బటన్ నొక్కాల్సిన అవసరం లేదన్నారు. 60 ఏళ్ల వయసు ఉన్నవారికి, మధుమేహం, ఇతర వ్యాధులు ఉన్నవారికి కరోనా వల్ల కొంత ప్రభావం కలిగే అవకాశం ఉందని చెప్పారు. ప్రపంచం మొత్తం మీద ఉన్న కేసుల్లో 81.9 శాతం కేసులు ఇంట్లో ఉండి చికిత్స పొందుతున్నారు. 13 శాతం కేసులు ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకున్నారు. 4.7 శాతం కేసులు మాత్రమే ఐసీయూలో చికిత్స జరిగింది. ఎవరికీ ఇబ్బందులు రాకూడదనే మా తాపత్రాయం. విదేశాల్లో పనిచేసుకునే మనవాళ్లను వెనక్కి పంపుతారు. వారికి ఎయిర్‌పోర్టులలో స్క్రీనింగ్ నిర్వహించి.. 14 రోజుల పాటు పర్యవేక్షణలో ఉంచుతాం. అవసరమైన వారందరికీ ప్రభుత్వం వైద్యం చేయిస్తుంది. కేవలం 2, 3 వారాల్లో పరిస్థితి మారిపోదు. వచ్చే ఏడాది పాటు ఇదంతా నిరంతర ప్రక్రియ. ఏపీలో 78 మందికి ఇప్పటివరకు పరీక్షలు నిర్వహించగా.. ఒక్కరికే కరోనా పాజిటివ్‌గా తేలిందన్నారు. అతను కూడా ప్రస్తుతం కోలుకుంటున్నాడు. తిరుపతి, విజయవాడలలో రెండు ల్యాబ్స్ పెట్టాం. త్వరలో కాకినాడలో మరో ల్యాబ్ పెడతాం. జిల్లా ఆస్పత్రులు, బోధన ఆస్పత్రుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. గ్రామ వాలంటీర్లతో ప్రతి ఇల్లు సర్వే చేయిస్తున్నాం. స్క్రీనింగ్ యాప్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. విశాఖలో 200 పడకల ఐసోలేషన్ వార్డు సిద్ధంగా ఉంచాం. విజయవాడలో 50 పడకల సూపర్ స్పెషాలిటీ ఐసోలేషన్ వార్డు ఉంచాం. కాకినాడ, రాజమండ్రి, కర్నూలు, గుంటూరు, విజయవాడ, విశాఖలో ఐసోలేషన్ రూమ్స్ ఏర్పాటు చేశాం. ఏ ఒక్కరికి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. నెల్లూరులో ఒక్క పాజిటివ్ కేసు రాగానే తక్షణం స్పందించాం. 40 టీమ్‌లతో 20 వేల ఇళ్లలో ప్రతి ఒక్కరికీ పరీక్షలు నిర్వహించామ’ని తెలిపారు. -
ఇళ్ల పట్టాల పంపిణీ నిలుపుదల
సాక్షి, అమరావతి: పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు నిలుపుదల చేయాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్.రమేశ్‌కుమార్ శనివారం కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఉగాది రోజు రాష్ట్ర వ్యాప్తంగా 26 లక్షలకు పైగా పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీకి ప్రభుత్వం సమాయత్తమైన విషయం తెలిసిందే. దీనికోసం అధికారయంత్రాంగం చకచకా ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తనా నియావళి (కోడ్) ఈనెల 7న అమలులోకి వచ్చిన నేపథ్యంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని నిలుపుదల చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఎన్నికల ప్రక్రియలోనే అధికారులు.. - ఇళ్ల స్థలాల పంపిణీ ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉందని, కోడ్ నియావళి ప్రకారం ఈ కార్యక్రమాన్ని అనుమతించలేమని తమ ఆదేశాల్లో ఎన్నికల కమిషనర్ పేర్కొన్నారు. - ఈ విషయంపై హైకోర్టులోనూ కేసులు దాఖలు అయ్యాయని, ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. - తమ పరిధిలో ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించి అన్ని చర్యలు నిలుపుదల చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. - ఎన్నికలు పూర్తయ్యే వరకు అధికారులందరినీ ఆ ఎన్నికల ప్రక్రియలో భాగస్వామ్యం చేస్తున్నామన్నారు. - జిల్లా కలెక్టర్లు, ఇతర జిల్లా స్థాయి ఎన్నికల అధికారులు, పరిశీలకులు తమ ఆదేశాలు తప్పనిసరిగా పాటించాలని రమేశ్‌కుమార్ పేర్కొన్నారు. -
'బాబుకు ధైర్యం లేకనే ఇలాంటి అసత్య ఆరోపణలు'
సాక్షి, అమరావతి : పల్నాడులో టీడీపీ నేతల దురుసు ప్రవర్తనపై వైసీపీ నేతలు గురువారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్‌కుమార్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో పాటు నిఘా యాప్‌పై టీడీపీ చేస్తున్న అసత్య ఆరోపణలను కూడా కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి ఎమ్‌విఎస్ నాగిరెడ్డి మాట్లాడుతూ.. నిఘా యాప్‌పై చంద్రబాబు మాట్లాడిన తీరుపై ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు. విజయవాడ కు చెందిన టీడీపీ నేతలు దురుసుగా డ్రైవింగ్ చేయడం వల్ల ఘర్షణ మొదలైందన్నారు. పల్నాడులో 144 సెక్షన్ అమలులో ఉన్నా టీడీపీ నేతల్ని పంపించడం వెనుక చంద్రబాబు కుట్ర దాగి ఉందని విమర్శించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగనివ్వకుండా చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు స్థానిక సంస్థలు ఎన్నికలకు వెళ్లే ధైర్యం లేకనే ఇలాంటి అసత్య ఆరోపణలు దిగతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరిగేందుకు ప్రభుత్వం నిఘా యాప్‌ను రిలీజ్ చేశారని తెలిపారు. కాగా ఎన్నికల కోడ్ రాకముందే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దీనిని ప్రారంభించారన్నారు. సాధారణంగా ఎన్నికల్లో సజావుగా జరిగేందుకు నిఘా పెంచాలని ప్రతిపక్షాలు కోరడం చూస్తాం.. కానీ రాష్ట్రంలో మాత్రం ప్రభుత్వమే నిఘా యాప్‌ను తీసుకురావడం గొప్ప విషయమన్నారు. ఈసీని కలిసిన వారిలో వైసీపీ అధికార ప్రతినిధి నారాయణ మూర్తి,ఇతర నేతలు పాల్గొన్నారు -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
సాక్షి, అమరావతి: ఒకట్రెండు చెదురుమదురు సంఘటనలు మినహా రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సజావుగా ముగిసిందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్.రమేష్‌కుమార్ చెప్పారు. మార్చి 9వ తేదీన మొదలైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ బుధవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. మొత్తం మూడు రోజుల నామినేషనల కార్యక్రమంలో బుధవారం ఒక్కరోజే మంచి రోజు కావడంతో ఎక్కువ మంది సాయంత్రం మూడు గంటల తర్వాతే నామినేషన్ల దాఖలుకు ఆసక్తి చూపారు. రాత్రి 12 గంటలకు అందిన సమాచారం ప్రకారం 652 జెడ్పీటీసీ స్థానాలకు గాను 4,012.. 9,696 ఎంపీటీసీ స్థానాలకు గాను 33,600 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల ప్రక్రియలో అక్రమాలు జరిగాయంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సహా ఇతర పార్టీల నేతలు చేసిన విమర్శలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్.రమేష్‌కుమార్ స్పందించారు. ఆయన ఏం చెప్పారంటే.. - విమర్శలు చేయడం సరైంది కాదు. ఒకట్రెండు చోట్ల ఘటనలు జరిగాయి. చిత్తూరు జిల్లాలో బీజేపీ అభ్యర్థి నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారని తెలిసి కలెక్టర్ తనంతట తాను చర్యలు చేపట్టారు. దీనిపై నివేదిక తెప్పించుకున్నాం. ఒక ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. ఆ కేసులో సయ్యద్ బాషా, ఇమ్రాన్ బాషా అనే ఇద్దరిని అరెస్టు చేశారు. - డీజీతో బుధవారం మాట్లాడాను. గుంటూరు జిల్లాలో జరిగిన కొన్ని ఘటనలను వారి దృష్టికి తీసుకొచ్చా. ప్రత్యేకంగా సూచన చేశాను. - ఎవరైనా నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటే తీవ్రంగా పరిగణించాలి. తప్పనిసరిగా చర్య తీసుకోవాలి. ఎవరినీ వదిలే ప్రసక్తే లేదు. - పరిశీలకులకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. ఎన్నికలు పూర్తయ్యే వరకు జిల్లాలోనే అందుబాటులో ఉంటారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలేదు రాష్ట్రంలో ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలేదు. హైకోర్టు తీర్పు దరిమిలా, కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలు ప్రకారం చూసినా.. ప్రజలకు వ్యక్తిగతంగా లబ్ధి చేకూర్చే ఏ పథకమైనా ఎన్నికల సమయంలో అమలు సాధ్యం కాదు. ఏకగ్రీవం దిశగా.. సాక్షి నెట్వర్క్: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రభంజనం స్పష్టం అవుతోంది. నామినేషన్ల ఘట్టం బుధవారం ముగియడంతో పలు చోట్ల ఆ పార్టీ అభ్యర్థుల ఎన్నిక లాంఛనమైంది. కొన్ని మండలాల్లో క్లీన్‌స్వీప్ దిశగా సాగుతోంది. చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు దాదాపు అన్ని జిల్లాల్లో పెద్ద సంఖ్యలో ఆ పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికకానున్నారు. సదుం మండలం వైఎస్సార్సీపీదే... చిత్తూరు జిల్లా సదుం మండలంలోని జెడ్పీటీసీ, పది ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపు లాంఛనమే కానుంది. వైఎస్సార్సీపీ అభ్యర్థులు తప్ప ఇతర పార్టీల వారెవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. జెడ్పీటీసీ స్థానానికి కూడా వైఎస్సార్సీపీ తరఫున సోమశేఖర్‌రెడ్డి నామినేషన్ ఒక్కటే దాఖలైంది. అలాగే జిల్లాలోని యాదమరి జెడ్పీటీసీ సభ్యుడిగా బి.ధనంజయరెడ్డి ఏకగ్రీవంకానున్నారు. పెళ్లకూరు క్లీన్ స్వీప్ నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం వైఎస్సార్సీపీ కైవసం చేసుకున్నట్లే. మండలంలోని మొత్తం 10 ఎంపీటీసీ స్థానాలకు వైఎస్సార్సీపీకి చెందిన 15 మంది, జెడ్పీటీసీకి ఆ పార్టీ తరఫున ప్రిస్కిల్లా మాత్రమే నామినేషన్లు వేశారు. వైఎస్సార్ జిల్లాలో ప్రభంజనం వైఎస్సార్ జిల్లాలో 61 ఎంపీటీసీ స్థానాల్లో సింగిల్ నామినేషన్లు దాఖలయ్యాయి. ఇవన్నీ వైఎస్సార్సీపీ అభ్యర్థులవే కావడం విశేషం. అందులోనూ పులివెందుల నియోజకవర్గంలోనే 30 స్థానాలు ఏకగ్రీవం కానున్నాయి. ఇక వేముల మండలంలో మొత్తం ఎంపీటీసీలు ఆ పార్టీ పరం అయినట్లే. శ్రీకాకుళం జిల్లాలోనూ అదే జోరు.. జిల్లాలో పలు ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం కానున్నాయి. నువ్వలరేవు ఎంపీటీసీ–1, ఎంపీటీసీ–2 స్థానాలకు వైఎస్సార్సీపీ అభ్యర్థులే నామినేషన్లు వేశారు. ఎచ్చెర్ల మండలం ఫరీదుపేట, రేగిడి మండలంలోని ఖండ్యాం, కొమెర, కందిశ స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు వేశారు. విశాఖపట్నం జిల్లాలో 3 ఎంపీటీసీ స్థానాలు.. విశాఖ జిల్లా కోటవురట్ల రాజుపేట, రాజుకోడూరు, గబుడుపుట్టు స్థానాల్లో నామినేషన్లు వేసిన వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవం అయినట్లే. కాగా పశ్చిమగోదావరి జిల్లాలో ఐదు ఎంపీటీసీ స్థానాలను వైఎస్సార్సీపీ ఏకగ్రీవంగా కైవసం చేసుకోనుంది. -
'నామినేషన్లను అడ్డుకుంటే చర్యలు తప్పవు'
సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను నామినేషన్లు వెయ్యకుండా అడ్డుకునే చర్యలను ఎన్నికల కమిషన్ తీవ్రంగా పరిగణిస్తుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్. రమేష్ కుమార్ హెచ్చరించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలను స్వేచ్ఛగా, పూర్తి పారదర్శకంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పోటీ చేసే అభ్యర్తులకు ఉద్దేశపూర్వకంగా అడ్డంకులు సృష్టించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారన్న సమాచారంతో చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమోటోగా సంబంధించిన వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చెయ్యడం జరిగిందన్నారు. ఎన్నికల విధుల్లో ఆటంకాలు కలుగచేసినా, ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా ప్రవర్తించినా ఎన్నికల కమిషన్ చూస్తూ ఊరుకోదన్నారు. రాష్ట్రంలో సమర్థవంతమైన యంత్రాంగం ఉందన్నారు. ఇప్పటిదాకా.. ఎక్కడా కూడా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్లు ఎటువంటి ఫిర్యాదులు అందలేదన్నారు. చట్టవ్యతిరేకమైన కార్యక్రమాల్లో పాల్గొని ఎన్నికల సమయంలో ఇబ్బందులకు కలుగాచెయ్యడాన్ని కూడా తీవ్రంగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందన్నారు. -
ప్రభుత్వ ఖర్చుతో ప్రకటనలు,హోర్డింగులు 'నిషేధం'
సాక్షి, అమరావతి: ‘స్థానిక’ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న దృష్ట్యా ప్రభుత్వ ఖర్చుతో ప్రకటనల జారీ, బహిరంగ ప్రదేశాలలో హోర్డింగ్‌ల ఏర్పాటుపై నిషేధం ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్. రమేష్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నాయకుల విగ్రహాలకు ముసుగు వెయ్యాల్సిందేనని స్పష్టంచేశారు. మార్చి 7వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన ఈ కోడ్.. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఉంటుందన్నారు. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ప్రవర్తనా నియమావళిని నిష్పాక్షికంగా అమలు చేస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రకటనలో ఎన్నికల కమిషనర్ తెలిపిన మరికొన్ని అంశాలు.. - ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లో మంత్రుల ఫొటోలతో పాటు వివిధ ప్రభుత్వ విభాగాల అధికారిక వెబ్సైట్ల నుంచి రాజకీయ నాయకులందరి ఫొటోలను వెంటనే తొలగిస్తాం. - ప్రధాని, ముఖ్యమంత్రి, మంత్రులు తదితర పార్టీల నాయకుల ఫొటోలను ప్రభుత్వ భవనాలు, వాటి ప్రాంగణాల్లో ప్రదర్శించడంపైనా నిషేధం. - ఈ నిబంధన జాతీయ నాయకులు, కవులు, గతంలోని ప్రముఖ చారిత్రక వ్యక్తుల ఫొటోలకు, రాష్ట్రపతి, గవర్నర్ల చిత్రాలకు వర్తించదు. - విద్యుత్ బిల్లులు, నీటి బిల్లులపైనా ఫొటోలు, ప్రకటనలు ఉండకూడదు. - ఈ సూచనలు ఇప్పటివరకు అమలు చేయనట్లయితే వెంటనే అమలు చేయాలి. - ఎన్నికల నియమావళి అమలులో నిర్లక్ష్యంగా, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే తీవ్రంగా పరిగణిస్తాం. - అభ్యర్థులను నామినేషన్ దాఖలు చెయ్యకుండా అడ్డుకునే చర్యలను కమిషన్ తీవ్రంగా పరిగణిస్తుంది. - స్థానిక ఎన్నికలను స్వేచ్ఛగా, పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తాం. - పోటీచేసే అభ్యర్థులకు ఉద్దేశపూర్వకంగా అడ్డంకులు సృష్టిస్తున్నారన్న సమాచారంతో బాధ్యులపై చిత్తూరు జిల్లా కలెక్టర్ ఫిర్యాదుతో కేసు నమోదైంది. -
'ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిస్తే సహించం'
సాక్షి, విజయవాడ : విజయవాడలోని ఈసీ కార్యాలయంలో 13 జిల్లాల ఎన్నికల వ్యయ పరిశీలకులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిరోజు క్షేత్రస్థాయిలో ఎన్ని కేసులు నమోదయ్యాయే వాటి వివరాలు తెలియజేయాలన్నారు. అనుమతి లేని ర్యాలీలు, బైక్ ర్యాలీలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.ఎన్నికల పరిశీలకులు తమ విధిని నిర్వర్తించడంలో నిష్పాక్షికంగా వ్యవహరించాలన్నారు.వెంటనే జిల్లాలలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై ఫిర్యాదులను పరిష్కరించడానికి పరిశీలకులు చురుకుగా వ్యవహరించాలన్నారు. ఎన్నికల నిబంధనలను కఠినంగా అమలు చేసేలా చూడాలని పేర్కొన్నారు. ఎన్నికల్లో అభ్యర్థులు చేసే ఖర్చులతో పాటు, సున్నితమైన ప్రదేశాలను గుర్తించి వాటిపై నిశితంగా దృష్టి సారించాలని వెల్లడించారు. ఎన్నికల్లో డబ్బును అరికట్టడానికి ఎన్నికల వ్యయ ఖాతాలను తరచూగా తనిఖీ చేయడానికి జిల్లా కలెక్టర్లతో కలిసి సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.వివాహం, కుటుంబ వేడుకలు, వైద్య చికిత్స, ఫీజు చెల్లింపు మొదలైన ఏవైనా వ్యక్తి గత కారణాల వల్ల నిర్దేశించిన పరిమితి రూ. 50వేల కంటే ఎక్కువ ఉండకూడదన్నారు.ఎన్నికల్లో అభ్యర్థులు చేసే ఖర్చులను గతంలో ఉన్న వ్యయ పరిధి కంటే రెండింతలు పెంచడం జరిగిందని అధికారులకు వెల్లడించారు. వ్యయ పరిశీలకులు వీలైనన్ని ఎక్కువ శిక్షణా కేంద్రాలకు హాజరు కావాలని, క్షేత్రస్థాయిలో విధుల్లో పాల్గొనే సిబ్బందికి, అధికారులకు తగిన సూచనలు చెయ్యాలన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల పరిశీలకులు సహించరనే నమ్మకం క్షేత్రస్థాయిలో తీసుకురావాలని రమేశ్ కుమార్ పేర్కొన్నారు. -
‘స్థానిక’ ఎన్నికల పరిశీలకుల నియామకం
సాక్షి, అమరావతి: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రతి జిల్లాకు ఓ సీనియర్ ఐఏఎస్ అధికారిని పరిశీలకునిగా నియమించింది. ఇలా 13 జిల్లాలకు 13 మంది, అదనంగా మరో నలుగురిని నియమించింది. జిల్లాల్లో ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇవ్వడం.. ఎన్నికల కోడ్ అమలు పర్యవేక్షణ వీరి ప్రధాన విధి అని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్. రమేష్‌కుమార్ తెలిపారు. కోడ్ ఉల్లంఘన ఫిర్యాదులపై నిర్ణయాలు తీసుకునేందుకు పరిశీలకులకు పూర్తి అధికారాలు కల్పించినట్లు ఆయన చెప్పారు. 13 జిల్లాల పరిశీలకులతో సోమవారం ఆయన రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఎవరికి కేటాయించిన జిల్లాకు వారు వెంటనే వెళ్లి విధుల్లో చేరాలని ఆదేశించారు. ఎన్నికల సిబ్బందికి జరుగుతున్న శిక్షణ కార్యక్రమాల వివరాలు, కోడ్ ఉల్లంఘనలపై ఫిర్యాదులు, తీసుకున్న చర్యలపై నివేదికను ప్రతిరోజూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు పంపాలని సూచించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. - ఎన్నికల పరిశీలకులందరూ ప్రజలకు అందుబాటులో ఉండాలి. వారి ఫోన్ నంబర్, చిరునామా మీడియా ద్వారా తెలియజే యాలి. ఎటువంటి ఆరోపణలకు తావు లేకుండా నిర్భయంగా విధులను నిర్వర్తించాలి. - అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సమయంలో మాదిరిగానే కోడ్ అమలుకు పటిష్ట చర్యలు చేపట్టాలి. - ఓటర్లను ప్రభావితం చేసే వ్యక్తిగత పథకాలు కోడ్ అమలులో ఉన్న సమయంలో నిలిచిపోతాయి. - ఎన్నికల్లో వలంటీర్ల సేవలు వినియోగించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. - బ్యాలెట్ పేపర్ల విషయంలోనూ ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. సమావేశంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయ కార్యదర్శి ఎస్.రామసుందర రెడ్డి, జాయింట్ సెక్రటరీ ఏవీ సత్య రమేష్ పాల్గొన్నారు. -
ఏపీలో మోగిన పుర భేరీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 12 నగర పాలక సంస్థలతోపాటు 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలో 15 నగర పాలక సంస్థలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా మూడు చోట్ల కోర్టు కేసులతో వాయిదా పడ్డాయి. కాకినాడ స్థానానికి 2017లోనే ఎన్నిక జరిగినందున ఇప్పుడు నిర్వహించడం లేదు. ఇక 104 మున్సిపల్, నగర పంచాయతీలకుగానూ 75 చోట్ల ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు కేసులు, కొన్ని గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలో విలీనం కావడం తదితర కారణాలతో 29 చోట్ల ఎన్నికలు వాయిదా వేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్‌కుమార్ మీడియాకు తెలిపారు. పామిడి నగర పంచాయతీ డౌన్‌గ్రేడ్‌కు ప్రభుత్వం యోచిస్తున్న నేపథ్యంలో ఎన్నిక జరపడం లేదన్నారు. వాయిదా వేసిన చోట ఎన్నికలు త్వరలోనే నిర్వహిస్తామన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రభావం మున్సిపల్ ఎన్నికలపై ఏమాత్రం ఉండదన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌ను మున్సిపల్ ఎన్నికల పోలింగ్ తర్వాతే చేపడతామన్నారు. పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా జరిగేవి కావడంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల ఫలితాల ప్రభావం వాటిపై ఉండదని పేర్కొన్నారు. - సాంకేతిక కారణాలతో ఎన్నికలు వాయిదా పడ్డ చోట కొద్ది వారాల వ్యవధిలోనే నిర్వహిస్తాం. - రాజధాని గ్రామాలను అమరావతి మున్సిపల్ కార్పొరేషన్‌గా చేయాలని ప్రతిపాదన ఉంది. అక్కడ ఎన్నికలు నిర్వహించేందుకు కొద్ది వారాలకు మించి సమయం పట్టదు. ఎన్నికల డిపాజిట్ నిబంధనలివీ - మున్సిపల్ కార్పొరేషన్లలో కార్పొరేటర్‌గా పోటీ చేసే అభ్యర్థులు ఎస్సీ, ఎస్టీ, బీసీలైతే రూ. 2,500, ఇతరులు రూ.5,000 చొప్పున డిపాజిట్ చెల్లించాలి. - మున్సిపాలిటీ, నగర పంచాయతీల్లో కౌన్సిలరుగా పోటీ చేసే అభ్యర్థులు ఎస్సీ, ఎస్టీ, బీసీలైతే రూ.1,500, ఇతరులు రూ.3,000 చొప్పున డిపాజిట్ చెల్లించాలి. - మున్సిపల్ కార్పొరేషన్లో కార్పొరేటర్‌గా పోటీ చేసే వారి గరిష్ట ఎన్నికల వ్యయ పరిమితి రూ.2 లక్షలు. మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లకు రూ.1.50 లక్షలు, నగర పంచాయతీల్లో కౌన్సిలర్లకు రూ.లక్ష ఎన్నికల గరిష్ట వ్యయ పరిమితిగా నిర్థారించారు. -
ముగ్గురు పిల్లలున్నా పోటీకి అర్హులే!
సాక్షి, అమరావతి: ముగ్గురు పిల్లలు ఉన్నా స్థానిక ఎన్నికల్లో పోటీకి అర్హులేనని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్‌కుమార్ స్పష్టం చేశారు. అయితే.. 1994, మే 30కి ముందు మాత్రమే ముగ్గురు పిల్లలు పుట్టి ఉండాలన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి సోమవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. 11వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఎంపీటీసీ పదవులకు ఆయా మండల పరిషత్ కార్యాలయాల్లో, జెడ్పీటీసీ పదవులకు జెడ్పీ సీఈవో కార్యాలయాల్లో నామినేషన్లు సమర్పించాలి. ఈ నేపథ్యంలో పోటీకి ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు అనే అంశాల్లో ఎన్నికల కమిషన్ స్పష్టతనిచ్చింది. దీని ప్రకారం.. - ఎంపీటీసీ, జెడ్పీటీసీగా పోటీ చేసేవారికి నామినేషన్ల పరిశీలన జరిగే తేదీ నాటికి కనీసం 21 ఏళ్లకు తక్కువ కాకుండా ఉండాలి. ఎంపీటీసీగా పోటీ చేసేవారు ఆ మండల పరిధిలోని ఏదో ఒక ఎంపీటీసీ పరిధిలో.. జెడ్పీటీసీగా పోటీ చేసే వారికి ఆ జిల్లా పరిధిలోని ఏదో ఒక జెడ్పీటీసీ పరిధిలో ఓటు ఉండాలి. పోటీ చేసే అభ్యర్థిని ప్రతిపాదించే వారు కూడా అభ్యర్థి పోటీ చేసే ఎంపీటీసీ, జెడ్పీటీసీ పరిధిలో ఓటరై ఉండాలి. - 1994, మే 30కి ముందు ముగ్గురు పిల్లలు ఉన్నవారు ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులే. ఆ తేదీ నాటికి ముగ్గురు పిల్లలు ఉండి, 1995, మే తర్వాత మరొక సంతానం ఉంటే పోటీకి అనర్హులవుతారు. - 1995, మే 29 తర్వాత ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మందికి జన్మనిచ్చిన తల్లిదండ్రులు పోటీకి అనర్హులు. అయితే, మొదట ఒకరు పుట్టి, రెండో సంతానంగా కవలలు పుడితే మాత్రం వారు పోటీకి అర్హులవుతారు. - 1995, మే 29 తర్వాత ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు పుట్టి, మొత్తం సంతానం ముగ్గురు దాటని వారు కూడా పోటీకి అర్హులే. - ముగ్గురు పిల్లలు కలిగి ఉండి, ఒకరిని ఇతరులకు దత్తత ఇస్తే అనర్హులే అవుతారు. - ఇప్పటికే ఇద్దరు పిల్లలు కలిగి ఉండి నామినేషన్ల పరిశీలన తేదీ నాటికి గర్భవతిగా ఉన్నా అలాంటి వారు కూడా పోటీకి అర్హులే. - రేషన్ షాపు డీలరుగా పనిచేసే వారు పోటీకి అర్హులే. అంగన్వాడీ కార్యకర్తలు పోటీకి అనర్హులు. - దేవదాయ శాఖ పరిధిలో ఆలయాల ట్రస్టు బోర్డు చైర్మన్ లేదంటే సభ్యులుగా ఉన్న వారు పోటీకి అనర్హులు. - ఎంపీటీసీ, జెడ్పీటీసీలుగా పోటీచేసేవారు ఆ పరిధిలో ఓటు కలిగి ఉండి, ఏదైనా పట్టణ ప్రాంతంలో మరొక ఓటు కలిగి ఉన్నా అర్హులే. ఇలాంటి వారిని అనర్హులుగా పేర్కొనడానికి చట్టంలో ప్రత్యేకంగా ఏ నిబంధన లేని కారణంగా వారిని అర్హులగానే పరిగణిస్తారు. -
ఆ 19 పార్టీలకే పార్టీ గుర్తులు
సాక్షి, అమరావతి: స్థానిక ఎన్నికల్లో వివిధ పార్టీల తరుఫున పోటీ చేసే వారికి గుర్తుల కేటాయింపుపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. 19 రాజకీయ పార్టీల తరఫున పోటీ చేసే వారికి ఆయా రాజకీయ పార్టీల గుర్తులు కేటాయించనున్నట్టు ఎన్నికల కమిషనర్ ఎన్.రమేష్‌కుమార్ గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొన్నారు. - గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో జాతీయస్థాయిలో బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, సీపీఐ, సీపీఎం, ఎన్సీపీలతో పాటు రాష్ట్ర స్థాయిలో వైఎస్సార్సీపీ, తెలుగుదేశం, ఇతర రాష్ట్రాలకు చెందిన టీఆర్ఎస్, అన్నాడీఎంకే, ఫార్వర్డ్‌బ్లాక్, ఎంఐఎం, ఐయూఎంఎల్, జనతాదళ్–ఎస్, జనతాదళ్–యూ, సమాజ్‌వాదీ పార్టీ (మర్రిచెట్టు గుర్తు), ఆర్ఎల్డీ, రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ ఉన్నాయి. వీటి తరఫున పోటీ చేసే వారికి ఆయా పార్టీల గుర్తులు కేటాయిస్తారు. - రిజస్టర్డ్ పార్టీలలో జనసేన పార్టీకి ప్రత్యేకంగా గుర్తును రిజర్వు చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ వద్ద మరో 89 రాజకీయ పార్టీలు రిజిస్టర్ చేసుకున్నా వాటికి గుర్తులు కేటాయించలేదు. - స్వతంత్ర అభ్యర్ధులుగా, గుర్తు కేటాయించని రిజిస్టర్ పార్టీల తరుఫున పోటీ చేసే వారి కోసం 60 గుర్తులను గెజిట్ నోటిఫికేషన్లో ప్రత్యేకంగా ఉదహరించారు. - ఈసారి స్థానిక ఎన్నికల బ్యాలెట్ పేపరులో ‘నోటా’ కూడా ఉంటుంది. -
తక్షణమే అమలులోకి ఎన్నికల కోడ్
సాక్షి, అమరావతి : స్థానిక ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రమంతటా తక్షణమే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్. రమేష్‌కుమార్ తెలిపారు. మంత్రులు, పదవుల్లో ఉన్న ఇతర ప్రముఖులు ఎన్నికల నియమావళిని విధిగా పాటించాలన్నారు. కోడ్ కారణంగా వారు ప్రభుత్వ సదుపాయాలు, వసతులను వినియోగించుకునే వీల్లేదన్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల సందర్భంగా శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలు జరిగే ప్రతీసారి కోడ్ అమలు సాధారణ ప్రక్రియేనని.. కేంద్ర ఎన్నికల సంఘం ఏ మార్గదర్శకాలను పాటిస్తుందో తామూ వాటినే పాటిస్తున్నామన్నారు. ఓటర్లను ప్రభావితం చేసే ప్రభుత్వ పథకాలు నిలిచిపోతాయన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై నిషేధం అమలులోకి వచ్చిందని.. కోడ్ ముగిసేవరకు కొత్త బదిలీలు జరగవని ఆయన చెప్పారు. ఇదివరకే బదిలీలు జరిగి, శనివారం 11 గంటల వరకు అమలులోకి రాకపోతే ఆ బదిలీలు నిలిచిపోతాయని రమేష్‌కుమార్ చెప్పారు. సమావేశంలో ఆయన ఇంకా ఏమన్నారంటే.. - ఎన్నికల నిర్వహణకు సంబంధించి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు పూర్తి అధికారాలు సంక్రమించాయి. అధికార యంత్రాంగం కలెక్టర్లకు పూర్తిస్థాయిలో తోడ్పాటునందించాలి. - ఎన్నికల కోసం 15 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులను సాధారణ పరిశీలకులుగా నియమిస్తున్నాం. సోమవారం వారితో సమావేశం నిర్వహించిన అనంతరం వారు జిల్లాలకు వెళ్లి జిల్లా అధికారులు, రాష్ట్రస్థాయి అధికారులకు వారధిగా పనిచేస్తారు. మరో 15 మంది అధికారులను వ్యయ పరిశీలకులుగా నియమిస్తాం. - స్వేచ్ఛగా ఎన్నికల నిర్వహణకు రాజకీయ పార్టీలు సహకరించాలి. ప్రజలందరూ ఈ ఎన్నికల్లో భాగస్వాములు కావాలి. - కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలలో ఇప్పుడు ఎన్నికలు జరపడం సాధ్యంకాదు. అలాంటివి 140 దాకా ఉండొచ్చు. - రాజధాని ప్రాంతంలోని గ్రామాలను కొత్తగా అర్బన్ పరిధిలోకి తీసుకొచ్చారు. సాంకేతికంగా అక్కడా ఎన్నికల నిర్వహణకు ఇబ్బందులున్నాయి. - కొన్ని ప్రభుత్వ భవనాలపై అభ్యంతరకర రంగులున్న అంశం ఓటర్లను పెద్దగా ప్రభావితం చేయదని నా భావన. ఇకపై అలాంటివి జరగకుండా చర్యలు తీసుకుంటాం. - ఎన్నికల కోడ్ అమలులో ప్రత్యేకంగా ఒక పథకం గురించి స్పందించను. ఓటర్లను ప్రభావితం చేసే ఏ స్కీం అయినా.. పాతవి లేదా కొత్తవి అమలు తాత్కాలికంగా నిలిచిపోతాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టదలచిన ఇళ్ల పట్టాల పంపిణీ ఆ పరిధిలో వస్తే నిలిచిపోతుంది. దానిపై కలెక్టర్లు అదనపు సమాచారం కోసం సంప్రదిస్తే చర్యలు తీసుకుంటాం. - బీసీ రిజర్వేషన్లపై కొన్ని రాజకీయ పార్టీలు వేసిన కేసును సుప్రీంకోర్టు స్వీకరించిందో లేదో అనే దానిపై సమాచారంలేదు. ఏదైనా కోర్టు తీర్పునకు అనుగుణంగా పనిచేస్తాం. - ఎన్నికలు ఏకగ్రీవమైన చోట ఈసారీ ప్రోత్సాహకాలు ఉంటాయి. ప్రభుత్వం కూడా ప్రోత్సాహక మొత్తాన్ని పెంచింది. అయితే, బలవంతపు ఏకగ్రీవాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించాను. - ఎన్నికలలో మద్యం, డబ్బు పంపిణీని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చట్టం తీసుకురావడం ప్రభుత్వ ధృఢమైన నిర్ణయాన్ని తెలియజేస్తోంది. - సొంత మండలంలో పనిచేసే ప్రభుత్వ సిబ్బందిని ఆ మండలంలోని ఎన్నికల విధులకు ఉపయోగించం. -
ఏపీ: ‘స్థానిక’ ఎన్నికల షెడ్యూల్ విడుదల
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ శనివారం విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్.రమేష్‌కుమార్ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. మొత్తం మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహస్తామని పేర్కొన్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఒక విడతలో, పంచాయతీ ఎన్నికలను రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. ఇక ఒకే దశలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈనెల 21న జడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించి ఫలితాలను 24న ప్రకటిస్తారు. ఇక ఈ నెల 23న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరిపి, 27న ఫలితాలను వెల్లడిస్తామని తెలిపారు. ఈనెల 27న తొలివిడుత పంచాయతీ ఎన్నికలు, 29న రెండో విడత పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. (చదండి : మహిళలకే పెద్ద‘పీఠం’) ‘రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన ఆర్డినెన్స్ ద్వారా ఈ షెడ్యూల్డ్‌ను విడుదల చేశాం. ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి వస్తుంది. ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఎన్నికల నియమావళి విధిగా పాటించాలి. ప్రభుత్వ సంబంధించిన సదుపాయాలను ఉపసంహరించుకోవాలి. ఓటర్లను ప్రభావితం చేసే పథకాలను అమలు చేయరాదు. కొత్తగా బదిలీలు, నియమాకాలు చేపట్టరాదు. ఎన్నికలు సజావుగా జరపడానికి కలెక్టర్లకి, ఎస్పీలకు అధికారాలు ఇచ్చాం. స్వేచ్చగా, హింసకి తావులేకుండా ఓటు హక్కు వినియోగించుకొనేలా అందరూ సహకరించాలి. ప్రభుత్వ భవనాలపై ఉన్న రంగుల గురించి ఇప్పటికే హైకోర్ట్ లో ఉంది కాబట్టి దానిపై మేము ప్రత్యేక చర్యలు తీసుకోం.సిబ్బంది కొరతలేదు.. అత్యవసరం అయితే అంగన్ వాడి వర్కర్స్ ని వాడుకుంటాం’ అని రమేశ్ కుమార్ అన్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు మార్చి 7: నోటిఫికేషన్ విడుదల మార్చి 9-11: నామినేషన్ల స్వీకరణ మార్చి 12: నామినేషన్ల పరిశీలన మార్చి 14: నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది మార్చి 21: ఎన్నికల పోలింగ్ మార్చి 24: ఓట్ల లెక్కింపు మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ మార్చి 9: నోటిఫికేషన్ విడుదల మార్చి 11-13: నామినేషన్ల స్వీకరణ మార్చి 14: నామినేషన్ల పరిశీలన మార్చి 16: నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది మార్చి 23: ఎన్నికల పోలింగ్ మార్చి 27: ఓట్ల లెక్కింపు పంచాయతీ ఎన్నికల తొలి విడత షెడ్యూల్ మార్చి 15: నోటిఫికేషన్ విడుదల మార్చి 17-19: నామినేషన్ల స్వీకరణ మార్చి 20: నామినేషన్ల పరిశీలన మార్చి 22: నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది మార్చి 27: ఎన్నికల పోలింగ్ మార్చి 27: ఓట్ల లెక్కింపు పంచాయతీ ఎన్నికల రెండో విడత షెడ్యూల్ మార్చి 17: నోటిఫికేషన్ విడుదల మార్చి 19-21: నామినేషన్ల స్వీకరణ మార్చి 22: నామినేషన్ల పరిశీలన మార్చి 24: నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది మార్చి 29: ఎన్నికల పోలింగ్ మార్చి 29: ఓట్ల లెక్కింపు -
‘స్థానిక’ షెడ్యూల్ నేడే
సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్రంలో ముఖ్యమైన రాజకీయ పార్టీలన్నింటితో తుది సంప్రదింపులు పూర్తయ్యాయని, శనివారం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్.రమేష్‌కుమార్ ప్రకటించారు. శుక్రవారం సాయంత్రం రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో వివిధ రాజకీయ పక్షాలతో సమావేశం అనంతరం కమిషన్ కార్యదర్శి రామసుందర్‌రెడ్డి, జాయింట్ సెక్రటరీ సత్యరమేష్‌లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయ పార్టీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తాయని, ఇది అందరిలోనూ ఏకాభిప్రాయం తెచ్చేందుకు ఉద్దేశించిన సమావేశం కాదన్నారు. ఎన్నికల ప్రక్రియను సరళీకృతం చేసే నిర్మాణాత్మక సూచనలను పరిగణలోకి తీసుకుంటున్నామన్నారు. అంతకుముందు ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్‌లతో కలసి కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికలను ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్ పేపర్ ద్వారా నిర్వహిస్తున్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో పంచాయతీ రాజ్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు, ఉన్నతాధికారులు గిరిజా శంకర్, జి.విజయ కుమార్, ఎన్నికల కమిషనర్ కార్యాలయ కార్యదర్శి ఎస్.రామసుందర రెడ్డి, జాయింట్ కార్యదర్శి ఏవీ సత్యరమేష్, విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ ఎన్నికల కమిషనర్ ఏమన్నారంటే.. – పరీక్షలు జరుగుతున్న సమయంలో ఎన్నికలు నిర్వహించడం ఇబ్బందని కొన్ని పార్టీలు సమావేశంలో ప్రస్తావించాయి. ఈ నెల చివరి వారంలో మొదలయ్యే పదో పరీక్షలను వాయిదా వేసి ఏప్రిల్‌లో నిర్వహిస్తామని ప్రభుత్వం తెలిపింది. ఎన్నికల నిర్వహణకు అనుకూల వాతావరణం ఉందని కమిషన్ భావించేందుకు ఇది కూడా కారణం. – సభలు, సమావేశాల నిర్వహణకు కలెక్టర్ ద్వారా అనుమతులిస్తాం. – గతంలో జారీ అయిన కుల ధృవీకరణ పత్రాలను ఉపయోగించుకోవచ్చు. ఎన్నికల నిమిత్తం మీసేవ కేంద్రాలకు అందే దరఖాస్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించాం. – కరోనా వైరస్ వల్ల మన దగ్గర పెద్దగా ఇబ్బంది లేదనేది నా అభిప్రాయం. –– ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేవన్నీ శిక్షార్హమైనవేనని గతంలోనూ నిబంధనలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ప్రత్యేక చట్టంతో ప్రయోజనం ఉంటుంది. అనర్హత వేటు తప్పు నిర్ధారణ అయిన తర్వాతే ఉంటుంది. –– వలంటీర్లను ఎన్నికల విధుల్లోకి తీసుకోవద్దని కొన్ని పార్టీలు సూచించాయి. సిబ్బంది తగ్గితే ఏపీపీఎస్సీ ద్వారా నియమితులైన గ్రామ సచివాలయ సిబ్బందిని వినియోగించుకుంటాం. అంగన్వాడీ కార్యకర్తలను ఇంకు మార్పిడి లాంటి పనులు అప్పగిస్తాం. ప్రభుత్వేతర సిబ్బందిని ఉపయోగించుకోవాల్సిన అవసరం లేదు. ––హేతుబద్ధంగానే ఎన్నికల షెడ్యూల్. అన్నీ దృష్టిలో పెట్టుకొనే నోటిఫికేషన్ ఇస్తాం. ––కొత్తగా ఓటర్లను చేర్చుకోవడం ఇప్పుడు సాధ్యం కాదు. –– ఈవీఎంలపై రాజకీయ పార్టీలు అపనమ్మకం వ్యక్తం చేస్తున్నాయి. బ్యాలెట్ పేపరుతో ఎన్నికలు నిర్వహిస్తున్నాం. అయితే రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఈవీఎంలపై సంపూర్ణ విశ్వాసం ఉంది. –– ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాకే ప్రవర్తనా నియమావళి అమలు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పరిధిలోకి వస్తుంది. కోడ్ అమలు వచ్చిన నాటి నుంచి ఫిర్యాదులపై పరిశీలిస్తాం. ‘2018 లో స్థానిక సంస్థలు ఎన్నికలు జరగాల్సి ఉంది. ప్రతిపక్ష టీడీపీ ఎన్నికలు అంటే భయపడుతోంది. కరోనా వైరస్ ఉందంటూ పారిపోతోంది. ఎన్నికలు జరగకుండా కుట్రలు చేస్తోంది’ ––జోగి రమేష్, వైసీపీ ఎమ్మెల్యే. ‘పరీక్షలు ఉన్నందున విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూడాలి’ –––పాతూరి నాగభూషణం..బీజేపీ ‘మద్యం, ధన ప్రభావం లేకుండా ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేలా చేయాలన్న సీఎం వాఖ్యలను స్వాగతిస్తున్నాం. మా పార్టీ ఇదే వైఖరితో ఉంది. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూడాలి’ ––వెంకటేశ్వరరావు, సీపీఎం నేత ‘స్థానిక ఎన్నికలు వాయిదా వేయాలని కోరాం’ – జల్లి విల్సన్, మాజీ ఎమ్మెల్సీ , సీపీఐ ‘ఎన్నికల నిర్వహణకు ఇది సరైన సమయం కాదు. కరోనా వైరస్ ప్రభావం ఉందని చెప్పాం. రిజర్వేషన్ల అంశం కోర్టులో ఉండగా ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు’ ––వర్ల రామయ్య, టీడీపీ. గవర్నర్‌తో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ భేటీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్.రమేష్ కుమార్ శుక్రవారం గవర్నర్ విశ్వ భూషణ్ హరిచందన్‌తో రాజ్‌భవన్‌లో భేటీ అయ్యారు. త్వరలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై గవర్నర్‌కు నివేదించారు. ఎన్నికలు నిర్వహించేందుకు తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్‌కుమార్ -
రేపే స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను రేపు (శనివారం) విడుదల చేస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ ప్రకటించారు. ఈవీఎంలపై పూర్తిస్థాయి విశ్వాసముందని, కానీ ఈసారి ఎన్నికలు మాత్రం బ్యాలెట్ పద్దతిలోనే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్థానిక సంస్థలతో పాటు, మున్సిపల్ ఎన్నికలు కూడా అదే పద్దతిలో నిర్వహిస్తామన్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన మీడియా సమావేశం నిర్వహించి.. షెడ్యూల్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఎన్నికలపై ఇప్పటికే జిల్లా కలెక్టర్, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించామన్నారు. అలాగే ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు సహకరించాలని కోరుతూ రాష్ట్రంలోని రాజకీయ పార్టీలతో సమావేశమైనట్లు తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ హేతుబద్దంగా ఉంటుందన్నారు. సింగిల్ డెస్క్ విధానం ప్రకారం ఎన్నికల ప్రచారానికి, సభలకు అనుమతి ఇవ్వాలని కోరారు. (ఏపీ జిల్లా పరిషత్ రిజర్వేషన్లు ఖరారు) ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు కుల ధృవీకరణ పత్రాన్ని తప్పనిసరిగా ఇవ్వాలని, పాత పత్రాలు ఉన్నా అనుమతిస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ప్రలోభాలకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, అభ్యర్థులపై అనర్హత వేటు కూడా వేస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎన్నికలు సిబ్బంది సరిపోతారని, అవసరమైతే గ్రామ సచివాలయ సిబ్బందిని కూడా వినియోగిస్తామని చెప్పారు. ఎన్నికలపై కరోనా వైరస్ ప్రభావం ఉంటుందని పలువురు ఈసీ దృష్టికి తీసుకువచ్చారని, అయితే ఎన్నికల నిర్వహరణకు ఎలాంటి ఇబ్బంది లేదని రమేష్ కుమార్ స్పష్టం చేశారు. కాగా ఎన్నికల నేపథ్యంలో పదో తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ పరీక్షలను ఎన్నికల ప్రక్రియ అనంతరం ఏప్రిల్‌లో నిర్వహించనున్నారు. -
మేం సిద్ధం
సాక్షి, అమరావతి: కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన 14వ ఆర్థిక సంఘం నిధుల విడుదల కోసం మార్చి 31వ తేదీలోగా ‘స్థానిక’ ఎన్నికలను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్.రమేశ్ కుమార్ చెప్పారు. తాము కూడా ఎన్నికల నిర్వహణకు సంసిద్ధత తెలియజేశామని వెల్లడించారు. బుధవారం ఆయన ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడారు. ‘స్థానిక’ ఎన్నికల నిర్వహణ కోసం పొరుగు రాష్ట్రాల నుంచి ఎంత మేర పోలీస్ బలగాలను రప్పించగలరో.. వివరాలు అందించాలని డీజీపీ సవాంగ్‌ను కోరినట్లు చెప్పారు. ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేసి, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు అందజేసిన తర్వాత కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తామన్నారు. ఆ తర్వాత రాజకీయ పార్టీలతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని.. అనంతరం ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసే అవకాశముందన్నారు. అంతకుముందు, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌తో డీజీపీ గౌతమ్ సవాంగ్ భేటీ అయ్యారు. ఎన్నికలకు పూర్తి స్థాయిలో భద్రత కల్పించేందుకు పోలీసు శాఖ సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా డీజీపీ వివరించినట్టు తెలిసింది. అనంతరం పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్, మున్సిపల్ శాఖ కార్యదర్శి శ్యామలరావు, కమిషనర్ విజయకుమార్‌లు.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌తో భేటీ అయ్యారు. త్వరితగతిన ఎన్నికల నిర్వహణకు వీలుగా రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికల కమిషన్‌కు అందజేస్తామని వారు తెలియజేశారు. -
‘స్థానిక’ ఎన్నికల వ్యవధి కుదింపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఈసారి జరిగే పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్, నగర పాలక సంస్థల ఎన్నికల నిర్వహణ కాల వ్యవధిని 27 రోజుల నుంచి 20 రోజులకు తగ్గించినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఎన్. రమేష్‌కుమార్ వెల్లడించారు. ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిన నాటి నుండి ఓట్ల లెక్కింపు వరకు మొత్తం 20 రోజుల్లో ఈ ప్రక్రియను ముగించనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో త్వరలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు అనుగుణంగా జిల్లా కలెక్టర్లు తగిన ప్రణాళికలతో సంసిద్ధంగా ఉండాలని ఆయన ఆదేశించారు. ‘స్థానిక’ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి రామసుందరరెడ్డితో కలిసి శుక్రవారం ఆయన విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి 13 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ ఎన్నికలకు సంబంధించిన నిబంధనలను, మార్గదర్శకాలను తు.చ. తప్పకుండా అమలుచేయడంపై ప్రత్యేక దృష్టిసారించాలని రమేష్‌కుమార్ సూచించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి.. ఓటర్ల జాబితా నవీకరణ, బ్యాలెట్ పత్రాల ముద్రణ, బ్యాలెట్ బాక్సులు.. ఇతర ఎన్నికల సామగ్రిని సిద్ధం చేసుకోవడంపై కలెక్టర్లు ప్రధానంగా దృష్టిసారించాలన్నారు. ‘స్థానిక’ ఎన్నికలన్నీ ఏకకాలంలో జరిగినా.. కాగా, మున్సిపల్ ఎన్నికలతో పాటు జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు ఒకేసారి ఎన్నికలు జరిగితే అదనపు ఎన్నికల మెటీరియల్, యంత్రాంగాన్ని సమకూర్చుకునేలా కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలు, మున్సిపల్ కమిషనర్లు చర్యలు చేపట్టాల్సి ఉంటుందని రమేష్‌కుమార్ జిల్లా అధికారులకు చెప్పారు. రాష్ట్రంలో సుమారు 13 వేలకు పైగా గ్రామ పంచాయతీలు ఉన్న నేపథ్యంలో.. సర్పంచ్ ఎన్నికలు మూడు దశలలో నిర్వహించాల్సి ఉంటుందని, ఆ దిశగా కలెక్టర్లు ముందస్తుగా ఏర్పాట్లు చేసుకోవాలని కమిషనర్ సూచించారు. మార్చిలో ఇంటర్, టెన్త్ పరీక్షలు జరుగుతున్న దృష్ట్యా ఎన్నికల కారణంగా విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా ఎన్నికల షెడ్యూల్ ఉంటుందని రమేష్‌కుమార్ జిల్లాల అధికారులకు తెలిపారు. మున్సిపల్ శాఖ కార్యదర్శి జె. శ్యామలరావు మాట్లాడుతూ.. కొత్తగా ఏర్పడిన 10 మున్సిపాలిటీలకు సంబంధించి విడిగా మార్గదర్శకాలను జారీచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎన్నికల సంఘం జాయింట్ సెక్రటరీ ఏవీ సత్యరమేష్, విశాఖపట్నం నుంచి మున్సిపల్ శాఖ కమిషనర్ విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
‘స్థానిక’ ఎన్నికలకు సన్నద్ధమవ్వండి
సాక్షి, అమరావతి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలకు అతి త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉందని.. ఇందుకు యంత్రాంగాన్ని సర్వసన్నద్ధంగా ఉంచాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ ఆదేశించారు. విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఓటర్ల జాబితాలు, బ్యాలెట్ బాక ్స్ల వంటి ఎన్నికల సామగ్రిని పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచుకోవాలని కమిషనర్ సూచించారు. ప్రతి గ్రామానికి, ప్రాదేశిక నియోజకవర్గాలకు సంబంధించి 70 కాపీల వరకు ఓటర్ల జాబితాల అవసరం ఉంటుందని, ఆ మేరకు సిద్ధం చేసుకోవాలని సూచించారు. విడతల వారీగా ఎన్నికలు జరిపినప్పటికీ, రాష్ట్రంలో సరిపడినన్ని బ్యాలెట్ బాక్స్‌లు అందుబాటులో లేని కారణంగా కేరళ నుంచి రప్పిస్తున్నట్లు వివరించారు. పోలింగ్ బూత్ గుర్తింపు, సిబ్బంది నియామకంలో ఎక్కడా పొరపాట్లకు తావివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. కాన్ఫరెన్స్‌లో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి ఏవీ సత్య రమేష్ పాల్గొనగా.. వివిధ జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీలు, జెడ్పీ సీఈవోలు, జిల్లా పంచాయతీ అధికారులు, ఆర్డీవోలు, ఎన్నికల విధుల్లో ఉండే ఇతర అధికారులు హాజరయ్యారు. పరీక్షలకు ఆటంకం లేకుండా ఎన్నికల తేదీలు మార్చి, ఏప్రిల్ నెలల్లో విద్యార్థులకు వార్షిక పరీక్షలు జరగనున్నందున వాటికి ఆటంకం కలగకుండా ఎన్నికల తేదీలు ఖరారు చేసే అంశంపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్‌కుమార్ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. డీజీపీ గౌతమ్ సవాంగ్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, విద్యా శాఖ, పంచాయతీరాజ్ శాఖ అధికారులతో వేర్వేరుగా భేటీ అయ్యారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో ఏయే తేదీల్లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో పరీక్షలు ఉన్నాయో విద్యా శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. కాలేజీలు, స్కూళ్లలో పోలింగ్‌తో పాటు ఎన్నికల కౌంటింగ్ వల్ల విద్యార్థులకు ఆటంకం కలిగే పరిస్థితి ఉంటే.. అలాంటి విద్యా సంస్థలను ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎన్నికల నిర్వహణకు నిధుల విడుదలలో ఇబ్బందులు లేకుండా చూడాలని ఆర్థిక శాఖ అధికారులను కోరారు. -
అనర్హులే.. కానీ పోటీ చేయొచ్చు!
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలో కుమారస్వామి ప్రభుత్వం కూలిపోవడానికి కారణమైన 17 మంది కాంగ్రెస్–జేడీఎస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలను అసెంబ్లీ స్పీకర్ అనర్హులుగా ప్రకటించడాన్ని బుధవారం సుప్రీంకోర్టు సమర్ధించింది. ఆ ఎమ్మెల్యేలు రానున్న ఉపఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించింది. ఆ ఎమ్మెల్యేలను అనర్హులుగా పేర్కొంటూ స్పీకర్రమేశ్ ఇచ్చిన ఉత్తర్వుల్లో.. 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల వరకు పోటీ చేసే అవకాశం లేదన్న భాగాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఉప ఎన్నికల్లో గెలిస్తే వారు మంత్రులూ కావచ్చని పేర్కొంది. కుమారస్వామి ప్రభుత్వం కూలిపోవడంతో జూలై నెలలో యడియూరప్ప నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే. కాగా, ఆ ఎమ్మెల్యేలు నేడు(గురువారం) బీజేపీలో చేరనున్నారని సీఎం యడియూరప్ప, ఉప ముఖ్యమంత్రి అశ్వద్ధ నారాయణ్ వెల్లడించారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ద్వారా సంక్రమించిన అధికారాలను స్పీకర్ ఉపయోగించిన విషయాన్ని జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ కృష్ణ మురారిల ధర్మాసనం ప్రస్తావిస్తూ.. ‘ఎంత కాలం అనర్హులుగా ప్రకటించాలనే విషయంలో కానీ, ఎన్నికల్లో పోటీ చేయరాదనే విషయంలో కానీ స్పీకర్‌కు అధికారం లేదు’ అని స్పష్టం చేసింది. నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్న రాజ్యాంగ ధర్మానికి వ్యతిరేకంగా స్పీకర్లు వ్యవహరించడం ఎక్కువైందని ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది. రాజకీయ పార్టీలు అనుసరిస్తున్న అవినీతికి పాల్పడటం, ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టడం వంటి చర్యల వల్ల పౌరులు స్థిర ప్రభుత్వాన్ని పొందే హక్కును కోల్పోతున్నారని పేర్కొంది. ‘ఎమ్మెల్యేలు రాజీనామా చేసినప్పుడు, వారు స్వచ్చంధంగానే చేశారా? అనే విషయాన్ని మాత్రమే స్పీకర్ పరిగణనలోకి తీసుకుని, ఆ రాజీనామాను ఆమోదించడమో, లేక తిరస్కరించడమో చేయాలి’ అని కోర్టు పేర్కొంది. ‘స్వచ్చంధంగానే రాజీనామా చేసినట్లు తేలితే, ఆ రాజీనామాను ఆమోదించడం మినహా స్పీకర్‌కు మరో మార్గం లేదు. ఆ రాజీనామాను ఆమోదించే విషయంలో సంబంధం లేని ఇతర అంశాలను స్పీకర్ పరిగణనలోకి తీసుకోవడం రాజ్యాంగపరంగా ఆమోదనీయం కాదు. స్పీకర్ నిర్ణయం న్యాయసమీక్షకు అర్హమైనదే’ అని ధర్మాసనం తేల్చిచెప్పింది. ఎమ్మెల్యేలు మొదట హైకోర్టును కాకుండా సుప్రీంకోర్టునే ఆశ్రయించడాన్ని ధర్మాసనం తప్పుబట్టింది. హైకోర్టును ఆశ్రయించి, ఆ తీర్పుపై సంతృప్తి చెందనట్లయితేనే, సుప్రీంకోర్టును ఆశ్రయించడం çసరైనదని వ్యాఖ్యానించింది. డిసెంబర్ 5న ఉప ఎన్నికలు తమను అనర్హ ఎమ్మెల్యేలుగా స్పీకర్ రమేశ్ కుమార్ ప్రకటించడాన్ని సవాలు చేస్తూ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌పై తాజా తీర్పును సుప్రీంకోర్టు వెలువరించింది. ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించడంతో ఖాళీ అయిన 17 అసెంబ్లీ స్థానాల్లో 15 సీట్లకు డిసెంబర్ 5వ తేదీని ఉప ఎన్నికలు జరగనున్నాయి. 18 వరకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చు. ‘ఆ’ ఎమ్మెల్యేలపై కఠిన విధానం సరికాదు పార్టీ ధిక్కరణకు పాల్పడే చట్ట సభల సభ్యులపై కఠినమైన అనర్హత విధానాన్ని తీసుకురావడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. దానివల్ల న్యాయమైన భిన్నాభిప్రాయాన్ని వ్యక్తీకరించడానికి ఆటంకం కలుగుతుందని కాబట్టి అది ఆమోదయోగ్యం కాదని వ్యాఖ్యానించింది. పార్టీ విధానాన్ని ధిక్కరించే, పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడే ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించేందుకు ఒక కఠిన విధానాన్ని రూపొందించేలా ఆదేశాలు జారీ చేయలన్న కాంగ్రెస్ పార్టీ కర్ణాటక శాఖ విజ్ఞప్తిపై సుప్రీంకోర్టు పై విధంగా స్పందించింది. కర్ణాటకకు చెందిన 17 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై తీర్పు సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది. ‘ఒకవేళ అలాంటి విధానమేదైనా తీసుకురావాలన్నా.. అది శాసన వ్యవస్థ చేయాల్సిన విధి. ఆ పని కోర్టులు చేయలేవు’ అని పేర్కొంది. విశ్వాస పరీక్షకు ముందే... జూలై 23న కుమారస్వామి ప్రభుత్వం విశ్వాస పరీక్ష నేపథ్యంలో... విప్‌ను వ్యతిరేకించే అవకాశమున్న కాంగ్రెస్, జేడీఎస్‌లకు చెందిన 17 మంది ఎమ్మెల్యేలను స్పీకర్ అనర్హులుగా ప్రకటించారు. తరవాత జరిగిన విశ్వాస పరీక్షలో గెలవకపోవడంతో కుమార స్వామి రాజీనామా చేశారు. జూలై 29న∙విశ్వాస పరీక్షలో నెగ్గి, యడియూరప్ప నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. 17 మంది ఎమ్మెల్యేల అనర్హతతో అసెంబ్లీలోని ఎమ్మెల్యేల సంఖ్య 225 నుంచి 208కి తగ్గింది. మెజారిటీకి అవసరమైన మేజిక్ ఫిగర్ 105కి చేరింది. ఒక స్వతంత్ర ఎమ్మెల్యే, తమ 105 మంది ఎమ్మెల్యేల మద్దతుతో యడియూరప్ప విశ్వాస పరీక్షలో నెగ్గారు. -
‘కర్ణాటకానికి’ తెర!
అనుకున్నట్టే కర్ణాటకలో యడియూరప్ప నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం సోమవారం విశ్వాస పరీక్షలో విజయం సాధించింది. ఆ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం మొదలైననాటి నుంచీ సంచలనాలకు కేంద్రంగా ఉన్న స్పీకర్ కేఆర్ రమేశ్ కుమార్ పదవి నుంచి తప్పుకున్నారు. ఈ పరిణామాలన్నీ చూశాక అందరికీ ఒకటి మాత్రం అర్ధమైంది– ప్రభుత్వం సంఖ్యాపరంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తీసుకొచ్చే విశ్వాస తీర్మానంపై చర్చ, ఓటింగ్ ఎడతెగని సీరియల్లా రోజుల తరబడి సాగుతాయి. తగినంత బలం ఉందనుకున్నప్పుడు పెట్టే తీర్మానం ఆగమేఘాల మీద పూర్తవుతుంది. రాజీనామాలిచ్చి మహారాష్ట్ర తరలిపోయి మకాం వేసిన కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు 17మంది విప్ విషయంలో తానిచ్చిన నోటీసులకు జవాబివ్వలేదన్న కారణం చూపి స్పీకర్ వారిపై అనర్హత వేటు వేసిన పర్యవసానంగా బల నిరూపణకు అవసరమైన కనీస సంఖ్యాబలం 104కు తగ్గింది. సొంత బలం 105కు తోడు అదనంగా స్వతంత్ర సభ్యుడి ఆసరా తీసుకుని యడియూరప్ప గట్టెక్కారు. ఎంతకాలం అధికారంలో కొనసాగుతారన్న అంశాన్ని పక్కనబెడితే త్రుటిలో చేజారిన సీఎం పదవిని చేజిక్కించుకు తీరాలన్న ఆయన పట్టుదల నెరవేరింది. కర్ణాటకలో నిరుడు మే నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత అతి పెద్ద పార్టీగా బీజేపీ అవతరించినా... గవర్నర్ వజూభాయ్ వాలా తొలి అవకాశమిచ్చినా ఆయన దాన్ని నిలబెట్టుకోలేకపోయారు. చివరకు కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వం అధికారంలోకొచ్చింది. గత 14 నెలలుగా యడియూరప్ప అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. కూటమి ఎమ్మెల్యేల్లో కొందరిని సమీకరించుకోవడానికి కృషి చేస్తూనే ఉన్నారు. అందుకు సంబంధించి ఒకరిద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆరోపణలు చేయడమే కాదు...సామాజిక మాధ్యమాల్లో కొన్ని ఫోన్ సంభాషణల ఫైళ్లు కూడా వెలుగుచూశాయి. కూటమి ప్రభుత్వం మాత్రం అంతర్గత కుమ్ములాటలతో కాలం గడిపింది. కుమారస్వామికి సక్రమంగా పాలించడానికి అవకాశమే చిక్కలేదు. 17మంది ఎమ్మెల్యేలు వలసపోవడానికి బీజేపీ ఏం చేసిందన్న సంగతలా ఉంచితే నిరంతర కలహాలతో మునిగితేలే కూటమి నుంచి నిష్క్రమించడానికి ఆ ఎమ్మెల్యేలకు సాకు దొరికిందన్నది వాస్తవం. ఈ మొత్తం వ్యవహారంలో రమేశ్ కుమార్ పాత్ర గురించి చెప్పుకోవాలి. ఆ పదవి హుందాతనాన్ని నిలబెట్టడంలో, పార్టీలకు అతీతంగా పనిచేయడంలో అసెంబ్లీల మొదలుకొని పార్లమెంటు వరకూ సభాధ్యక్షులు విఫలమవుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్న వర్తమానంలో ఆయన ప్రశంశనీయంగా వ్యవహరించారు. కూటమి తరఫున స్పీకర్ పదవిని అధిష్టించినా చాలా వరకూ తటస్థంగా ఉన్నారు. ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదించే విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఒకపక్క, విశ్వాస తీర్మానంపై ఓటింగ్ ఫలానా సమయానికల్లా పూర్తికావాలన్న గవర్నర్ తాఖీదులు మరోపక్క వచ్చినా తన విధుల విషయంలో ఆయన స్పష్టంగానే, నిష్కర్షగానే ఉన్నారు. ఒత్తిళ్లకు లొంగడానికి సిద్ధపడలేదు. విశ్వాస తీర్మానంపై జరిగే చర్చను మరింత పొడిగించాలని అప్పటికి సీఎంగా ఉన్న కుమారస్వామి కోరినా నిరాకరించారు. ఓటింగ్‌ను ఎలాగైనా ఇంకోరోజుకు వాయిదా వేస్తే ఏదో ఒరుగుతుందన్న భ్రమలో ఉన్న కుమారస్వామికి చివరకు నిరాశే మిగిల్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివంగత నేత ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు అధికారం చేజిక్కించుకున్నప్పుడు ఆనాటి స్పీకర్ యనమల రామకృష్ణుడు, గత అయిదేళ్లలో కోడెల శివప్రసాదరావు ఎలా వ్యవహరించారో, ఆ పదవికే ఎలా కళంకం తెచ్చారో తెలుగు ప్రజలు మరిచిపోలేరు. పదవి నుంచి వైదొలగక తప్పనిస్థితి ఏర్పడిన ఒక ముఖ్యమంత్రి అందుకు గల కారణాలను చెప్పుకుందామంటే రామకృష్ణుడు ఆయనకు అవకాశమివ్వలేదు. ఏ పరిస్థితుల్లో తాను పదవి కోల్పోవలసి వచ్చిందో ఎన్టీఆర్ స్వయంగా చెప్పిన వీడియోలు సామాజిక మాధ్యమాల పుణ్యమా అని ఇప్పుడు అందరికీ అందుబాటులోకొచ్చాయి. కానీ యనమల అనుసరించిన వైఖరి కారణంగా అసెంబ్లీ రికార్డుల్లో మాత్రం ఆయన స్వరం లేదు. కోడెల తీరు కూడా ఎన్నో విమర్శలకు తావిచ్చింది. సభలో వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యుల సంఖ్య ఎంతో ఆయనకు తెలుసు. అందులో ఎందరు ఫిరాయించారో తెలుసు. ఎందరికి మంత్రి పదవులొచ్చాయో తెలుసు. కానీ స్పీకర్‌గా అలాంటి సభ్యులపై చర్య తీసుకోవడం తన బాధ్యతన్న సంగతిని మాత్రం మరిచారు. కానీ సభలోనూ, బయట వేదికలపైనా విలువల గురించి గంభీరోపన్యాసాలివ్వడం మానుకోలేదు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడమే కాదు... ఒక సందర్భంలో చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేయడానికి కూడా ఆయన వెనకాడలేదు. ఈ బాపతు నేతలే స్పీకర్లుగా అధికారాలు చలాయిస్తున్న దేశంలో ఫిరాయింపుల నిషేధ చట్టంతోసహా అన్ని రకాల రాజ్యాంగ విలువలూ మంట కలవడంలో వింతేముంది? ఇలాంటి పరిస్థితుల్లో రమేశ్ కుమార్ సభా సంప్రదాయాలనూ, స్పీకర్‌గా తనకున్న అధికారాలను సవ్యంగా వినియోగించుకోలగడం ప్రశంసనీయం. రాజకీయ వ్యూహప్రతివ్యూహాల దశ ముగిసింది కనుక కర్ణాటక ప్రజలకు మెరుగైన పాలన అందించడానికి ఏం చేయాలన్న విషయంపై కొత్తగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం దృష్టి పెట్టాలి. సాగు సంక్షోభం, ఉపాధి లేమి గ్రామీణ ప్రాంతాలను ఊపిరాడనీయకుండా చేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో కొత్త ప్రభుత్వం తక్షణ చర్యలకు నడుం బిగించాల్సిన అవసరం ఉంటుంది. అయితే యడియూరప్ప అధికారంలో ఎన్నాళ్లు నెట్టుకు రాగలరన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. పదవి కోసం కూటమి సర్కారును కూల్చిన ఎమ్మెల్యేల వైనం కళ్ల ముందు కనబడుతుండగా, బీజేపీలో పదవు లాశిస్తున్నవారు సైతం రేపన్న రోజున అదే పని చేయరన్న గ్యారెంటీ లేదు. అదీగాక 17 స్థానాలకూ ఉప ఎన్నికలు వస్తే యడియూరప్పకు అదొక అగ్ని పరీక్ష అవుతుంది. వీటిని ఆయన ఎలా అధిగమిస్తారో, ఎలాంటి ఎత్తులు వేస్తారో వేచి చూడాలి. -
జైపాల్‌రెడ్డి పాడె మోసిన సిద్దరామయ్య
-
జైపాల్‌రెడ్డి పాడె మోసిన సిద్దరామయ్య
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైపాల్‌రెడ్డి భౌతికకాయానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. సోమవారం మధ్యాహ్నం గాంధీభవన్ నుంచి నెక్లెస్ రోడ్డువరకు సాగిన జైపాల్‌రెడ్డి అంతిమయాత్రకు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. కర్ణాటక అసెంబ్లీలో నేడు సీఎం యడియూరప్ప విశ్వాస పరీక్ష ముగిసిన అనంతరం కాంగ్రెస్ నాయకులు సిద్దరామయ్య, కేఆర్ రమేశ్‌కుమార్‌లు హైదరాబాద్‌కు చేరుకున్నారు. జైపాల్‌రెడ్డి అంత్యక్రియలకు హాజరై ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. అంతేకాకుండా ఆయన పాడె మోసి తమ గురుభక్తిని చాటుకున్నారు. మరోసారి కన్నీటి పర్యంతమైన కేఆర్ రమేశ్.. జైపాల్‌రెడ్డి మరణవార్త విని తీవ్ర దిగ్ర్భాంతికి లోనైన రమేశ్‌కుమార్.. ఆదివారం బెంగళూరులో జరిగిన మీడియా సమావేశంలో కన్నీటి పర్యంతమైన సంగతి తెలిసిందే. అంతేకాకుండా జైపాల్‌రెడ్డితో ఉన్న అనుబంధాన్ని కూడా గుర్తుచేసుకుంటూ ఒకింత ఆవేదనకు లోనయ్యారు. అయితే ఈ రోజు జైపాల్‌రెడ్డి అంత్యక్రియలకు హాజరైన రమేశ్‌కుమార్ అక్కడున్న ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. వారితో మాట్లాడుతూ రమేశ్‌కుమార్ కన్నీటిని ఆపుకోలేకపోయారు. చదవండి : ముగిసిన జైపాల్‌రెడ్డి అంత్యక్రియలు.. కంటతడి పెట్టిన కర్ణాటక స్పీకర్ -
రమేశ్ భేష్; సిద్దు మెచ్చుకోలు
సాక్షి, బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ స్పీకర్‌గా కేఆర్ రమేశ్ కుమార్ ఎటువంటి పక్షపాతం లేకుండా పనిచేశారని మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రశంసించారు. నిజాయితీగా నిర్ణయాలు తీసుకుని స్పీకర్ పదవిలో ఉన్నవాళ్లు ఎలా ఉండాలన్న దానికి ఉదాహరణగా నిలిచారని మెచ్చుకున్నారు. స్పీకర్‌గా ఆయన చేసిన సేవలకు ధన్యవాదాలు తెలిపారు. కాగా, సిద్దరామయ్య కోరితేనే తాను స్పీకర్ పదవిని చేపట్టినట్టు రమేశ్ కుమార్ వెల్లడించారు. 14 నెలల 4 రోజులు పాటు శాసనసభ సభాపతిగా తాను రాజ్యాంగ నిబంధనలకు కట్టుబడి పనిచేశానని తెలిపారు. అసెంబ్లీ ప్రతిష్టను కాపాడేందుకు తన శక్తిమేరకు కృషి చేసినట్టు చెప్పారు. తన వల్ల ఎవరికైనా బాధ కలిగితే క్షమించాలని అన్నారు. అధికారంలోకి రావడానికి అడ్డదారులు తొక్కడం రాజ్యాంగానికి మంచిది కాదని హితవు పలికారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌ను సవరించాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల సంస్కరణలు అమలులో ఉన్నా అవినీతి కట్టడి కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప విశ్వాస పరీక్షలో నెగ్గడంతో స్పీకర్ రమేశ్ కుమార్ సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం బెంగళూరు నుంచి సిద్దరామయ్యతో పాటు హైదరాబాద్ చేరుకుని జైపాల్‌రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. -
కర్ణాటక స్పీకర్ రాజీనామా
సాక్షి, బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ కే.ఆర్.రమేశ్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. గతకొంత కాలంగా రాష్ట్రంలో సాగుతోన్న రాజకీయ సంక్షోభానికి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన స్పీకర్ సోమవారం తన పదవి నుంచి తప్పుకున్నారు. అసెంబ్లీలో యుడియూరప్ప విశ్వాస పరీక్షలో విజయం సాధించిన విషయం తెలిసిందే. అనంతరం సభలో ప్రవేశపెట్టిన ఆర్థిక బిల్లుకు ఆమోదం లభించిన వెంటనే ఆయన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. సభలోనే ఆయన రాజీనామా లేఖను సభ్యులందరికీ చదవి వినిపించారు. కాగా స్పీకర్ రాజీనామాకు ఒక్కరోజు ముందు (ఆదివారం) 14 మంది సభ్యులపై అనర్హత వేటు వేస్తూ.. సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసి.. సభా నియమాలను ఉల్లంఘించినందుకు వారిపై వేటు వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. కాగా కర్ణాటక ముఖ్యమంత్రిగా బీఎస్ యడియూరప్ప ప్రమాణస్వీకారం చేసి అనంతరం.. స్పీకర్‌ను దింపేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. అసెంబ్లీ స్పీకర్ కే.ఆర్.రమేశ్ కుమార్ వెంటనే బాధ్యతల నుంచి తప్పుకోవాలని సందేశాన్ని పంపింది. స్వచ్ఛందంగా తప్పుకోకుంటే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి బలవంతంగా సాగనంపాల్సి ఉంటుందని కూడా హెచ్చరించింది. ఈ నేపథ్యంలో సోమవారం సభలో జరిగిన విశ్వాస పరీక్షలో యడియూరప్ప సర్కార్ విజయం సాధించడంతో ఆయన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆయన స్థానంలో బీజేపీ నూతన స్పీకర్‌ను ఎన్నుకోనుంది. -
జాతకం తారుమారు అయ్యిందా?
సంచలనాలన్నీ తిరుగుబాటు ఎమ్మెల్యేల చుట్టూనే పరిభ్రమిస్తున్నాయి. వారి రాజీనామాలతో కుమార సర్కారు కూలిపోగా, ఇప్పుడు వారివంతు వచ్చింది. మూకుమ్మడిగా అనర్హత వేటు పడడంతో రెబెల్స్ సందిగ్ధంలో పడిపోయారు. యడియూరప్ప ప్రభుత్వంలో మంత్రుల పదవులు ఊరిస్తూ ఉండగా ఇలా జరిగిందేమిటని కంగుతిన్నారు. సాక్షి, బెంగళూరు: అసంతృప్త ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడడంతో బీజేపీ ప్రభుత్వ మంత్రివర్గ కూర్పు మారిపోయే అవకాశాలున్నాయి. బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించిన రెబెల్స్‌కు కేబినెట్లో చోటు కల్పించాల్సిన తప్పనిసరి పరిస్థితుల్లో ఇప్పుడు వారిపై అనర్హత వేటు వేయడంతో పదవులు దక్కడం అనుమానమే. ఈ పరిణామం అధికార బీజేపీ ఎమ్మెల్యేల్లో సంతోషాన్ని నింపింది. తమ పదవులకు ఢోకా లేదని సీనియర్లు ఊహల్లో విహరిస్తున్నారు. ఒకవేళ రాజీనామాలను స్పీకర్ ఆమోదిస్తే వారికే బీజేపీ టికెట్ ఇచ్చి ఉప ఎన్నికలు జరపాల్సి ఉండేది. గెలిచిన అభ్యర్థులకు బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగిరి ఇవ్వాల్సి ఉంది. చదవండి: కర్ణాటక స్పీకర్ సంచలన నిర్ణయం పదవుల సంగతేమిటి? అనూహ్యంగా అందరిమీదా అనర్హత వేటు పడడంతో అసంతృప్త ఎమ్మెల్యేలు ఆందోళనకు గురవుతున్నారు. అనర్హత గురయిన ఎమ్మెల్యేలంతా సుప్రీంకోర్టుకు వెళ్లనున్నారు. సుప్రీంలో తమకు అనుకూలంగా తీర్పు వస్తే మంత్రి పదవులను డిమాండ్ చేసేందుకు ఆస్కారముంది. వ్యతిరేకంగా వస్తే మంత్రి పదవిపై ఆశలు వదులుకోవాల్సిందే. కానీ ప్రభుత్వంలోని బోర్డులు, నామినేషన్ల అధ్యక్షులు, డైరెక్టర్ల పదవులను చేపట్టడానికి ఏ అడ్డంకీ లేనందున ఆ పదవులనే రెబెల్స్ డిమాండ్ చేయవచ్చు. ఆది నుంచీ ఆవేశాలు అనర్హతకు గురయిన రెబెల్ ఎమ్మెల్యేల భవిష్యత్తు ప్రస్తుతం అగమ్యగోచరంగా మారింది. దురాశకు వెళ్లి ఉన్న పదవులు పోగొట్టుకున్నారనే విమర్శలు రెబెల్ ఎమ్మెల్యేలపై వస్తున్నాయి. స్పీకర్ అనర్హత వేటు వేయడంతో వీరు 2023 వరకు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయడానికి వీలు లేకుండా పోయింది. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అప్పటి సీఎం కుమారస్వామితో పొసగడం లేదు. 14 నెలల పాలన కాలం లో విమర్శలు గుప్పిస్తూ కాం గ్రెస్, జేడీఎస్ నేతలకు మింగు డు పడకుండా తయారయ్యా రు. పదవులు దక్కలేదన్న ఆగ్రహంతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేయాలని ప్రయత్నాలు చేస్తూనే వచ్చారు. రాజీనామాలతో మొత్తం సంకీర్ణం చాపకిందకు నీళ్లు వచ్చాయి. ఇప్పుడు రెబెల్స్ భవిత ఏమిటనేది చర్చనీయాంశమైంది. అనర్హతకు గురైన ఎమ్మెల్యేలు ఎ.శివరామ్ హెబ్బార్ ( యల్లాపుర), శ్రీమంత్ పాటిల్ (కాగవాడ); బైరతి బసవరాజు (కృష్ణరాజపురం); మునిరత్న ( రాజరాజేశ్వరి నగర); ఆర్.రోషన్ బేగ్ (శివాజీనగర); ప్రతాప్ గౌడ పాటిల్ (మస్కి); కేసీ నారాయణ గౌడ (కేఆర్ పేట); కె.గోపాలయ్య(మహాలక్ష్మి లేఔట్); ఎంటీబీ నాగరాజు (హోసకోటె); కె.సుధాకర్ (చిక్కబళ్లాపుర); హెచ్. విశ్వనాథ్(హుణసూరు); బీసీ పాటిల్ (హీరేకరూర్); ఆనంద్ సింగ్ (హొసపేట); ఎస్టీ సోమశేఖర్ (యశ్వంతపుర). -
14 మంది రెబెల్స్‌పై కొరడా
సాక్షి, బెంగళూరు/పుణే : కర్ణాటకలో రెబెల్ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ రమేశ్ కుమార్ ఆదివారం షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 11 మంది, జేడీఎస్‌కు చెందిన ముగ్గురు రెబెల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. వీరంతా కర్ణాటక అసెంబ్లీ కాలపరిమితి ముగిసేవరకూ(2023) ఎన్నికల్లో పోటీకి అనర్హులని స్పష్టం చేశారు. తాజా నిర్ణయంతో అనర్హత వేటుపడ్డ ఎమ్మెల్యేల సంఖ్య 17కు చేరుకుంది. ఈ నెల 25న ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను స్పీకర్ అనర్హులుగా ప్రకటించారు. రమేశ్ కుమార్ నిర్ణయంతో యడియూరప్ప ప్రభుత్వం సోమవారం విశ్వాసపరీక్షను సులభంగా గట్టెక్కేందుకు అవకాశమేర్పడింది. కాగా, స్పీకర్ నిర్ణయాన్ని కాంగ్రెస్, జేడీఎస్ స్వాగతించగా, ఓ పార్టీ నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగానే రమేశ్ రెబెల్స్‌పై వేటేశారని బీజేపీ విమర్శించింది. నోటీసులిచ్చినా స్పందించలేదు.. చట్టాన్ని అనుసరించి, మనస్సాక్షి ఆధారంగా తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హతవేటు వేసినట్లు స్పీకర్ రమేశ్ కుమార్ తెలిపారు. ఆదివారం బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ..‘ప్రస్తుత రాజకీయ సంక్షోభం నన్ను తీవ్రమైన డిప్రెషన్లోకి నెట్టేసింది. ఇది నా రాజకీయ జీవితంలో చివరిదశ కావొచ్చు. ఎమ్మెల్యేల అనర్హత విషయంలో నాపై వచ్చిన విమర్శలు నూటికి నూరుశాతం బాధించాయి. రెబెల్ ఎమ్మెల్యేలు విప్ ఉల్లంఘించినట్లు కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు ఫిర్యాదు చేశాయి. దీంతో మూడు రోజుల్లోగా నా ముందు హాజరై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీచేశాను. వారు స్పందించకపోవడంతో ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఎమ్మెల్యేలు ప్రతాప్‌గౌడ పాటిల్, బీసీ పాటిల్, శివరామ్ హెబ్బర్, ఎస్టీ సోమశేఖర్, జేడీఎస్ ఎమ్మెల్యేలు గోపీనాథ్, ఎ.హెచ్.విశ్వనాథ్, నారాయణ గౌడ, తదితరుల్ని అనర్హులుగా ప్రకటించాను’ అని చెప్పారు. ఏకైక బీఎస్పీ ఎమ్మెల్యే ఎన్.మహేశ్‌పై అనర్హత వేటేయాలని బీఎస్పీ కోరిందనీ, దీనిపైనా నిర్ణయం తీసుకుంటానన్నారు. తనపై బీజేపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతుందన్న వార్తలపై స్పందిస్తూ..‘నేనే సభాపతిగా ఉంటా. వాళ్లను(బీజేపీ) రానివ్వండి. నేను రాజీనామా చేయను. నా విధులను బాధ్యతతో నిర్వర్తిస్తాను’ అని తెలిపారు. విశ్వాసపరీక్షతో పాటు ఆర్థికబిల్లుకు ఆమోదం నేపథ్యంలో సోమవారం 11 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి మరణంపై స్పీకర్ రమేశ్ భావోద్వేగానికి లోనయ్యారు. ‘జైపాల్ రెడ్డి నాకు పెద్దన్నలాంటివారు. నాకు మార్గదర్శి. మాది 40 ఏళ్ల అనుబంధం ’ అని చెప్పారు. ‘సుప్రీం’లో సవాల్ చేస్తాం: రెబెల్స్ స్పీకర్ రమేశ్ కుమార్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సోమవారం సవాలు చేస్తామని రెబెల్ ఎమ్మెల్యేలు ప్రకటించారు. అనర్హత విషయంలో స్పీకర్ చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరించారని జేడీఎస్ రెబెల్ ఎమ్మెల్యే ఎ.హెచ్.విశ్వనాథ్ ఆరోపించారు. ఓ వీడియోను విడుదలచేసిన తిరుగుబాటు ఎమ్మెల్యే ప్రతాప్‌గౌడ పాటిల్..అనర్హత వేటుపై సుప్రీంకోర్టుకు వెళతామనీ, న్యాయపోరాటంలో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అన్ని తెలుసుకునే పదవులకు రాజీనామా చేశామనీ, ఈ విషయాన్ని చట్టపరంగా ఎదుర్కొంటామని తెలిపారు. స్పీకర్ పక్షపాతంతో వ్యవహరించారని ఎమ్మెల్యే శివరామ్ హెబ్బర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో బలాబలాలు కర్ణాటక అసెంబ్లీలో 224 మంది సభ్యులు(స్పీకర్ కాకుండా) ఉన్నారు. స్పీకర్ 17 మందిపై అనర్హతవేటు వేయడంతో అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్య 207కు చేరుకుంది. అదే సమయంలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన ఎమ్మెల్యేల సంఖ్య 104కు తగ్గింది. ప్రస్తుతం బీజేపీకి 105 మంది బలం ఉండగా, ఓ స్వతంత్ర ఎమ్మెల్యే కూడా మద్దతు ఇస్తున్నారు. ఇక కాంగ్రెస్–జేడీఎస్ కూటమికి 100 మంది(నామినేటెడ్‌తో కలిపి) ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ నేపథ్యంలో సోమవారం జరిగే బలపరీక్షలో బీజేపీ విజయం సాధించడం నల్లేరుపై నడకేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సోమవారం బలపరీక్ష నేపథ్యంలో అసెంబ్లీకి తప్పనిసరిగా హాజరుకావాలని తమ ఎమ్మెల్యేలకు బీజేపీ విప్ జారీ చేసింది. ఇక మిషన్ మధ్యప్రదేశ్! జైపూర్: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మధ్యప్రదేశ్ బీజేపీ నేత కైలాశ్ విజయవర్గీయ సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయిన నేపథ్యంలో బీజేపీ మధ్యప్రదేశ్‌పై దృష్టిసారించబోతోందన్న వార్తలపై ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యడియూరప్ప కేబినెట్ ఏర్పాటయ్యాక కొత్త మిషన్ ప్రారంభిస్తామని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ‘ప్రభుత్వాలు కూల్చాలన్నది మా ఉద్దేశం కాదు. కానీ మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య అనేక విభేదాలు నెలకొన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంపై సొంత ఎమ్మెల్యేలకే నమ్మకం లేదు. కాంగ్రెస్‌తో పోల్చుకుంటే ప్రధాని మోదీ నాయకత్వం మంచిదని వారంతా భావిస్తున్నారు. అంతర్గత కలహాలు, కుమ్ములాటలతోనే కాంగ్రెస్ ప్రభుత్వాలు కూలిపోతున్నాయి’ అని విజయవర్గీయ అన్నారు. 100% విజయం: యడియూరప్ప సోమవారం జరిగే విశ్వాసపరీక్షలో విజయం సాధిస్తామని ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప విశ్వాసం వ్యక్తం చేశారు. ‘సోమవారం అసెంబ్లీలో మెజారిటీని 100 శాతం నిరూపించుకుంటా. ఆర్థిక బిల్లును ఆమోదించకుంటే ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేం. కాబట్టి అసెంబ్లీ ప్రారంభంకాగానే విశ్వాసపరీక్షను ముగించి, ఆర్థిక బిల్లుకు ఆమోదం తెలుపుతాం. కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వం తయారుచేసిన ఆర్థిక బిల్లునే సభలో ప్రవేశపెట్టబోతున్నాం. ఇందులో చిన్న కామా, ఫుల్‌స్టాప్‌ను కూడా మార్చలేదు’ అని అన్నారు. -
కర్ణాటక రాజకీయాల్లో మరో ట్విస్ట్
సాక్షి, బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ రమేశ్ కుమార్ ఆదివారం అనూహ్య నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కుమారస్వామి ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన 14 మంది రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. వీరిలో 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముగ్గురు జేడీ(ఎస్)కు చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రెబల్ ఎమ్మెల్యేలు సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నారు. అనర్హత వేటు వేయడం చట్టవిరద్దమని, రేపు సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని జేడీ(ఎస్) రెబల్ ఎమ్మెల్యే విశ్వనాథ్ తెలిపారు. తమపై అనర్హత వేటు వేయడాన్ని చట్ట విరుద్ధంగా భావిస్తున్నానని, అందుకే ఈ విషయమై తాను సుప్రీంను ఆశ్రయిచంనున్నట్లు స్పష్టం చేశారు. స్పీకర్ నిర్ణయం చట్టవిరుద్ధంగా ఉందని, సుప్రీంకోర్టులోనే తమకు న్యాయం జరుగుతుందని మరో రెబల్ ఎమ్మెల్యే ప్రతాప్ గౌడ ఓ వీడియో విడుదల చేశారు. (చదవండి : కర్ణాటక స్పీకర్ సంచలన నిర్ణయం) కాగా స్పీకర్ తాజా నిర్ణయంతో వేటు పడిన మొత్తం సభ్యుల సంఖ్య 17కి చేరింది(ఇదివరకే ముగ్గురు ఎమ్మెల్యేలపై వేటు వేశారు). మరోవైపు సోమవారం అసెంబ్లీలో బలనిరూపణ ఉంటుందని, సభ్యులంతా దీనికి హాజరుకావాలంటూ స్పీకర్ ఆదేశాలు జారీచేశారు. శుక్రవారం రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన యడియూరప్ప.. సోమవారం అసెంబ్లీలో బలనిరూపణ చేయాల్సి ఉన్న విషయం తెలిసిందే. 17 మంది ఎమ్మెల్యేలపై వేటు పడటంతో కర్ణాటక అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 207కు పడిపోయింది. బల నిరూపణకు కావల్సిన బలం 105. భాజపాకి 105మంది సొంత పార్టీ సభ్యులతో పాటు ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు ఉంది. దీంతో రేపు బల పరీక్షలో సీఎం యడియూరప్ప నెగ్గేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. -
కంటతడి పెట్టిన కర్ణాటక స్పీకర్
బెంగళూరు : కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైపాల్‌రెడ్డి మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు. కర్ణాటక స్పీకర్ రమేశ్ కుమార్ జైపాల్‌రెడ్డి మరణవార్త విని దు:ఖాన్ని ఆపుకోలేకపోయారు. దీనిపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘జైపాల్‌రెడ్డి నాకు వ్యక్తిగతంగా చాలా దగ్గరగా ఉండేవారు. ఆయన నాకు గురువుతో సమానం. నాకు ఆయన 1980 నుంచి తెలుసు.. నేను ఆయన్ని అన్నయ్యలా భావిస్తాను. ఆయన గొప్ప పార్లమెంటరీయన్. మంచి మనస్సు ఉన్నవాడు. జీవితంలో జైపాల్‌రెడ్డి లాంటి గొప్ప నాయకుడితో పనిచేయడం నా అదృష్టం. ఆయనకు నేను వందనం చేస్తున్నాను. ఇది నాకు చాలా విషాదకరమైన రోజు’ అని తెలిపారు. కాగా, తెలంగాణ రాజకీయాల్లో కీలక భూమిక పోషించిన జైపాల్‌రెడ్డి అనారోగ్య కారణాలతో ఆదివారం తెల్లవారు జామున కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. పార్టీలకు అతీతంగా పలువురు నేతలు జైపాల్‌రెడ్డికి నివాళులర్పించేందకు జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. -
కర్ణాటక స్పీకర్ సంచలన నిర్ణయం
సాక్షి, బెంగళూరు: గత కొంతకాలంగా ఉత్కంఠ రాజకీయాలకు వేదికయిన కర్ణాటకలో అసెంబ్లీ స్పీకర్ ఊహించని నిర్ణయం తీసుకున్నారు. కుమారస్వామి ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన మొత్తం 14 మంది రెబల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ రమేష్ కుమార్ అనర్హత వేటు వేస్తూ.. సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇదివరకే ముగ్గురు ఎమ్మెల్యేలపై వేటు వేసిన స్పీకర్.. తాజాగా 13 మంది కాంగ్రెస్, ఓ స్వతంత్ర సభ్యుడిపై అనర్హత వేటు వేశారు. దీంతో వేటు పడిన మొత్తం సభ్యుల సంఖ్య 17కి చేరింది. స్పీకర్ తాజా నిర్ణయం తక్షణమే అమల్లోకి రానుంది.. దీంతో వారంత నాలుగేళ్లపాటు ఎన్నికల్లో పోటీకి దూరం కానున్నారు. మరోవైపు సోమవారం అసెంబ్లీలో బలనిరూపణ ఉంటుందని, సభ్యులంతా దీనికి హాజరుకావాలంటూ స్పీకర్ ఆదేశాలు జారీచేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడినా తాను మాత్రం స్పీకర్ పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు. శుక్రవారం రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన యడియూరప్ప.. సోమవారం అసెంబ్లీలో బలనిరూపణ చేయాల్సి ఉన్న విషయం తెలిసిందే. 17 మంది సభ్యులపై అనర్హత వేట పడడంతో.. సభలో మొత్తం సభ్యుల సంఖ్య 208కి పడిపోయింది. దీంతో మేజిక్ ఫిగర్ 104కి చేరింది. బీజేపీకి ప్రస్తుతం 105 మంది సభ్యులు ఉండగా.. ఓ స్వతంత్ర ఎమ్మెల్యే మద్దతు ప్రకటించారు. దీంతో విశ్వాస పరీక్షలో బీజేపీ సునాయాసంగా నెగ్గే అవకాశం ఉంది. అనర్హత వేటుకు గురయిన ఎమ్మెల్యేలు వీరే.. కాంగ్రెస్ బస్వరాజు మునిరత్నం సోమశేఖర్ రోషన్‌బేగ్ ఆనంద్‌సింగ్ నాగరాజు బీసీ పాటిల్ ప్రతాప్ గౌడ్ సుధాకర్ శివరాం హెబ్బర్ మంత్ పాటిల్ రమేష్ జార్జ్‌హోళి మహేష్ జేడీఎస్ గోపాలయ్య నారాయణ గౌడ్ విశ్వనాథ్ శంకర్(స్వతంత్ర) -
మర్యాదగా తప్పుకోకుంటే అవిశ్వాసమే!
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా బీఎస్ యడియూరప్ప ప్రమాణస్వీకారం చేసి 24 గంటలు కూడా కాకముందే బీజేపీ జోరుపెంచింది. కాంగ్రెస్ నేత, కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ కె.ఆర్.రమేశ్ కుమార్ వెంటనే బాధ్యతల నుంచి తప్పుకోవాలని సందేశాన్ని పంపింది. స్వచ్ఛందంగా తప్పుకోకుంటే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి బలవంతంగా సాగనంపాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ మేరకు బీజేపీ తరఫు ప్రతినిధి ఒకరు ఈ విషయాన్ని నేరుగా స్పీకర్‌కు చేరవేసినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఈ విషయమై బీజేపీ సీనియర్ నేత ఒకరు మాట్లాడుతూ.. ‘రమేశ్ కుమార్ స్వచ్ఛందంగా తప్పుకోకుంటే ఆయనపై అవిశ్వాసం పెట్టక తప్పదు. అయితే మా తొలిప్రాధాన్యం సోమవారం అసెంబ్లీలో బలపరీక్ష నెగ్గడం, ఆర్థిక బిల్లుకు ఆమోదం తెలపడమే. ఇది పూర్తయ్యాక స్పీకర్ విషయమై నిర్ణయం తీసుకుంటాం’ అని చెప్పారు. కాంగ్రెస్–జేడీఎస్ కూటమికి లబ్ధి చేకూర్చేలా స్పీకర్ వ్యవహరించవచ్చన్న అనుమానంతోనే బీజేపీ దూకుడు పెంచినట్లు తెలుస్తోంది. మరోవైపు యడియూరప్ప ప్రభుత్వానికి తాము మద్దతిచ్చే ప్రసక్తే లేదని జేడీఎస్ చీఫ్ దేవెగౌడ చెప్పారు. అనర్హతపై రెబెల్స్ న్యాయపోరాటం.. స్పీకర్ అనర్హతవేటు వేసిన నేపథ్యంలో ముగ్గురు కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యేలు న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు. స్పీకర్ నిర్ణయంపై సుప్రీంకోర్టుతో పాటు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించాలని ఎమ్మెల్యేలు రమే శ్ జార్కిహోళి, మహేశ్ కుమటహళ్లి, శంకర్లు నిర్ణయించారు. సుప్రీంలో రమేశ్, మహేశ్‌ల పిటిషన్లు ఇప్పటికే పెండింగ్‌లో ఉన్నందున స్పీకర్ కనీసం నోటీసు ఇవ్వకుండా, తమ వివరణ తీసుకోకుండా అనర్హులను చేయడంపై వీరిద్దరూ అఫిడవిట్లు దాఖలు చేస్తారని సమాచారం. స్వతంత్ర ఎమ్మెల్యే ఆర్.శంకర్‌ను కాంగ్రెస్ సభ్యుడిగా పరిగణిస్తూ స్పీకర్ అనర్హతవేటు వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శంకర్ సోమవారం హైకోర్టును ఆశ్రయిస్తారని తెలుస్తోంది. తాను స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలుపొందినందున ఫిరాయింపుల చట్టం కింద వేటువేయడం కుదరదని శంకర్ చెబుతున్నారు. తమిళనాడులో 18 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడినప్పటికీ, 6 నెలల్లోపు జరిగిన ఉపఎన్నికల్లో పోటీచేసేందుకు సుప్రీంకోర్టు, ఈసీ అనుమతించిన విషయా న్ని గుర్తుచేస్తున్నారు. కాబట్టి అసెంబ్లీ ముగిసేవరకూ (2023) అనర్హత వేటేస్తూ స్పీకర్ ఇచ్చిన ఉత్తర్వులు కోర్టులో నిలబడవని స్పష్టం చేస్తున్నారు. -
ముగ్గురు రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు
సాక్షి, బెంగళూరు : విశ్వాస పరీక్ష ముగిసినా కర్ణాటకలో రాజకీయ సంక్షోభానికి ఇంకా తెరపడలేదు. కుమారస్వామి ప్రభుత్వం కూలిపోయిన 48 గంటల్లోనే కర్ణాటక స్పీకర్ రమేష్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ముగ్గురు రెబల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ గురువారం అనర్హత వేటు వేశారు. స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆర్.శంకర్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రమేష్ జార్జ్‌హోళి, మహేష్... 2023 వరకూ ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేస్తున్నట్లు ప్రకటన చేశారు. విశ్వాస తీర్మానంలో కుమారస్వామి ప్రభుత్వానికి వీరంతా మద్దతు ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. కాగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో శంకర్ కేపీజేపీ (కర్ణాటక ప్రజకీయ జనతా పార్టీ) తరపును పోటీ చేసి గెలుపొందారు. అయితే ఆయన కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ఈ ఏడాది జూన్ 14న గవర్నర్‌కు లేఖ ఇచ్చారు. అంతేకాకుండా కేపీజేపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. విలీన ప్రక్రియకు స్పీకర్ ఈ ఏడాది జూన్ 25న ఆమోదం తెలపడంతో ఆర్.శంకర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పరిగణించడం జరిగింది. కాగా తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్యే శంకర్ బీజేపీలోకి చేరేందుకు సన్నద్ధం అయ్యారు. దీంతో కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత సిద్ధరామయ్య ఆయనపై అనర్హత పిటిషన్ దాఖలు చేశారు. ఆ ఫిర్యాదుపై స్పీకర్ ఇవాళ నిర్ణయం తీసుకున్నారు. 17 రోజులు హైడ్రామా కాంగ్రెస్-జేడీఎస్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంలో భాగంగా ముఖ్యమంత్రి కుమారస్వామి పనితీరుకు వ్యతిరేకంగా రెండు పార్టీల నుంచి 16మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఫలితంగా సంకీర్ణ ప్రభుత్వం ఒక్కసారిగా ప్రమాదంలో పడింది. అయితే ఎవరు ఎందుకు రాజీనామా చేశారనే దానిపై ఇప్పటివరకూ స్పష్టత రాలేదు. రాజీనామా చేసిన 16మందిలో 12మంది ముంబయిలో మకాం వేశారు. పార్టీ అధిష్టానం విప్ జారీ చేసినప్పటికీ పట్టించుకోలేదు. ముంబయికి ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్‌తో పాటు కాంగ్రెస్ జాతీయ నేతలు గులాంనబీ ఆజాద్, కేసీ వేణుగోపాల్ వెళ్లినా ఎలాంటి ఫలితం లేకపోయింది. -
కర్ణాటకం: నా రక్తం మరిగిపోతోంది: స్పీకర్
సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాజకీయ సంక్షోభం చివరి దశకు చేరుకుంది. మరికొద్ది సేపట్లో స్పీకర్ అసెంబ్లీలో విశ్వాసపరీక్ష నిర్వహించనున్నారు. సభలో చర్చలో భాగంగా స్పీకర్ రమేష్ కుమార్ భావోద్వేగ ప్రసంగం చేశారు. గత కొన్ని రోజులుగా సభలో జరిగే పరిణామాలన్నింటితో తన రక్తం మరిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సభ్యులు కనీస సంప్రదాయలు పాటించకుండా స్పీకర్ పదవిలో ఉన్న తనను అనేక ఇబ్బందులకు గురిచేశారని అన్నారు. రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవికి తాను పూర్తిగా న్యాయం చేసినట్లు భావిస్తున్నానని చెప్పారు. రాజ్యాంగ ప్రమాణాల మేరకు సభను నిర్వహించానన్నారు. సభలో జరగబోయే పరిణామాలను తాము ముందే ఊహించి.. తన రాజీనామా పత్రాన్ని జేబులో పెట్టుకుని తిరుగుతున్నట్లు వెల్లడించారు. తానేంటో ప్రపంచానికి తెలుసని వ్యాఖ్యానించారు. కాగా సభలో సీఎం కుమార స్వామి ఉద్వేగభరితంగా ప్రసంగించారు. ఓటింగ్‌కు తాము సిద్ధమేని...కానీ డివిజన్ పద్దతిలో ఓటింగ్ జరపాలని స్పీకర్‌ని కోరారు. దానికి స్పీకర్ నిరాకరించారు. -
‘కర్నాటకం’లో కొత్త మలుపు
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. ముఖ్యమంత్రి కుమారస్వామి ఈరోజు మధ్యాహ్నం 1.30 గంటల్లోగా మెజారిటీ నిరూపించుకోవాలన్న గవర్నర్ ఆదేశాలను శాసనసభ పట్టించుకోలేదు. గవర్నర్ ఆదేశాల ప్రకారం బలపరీక్ష నిర్వహించేందుకు స్పీకర్ కేఈఆర్ రమేశ్‌కుమార్ తిరస్కరించారు. తనను సుప్రీంకోర్టు, గవర్నర్ శాసించలేరని అన్నారు. బలపరీక్షలకు ఆదేశాలు ఇవ్వాలని బీజేపీ సభ్యులు పదేపదే డిమాండ్ చేసినా ఆయన తలొగ్గలేదు. తనను ఒత్తిడికి గురిచేసే వాడు ఇంకా పుట్టలేదని వ్యాఖ్యానించారు. బలపరీక్షపై స్పీకర్ ఆదేశాలకు కట్టుబడతానని సీఎం కుమారస్వామి తెలిపారు. ‘మధ్యాహ్నం 1.30 గంటల్లోగా బలం నిరూపించుకోవాలని నన్ను స్పీకర్ ఆదేశించారు. రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాలపై నిర్ణయాధికారాన్ని స్పీకర్‌కే సుప్రీంకోర్టు వదిలిపెట్టింది. ఇప్పటికే నేను అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాను. బలనిరూపణపై నాకు గవర్నర్ ఇచ్చిన ఆదేశాలపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు. ఈ అంశాన్ని ఆయనకే వదిలిపెడుతున్నాన’ని కుమారస్వామి అన్నారు. (చదవండి: యడ్యూరప్ప చేతులు జోడించి వేడుకున్నారు కానీ..) తాను నిప్పుల కుంపటిపై కూర్చున్నట్టుగా ఉందని అంతకుముందు స్పీకర్ కేఆర్ రమేశ్ కుమార్ అన్నారు. గౌరవంతో బతికే తనను కించపరిచే విధంగా కొంత మంది మాట్లాడుతున్నారని వాపోయారు. అసెంబ్లీలో సభ్యులు మాట్లాడే ప్రతి మాట రికార్డవుతుందని హెచ్చరించారు. హడావుడిగా నిర్ణయాలు తీసుకోబోనని, చర్చ తర్వాతే బలపరీక్ష జరుగుతుందని స్పష్టం చేశారు. భోజన విరామం కోసం సభను స్పీకర్ మధ్యాహ్నం 3 గంటల వరకు వాయిదా వేయడంతో హైడ్రామా కొనసాగుతోంది. గవర్నర్ ఏమంటారో..? డెడ్‌లైన్ విధించే అధికారం గవర్నర్‌కు ఉంటుందని బీజేపీ నాయకులు వాదిస్తున్నారు. అసెంబ్లీ వ్యవహారాల్లో గవర్నర్ జోక్యం చేసుకోవడం తగదని కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలు అంటున్నారు. ఎన్నిరోజులైనా సరే చర్చ కొనసాగించాలి, సభ్యులందరికీ మాట్లాడే అవకాశం కల్పించాలని మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. అందరి అభిప్రాయాల తర్వాతే విశ్వాస పరీక్ష జరపాలని సూచించారు. తన నిర్ణయాన్ని స్పీకర్ ధిక్కరించిన నేపథ్యంలో గవర్నర్ వజూభాయ్‌వాలా ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. (చదవండి: కర్నాటకం క్లైమాక్స్ నేడే) -
యడ్యూరప్ప చేతులు జోడించి వేడుకున్నారు కానీ..
సాక్షి, బెంగళూరు: ముఖ్యమంత్రిగా తాను ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచే తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కర్ణాటక సీఎం హెచ్డీ కుమారస్వామి ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే సంకీర్ణ సర్కారును అస్థిరపరిచేందుకు కుట్రలు చేసిందన్నారు. బలపరీక్ష ఎదుర్కొనున్న నేపథ్యంలో ఈ ఉదయం 11 గంటలకు కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ.. ‘కొంత మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు మీ (స్పీకర్) ముందు ఉన్నాయి. దీనిపై నిర్ణయం తీసుకోవడానికి రాజ్యాంగ నిబంధనలు ఉన్నాయి. ప్రస్తుత పరిణామాలు రాజ్యాంగ విలువలను ధ్వంసం చేసేలా కనబడుతున్నాయి. ఎటువంటి సందర్భంలో ఈ రాజీనామాలు చేశారో గమనించాలి. ఇంత ముఖ్యమైన అంశంపై చర్చించేందుకు బీజేపీ ఇష్టపడటం లేదు. చర్చ జరిగిన తర్వాతే నా సీటు హస్తగతం చేసుకోండి. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తొందరపడకండి. ఇవాళ కాకపోతే, సోమవారం అయినా అధికారాన్ని అందుకోవచ్చు. గతంలో ముఖ్యమంత్రి పదవి నుంచి యడ్యూరప్పను బీజేపీ అధినాయత్వం తొలగించినప్పుడు తనను తప్పించొద్దని రెండు చేతులు జోడించి ఆయన ప్రాధేయపడ్డారు. కానీ నేను అలా చేయను. పదవి కోసం ఎవరినీ వేడుకోను. కాంగ్రెస్ నాయకులే వచ్చి నన్ను ముఖ్యమంత్రిని చేశారు. నాకు సీఎం సీటు ముఖ్యం కాదు. నా ఆలోచన అంతా భవిష్యత్ తరాల గురించే. ప్రభుత్వాలను ఇలా కూల్చడానికే స్వాతంత్ర్య సమరయోధులు మనకు ప్రజాస్వామ్యాన్ని అందించారా’ అంటూ ప్రశ్నించారు. తాను నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నానని స్పీకర్ కేఆర్ రమేశ్‌కుమార్ పునరుద్ఘాటించారు. తనపై అపనిందలు వేసినవారు ముందుగా తమ బతుకెంటో తెలుసోవాలని ఘాటుగా సమాధానమిచ్చారు. తన దగ్గర డబ్బు లేకపోయినా, విలువలకు కట్టుబడే నైజం ఉందన్నారు. రెబల్ ఎమ్మెల్యేల తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు బలపరీక్ష వెంటనే నిర్వహించాలని బీజేపీ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. (చదవండి: అసెంబ్లీలోనే భోజనం, నిద్ర) -
మీరు మనుషులేనా? ఎక్కడేమి అడగాలో తెలియదా?
సాక్షి. బెంగళూరు: రాష్ట్రంలో అధికారంలో ఉన్న సంకీర్ణ ప్రభుత్వంలో ఒక్క సారిగా అసమ్మతి తలెత్తడంతో పాటు శనివారం ఒక్క రోజే 10 మంది అసమ్మతి ఎమ్మెల్యేలు రాజీనామా చేయడానికి రావడం, దీనిపై శాసనసభ స్పీకర్ రమేష్ కుమార్‌ను అడగడానికి వచ్చిన మీడియా ప్రతినిధులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఉదయం నగరంలోని జయదేవ ఆస్పత్రిలో ఆయన బంధువు ఒకరిని పరామర్శించడానికి ఆస్పత్రికి వచ్చారు. దీంతో రాజీనామాలపై ఏమైనా మాట్లాడతారేమోనని మీడియా ప్రతినిధులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. చదవండి: కన్నడ సంక్షోభం ఆయన ఆస్పత్రి నుంచి బయటకు వస్తుండగా చుట్టుముట్టి ప్రశ్నల వర్షం కురిపించారు. దాంతో ఆగ్రహానికి లోనైన స్పీకర్ మండిపడ్డారు. మీరు మనుషులా, ఎక్కడ ఏమి అడగాలో తెలియదా?, నా దగ్గరి బంధువు ఆస్పత్రిలో ఉంటే చూడటానికి వస్తే ఇక్కడ వచ్చి ఏం మాట్లాడుతున్నారు? అని ఆగ్రహించారు. ఆస్పత్రిలో ఉన్న వారిని పరామర్శించడానికి వస్తే మీకూ వార్తలు కావాలా?, మీరు మనుషులా, కాదా అని వ్యాఖ్యానించడంతో మీడియా ప్రతినిధులు ఆవేదనకు లోనయ్యారు. ఇలా దూషించడం తగదని పలువురు వ్యాఖ్యానించారు. -
ఘరానా మోసం
లేదు సర్. తమ్ముడి మీద నమ్మకంతో వాటిని తీసుకున్నాను. వాట్సాప్లూ, ఫొటోలూ లేనప్పుడు ఇదే పద్ధతిలో మా మధ్య నగల మార్పిడి జరిగేది. ప్రతిసారీ ఆ బంటిగాడే వచ్చి నగలు తీసుకెళ్లేవాడు. ఈసారీ అలాగే జరిగింది. గోపాల్ సే తన కారులోంచి దిగి కంగారుగా పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్లాడు. నేరుగా ఎస్సై రమేష్ కుమార్ దగ్గరకు వెళ్లాడు. ఎస్సైగారూ! ఎలాగైనా మీరే కాపాడాలి. దారుణంగా మోసపోయాను. మీరు నన్ను కాపాడకపోతే నాకు ఆత్మహత్యే దారి.ఆ మాటలు వినగానే కుమార్ షాక్ అయ్యాడు. ఎప్పుడూ హుందాగా, ఠీవిగా దర్పాన్ని ప్రదర్శించే గోపాల్ సేఠేనా ఇలా మాట్లాడుతోంది అనుకున్నాడు. ‘‘గోపాల్ సే గారూ! ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు? రండి. ముందు కూర్చోండి. తాగడానికి ఏమైనా తీసుకుంటారా?’’ అన్నాడు.‘‘ఏమీ వద్దు ఎస్సైగారూ! ముందు నా కంప్లైంట్ తీసుకోండి.. ప్లీజ్..!’’‘‘సరే చెప్పండి. ఏం జరిగింది?’’ అడిగాడు ఎస్సై.గోపాల్ సే పూర్వీకులది కలకత్తా. చాలా ఏళ్ల కిందటే వాళ్ల నాన్న ఇంట్లో గొడవ పడి హైదరాబాద్ వచ్చి నార్తిండియన్లు ఎక్కువగా ఉండే గాంధీనగర్ ఏరియాలో నగల దుకాణం పెట్టాడు. అది దినదినాభివృద్ధి చెంది ఆ ఏరియాలో మంచి పేరు తెచ్చుకుంది. అలాగే వాళ్లకు మంచి సంపాదన తెచ్చి పెట్టింది. వాళ్ల నాన్న చనిపోయిన తర్వాత గోపాల్ సేదాన్ని మరింత అభివృద్ధిలోకి తెచ్చాడు. ఆ ఏరియాలో మిగిలిన అన్ని నగల దుకాణాల కన్నా గోపాల్ సే దుకాణానికి గ్లామరెక్కువ. సిటీలో ఒక పెద్ద మల్టీ ఫ్లోర్ జ్యువెలరీ షాపు ఓపెన్ చేయాలనేది అతని ఆశ. అతని బంధువులంతా కలకత్తాలోనే ఉంటారు. అందరూ జ్యువెలరీ బిజినెస్‌లోనే ఉన్నారు. అక్కడి వాళ్లకు ఇతను డిజైన్లు పంపడం, అక్కడి డిజైన్లు వాళ్లు ఇతనికి పంపడం ఏళ్ల నుంచి జరుగుతూనే ఉంది.ఎస్సై రమేష్‌కుమార్ ఈ మధ్యనే నిజామాబాద్ నుంచి గాంధీనగర్ పోలీస్‌స్టేషన్‌కి ట్రాన్స్ఫర్ మీద వచ్చాడు. అతని భార్య అంటే అతనికి ఎనలేని ప్రేమ. ఆమె కోసం ఏ పని చేయడానికైనా వెనుకాడడు. మొన్నామధ్య డీజీపీ ఇంట్లో జరిగిన వేడుకలో డీజీపీ భార్య వేసుకున్న నెక్లెస్ రమేష్‌కుమార్ భార్యకి తెగ నచ్చేసింది. వచ్చే నెలలో జరగబోయే పోలీస్ గెట్ టుగెదర్ పార్టీకి అలాంటిదే కావాలని పట్టుబట్టింది. ఎంక్వైరీ చేస్తే అది గోపాల్ సే షాపు డిజైన్ అని తేలింది. భార్యను వెంటబెట్టుకొని షాపుకెళ్లాడు. ఆ డిజైన్ అయిపోయిందని, అటువంటిది తయారు చేయాలన్నా ఇంకో మూడునెలల టైమ్ పడుతుందని గోపాల్ సేచెప్పాడు. ఇంకో ఖరీదైన నెక్లెస్ చూపించి, ‘ఇది తీసుకోండి. లేటెస్ట్ డిజైన్. నిన్ననే డీజీపీగారి వైఫ్ వచ్చి నెక్ట్స్ మంత్ ఏదో పార్టీ ఉందని దీనిని తీసుకెళ్లారు’’ అని చెప్పాడు. ఆ మాట వినగానే రమేష్‌కుమార్ భార్య కళ్లు మెరిశాయి. తనకు అది కావాల్సిందేనని ఆమె చూపుతోనే రమేష్‌కుమార్‌కి అర్థమైంది. ధర ఎంతని అడిగితే, ‘జస్ట్ యాభై లక్షలే’ అని చెప్పాడు గోపాల్ సే. ధర వినగానే రమేష్‌కుమార్ గుండె అదిరిపోయింది. ‘‘ఏంటీ యాభై లక్షలే’’ అంటూ నోరెళ్లబెట్టాడు. ‘‘ఔను సర్! ప్యూర్ గోల్డ్. ఫైన్ కటింగ్ డైమండ్స్...’’ అంటూ ఏవేవో చెబుతున్నాడు గోపాల్ సే. కానీ అవేవీ వినకుండా రమేష్ కుమార్ ఏదో ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు ఇది కొనివ్వకపోతే భార్య పెట్టే టార్చర్‌ను తట్టుకోలేడు. ఈసారి ఎన్ని నెలలు ఫుడ్డు, బెడ్డు కట్ చేస్తుందోనని అతని భయం. ఆ నెక్లెస్‌ను ఎలా దక్కించుకోవాలా అనే ఆలోచనలో పడ్డాడు.ఇంతలో గోపాల్ సే, ‘‘ఎస్సైగారు! మీ ప్రాబ్లమ్ నాకు అర్థమైంది. డీజీపీగారంటే పెద్దోళ్లు. వాళ్ల లెవలూ, వాళ్ల మెయిన్ ఇన్కమ్మూ, సైడ్ ఇన్కమ్మూ వేరే. మనమా వాళ్లతో పోటీ పడలేం. కానీ పడాలని కోరిక. సరే, అదంతా పక్కన పెట్టండి. మీరు నాకో సాయం చేస్తే మీకు ఇలాంటివి బోలెడు మీకు సగం రేటుకే అందుతాయి. అలాగే మీకొచ్చే మామూలు మీకు ఎలాగూ అందుతూనే ఉంటుంది. ఇంతకీ మీరు చేయాల్సిందల్లా బయట నుంచి నాకు వేరే దారిలో వచ్చే బంగారాన్ని అడ్డుకోకుండా ఉండటమే.. అంటే మీరు ఈ ఏరియాకి కొత్తగా వచ్చారు. చెప్పడం నా బాధ్యత. అయినా ఇవన్నీ మీకు తెలియనివి కావులెండి..’’ అంటూ నసుగుతూ అన్నాడు.రమేష్ కుమార్ కొద్దిసేపు మౌనంగా ఉండి, ‘‘సరే, ఆ నెక్లెస్ ప్యాక్ చేసి ఇంటికి పంపండి’’ అని వెళ్లిపోయాడు. అలా వాళ్ల మధ్య స్నేహం మొదలైంది.ధన్ తెరాస్ కోసం గోపాల్ సే పెద్ద ఎత్తున కొత్త డిజైన్లు చూపిస్తున్నాడు. అప్పుడే కలకత్తాలో ఉండే అతని బాబాయి కొడుకు శ్యామ్‌లాల్ తను చేసిన కొత్త డిజైన్ల ఫొటోలను వాట్సాప్ చేయమని అడిగాడు. గోపాల్ సేఆ ఫొటోలను అతనికి పంపాడు. వెంటనే శ్యామ్‌లాల్ ఫొటోస్‌లో చిన్న చిన్న డిజైన్స్ సరిగా కనపడటం లేదని, ఒకప్పట్లా పాత పద్ధతిలోనే వాటిని తనకు పంపాలని వాటిని చూసి తను నగలు చేసిన తర్వాత తిరిగి పంపిస్తానని, అవి తిరిగి వచ్చే వరకు అంతే విలువ గల నగలను వాటికి బదులు పంపిస్తానని, బంటీ వాటిని తీసుకుని వచ్చే శుక్రవారం మీ దగ్గరకొస్తాడని వాట్సాప్‌లో మెసేజ్ పంపాడు. దానికి గోపాల్ సే ‘ఓకే’ అంటూ బదులిచ్చాడు.బంటి శ్యామ్‌లాల్ దగ్గర చాలా ఏళ్లుగా పనిచేస్తున్నాడు. చాలా నమ్మకస్తుడు. శ్యామ్‌లాల్ ఇచ్చిన నగలతో బంటి శుక్రవారం గోపాల్ సేవద్దకొచ్చాడు. బంటి ఇచ్చిన నగలు తీసుకుని, తన కొత్త డిజైన్లను అతనికి ఇచ్చి పంపించాడు గోపాల్ సేవారం గడిచిపోయింది. ధన్ తెరాస్కు మరో వారం రోజులే ఉంది. శ్యామ్‌లాల్ నుంచి ఎలాంటి కబురూ రావట్లేదు. గోపాల్ సే శ్యామ్లాల్కి ఫోన్ చేశాడు. అటువైపు నుంచి వచ్చిన సమాధానానికి గోపాల్ సేకొయ్యబారిపోయాడు.అసలు తాను డిజైన్ల కోసం ఏ నగలూ అడగలేదని, అయినా బంటి తన దగ్గర పని మానేసి రెండు వారాలు అవుతోందని శ్యామ్‌లాల్ అన్నాడు. పైగా, ‘‘ఏంటి అన్నయ్యా! నా మీద ఏదో కుట్ర పన్నుతున్నట్టున్నావు. అన్నయ్యా జాగ్రత్త! అక్కడ నువ్వెంతో ఇక్కడ నేనూ అంతే’’ అని ఫోన్ కట్ చేశాడు.గోపాల్ సేకి ఏమీ అర్థం కాలేదు. వెంటనే కలకత్తాకు బయలుదేరాడు. శ్యామ్‌లాల్ షాపులోకి అడుగు పెడుతూనే షాక్ అయ్యాడు. గోపాల్ సే తయారు చేసిన డిజైన్లన్నీ షోకేసుల్లో పెట్టి ఉన్నాయి. ‘‘ఏంటి తమ్ముడూ నన్ను నగలు అడగలేదన్నావు. మరి ఈ డిజైన్లు ఎవరివి?’’‘‘అవి నా డిజైన్లే’’ అని దబాయించాడు శ్యామ్‌లాల్. గోపాల్ సేకు చిర్రెత్తుకొచ్చింది. ఇద్దరికీ మాటా మాటా పెరిగి గొడవ పెద్దదయింది. చివరకు పోలీసులు రంగంలోకి దిగి గోపాల్ సేని అరెస్టు చేశారు. రెండు రోజుల తర్వాత విడుదలై, నేరుగా హైదరాబాద్ చేరుకున్నాడు.జరిగినదంతా చెప్పి ‘‘తమ్మడు ఇలా చేస్తాడనుకోలేదు ఎస్సైగారూ! వీటి విలువ పది కోట్లు. ధన్ తెరాస్ వస్తోంది కదా అని సేల్స్ ఎక్కువవుతాయని అప్పు చేసి మరీ వాటిని తయారు చేయించాను. ఇప్పుడు మీరే నన్ను కాపాడాలి. లేకపోతే ఆత్మహత్యే గతి’’ అంటూ భోరుమన్నాడు. ‘‘ఊరుకోండి గోపాల్ సేగారు! చిన్నపిల్లాడిలా ఏడిస్తే ఏం లాభం? ముందు ఈ మంచినీళ్లు తాగండి’’ అంటూ గ్లాస్ అందించాడు. ‘‘అయినా మీ దగ్గర మీ తమ్ముడు ఇచ్చిన అంతే విలువ గల నగలు ఉన్నాయి కదా!’’ అని ఎస్సై అనగానే..‘‘అయ్యో! నా ఖర్మ సార్.. ఖర్మ.. అవి నకిలీవి’’ అంటూ నెత్తికొట్టుకుంటూ మళ్లీ ఏడుపు లంకించుకున్నాడు గోపాల్ సే‘‘అదేంటి తీసుకునేటప్పుడు మీరు చెక్ చేసుకోలేదా?’’‘‘లేదు సర్. తమ్ముడి మీద నమ్మకంతో వాటిని తీసుకున్నాను. వాట్సాప్లూ, ఫొటోలూ లేనప్పుడు ఇదే పద్ధతిలో మా మధ్య నగల మార్పిడి జరిగేది. ప్రతిసారీ ఆ బంటిగాడే వచ్చి నగలు తీసుకెళ్లేవాడు. ఈసారీ అలాగే జరిగింది.’’ ‘‘మరి కలకత్తా పోలీసులకు కంప్లైంట్ ఇవ్వొచ్చు కదా?’’‘‘ఏంటి ఎస్సైగారు! అన్నీ తెలిసిన మీరే ఇలా అడిగితే ఎలా? అది వాడి ఏరియా సర్. నేను కంప్లైంట్ చెయ్యక ముందే నన్ను అరెస్టు చేయించినవాడు. నేను కంప్లైంట్ చేస్తే దాన్ని తనకు అనుకూలంగా మార్చుకునే సత్తా ఉన్నవాడు. అందుకే నేను డైరెక్ట్‌గా మీ దగ్గరకు వచ్చాను. మీ పోలీసు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఎలాగైనా మీరు వాటిని నాకు దక్కేలా చూడండి. మీకు వచ్చేది మీకు వచ్చేలా చేస్తాను’’ అని ఎస్సై రమేష్‌కుమార్ చేతులు పట్టుకుని బతిమాలాడు.‘‘సరే గోపాల్ సే గారు! మీరు బాధపడకండి. ప్రాబ్లమ్ నాకు క్లియర్‌గా అర్థమైంది. వాటిని మీ దగ్గరకు చేర్చే బాధ్యత నాది. నాకు ఇవ్వాల్సింది మాత్రం మర్చిపోకండి. మీ ఫోన్ ఇచ్చి వెళ్లండి. అలాగే బంటీ ఫోన్ నంబర్ కూడా’’‘‘అలాగే సర్. మీ మీద నమ్మకంతో ఈ ఒక్కరోజన్నా నేను ప్రశాంతంగా నిద్రపోతాను’’ అని గోపాల్ సేవెళ్లిపోయాడు. గోపాల్ సే ఫోన్ చెక్ చేసి, అతను, అతని తమ్ముడు చేసిన వాట్సాప్ చాట్ చెక్ చేశాడు ఎస్సై రమేష్ కుమార్. అంతా గోపాల్ చెప్పినట్లే ఉంది. క్లూస్ టీమ్‌కి ఆ నంబర్ ఇచ్చి, గోపాల్ సేకి, శ్యామ్లాల్కి జరిగిన ఫోన్ సంభాషణలను రిట్రీవ్ చేసి విన్నాడు. అంతా గోపాల్ సే చెప్పినట్లే కరెక్ట్‌గా ఉంది. గోపాల్ సే ఇంటి నుంచి నకిలీ నగలను హ్యాండోవర్ చేసుకున్నాడు. కలకత్తాలో తనకు తెలిసిన కానిస్టేబుల్ చేత శ్యామ్‌లాల్ షాపులో ఉండే నగల ఫొటోలు తీయించి, వాటిని గోపాల్ సే వాట్సాప్‌లో పంపిన ఫొటోస్‌తో పోల్చి చూసుకున్నాడు. అవి కూడా మ్యాచ్ అయ్యాయి. ఇక ఒకే ఒక్క విషయం నిర్ధారణ కావాల్సి ఉంది. అది బంటీగాడి వాంగ్మూలం. శ్యామ్‌లాల్ ఇదంతా చేయించాడని బంటి చెబితే సరిపోతుంది. జాక్‌పాట్ కొట్టినట్టే. పదికోట్ల విలువ చేసే నగలు రికవరీ చేసుకోవచ్చు. తనకు వచ్చే కమీషన్ కూడా భారీగానే ఉంటుంది అని మనసులో సంతోషించాడు.మర్నాడు డీజీపీకి కేసు వివరించి, ‘‘సర్! బంటీ అరెస్టుకు కావలసిందల్లా కలకత్తా పోలీసుల పర్మిషన్. వాడు అక్కడే ఉన్నట్లు సెల్‌ఫోన్ సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేశాం. మీరు వాళ్లతో మాట్లాడి పర్మిషన్ తెప్పిస్తే మిగిలినదంతా నేను చూసుకుంటాను’’ అని చెప్పడంతో ‘‘గో అహెడ్’’ అన్నాడు డీజీపీ.మర్నాడే కలకత్తా పోలీసుల నుంచి అనుమతి వచ్చింది. ఎస్సై రమేష్‌కుమార్ టీమ్ కలకత్తా వెళ్లి బంటీని అరెస్టు చేసి, హైదరాబాద్ తీసుకొచ్చారు. ఇంటరాగేషన్‌లో ఇదంతా శ్యామ్లాలే చేయించాడని చెప్పాడు వాడు. రేపు వాణ్ణి కోర్టులో హాజరుపరచి, జడ్జి ఎదుట ఇదే మాట అనిపిస్తే బంటీగాడు జైలుకి, లక్షల కమీషన్ తన జేబులోకి అంటూ కలల్లో తేలిపోసాగాడు రమేష్‌కుమార్. ఇంటికెళ్లి భార్యతో ఇదే విషయం చెబితే ఆమె సంతోషంతో అతణ్ణి వాటేసుకుంది. రాత్రంతా వాళ్లు కలల్లో తేలిపోతూ గడిపారు.తెల్లారుజామున కాస్త కునుకుపడుతుండగా రమేష్‌కుమార్‌కు డీజీపీ నుంచి ఫోన్ వచ్చింది. చిరాగ్గా ఫోన్ ఎత్తి ‘‘చెప్పండి సర్.’’ అన్నాడు.‘‘ఏమైందా..? చేసిందంతా చేసి ఇప్పుడు ఏమైందని అడుగుతున్నావా? తొందరగా వెళ్లి ఆ గోపాల్ సేని అరెస్టు చేసి స్టేషన్‌కి తీసుకురా. నేను స్టేషన్‌కు వస్తున్నా’’ అని ఫోన్ కట్ చేశాడు. ఎస్సై రమేష్ కుమార్‌కు నిద్రమత్తంతా వదిలిపోయింది. హడావుడిగా గోపాల్ సే ఇంటికెళ్లి అతణ్ణి అరెస్టు చేసి, స్టేషన్‌కు తీసుకొచ్చారు పోలీసులు. స్టేషన్ కేబిన్‌లో కూర్చుని ఉన్నాడు డీజీపీ. రమేష్ కుమార్ అప్పుడే లోపలకు అడుగు పెట్టాడు. అతణ్ణి చూస్తూనే ‘‘రావయ్యా రా.. నీ కోసమే ఎదురు చూస్తున్నా’’ అన్నాడు.‘సర్ అసలేం జరిగింది? నాకేమీ అర్థం కావడం లేదు. గోపాల్ సేని ఎందుకు అరెస్టు చేసినట్లు?’’ అన్నాడు.‘‘గోపాల్ సే పెద్ద జాదూగాడయ్యా. ఆ నగలు గోపాల్ సేవి కాదు. శ్యామ్లాల్వే. శ్యామ్‌లాల్ దగ్గర పనిచేసే బంటీగాడికి డబ్బు ఆశ చూపి తనవైపు తిప్పుకున్నాడు. బంటీగాడు ఆ నగలు సేఫ్ హౌస్‌లో ఉండగానే వాటిని శ్యామ్‌లాల్ ఫోన్ దొంగిలించి, దాంతో ఫొటోలు తీసి గోపాల్సేకి పంపించాడు. తర్వాత అవి డిలీట్ చేశాడు. తర్వాత ఆ నంబర్ నుంచి బంటీగాడు శ్యామ్లాల్లాగ నగలు అడగడం, ఇక్కడ గోపాల్ సే శ్యామ్‌లాల్ నంబర్‌కి ఫోన్‌చేసి పంపడం.. ఇలా వద్దని బంటీ చేత తనకు నగలు పంపించాలని బంటీగాడే శ్యామ్లాల్లా మెసేజ్‌లు పంపడం .. తర్వాత బంటీ శ్యామ్‌లాల్ దగ్గర పని మానేయడం.. ఇదంతా వాళ్ల ప్లాన్‌లో భాగమే.. ఇక్కడ నీతో పరిచయం కూడా వాడి మాస్టర్ ప్లాన్‌లో భాగమే. వాడి తర్వాతి స్టెప్‌ను నువ్వు కంప్లీట్ చేశావు. బంటీగాడి ఫోన్ ఆన్‌లో ఉంచుకోమని చెప్పి, దాని ద్వారా నువ్వు అతన్ని పట్టుకున్నప్పుడు శ్యామ్లాలే ఇదంతా చేయించాడని చెప్పడం కూడా అతని ప్లాన్‌లో భాగమే. వాడు జైలుకెళ్తే తర్వాత వాణ్ణి బెయిల్‌పై బయటకు తెచ్చే బాధ్యత తనదేనని గోపాల్ సేవాడికి ముందుగానే మాట ఇచ్చాడు.’’ఇదంతా విన్న ఎస్సై రమేష్ నిర్ఘాంతపోయాడు. తన పక్కనే ఉంటూ తనకు తెలియకుండా ఇంత పెద్ద ప్లాన్ వేశాడా.. అనుకున్నాడు.ఇక కేసు ఎలా ఛేదించాడో డీజీపీ చెప్పసాగాడు. ‘‘ఇక్కడ గోపాల్సేకి నువ్వెలా దోస్తువో, అక్కడ శ్యామ్లాల్కి కూడా పోలీసుల్లో ఒక దోస్తు ఉన్నాడు. మనం బంటీ అరెస్టుకు పర్మిషన్ అడిగినప్పుడు అక్కడి పోలీసులు శ్యామ్‌లాల్ ఫోన్ హ్యాండోవర్ చేసుకుని, ఫోరెన్సిక్ టీమ్‌తో క్రాస్ చెక్ చేయించారు. బంటీగాడు శ్యామ్‌లాల్ ఫోన్ నుంచి గోపాల్సే కి పంపి, డిలీట్ చేసిన ఫొటోలను కూడా రిట్రీవ్ చేశాడు. అవి బయటపడటంతో గోపాల్ సే, బంటీ కుమ్మక్కై వేసిన మాస్టర్ప్లానేనని అర్థం చేసుకున్నాడు. శ్యామ్‌లాల్ కలకత్తా కోర్టుకు వెళ్లడంతో కోర్టు ఆదేశాల మీద అక్కడి పోలీసులు ఇక్కడకు వచ్చారు. సెల్లో ఉన్న బంటీగాడిని కలకత్తా స్టైల్లో ఇంటరాగేట్ చేయడంతో నిజం కక్కాడు’’ అని వివరించాడు. ‘‘వాళ్లు ముందే వచ్చారు కాబట్టి సరిపోయింది. మనం బంటీగాడిని జడ్జి ముందు పెట్టి, శిక్షపడేలా చేశాక వచ్చి ఉంటే మన ఉద్యోగాలకే ఎసరొచ్చేది’’ అంటూ ఎస్సై రమేష్‌కుమార్‌కి చీవాట్లు పెట్టాడు. ఎం.శంకర్ రామమూర్తి -
ఆత్మ అలజడి
మహేంద్ర, ధీరజ్, పావని ముఖ్య తారలుగా ధీరజ్ (ఎమ్. రమేశ్‌కుమార్) దర్శకత్వంలో డా. బి. మహేంద్ర నిర్మించిన చిత్రం ‘ఆడో ఎదవ’. రమేశ్ కుమార్ మాట్లాడుతూ– ‘‘ఒక ఆత్మ మరో జీవిలోకి వెళ్లి చేసిన అలజడితో తెరకెక్కిన చిత్రమిది. వినోదాత్మకంగా ఉంటుంది. కథ డిమాండ్ మేరకు మహేంద్ర భారీ బడ్జెట్‌తో నిర్మించారు’’ అన్నారు. ‘‘దర్శకుడు నాకు చెప్పిన కథని పది రెట్లు ఎక్కువగా తెరమీద చూపించబోతున్నారు. ఇందులో 4 ఫైట్లు భారీ ఖర్చుతో తెరకెక్కించాం. ‘జబర్దస్త్’ టీమ్ చక్కటి వినోదం పంచారు. కిషన్ కవాడియా ఇచ్చిన పాటలు బాగున్నాయి. తెలుగులో ఇప్పటి వరకూ రాని కొత్త కథతో సినిమా తీశాం. త్వరలోనే పాటలు విడుదల చేస్తాం’’ అన్నారు మహేంద్ర. ఈ చిత్రానికి కెమెరా: పి.ఎస్. ప్రకాష్‌రావు, సహ నిర్మాతలు: సత్విక్ తంగెళ్ల, అక్కరమణి కొండబాబు, వానపల్లి శ్రీనివాస్. -
నేటి నుంచి రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు
సాక్షి,వరంగల్ స్పోర్ట్స్: మూడు రోజులపాటు కొనసాగనున్న నాలుగో తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్‌జూనియర్స్ బాలబాలికల బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్స్–2018 పోటీలకు హన్మకొండలోని సుబేదారిలోని వరంగల్ క్లబ్ ముస్తాబైంది. రాష్ట్రంలోని ఉమ్మడి 10 జిల్లాల నుంచి హాజరైన క్రీడాకారులకు గురువారం క్వాలీఫైయింగ్ రౌండ్స్ నిర్వహించారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను చాంపియన్‌షిప్స్‌కు ఎంపిక చేశారు. వరంగల్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోటీల వివరాలను సాయంత్రం వరంగల్ క్లబ్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ డాక్టర్ రమేష్‌కుమార్ వెల్లడించారు. ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు జరగనున్న పోటీలను శుక్రవారం ఉదయం 9 గంటలకు అంతర్జాతీయ మాజీ క్రీడాకారుడు బి.చేతన్ ఆనంద్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభిస్తారని తెలిపారు. పది జిల్లాల నుంచి 150 మంది క్రీడాకారులు, 50 మంది టెక్నికల్ అఫీషియల్స్ పాల్గొంటున్నారని తెలిపారు. వారందరికీ నగరంలోని కిట్స్, నిట్‌తోపాటు వివిధ ప్రైవేట్ హోటళ్లలో వసతి సదుపాయాలను కల్పించామని తెలిపారు. 11న జరిగే ముగింపు వేడుకలకు వరంగల్‌కు చెందిన అంతర్జాతీయ మాజీ బ్యాడ్మింటన్ క్రీడాకారిణీ సీహెచ్ దీప్తి హాజరై విజేతలకు బహుమతులను అందజేస్తారని తెలిపారు. ఆఫీసర్స్ క్లబ్ కార్యదర్శి ప్రేమ్‌సాగర్‌రెడ్డి మాట్లాడుతూ క్రీడలను ప్రోత్సహించేందుకు క్లబ్ సభ్యులు ఎల్లవేళలా ముందుంటారని అన్నారు. మూడు రోజులపాటు సాగనున్న క్రీడల నేపథ్యంలో తమ సభ్యులు సహకరించాలని కోరినట్లు తెలిపారు. సమావేశంలో బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా ప్రదాన కార్యదర్శి పి.రమేష్‌రెడ్డి, కోశాధికారి నాగకిషన్ , టెక్నికల్ అఫీషియల్స్ కొమ్ము రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. -
ఇంధన భద్రతకు చర్యలు: భారత్
న్యూఢిల్లీ: నవంబర్ 4 తర్వాత మిత్రదేశాలు ఇరాన్ నుంచి చమురు దిగుమతి చేసుకోవద్దంటూ అమెరికా చేసిన హెచ్చరికల నేపథ్యంలో భారత్ స్పందించింది. దేశంలో ఇంధన భధ్రతకు సంబంధించిన చర్యలు చేపడుతున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం అన్ని భాగస్వామ్య పక్షాలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను అన్వేషించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ‘అమెరికా విదేశాంగ శాఖ జారీచేసిన ప్రకటన కేవలం భారత్‌ను ఉద్దేశించి చేసింది కాదు. అన్ని దేశాలకూ వర్తిస్తుంది. ఈ దిశగా భారత్ అవసరమైన చర్యలు చేపడుతుంది’ అని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ గురువారం ఢిల్లీలో తెలిపారు. అంతకుముందు, పరిశ్రమల శాఖ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇరాన్ నుంచి చమురు దిగుమతులను తగ్గించుకునేందుకు ప్రయత్నించడంతోపాటు, సౌదీ అరేబియా, కువైట్ నుంచి దిగుమతులు పెంచుకునేలా భారత్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. ఇరాక్, సౌదీ అరేబియా తర్వాత భారత్‌కు చమురు సరఫరా చేస్తున్న మూడో అతిపెద్ద దేశం ఇరాన్. -
మెత్తబడిన సర్కారు?
సాక్షి, బెంగళూరు (బెళగావి): ప్రైవేటు ఆస్పత్రుల నియంత్రణకు సంబంధించి రూపొందించిన కర్ణాటక ప్రైవేట్ మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ (కేపీఎంఈ)పై సిద్ధరామయ్య ప్రభుత్వం వెనక్కు తగ్గిందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సీఎల్పీ సమావేశంలో కేపీఎంఈ పై అసలు చర్చ జరగకపోవడంతో ప్రైవేటు లాబీయింగ్‌కి ప్రభుత్వం తలొగ్గిందా అన్న అనుమానాలు ముసురుకొన్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.... బుధవారం ఉదయం బెళగావి సువర్ణసౌధలో సీఎల్పీ సమావేశం ప్రారంభం కాగానే సీఎం సిద్ధరామయ్య తన కేబినెట్ సహచరులతో ‘ఈ బిల్లుకు సంబంధించి మీరెవరూ చర్చించాల్సిన అవసరం లేదు. నేను ఆరోగ్యశాఖ మంత్రితో మాట్లాడి ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటాను’ అని పేర్కొన్నట్లు సమాచారం. దీంతో ఆరోగ్యశాఖ మంత్రి రమేష్‌కుమార్ నిరాశకు లోనయ్యారు. ఏదిఏమైనా ఈ బిల్లును చట్టం చేస్తామని చెప్పే మంత్రి రమేష్‌కుమార్, సీఎల్పీ సమావేశం అనంతరం తనను కలిసిన విలేకరులతో మాత్రం ....‘మీరు ఏమైనా ప్రశ్నించాలనుకుంటే మా సీఎల్పీ నాయకుడిని అడగండి. ఈ విషయం పై నేను ఏమీ మాట్లాడలేను’ అని సమాధానమిచ్చారు. దీనిని బట్టి ముసాయిదాపై సిద్ధు మెత్తబడినట్లు అంచనా. ప్రైవేటు వైద్యుల తీవ్ర నిరసనలు, వైద్యమందక అక్కడక్కడ జనం మరణాలే పునరాలోచనకు పురికొల్పి ఉంటాయని భావిస్తున్నారు. మంత్రి ఆంజనేయపై ‘కమీషన్ల’ విమర్శలు సీఎల్పీ సమావేశంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఆంజనేయపై స్వపక్ష ఎమ్మెల్యేలే విమర్శలతో మండిపడ్డారు. ఎమ్మెల్యే ఎం.టి.బి.నాగరాజు తో పాటు ఇతర ఎమ్మెల్యేలు ‘మంత్రి ఆంజనేయ నుండి సంక్షేమ పథకాల నిధులను ఎమ్మెల్యేలు పొందాలన్నా కమీషన్లు ఇచ్చుకోవాల్సి వస్తోంది. మంత్రి ఆంజనేయ ఏజెంట్లను నియమించుకొని కమీషన్లు వసూలు చేస్తున్నారు’ అని సీఎంకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేల ఆగ్రహాన్ని గమనించిన సీఎం సిద్ధరామయ్య ఎమ్మెల్యేలను శాంతపరిచిన అనంతరం, ఈ లోపాలన్నింటిని సరిచేయాలని మంత్రి ఆంజనేయకు సూచించారు. కాగా, ఎమ్మెల్యేలందరూ సభలకు తప్పనిసరిగా హాజరు కావాలని సిద్ధు ఆదేశించారు. -
చెట్టును ఢీకొన్న కారు.. ఒకరు మృతి
మొయినాబాద్: మూల మలుపువద్ద కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టడంతో ఓ వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తికి గాయాలయ్యాయి. ఈ సంఘటన హైదరాబాద్– బీజాపూర్ రహదారిపై చిన్నషాపూర్ గేటు సమీపంలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్సై నయీమొద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం రాజేంద్రనగర్‌లోని శివరాంపల్లి ప్రాంతానికి చెందిన రమేష్‌కుమార్(55) కిరాణా షాపు నిర్వహిస్తున్నాడు. సోమవారం ఉదయం రమేష్‌కుమార్ అతని బావమరిది కొడుకు సంతోష్‌కుమార్ కలిసి ఓమిని కారులో వికారాబాద్‌కు సరుకులు తేవడానికి వెళ్లారు. తిరిగి వస్తుండగా చిన్నషాపూర్ గేటు సమీపంలో మలుపువద్ద కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. దీంతో కారులోఉన్న రమేష్‌కుమార్ అక్కడిక్కడే మృతి చెందాడు. కారు నడుపుతున్న సంతోష్‌కుమార్‌కు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయాలైన సంతోష్‌కుమార్‌ను ఆసుపత్రికి తరలించారు. రమేష్‌కుమార్ మృతదేహం కారులో ఇరుక్కుపోవడంతో జేసీబీ, ఇటాచీల సహాయంతో బయటకు తీశారు. వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. -
అన్నయ్యపై వదంతులు నమ్మొద్దు
చెన్నై : అన్నయ్య నా.ముత్తుకుమార్ గురించి అసత్య ప్రచారాలను నమ్మవద్దని ఆయన సోదరుడు రమేశ్‌కుమార్ విజ్ఞప్తి చేశారు. ప్రముఖ సినీ గేయ రచయిత నా.ముత్తుకుమార్ అనారోగ్యం కారణంగా ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. ఆయన గురించి పలు వదంతులు ప్రచారం అవుతున్నాయి. నా.ముత్తుకుమార్ కుటుంబం పేదరికంలో మగ్గుతోందని, ఆర్థిక సాయం అందించాలని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాలకు స్పందించిన ఆయన తమ్ముడు రమేశ్‌కుమార్ ఓ ప్రకటనలో పేర్కొంటూ తాము అమ్మా అని పిలవడం కూడా తెలియని వయసులోనే తల్లిని కోల్పోయామని తెలిపారు. ఇరుగుపొరుగు, బంధువుల జాలి చూపులు భరించలేక తమ తండ్రి ఏ కార్యక్రమాలకు వెళ్లకుండా దూరంగా పెంచారని పేర్కొన్నారు. ఇప్పుడు తాము అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నామని, అలాంటి జాలి చూపే మాటలు తమ పిల్లలు వినడాన్ని సహించలేమని తెలిపారు. తమకు సాయపడాలన్నదే మీ అందరి భావన అని గ్రహించగలమన్నారు. తన అన్న నా.ముత్తుకుమార్ మంచి స్నేహితులను, అనుబంధాలను సంపాదించుకుని సంతృప్తికరమైన జీవితాన్ని అనుభవించారని పేర్కొన్నారు. అన్నయ్య సినిమాను ఎంతగా ప్రేమించాడో అంతగా అందరినీ తన వారిగానే భావించి కోట్లాది మంది ప్రేమను పొందారని తెలిపారు. అంత కన్నా వే రే సంపాదన తమకు అవసరం లేదన్నారు. తండ్రి తమను పెంచినట్టుగానే తమ పిల్లల్ని నిరాడంబరంగా పెంచాలనుకుంటున్నామని తెలిపారు. అందుకు అన్నయ్య అన్ని సౌకర్యాలు సమకూర్చార ని పేర్కొన్నారు. తమ కుటుంబం గురించి ఎలాంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని నా.ముత్తుకుమార్ తమ్ముడు రమేశ్‌కుమార్ ప్రకటనలో కోరారు. -
రొయ్యయ్యో
మొక్కుబడిగా హేచరీల తనిఖీ ఒంగోలు టౌన్: కొన్ని హేచరీ నిర్వాహకుల స్వార్థం విదేశీ ఎగుమతులకు అవరోధంగా నిలిచింది. అది ఏ స్థాయికి చేరుకుందంటే చివరకు మనదేశం నుంచి ఎగుమతులు వద్దనే దశకు వెళ్లింది. దీనికి కారణం నకిలీ రొయ్య పిల్లల పెంపకమే. నాసిరకం కావడంతో విదేశీయులు ఈ రొయ్యలంటేనే దూరంగా పెడుతున్నారు. ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతున్న వీరి ఆగడాలను అరికట్టేందుకు చెన్నై నుంచి వచ్చిన కోస్టల్ ఆక్వా కల్చర్ అథారిటీ కమిటీ సభ్యుడు రమేష్‌కుమార్ మొక్కుబడిగా ఒక్క హేచరీని మాత్రమే తనిఖీ చేసి వెళ్లడం అనేక విమర్శలకు తావిస్తోంది. కొత్తపట్నం మండలంలోని రెండు హేచరీలు నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో వారం రోజుల క్రితం వాటిని సీజ్ చేశారు. మిగిలిన హేచరీల విషయాన్ని ఇటు జిల్లా యంత్రాంగం, అటు కోస్టల్ ఆక్వా కల్చర్ అథారిటీ కమిటీ పట్టించుకోకపోవడం పట్ల అనేక మంది పెదవి విరుస్తున్నారు. తనిఖీలు లేవు.. నివేదికలు లేవు జిల్లాలోని హేచరీలను యుద్ధప్రాతిపదికన తనిఖీలు చేసి నివేదికలు అందించాలని కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ ఆదేశాలు జారీ చేశారు. తనిఖీల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినప్పటికీ అవి ముందుకు కదిలిన దాఖలాలు లేవు. ఒంగోలు రెవెన్యూ డివిజన్ పరిధిలోని హేచరీలను ఒంగోలు ఆర్డీఓ, కందుకూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని హేచరీలను కందుకూరు సబ్ కలెక్టర్ తనిఖీలు చేసి నివేదికలు అందిస్తారని వారం రోజుల కిందట జిల్లా కలెక్టర్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అయినప్పటికీ అధికారులు పూర్తి స్థాయిలో తనిఖీలు చేసిన దాఖలాలు లేవు. మత్స్యశాఖ అధికారులు కూడా తనిఖీలు నిర్వహించకుండా మౌనంగా ఉండటం విమర్శలకు తావిస్తోంది. జిల్లాలో 11మండలాల్లో 102 కిలోమీటర్ల మేర సముద్ర తీరం విస్తరించి ఉంది. 2894 హెక్టార్లలో 1563 మంది రైతులు వెన్నామీ సాగు చేస్తున్నారు. ఏడాదికి దాదాపు 23 వేల 152 మెట్రిక్ టన్నుల సాగు వస్తోంది. హెక్టార్‌కు 8 నుండి 15 టన్నుల వరకు ఉత్పత్తి వస్తుండటంతో రైతులు ఎక్కువ మంది వెన్నామీ సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. రైతుల ఆశలను సొమ్ము చేసుకునేందుకు అనధికారిక హేచరీలు పుట్టుగొడుగుల్లా పుట్టుకు వస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలో 20 హేచరీలు అధికారికంగా ఉండగా, అనధికారికంగా మరికొన్ని ఉన్నట్లు తేలింది. వీటిని ఏర్పాటు చేయాలంటే ముందుగా ఎంపెడా నుండి అనుమతి పొందాల్సి ఉంటుంది. ఆ తరువాత చెన్నైలోని కోస్టల్ ఆక్వా కల్చర్ అధారిటీ నుంచి తల్లి రొయ్యల ఉత్పత్తికి అనుమతి తీసుకోవలసి ఉంటుంది. వాస్తవానికి వెన్నామీ తల్లి సీడ్ దక్షిణ అమెరికా సముద్రంలో లభిస్తోంది. ఆ సీడ్ (బ్రూడర్ స్టాక్)ను దిగుమతి చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. జబ్బులేని తల్లి రొయ్యలను దిగుమతి చేసుకోవడం వల్ల వాటి సీడ్‌తో ఆరోగ్యవంతమైన పిల్లలు వస్తాయి. వాటిని విదేశాలకు ఎగుమతి చేయడం వల్ల కోట్లాది రూపాయల విదేశీ ఆదాయం వస్తోంది. వెన్నామీకి డిమాండ్ పెరుగుతుండటంతో అనధికారిక హేచరీల నిర్వాహకులు విచ్చలవిడిగా నకిలీ సీడ్‌ను రైతులకు అంటగడుతున్నారు. చివరకు అది విదేశీ ఎగుమతులపై ప్రభావం చూపుతోంది. ఇప్పటికైనా జిల్లాలోని హేచరీలను విస్తృతంగా తనిఖీచేసి నకిలీ సీడ్‌ను నిరోధిస్తే భవిష్యత్‌లో వెన్నామీకి విదేశాల్లో మంచి డిమాండ్ ఉంటుంది. లేకుంటే టైగర్ రొయ్య కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. ఐదుగురు జూదరుల అరెస్టు - రూ.17,060 స్వాధీనం మార్కాపురం : మార్కాపురం పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పెద్దనాగులవరం రోడ్డులో పేకాటాడుతున్న ఐదుగురిని గురువారం రాత్రి పట్టణ ఎస్సై రాంబాబు అరెస్టు చేశారు. వారి నుంచి 17,060 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి శుక్రవారం నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు ఎస్సై తెలిపారు. -
చేనేత కార్మికులకు నాబార్డ్ అండ
దుబ్బాక: ఆత్మహత్యలు, ఆకలి చావులు నివారించి, చేనేత కార్మికులకు నాబార్డ అండగా ఉంటుందని నాబార్డ్ ఏజీఎం రమేశ్ కుమార్ స్పష్టం చేశారు. దుబ్బాక చేనేత సహకార సంఘాన్ని ఆదివారం ఆయన సందర్శించి, చేనేత కార్మికుల స్థితిగతులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత రంగాన్ని నమ్ముకున్న వృత్తి దారులకు ఉత్పత్తిదారుల అభివృద్ధి నిధి కింద సాయం అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. చేనేత కార్మికులకు శిక్షణ, ఎగుమతులు, దిగుమతుల సాధ్యసాధ్యాలపై అవగాహన కల్పించేందుకు నాబార్డ్ కృషి చేస్తుందన్నారు. చేనేత ఉత్పత్తులను నూతన ఒరవడిలో తయారు చేయడానికి నాబార్డ్ చేనేత కళాఖండాలపై అధ్యయనం చేపట్టిందన్నారు. దుబ్బాక సొసైటీలో తయారు చేస్తున్న షర్టులు, టవల్స్ చాలా బాగున్నాయన్నారు. దుబ్బాక చేనేత సహకార సంఘం ఇచ్చే ప్రాజెక్టు రిపోర్టు ఆధారంగానే నాబార్డ్ సాయం చేస్తుందన్నారు. చేనేత రంగాన్ని బ్యాంకులతో అనుసంధానం చేయడానికి నాబార్డ్ కృషి చేస్తుందన్నారు. అంతకుముందు సొసైటీలోని రికార్డులను పరిశీలించి చైర్మన్‌కు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో చైర్మన్ బోడ శ్రీనివాస్, కార్యదర్శి కాల్వ లక్ష్మీనారాయణ, సభ్యులు కూరపాటి బాల్‌రాజు, చింత శేఖరం, గవ్వల దుబ్బరాజం తదితరులు పాల్గొన్నారు. -
కేఎంసీలో ఎంసీఐ తనిఖీ
ఎంజీఎం : కాకతీయ మెడికల్ కళాశాలతోపాటు అనుబంధ ఆస్పత్రులైన మహాత్మాగాంధీ మెమోరియల్ ఆస్పత్రి, రీజినల్ కంటి ఆస్పత్రి, సీకేఎం, జీఎంహెచ్ ఆస్పత్రుల్లో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) బృందం సభ్యులు సోమవారం పర్యటించారు. గత ఏడాది ఎంసీఐ సభ్యు లు తనిఖీలు నిర్వహించినపుడు కళాశాల పరిధిలో 150 సీట్లలో అదనంగా పెంచిన 50 సీట్లకు సౌకర్యాలు లేవని కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంతోపాటు డీఎంఈ పుట్ట శ్రీని వాస్, కేఎంసీ ప్రిన్సిపాల్ రమేశ్ కుమార్ ఢిల్లీలో ఎంసీఐ సభ్యులను కలిసి వసతులు కల్పిస్తామని పవర్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. దీంతో పెంచిన సీట్లను కొనసాగించేందుకు ఎంసీఐ నిర్ణయించింది. ఈ క్రమంలో కేఎంసీ, అనుబంధ ఆస్పత్రుల్లో ఎంసీ ఐ సభ్యులు దేశ్‌ముఖ్ (మహారాష్ట్ర), అరుణ్‌వ్యాస్ (అహ్మద్‌బాద్), జేఎం జడేజా (అహ్మద్‌బాద్), సుమన్ బన్సాలీ (జోధ్‌పూర్) తనిఖీ చేశారు. విడివిడిగా పరిశీలనలు కళాశాలకు అనుబంధంగా ఉన్న ఎంజీఎం ఆస్పత్రిలో వైద్యవిద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను దేశ్‌ముఖ్, అరుణ్‌వ్యాస్ క్షుణ్ణంగా పరిశీలించారు. మొదటగా ఓపీ విభాగంతోపాటు బ్లడ్‌బ్యాంక్, సెంట్రల్ ల్యాబ్, రెడియోలజీ, అత్యవసర చికిత్స విభాగాలను తనిఖీ చేశారు. అనంతరం ఏఎంసీ, ఐఎంసీ, ఆర్ఐసీయూ, ఐసీసీయూ, మెడికల్, సర్జికల్ వార్డులను సందర్శించారు. రోగులకు సౌకర్యాలు కల్పించాలని ఈ సందర్భంగా వారు అభిప్రాయపడ్డారు. మరో ఇద్దరు ఎంసీఐ సభ్యులు ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కేఎంసీలో తనిఖీ చేశారు. సీకేఎంతోపాటు జీఎంహెచ్‌లో కూడా తనిఖీలు కొనసాగారుు. సభ్యులు ఆస్పత్రిలోని గైనిక్, పోస్టు ఆపరేటివ్, లేబర్, స్కా నింగ్ గదులను పరిశీలించారు. అనంతరం ఆస్పత్రి పరిపాలనాధికారులతో సమావేశమై ఆస్పత్రిలోని సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. సాయంత్రం కేఎంసీలో సిబ్బంది వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. మొ త్తం 9 గంటలపాటు ఎంసీఐ తనిఖీలు నిర్వహించింది. కాగా, గత ఏడాది కేఎంసీ సీనియర్ రెసిడెన్సీలో సౌకర్యాలు సక్రమంగా లేవని ఎంసీఐ తనిఖీల్లో తేలగా, ఈ లోపాలను సవరించినట్లు అధికారులు తెలిపారు. నేడు డీఎంఈ రాక కళాశాలలో ఎంసీఐ సభ్యులు తనిఖీ లు నిర్వహిస్తున్న సమయంలో జూని యర్ డాక్టర్లు సమ్మెలో ఉండడంతో మెడికల్ సీట్లకు అడ్డంకులు రాకుండా ఉండేందుకు మంగళవారం డీఎంఈ శ్రీనివాస్... కేఎంసీకి రానున్నారు. -
స.హ.చట్టం అమలు తప్పనిసరి
నూజివీడు : సమాచార హక్కుచట్టం అమలులో అధికారులు గిమ్మిక్కులు చేస్తూ చట్టాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర సమాచార కమిషనర్లు లాం తాంతియాకుమారి, ముత్తంశెట్టి విజయనిర్మల హెచ్చరించారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో అమలవుతున్న సమాచార హక్కు చట్టం పనితీరును పర్యవేక్షించేందుకు శనివారం వారు వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. నూజివీడులోని ఆర్అండ్బీ అతిధి గృహంలో లాం తాంతియాకుమారి మాట్లాడుతూ సమాచార హక్కుచట్టంపై ప్రజలలో గతంలో కంటే చైతన్యం పెరిగిందన్నారు. అవినీతిని అరికట్టడానికి ఈ చట్టం ఎంతో ఉపయోగపడుతుందని, ఈ చట్టం పట్ల ప్రతి పౌరుడు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. రాష్ట్రంలోని విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో ఈ చట్టం అమలు బాగా జరుగుతోందన్నారు. జన్మభూమి గ్రామసభల్లో సైతం ఈ చట్టం గురించి ప్రజలకు అవగాహన కలిగించాలని చెప్పారు. దేవాదాయశాఖ, సహకారశాఖలు సైతం సమాచారహక్కుచట్టం పరిధిలోకి వస్తాయని ఆమె స్పష్టం చేశారు. ఈ చట్టం ద్వారా ప్రజలే ప్రభువులనే విషయాన్ని గమనించాలన్నారు. అయితే ఈ చట్టాన్ని దుర్వినియోగం చేసేవారి సంఖ్య కూడా పెరుగుతోందని, అటువంటి వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. లాం తాంతీయాకుమారిని ఇన్‌ఛార్జి ఆర్డీవో ఎన్.రమేష్‌కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాలి విజయనిర్మల జూపూడి(ఇబ్రహీంపట్నం రూరల్) : ప్రభుత్వ శాఖలో పనిచేసే అధికారులు ప్రజలకు జవాబుదారులుగా ఉండాలని రాష్ట్ర సమాచార హక్కుచట్టం (ఆర్టీఐ) కమిషనర్ ముత్తంశెట్టి విజయనిర్మల సూచిం చారు. జూపూడి నోవా ఇంజినీరింగ్ కళాశాలలో ఆర్టీఐ చట్టంపై జరిగిన అవగాహనా సదస్సులో ఆమె పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల్లోని అవినీతిని బట్టబయలు చేయడంలో ఆర్టీఐ(2005)చట్టం సామాన్యుల చేతిలో వజ్రాయుధమన్నారు. గ్రామపంచాయతీ నుంచి కేంద్ర ప్రభుత్వం వరకు ప్రజాధనంతో చేపట్టే పనుల వివరాలను కేవలం రూ.10ఫీజుతో అర్జీపెట్టి తెలుసుకోవచ్చని తెలిపారు. తెల్లరేషన్ కార్డుదారులకు రుసుము అవసరం లేదని తెలిపా రు. అర్జీ ఇచ్చిన 30రోజుల తర్వాత సమాధానం ఇవ్వకపోతే అప్పిలేట్ అధికారిని సంప్రదించాలని, అప్పటికీ సమస్య పరిష్కా రం కాకపోతే రోజుకు రూ.250 చొప్పున రూ.25వేల వరకు సంబంధిత అధికారులకు జరిమానా విధించవచ్చన్నారు. కార్పొరేట్ ఆస్పత్రులు పేదవర్గాలకు 5శాతం మెడికల్ రాయితీ కల్పించాలని, ప్రస్తుతం ఎన్ని ఆస్పత్రులు ఆ విధానాన్ని పాటిస్తున్నాయో ఆర్టీఐ ద్వారా తెలుసుకునే అవకాశం ఉందని చెప్పారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సమాధానాలు చెప్పారు. కళాశాల డెరైక్టర్ జె.శ్రీనివాసరావు, ఆర్ఐ బేబీసరోజిని ఎస్ఐ లక్ష్మీనారాయణ, వీఆర్వో లలితకుమారి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ లాంఛనాలతో ఆర్మీ జవాన్ అంత్యక్రియలు
ఆమదాలవలస/ఆమదాలవలస రూరల్: ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధి 7వ వార్డు చింతాడకు చెందిన ఆర్మీ జవాన్ యాళ్ల భాస్కరరావు(అలియాస్ రాజశేఖర్)(25) అంత్యక్రియలు మంగళవారం ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. భాస్కరరావు విధి నిర్వహణలో ఉంటూ రాజస్థాన్‌లో ఇటీవల జరిగిన రోడ్డుప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. మృతదేహం మంగళవారం తెల్లవారుజామున చింతాడకు తీసుకువచ్చారు. అంత్యక్రియల్లో నావీకాదళం చీఫ్ మార్షల్ రమేష్‌కుమార్, ఆర్మీ సుబేదారు ఎల్జే చౌదరి, హవల్దార్ ఎం.మురళీధర్, శ్రీకాకుళం తహశీల్దారు ఎస్.దీలిప్ చక్రవర్తి, ఆర్ఐ ఎస్.శంకరరావు పాల్గొన్నారు. విషాదంలో చింతాడ చింతాడ గ్రామంలోకి భాస్కరరావు మృతదేహాన్ని తీసుకురాగానే గ్రామమంతా విషాదఛాయలు అలముకున్నాయి. భాస్కరరావు తల్లిదండ్రులు సుందరరావు, రమణమ్మల రోదనలు పలువురిని కంటతడిపెట్టంచాయి. వృద్ధాప్యంలో తమకు ఆసరాగా నిలుస్తాడనుకున్న చేతికందిన కొడుకు మరణవార్త వారికి అశనిపాతంగా తయారైంది.కొడుకు కష్టార్జితంతో ఇంటి నిర్మా ణం పూర్తి చేసినా గృహప్రవేశానికి కూడా రాలే దని, అక్టోబర్‌లో వస్తానని చెప్పిన కడసారి మాటలను గుర్తు చేసుకుని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్మీ జవాన్ యాళ్ల భాస్కరరావు మృతి వార్తను తెలుసుకున్న మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ మంగళవారం మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. భాస్కరరావు తల్లిదండ్రులను పరామర్శించి ఓదార్చారు. నేవీ చీఫ్ రమేష్ కుమార్ ఆధ్వర్యంలో నావికా దళం బ్యాండ్ పార్టీతో మృతదేహాన్ని శ్మశాన వాటికకు తరలించారు. నావికాదళం గాలిలో కాల్పు జరిపి అంత్యక్రియలు చేపట్టారు. -
సార్లొస్తున్నారు..రూములు బుక్ చేయండి
నగరపాలక సంస్థ అధికారులకు ఇన్చార్జి సబ్ కలెక్టర్ సూచన ఒక్కో హోటల్లో 15 గదుల కేటాయింపు నగరంలో చెత్త సమస్య తలెత్తకుండా చర్యలు కార్పొరేషన్, న్యూస్‌లైన్ : వీఐపీలొస్తున్నారు... నగరాన్ని శుభ్రంగా ఉంచండి... హోటల్ రూమ్స్ బుక్ చేయండి అంటూ ఇన్చార్జి సబ్ కలెక్టర్ రమేష్ కుమార్ నుంచి నగరపాలక సంస్థ అధికారులకు ఆదేశాలు అందాయి. చీఫ్ మెడికల్ ఆఫీసర్ పి.రత్నావళి శుక్రవారం నుంచి ఆదిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. నగరం సుమా రు 20 వరకు ప్రముఖ హోటళ్ళు ఉన్నాయి. ఒక్కో హోటల్లో 15 రూంలు వీఐపీలకు జూన్ 6 నుంచి 8 వరకు కేటాయించాల్సిందిగా సీఎంహెచ్ఓ హోటల్ యజమానులకు ఆదేశాలు జారీ చేశారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ క్యాంపస్ సమీపంలోని స్థలంలో జూన్ 8న రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవం చేయనున్న విషయం విదితమే. ఈక్రమంలో రెండు రోజుల ముందుగానే వీఐపీలు నగరానికి చేరుకొనే అవకాశం ఉంది. రెవెన్యూ, నగరపాలక సంస్థ అధికారులు ఆదిశగా ఏర్పాట్లను ముమ్మరం చేశారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవాన్ని పురస్కరించుకొని ఉన్నతాధికారులు రెండు రోజుల పాటు నగరంలో ఉండే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ రెండు రోజులు నగరంలో చెత్త సమస్య ఉత్పన్నం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కమిషనర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ రత్నావళిని ఆదేశించారు. ప్రణాళికను రూపొందించుకోవాలని, లోటుపాట్లకు తావివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎంహెచ్ఓకు సూచించారు. ఈమేరకు ఆమె యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నారు. -
ఎమ్మెల్యే రమేశ్ కుమార్‌పై విద్యుత్ ఉద్యోగుల కన్నెర్ర
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : కోలారు జిల్లా శ్రీనివాసపురం ఎమ్మెల్యే రమేశ్ కుమార్ తమపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఇక్కడి కేపీటీసీఎల్ కార్యాలయం వద్ద బెస్కాం ఉద్యోగులు సోమవారం ప్రదర్శన చేపట్టారు. ఆయన శాసన సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గత వారం కోలారులో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమస్యలపై స్పందించని విద్యుత్ ఉద్యోగులను చెట్టుకు కట్టేసి కొట్టాలని, ఆహారం, నీరు అందకుండా చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దీనిపై విద్యుత్ ఉద్యోగుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. బాధ్యత కలిగిన ఎమ్మెల్యే ఇలా రెచ్చ గొట్టే వ్యాఖ్యలు చేయవచ్చునా అని ఉద్యోగ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. వ్యవహార శైలిని మార్చుకోవాల్సిందిగా ఆయనను హెచ్చరించాయి. -
శివోహం
నెల్లూరు (బృందావనం), న్యూస్‌లైన్ : మహాశివరాత్రి పర్వదినాన్ని జిల్లా ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. గురువారం వేకువజాము నుంచే పరమేశ్వరుని దర్శనం కోసం శివాలయాల్లో బారులుదీరారు. ఓం నమఃశివాయ..శంభో శంకర..హరహర మహదేవ..పాహిమాం..పాహిమాం..అంటూ ముక్కంటి ముందు మోకరిల్లారు. విశేష అభిషేకాలను తిలకిస్తూ భక్తపారవశ్యంలో మునిగారు. మూలాపేటలోని శ్రీ భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వరస్వామి ఆలయంలో గిన్నెభిక్ష, లింగోద్భవ కాలాభిషేకం, వెండి నందిసేవ వైభవంగా జరిగాయి. శ్రీరామకవచం కోటేశ్వరశర్మ, రమేష్కుమార్శర్మ ఆధ్వర్యంలో జరిగిన పూజా కార్యక్రమాలకు ఉభయకర్తలుగా భీమశెట్టి వెంకటరత్నం, ధనమ్మ , రేబాల వెంకటరెడ్డి, ఇందిరమ్మ, పులిమి రమేష్‌రెడ్డి, కమలాకర్‌రెడ్డి, దినకర్‌రెడ్డి వ్యవహరించారు. ఈఓ కోవూరు జనార్దన్‌రెడ్డి, ధర్మకర్తల మండలిసభ్యులు పర్యవేక్షించారు. దర్గామిట్టలోని శ్రీరాజరాజేశ్వరి ఆమ్మవారి ఆలయ ప్రాంగణంలోని శ్రీ మీనాక్షి సమేత సుందరేశ్వరస్వామి వారికి వేకువజాము నుంచి రాత్రి విశేష పూజలు జరిగాయి. ఆలయ ప్రధానార్చకుడు తంగిరాల రాధాకృష్ణశర్మ ఆధ్వర్యంలో మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, గిన్నెభిక్ష, రుద్రహోమం, లింగోద్భవాభిషేకం, నందిసేవ తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామి వారు కాశీ విశ్వేశ్వర జ్యోతిర్లింగ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉభయకర్తలుగా ఆల్తూరు ఆదినారాయణరెడ్డి, సులోచనమ్మ దంపతులు వ్యవహరించారు. ఏర్పాట్లను ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త రత్నం జయరామ్, కార్యనిర్వహణాధికారి పాయసం నాగేశ్వరరావు పర్యవేక్షించారు. నేలనూతల శ్రీనివాసమూర్తి, తంగిరాల రాధాకృష్ణశర్మ పర్యవేక్షణలో శ్రీలలితా లక్ష కుంకుమార్చన జరిగింది. సీఏఎం ఉన్నత పాఠశాల సమీపంలోని శ్రీఉమామహేశ్వరస్వామి దేవస్థానంలో స్వామి వారికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, లింగోద్భవాభిషేకం చేశారు. స్వామి వారు చందనాలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయాన్ని పూలతో విశేషంగా అలంకరించారు. అర్చకులు పోగుల వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాలను ధర్మకర్త గరుడసింగ్, ఈఓ రామకృష్ణ పర్యవేక్షించారు. భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఉభయకర్తలుగా బోగోలు మోహన్‌రెడ్డి, నిర్మలమ్మ, దుగ్గి వెంకటేశ్వర్లు, అంచనాల నాగేశ్వరరావు, గాలి కేశవులునాయుడు, చుండూరు శివకృష్ణకుమార్, కమలమ్మ వ్యవహరించారు.= నవాబుపేటలోని శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి దేవస్థానంలో మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరిశెట్టి హనుమాయమ్మ కుమారులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. కొండాయపాళెం రోడ్డు రామకృష్ణనగర్‌లో కొలువైన శ్రీఅన్నపూర్ణ సమేత విశ్వేశ్వరస్వామి దేవస్థానంలో విశేష పూజలు, సహస్ర దీపోత్సవం నిర్వహించారు. అర్చకులు పులిజాల సురేష్‌శర్మ, తం గిరాల వరప్రసాద్‌శర్మ ఆధ్వర్యంలో జరిగిన పూజలను మేనేజింగ్ ట్రస్టీ కోట ప్రభాకర్‌రావు, బండి శ్రీనివాసులురెడ్డి, పోలవరపు హనుమంతరావు పర్యవేక్షించారు. ఉభయకర్తలుగా వడ్లమూడి మధుసూదన్‌రావు, సుజాతమ్మ దంపతులు వ్యవహరించారు. శుక్రవారం స్వామివార్ల కల్యాణ మహోత్సవం, రాత్రి గ్రామోత్సవం నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఉస్మాన్‌సాహెబ్‌పేటలోని శ్రీ అన్నపూర ్ణసమేత కాశీవిశ్వనాథ స్వామి దేవస్థానం, సంతపేటలోని శ్రీభ్రమరాంబ సమేత హరిహరనాథస్వామి దేవస్థానం శ్రీకన్యకాపరమేశ్వరి ఆలయంలోనూ ప్రత్యేక పూజలు జరిగాయి. ఆకట్టుకున్న మంచుశివలింగం శివరాత్రి సందర్భంగా మూలస్థానేశ్వరస్వామి ఆలయంలో బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మంచు లింగం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ముందే కూసిన ‘కోడ్’ కోవూరు, న్యూస్‌లైన్: ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ రాకమునుపే అనధికారికంగా కోడ్ అమల్లోకి వచ్చింది. అమ్మహస్తం పథకంలో భాగంగా తెల్లకార్డుదారులకు ప్రతినెలా అందించే తొమ్మిది రకాల సరుకుల సంచిపై నేతల ఫొటోలను తొలగిస్తున్నారు. పేదలకు పామాయిల్, పంచదార, పసుపు, చింతపండు, కందిపప్పు, గోధుమలు, గోధుమ పిండి, ఉప్పు, కారం సరుకులను ప్యాకెట్లగా చేసి వాటిపై ఇందిరాగాంధీ, సోనియాగాంధీ, మన్మోహన్సింగ్, కిరణ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు ఫొటోలను ముద్రించి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారానికి తెరతీసింది. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆ ప్రచారానికి తెరదించాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. మార్చి, ఏప్రిల్, మే మాసాల్లో ఈ బొమ్మలను తొలగించాలని ఉత్తర్వులు వెలువడ్డాయి. ఎన్నికల నోటిఫికేషన్ మార్చి మొదటి వారంలో విడుదల కావచ్చని అంతా భావిస్తున్నారు. ఈసీ నిబంధనలకు అనుగుణంగా జిల్లా అధికారులు గోడౌన్లలో ఉన్న స్టాకుకు తెల్ల స్టిక్కర్లు అంటించాలని ప్రతిపాదనలు రూపొందించారు. -
ఆరోపణలపై ఆగ్రహం
= హిరేమఠ్‌పై ‘హక్కుల’ తీర్మానం = రమేశ్‌పై ఆరోపణలకు ప్రతిఫలం = దర్వాప్తు నివేదిక త్వరగా ఇవ్వాలని కమిటీకి సూచిస్తానన్న స్పీకర్ = అసెంబ్లీలో రమేశ్ భావోద్వేగ ప్రసంగం = విమర్శించడానికి హిరేమఠ్ ఎవరంటూ ధ్వజం సాక్షి ప్రతినిధి, బెంగళూరు : హుబ్లీకి చెందిన సమాజ పరివర్తన సముదాయం అధ్యక్షుడు, సామాజికవేత్త ఎస్ఆర్. హిరేమఠ్, మాజీ స్పీకర్, కోలారు జిల్లా శ్రీనివాసపురం ఎమ్మెల్యే రమేశ్ కుమార్‌పై చేసిన ఆరోపణల పట్ల శాసన సభలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. బెల్గాంలో జరుగుతున్న శాసన సభ శీతాకాల సమావేశాల్లో సోమవారం రమేశ్ కుమార్ ఈ అంశాన్ని లేవనెత్తారు. తనను కళంకిత ఎమ్మెల్యే అని ఆయన ఆరోపించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం దీనిపై సత్యసత్యాలను కనుగొని నివేదిక సమర్పించడానికి సభా హక్కుల కమిటీకి నివేదించాలని తీర్మానించారు. త్వరగా దర్యాప్తు జరిపి నివేదికను సమర్పించాల్సిందిగా కమిటీకి సూచిస్తానని స్పీకర్ కాగోడు తిమ్మప్ప ప్రకటించారు. ప్రశ్నోత్తరాల సమయం అనంతరం రమేశ్ కుమార్ తనపై హిరేమఠ్ చేసిన ఆరోపణలను ప్రస్తావించారు. తనను రాజకీయంగా అంతమొందించాలనే కుట్రతో ఇలాంటి ఆరోపణలు చేయడం తనకు బాధను కలిగించిందని వాపోయారు. స్పీకర్ తమ రక్షణకు రావాలని, ఈ అంశాన్ని సభా హక్కుల సంఘానికి నివేదించాలని విజ్ఞప్తి చేశారు. న్యాయ శాఖ మంత్రి టీబీ. జయచంద్ర జోక్యం చేసుకుని ఈ అంశాన్ని సభా హక్కుల సంఘానికి నివేదించడమే ఉత్తమమని పేర్కొనడంతో స్పీకర్ కూడా సమ్మతించారు. అంతకు ముందు రమేశ్ కుమార్ భావోద్వేగంతో ప్రసంగించారు. ఎమ్మెల్యే కావడానికి తనకు అన్ని అర్హతలు ఉన్నాయని తెలిపారు. తనను కళంకితుడు అనడానికి హిరేమఠ్ గవర్నర్ లేదా ముఖ్యమంత్రి లేదా రాష్ట్రపతి కారని దెప్పి పొడిచారు. ఎన్నికల కమిషన్ కూడా కాదన్నారు. ఒక వేళ తాను కళంకితుడినై ఉంటే ప్రజలు ఈ సభకు ఎందుకు పంపుతారని ప్రశ్నించారు. రాష్ర్టంలోని ఏ కోర్టులోనూ తనపై కేసులు లేవని తెలిపారు. వాస్తవం ఇలా ఉంటే, తనపై ఆరోపణలు చేయడానికి ఆయనెవరని ప్రశ్నించారు. తనను సమాజం నుంచి బహిష్కరించాలని కూడా అన్నారని వాపోయారు. -
ఐఏఎస్ ఇంటి ముందు భార్య ధర్నా
ఇద్దరూ ఆడపిల్లలే జన్మించినందుకు విడాకులివ్వాలని తన భర్త వేధిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఐఏఎస్ అధికారి, విశాఖ జీసీసీ ఎండీ రమేష్ కుమార్ భార్య స్వప్న శుక్రవారం ఆయన ఇంటి ముందు ధర్నా చేశారు. ఆమెకు మద్దతుగా ఐద్వా కార్యకర్తలు, నాయకులు తరలివచ్చారు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన స్వప్నకు 2001లో రమేష్ కుమార్‌తో వివాహమైంది. తనకు ఇద్దరూ ఆడపిల్లలే కావడంతో సమస్యలు మొదలయ్యాయని ఆమె ఆరోపించింది. తనను, తన పిల్లలను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. మగబిడ్డ కోసం తన భర్తకు మరో పెళ్లి చేసేందుకుగాను విడాకులు ఇవ్వాలని బెదిరిస్తున్నట్టు వాపోయింది. తనకు న్యాయం చేయాల్సిందిగా పలువురు అధికారులను కలిసినా ఎవరూ పట్టించుకోలేదని స్పప్న చెప్పింది. తన పిల్లలు, తాను కష్టాలు పడుతున్నామని తమకు న్యాయం చేయాల్సిందిగా కోరింది.