కోలారు జిల్లా శ్రీనివాసపురం ఎమ్మెల్యే రమేశ్ కుమార్ తమపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఇక్కడి కేపీటీసీఎల్ కార్యాలయం వద్ద బెస్కాం ఉద్యోగులు సోమవారం ప్రదర్శన చేపట్టారు.
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : కోలారు జిల్లా శ్రీనివాసపురం ఎమ్మెల్యే రమేశ్ కుమార్ తమపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఇక్కడి కేపీటీసీఎల్ కార్యాలయం వద్ద బెస్కాం ఉద్యోగులు సోమవారం ప్రదర్శన చేపట్టారు. ఆయన శాసన సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
గత వారం కోలారులో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమస్యలపై స్పందించని విద్యుత్ ఉద్యోగులను చెట్టుకు కట్టేసి కొట్టాలని, ఆహారం, నీరు అందకుండా చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దీనిపై విద్యుత్ ఉద్యోగుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. బాధ్యత కలిగిన ఎమ్మెల్యే ఇలా రెచ్చ గొట్టే వ్యాఖ్యలు చేయవచ్చునా అని ఉద్యోగ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. వ్యవహార శైలిని మార్చుకోవాల్సిందిగా ఆయనను హెచ్చరించాయి.