ఏపీ: ‘స్థానిక’ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల | Andhra Pradesh Local Body Election Schedule Released | Sakshi
Sakshi News home page

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

Mar 7 2020 11:30 AM | Updated on Mar 7 2020 6:41 PM

Andhra Pradesh Local Body Election Schedule Released - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ శనివారం విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఎన్‌.రమేష్‌కుమార్‌ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. మొత్తం మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహస్తామని పేర్కొన్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఒక విడతలో, పంచాయతీ ఎన్నికలను రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. ఇక ఒకే దశలో మున్సిపల్‌ ఎన్నికలు జరగనున్నాయి. ఈనెల 21న జడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించి ఫలితాలను 24న ప్రకటిస్తారు. ఇక ఈ నెల 23న మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ జరిపి, 27న ఫలితాలను వెల్లడిస్తామని తెలిపారు. ఈనెల 27న తొలివిడుత పంచాయతీ ఎన్నికలు, 29న రెండో విడత పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు.

(చదండి : మహిళలకే పెద్ద‘పీఠం’)

‘రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌ ద్వారా ఈ షెడ్యూల్డ్‌ను విడుదల చేశాం. ఎన్నికల కోడ్‌ తక్షణమే అమల్లోకి వస్తుంది. ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఎన్నికల నియమావళి విధిగా పాటించాలి. ప్రభుత్వ సంబంధించిన సదుపాయాలను ఉపసంహరించుకోవాలి. ఓటర్లను ప్రభావితం చేసే పథకాలను అమలు చేయరాదు. కొత్తగా బదిలీలు, నియమాకాలు చేపట్టరాదు. ఎన్నికలు సజావుగా జరపడానికి కలెక్టర్లకి, ఎస్పీలకు అధికారాలు ఇచ్చాం. స్వేచ్చగా, హింసకి తావులేకుండా ఓటు హక్కు వినియోగించుకొనేలా అందరూ సహకరించాలి. ప్రభుత్వ భవనాలపై ఉన్న రంగుల గురించి ఇప్పటికే హైకోర్ట్ లో ఉంది కాబట్టి దానిపై మేము ప్రత్యేక చర్యలు తీసుకోం.సిబ్బంది కొరతలేదు.. అత్యవసరం అయితే అంగన్ వాడి వర్కర్స్ ని వాడుకుంటాం’ అని రమేశ్‌ కుమార్‌ అన్నారు. 

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు
మార్చి 7: నోటిఫికేషన్‌ విడుదల 
మార్చి 9-11: నామినేషన్ల స్వీకరణ
మార్చి 12: నామినేషన్ల పరిశీలన
మార్చి 14: నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది
మార్చి 21: ఎన్నికల పోలింగ్‌
మార్చి 24: ఓట్ల లెక్కింపు

మున్సిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌
మార్చి 9: నోటిఫికేషన్‌ విడుదల
మార్చి 11-13: నామినేషన్ల స్వీకరణ
మార్చి 14: నామినేషన్ల పరిశీలన
మార్చి 16: నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది
మార్చి 23: ఎన్నికల పోలింగ్‌
మార్చి 27: ఓట్ల లెక్కింపు

పంచాయతీ ఎన్నికల తొలి విడత షెడ్యూల్‌
మార్చి 15: నోటిఫికేషన్‌ విడుదల
మార్చి 17-19: నామినేషన్ల స్వీకరణ
మార్చి 20: నామినేషన్ల పరిశీలన
మార్చి 22: నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది
మార్చి 27: ఎన్నికల పోలింగ్‌
మార్చి 27: ఓట్ల లెక్కింపు

పంచాయతీ ఎన్నికల రెండో విడత షెడ్యూల్‌
మార్చి 17: నోటిఫికేషన్‌ విడుదల
మార్చి 19-21: నామినేషన్ల స్వీకరణ
మార్చి 22: నామినేషన్ల పరిశీలన
మార్చి 24: నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది
మార్చి 29: ఎన్నికల పోలింగ్‌
మార్చి 29: ఓట్ల లెక్కింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement