సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ విషయంలో సీఐడీ దర్యాప్తులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఆధారాలు ధ్వంసం చేసినట్టు నిమ్మగడ్డ అడిషనల్ పీఎస్ సాంబ మూర్తి సీఐడీ అధికారుల ఎదుట అంగీకరించారు. ల్యాప్ టాప్‌లో ఆ లేఖ తయారు చేసి పెన్ డ్రైవ్ ద్వారా లేఖను డెస్క్ టాప్‌లో వేసినట్టు సాంబ మూర్తి చెప్పారు. ఆ లేఖను తర్వాత వాట్సాప్ వెబ్ ద్వారా రమేష్ కుమార్‌కు పంపారు. ఆ లేఖను మొబైల్ నుండి రమేష్ కుమార్ కేంద్రానికి పంపినట్టు సమాచారం. ల్యాప్ టాప్‌లో ఫైల్స్ డిలీట్ చేయడంతో పాటు, పెన్ డ్రైవ్ ధ్వంసం చేశారని సీఐడీ అధికారులు తెలిపారు. అనంతరం డెస్క్ టాప్ కూడా ఫార్మాట్ చేశారని చెప్పారు. లేఖకు సంబంధించి అన్ని ఆధారాలు ఎందుకు ధ్వంసం చేశారో తెలియదన్నారు. వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి చెప్పినట్టు లేఖ బయట నుండి వచ్చి ఉండే అవకాశం కూడా ఉందని అధికారులు తెలిపారు.(‘లేఖపై పోలీసు దర్యాప్తు కోరగానే ముచ్చెమటలు’)
ఆధారాలు ట్యాంపర్ చేసిన అంశంపై కేసు నమోదు చేశామని సీఐడీ డీజీ సునీల్ కుమార్ తెలిపారు. లేఖ నంబర్‌పైన కూడా కొన్ని ఆధారాలు సేకరించామన్నారు. కేంద్రంకు రాసిన లేఖ 221 నంబర్‌తోనే, అశోక్‌బాబు రాసిన రెఫ్రెన్స్ లెటర్‌కు కూడా ఉందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment