Employer associations
-
విద్యుత్ ఉద్యోగుల విభజనపై భేటీ
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల విభజనపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ డీఎం ధర్మాధికారి నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ మార్చి 2, 3వ తేదీల్లో హైదరాబాద్‌లో భేటీ కానుంది. ఈ మేరకు బుధవారం ఉద్యోగ సంఘాలకు సమాచారం ఇచ్చింది. ఏపీలోని విజయవాడలో ఉద్యోగ, కార్మిక సంఘాల అభిప్రాయాన్ని సేకరించిన కమిటీ ..తాజాగా వచ్చేనెల 2, 3 తేదీల్లో తెలంగాణ ఉద్యోగ సంఘాల అభిప్రాయాలను కూడా సేకరి స్తామని స్పష్టం చేసింది. ఇప్పటికే విద్యుత్ సంస్థలతో ఒకసారి సమావేశమైన కమిటీ ఇప్పుడు మరోసారి సమావేశానికి సిద్ధమయ్యింది. రెండ్రోజులుగా విజయవాడలో జరుగుతున్న భేటీలో ఏపీ సంఘాలన్నీ ఉద్యోగులందరి నుంచి ఆప్షన్లు తీసుకోవాలని నివేదించగా..రిలీవ్ అయిన ఉద్యోగులు మాత్రం తమ 1,157 మంది ఆప్షన్లను మాత్రమే పరిగణంలోకి తీసుకోవాలని కోరినట్లు సమాచారం. ఏపీకి వెళ్లేందుకు 621 మంది సిద్ధం రాష్ట్రపతి ఉత్తర్వులను అనుసరించి స్థానికతను 1 నుంచి 7వ తరగతి ఏ ప్రాంతంలో చదివితే, ఆ ప్రాంతానికి స్థానికుడిగా పరిగణనలోకి తీసుకుని ఉద్యోగులను విభజించాలని డిస్కమ్‌లు పట్టుబడుతున్నాయి. ఏపీ ఉద్యోగ సంఘాలే కాకుండా విద్యుత్ సంస్థల ప్రతినిధులు కూడా ఉద్యోగులందరి దగ్గరి నుంచి అభిప్రాయాలను తీసుకోవాలని కోరాయి. తెలంగాణ డిస్కమ్‌లలో పని చేస్తున్న ఏపీ స్థానికత కలిగిన 1,157 మంది ఉద్యోగులను ఏపీకి కేటాయించాలని, వీరిలో ఇప్పటికే 621 మంది ఏపీకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలంగాణ డిస్కమ్‌లు ఇప్పటికే ధర్మాధికారి కమిషన్‌కు నివేదించాయి. ఉద్యోగల విభజన సందర్భంగా పంజాబ్, బిహార్ రాష్ట్రాల తీర్పులను కూడా జోడించాయి. ఇక సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన ఆర్నెల్లలోపు ఉద్యోగుల విభజన సమస్యను తేల్చాల్సి ఉండగా ఇప్పటికే దీంట్లో మూడు నెలలు గడిచిపోయాయి. -
చర్చలు విఫలం..ఆర్టీసీలో సమ్మె సైరన్
-
ఆర్టీసీలో సమ్మె సైరన్
సాక్షి, అమరావతి: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో(ఏపీఎస్ఆర్టీసీ) సమ్మె సైరన్ మోగనుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ వ్యతిరేక విధానాలకు నిరసనగా ఆర్టీసీ సిబ్బంది సమ్మెకు సై అంటున్నారు. సమ్మె తేదీలను బుధవారం ప్రకటిం చాలని నిర్ణయించారు. మంగళవారం విజయవాడలో ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు, ఈడీలు, ఉద్యోగ సంఘాల ప్రతినిధుల మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో సమ్మెకు సిద్ధమవు తున్నామని చర్చల అనంతరం ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వైవీ రావు, పలిశెట్టి దామోదరరావు మీడియాకు తెలియచేశారు. కార్మికులను రెచ్చగొట్టేలా యాజమాన్యం నిర్ణయాలు ఫిట్మెంట్ 50 శాతం ఇవ్వాలని తాము కోరుతుండగా, 20 శాతానికి మించి ఇచ్చేది లేదంటూ ఆర్టీసీ యాజమాన్యం మొండికేయడాన్ని ఉద్యోగులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఏపీఎస్ ఆర్టీసీలో నష్టాలకు ప్రభుత్వం తీసుకుంటున్న విధానపరమైన నిర్ణయాలే కారణమని, నష్టాలు, అప్పులను ప్రభుత్వమే భరించాలని ఉద్యోగులు తేల్చిచెబుతున్నారు. ఇతర ప్రభుత్వ ఉద్యోగుల కంటే కేటగిరీల వారీగా 20 నుంచి 30 శాతం తక్కువ జీతభత్యాలతో పనిచేస్తున్నామని, అయినా సర్కారు తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు. వేతన సవరణలో ఉన్న డిమాండ్ల సాధన కోసం ఇప్పటికే ఆర్టీసీలోని ఎనిమిది సంఘాలు కలిసి జేఏసీగా ఏర్పడ్డాయని, ఎన్ఎంయూని కూడా కలుపుకుని ముందుకు వెళ్తామని ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నాయకులు తెలిపారు. జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం సమ్మె తేదీని ప్రకటించేందుకు ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు సిద్ధమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో చేపట్టబోయే సమ్మె సన్నాహక షెడ్యూల్‌ను కూడా ప్రకటించాలని నిర్ణయించారు. యాజమాన్యం ఒకవైపు చర్చలు జరుపుతూనే మరోవైపు సంస్థలో సిబ్బందిని కుదించేలా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటోందని నేతలు ఆరోపిస్తున్నారు. సెక్యూరిటీ, సివిల్ ఇంజనీరింగ్ విభాగాల్లో సిబ్బందిని తగ్గించడం, యూనియన్‌కు ఇచ్చే రాయితీలను రద్దు చేయడం వంటి చర్యలు కార్మికులను రెచ్చగొట్టేలా ఉన్నాయని అంటున్నారు. ప్రభుత్వం ఫిట్మెంట్ తదితర డిమాండ్ల విషయంలో సానుకూలంగా స్పందించకపోతే సమ్మె తప్పదని ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. మంగళవారం జరిగిన చర్చల్లో ఎంప్లాయీస్ యూనియన్ పే కమిటీ సభ్యులు వైవీ రావు, ఎం హనుమంతరావు, పి.సుబ్రహ్మణ్యం రాజు, ఆవుల ప్రభాకర్, జీవీ నరసయ్య తదితరులు పాల్గొన్నారు. -
సీఎం ప్రైవేట్ సన్మాన సభకు ప్రజాధనంతో ఏర్పాట్లు
సాక్షి, అమరావతి: ఉద్యోగ సంఘాలు సీఎంకు చేస్తున్న సన్మాన కార్యక్రమానికి రూ.కోట్ల ప్రజాధనం ఖర్చు పెట్టేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు. ఉద్యోగులను తరలించడానికి వాహనాలు, వచ్చిన వారికి భోజనాలు ప్రభుత్వ సొమ్ముతో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మొత్తం బాధ్యతలను కలెక్టర్లకు అప్పగించింది. గ్రామ రెవెన్యూ సహాయకుల(వీఆర్ఏ) జీతాలను ప్రభుత్వం ఇటీవల పెంచింది. ఈ సందర్భంగా సోమవారం విజయవాడలో ముఖ్యమంత్రికి వీఆర్ఏల ఆత్మీయ అభినందన సభ నిర్వహించనున్నట్టు ఉద్యోగ సంఘ నాయకుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రకటించారు. అది పూర్తిగా ప్రభుత్వానికి సంబంధంలేని కార్యక్రమం అవుతుంది. అయితే ఈ కార్యక్రమానికి ప్రతి జిల్లా నుంచి 1,500 మందికి తక్కువ కాకుండా ఉద్యోగులను తరలించే బాధ్యతలను ప్రభుత్వం కలెక్టర్లకు అప్పగించింది. దీంతో కలెక్టర్లు ఆర్డీవోలు, తహసీల్దార్లకు ఉత్తర్వులు జారీ చేశారు. మండలాల నుంచి గ్రామ రెవిన్యూ సేవకులను విజయవాడలో జరిగే సీఎం సన్మానసభకు తరలించేందుకు బస్సులను ఏర్పాటు చేశారు. ఒక్కో ఉద్యోగి తిండి ఖర్చులకు రూ.300 చొప్పన ఇవ్వాలని కలెక్టర్లు తహసీల్దార్లను ఆదేశించారు. విజయవాడకు చేరుకున్న ఉద్యోగులకు అక్కడ బస ఏర్పాటు, సన్మాన కార్యక్రమం అనంతరం ఉద్యోగులకు రాత్రి భోజన వసతి కల్పించే బాధ్యతను కృష్ణా జిల్లా కలెక్టర్‌కు అప్పగించారు. జనాల తరలింపు కార్యక్రమం సజావుగా జరిగేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో లైజనింగ్ అధికారులను నియమించడంతో పాటు ప్రతి బస్సుకు ఇద్దరు వీఆర్వోలను నియమించింది. అధికార దుర్వినియోగానికి పరాకాష్ట చంద్రబాబు సర్కార్‌లో ప్రభుత్వ కార్యక్రమాలకు, పార్టీ కార్యక్రమాలకు మధ్య తేడా అన్నది లేకుండా పోయిందని అధికార వర్గాలే అంగీకరిస్తున్నాయి. జిల్లా కలెక్టర్ల సదస్సు నుంచి సీఎం పాల్గొనే ప్రతి కార్యక్రమంలోనూ ప్రతిపక్షాలపై ఆరోపణలు చేయడం, వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ గెలుపునకు అధికారులు కృషి చేయాలని బాహాటంగానే చెపుతున్నారు. ఉండవల్లిలోని సీఎం అధికార నివాసం వద్ద దాదాపు రూ.5 కోట్లు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి నిర్మించిన ప్రజాదర్బార్ హాల్లో పార్టీ కార్యక్రమాలే ఎక్కువగా జరుగుతున్నాయన్న విమర్శ ఉంది. ప్రజాదర్బార్‌లో శనివారం అంగన్వాడీ కార్యకర్తలతో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు రాజకీయాల గురించే మాట్లాడడం విమర్శలకు దారితీసిన విషయం తెలిసిందే. -
సంధి ముగిసింది.. ఇక సమరమే
హన్మకొండ అర్బన్: ‘‘ఉద్యోగుల సమస్యల పరి ష్కారం కోసం ఫ్రెండ్లీ ప్రభుత్వంలో 44 నెలలు వేచిచూశాం.. 43 శాతం పీఆర్సీ సాధించడం మినహా ఉద్యోగులకు ఒరిగిందేమీ లేదు. ప్రతీ సమస్య పెండింగ్‌లోనే ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో అంగీకరించిన సీపీఎస్ విధానం కొనసాగించడానికి ప్రస్తుత ప్రభుత్వం అంగీకరించి తప్పుచేసింది. ఉద్యమ సారథి ముఖ్యమంత్రి అయితే మన సమస్యలు పరిష్కారమవుతాయని ఇంతకాలం వేచి చూశాం. ప్రతి ఉద్యోగిలో సహనం నశించింది. సంధికాలం పూర్తయింది. ఇక మిగిలింది ప్రభుత్వంపై సమరమే. సమరశంఖం పూరించడానికి 25న సకల ఉద్యోగుల సభను హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నాం’’అని ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు అన్నారు. సభను విజయవంతం చేసి ఉద్యోగుల సత్తాను ప్రభుత్వాలకు చాటుదామని పిలుపునిచ్చారు. సకల ఉద్యోగుల సభ విజయవంతం కోసం వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలోని ఆర్ట్స్ కాలేజీ ఆడిటోరియంలో సోమవారం రాత్రి ఉద్యోగ సంఘాల జేఏసీ సన్నాహకసభ నిర్వహించారు. టీఎన్జీవోస్ ఉమ్మడి జిల్లా కన్వీనర్ రాజేశ్‌కుమార్ అద్యక్షతన జరిగిన సభలో ఉద్యోగులు తమ సమస్యల సాధన కోసం ప్రభుత్వంపై పోరుకు సిద్ధమవుతున్నామని స్పష్టమైన సంకేతాలిచ్చారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న టీఎన్జీవోస్ కేంద్ర సంఘం అధ్యక్షుడు, జేఏసీ రాష్ట్ర చైర్మన్ కారం రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ సీపీఎస్ అమలులో రాష్ట్ర ప్రభుత్వ పాపం కూడా ఉందన్నారు. అందుకే దానిని రద్దు చేస్తూ దేశానికి ఆదర్శంగా నిలవాలన్నారు. ప్రభుత్వానికి అన్ని సమయాల్లో ఉద్యోగులు అండగా ఉన్నా రని పేర్కొన్నారు. అలాంటిది సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉద్యోగులు మరోసారి ఉద్యమానికి సిద్ధమవుతారని పేర్కొన్నారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, ఎన్ఎంఆర్ పేర్లు ఏవైనా ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. ఉమ్మడి రాష్ట్ర సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాలేదని గుర్తుచేశారు. నకిలీ సర్టిఫికెట్లతో ఆంధ్ర ఉద్యోగులు తెలంగాణలో ఉన్నారన్నారు. సీపీఎస్‌పై సభకు ముందే సీఎం ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఆటంకాలు సృష్టిస్తే అగ్నిగుండమే.. ఉద్యోగుల మహాసభకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వకుండా ఆటంకాలు సృష్టిస్తే ఎక్కడికక్కడ ధర్నాలు, రాస్తారోకోలు చేస్తామని, రాష్ట్రాన్ని అగ్ని గుండంగా మారుస్తామని ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి రాజేందర్, హైదరాబాద్ అధ్యక్షుడు ప్రతాప్ హెచ్చరించారు. కొత్త జిల్లాల ఏర్పాటులో దసరా పండుగ లేకుండా పనిచేసిన ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ఉద్యోగుల కృషి ఫలితంగానే ప్రభుత్వ పథకాల అమల్లో రాష్ట్ర ప్రభుత్వం నంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. పెన్షన్లు, ఆశావర్కర్లు హౌసింగ్ ఉద్యోగులు, సెర్ఫ్ ఉద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారమయ్యేవరకూ ఐక్యంగా ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు. ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, జేఏసీలోని వివిధ సంఘాల రాష్ట్ర నాయకులు ఉపేందర్‌రెడ్డి, జగన్మోహన్రావు, శ్రీనివాస్‌రావు, రేచల్, మహిపాల్‌రెడ్డి, నర్సింహస్వామి, కైలాసం, రమేశ్, జగదీశ్వర్, సర్వర్ హుస్సేన్, రత్నాకర్‌రెడ్డి, రత్నవీరాచారి, వేణుగోపాల్, నూతనకంటి బాబు, నరేందర్‌నాయక్, రాగి శ్రీనివాస్, బురుగు రవి, శ్యాంసుందర్, మాధవరెడ్డి, హసనుద్దీన్, శ్రీనివాస ఫణికుమార్, శ్రీనివాస్‌రావు, శ్రీనివాస్‌రెడ్డి, ఉపేందర్‌రెడ్డి విజయలక్ష్మి, అనిత, సునీత, వీఆర్వోల సంఘం నేతలు పాల్గొన్నారు. సీపీఎస్ ఉద్యోగులు, హౌసింగ్ ఉద్యోగులు, ఈజీఎస్, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు తమతమ సమస్యల పరిష్కారం కోరు తూ జేఏసీ నేతలకు వినతిపత్రాలు అందజేశారు. చేయాల్సినవి ఉన్నాయి.. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు పీఆర్సీ, హెల్త్ కార్డులు, ఇంక్రిమెంట్ ఇచ్చిందని.. అయితే పరిష్కరించాల్సిన సమస్యలు చాలా ఉన్నాయని ఉద్యోగ సంఘాల జిల్లా జేఏసీ చైర్మన్ పరిటాల సుబ్బారావు అన్నారు. సామరస్య పూర్వక వాతావరణంలో సమస్యలను పరిష్కరించేందుకు ప్రభు త్వం చర్యలు తీసుకోవాలన్నారు. పీఆర్సీ కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. -
అందరి శత్రువయా!
⇒ బిగ్‌బాస్‌కు అందరితోనూ విభేదాలే.. ⇒ సాగనంపాలంటూ ప్రభుత్వానికి టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే లేఖ ⇒ జిల్లా సమీక్ష సమావేశంలో పలువురు ఎమ్మెల్యేల ఆగ్రహం ⇒ నగదు రహిత రేషన్ పంపిణీపైనా విమర్శలు ⇒ సార్ నిబంధనలపై ఉద్యోగ సంఘాలు సీరియస్ జిల్లాలో బిగ్‌బాస్‌గా వ్యవహరిస్తున్న ఆ అధికారికి ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు ఇలా అందరితో విభేదాలు తెచ్చుకోవడం సాధారణమైంది. ఆయన తీరుపై ఉద్యోగ సంఘాలే కాదు... అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. జిల్లా సమీక్ష సమావేశాల్లో బిగ్‌బాస్ తీరును ఆ ఎమ్మెల్యేలు ఎండగడుతున్నారు. అయితే చిన్నబాబు ఆశీస్సులు పుష్కలంగా ఉండటంతో జిల్లా ఇన్చార్జి మంత్రి, ఇతర మంత్రులు ఏమీ చేయలేక ఎమ్మెల్యేలకు సర్దిచెబుతున్నారు. సాక్షి, విజయవాడ : బిగ్‌బాస్ జిల్లాలో బాధ్యతలు స్వీకరించిన తరువాత అధికార పార్టీ ఎమ్మెల్యేలను సైతం పూర్తిగా విస్మరించారు. చిన్నచిన్న పనులు కూడా చేయించుకోలేక అధికార పార్టీ ఎమ్మెల్యేలు సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్‌ను జిల్లా నుంచి సాగనంపాలంటూ టీడీపీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే ఒకరు ప్రభుత్వానికి లేఖ రాశారు. అదే సమయంలో మరికొంత మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా బిగ్‌బాస్‌పై మంత్రుల వద్ద తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. ► నగదు రహిత రేషన్‌ను రాష్ట్రంలోనే తొలిసారిగా కృష్ణాజిల్లాలో అమలు చేశారు. దీనివల్ల పేదలకు పూర్తిగా రేషన్ అందడం లేదు. మరోవైపు రేషన్ డీలర్లు ఇబ్బంది పడుతున్నారు. పేద, మధ్య తరగతి వర్గాల ప్రజల నుంచి తీవ్ర వత్తిడి రావడంతో రేషన్ దుకాణల్లో డిజిటల్ విధానానికి స్వస్తి పలకాలంటూ గత నెల 28వ తేదీన జరిగిన జిల్లాసమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే బోడె ప్రసాద్ డిమాండ్ చేశారు. రేషన్ దుకాణాలకు బదులుగా మద్యం షాపుల్లో ఈ విధానం పెట్టాలని సూచించారు. ► రాజధాని పేరుతో బిగ్‌బాస్ కొత్తకొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. ఈ కార్యక్రమాల్లో ఎక్కువగా ఒక ఈవెంట్ మేనేజర్‌కే దక్కుతున్నాయి. ఆయనకు రూ.కోట్లలో బిల్లులు ఇస్తున్నారు. దీని వెనుక చిన్నబాబుకు, బిగ్బాబుకు వాటాలు అందుతున్నాయని అధికార పార్టీ ప్రజాప్రతినిధులే చర్చిం చుకుంటున్నారు. ► జిల్లాలో ఒక నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూసేకరణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో భూములు కోల్పోతున్న పేదలు అధికార పార్టీకి చెందిన స్థానిక ఎమ్మెల్యే వద్దకు వెళ్లి మొరపెట్టుకుంటున్నారు. భూసేకరణ సమాచారం తెలుసుకునేందుకు ఆ ఎమ్మెల్యే కీలక అధికారి అయిన బిగ్‌బాస్‌కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా అందుబాటులోకి రాలేదు. దీంతో ఎమ్మెల్యే ఆ అధికారిపై బహిరంగంగానే విమర్శలు చేశారు. ► విజయవాడలో అమరావతి ఫెస్టివల్ నిర్వహణకు అవసరమైన నగదు కోసం వాణిజ్య పన్నుల శాఖకు బిగ్‌బాస్ భారీగా టెండర్లు వేసి చందాలు వసూలు చేసి వ్యాపారులను వేధించారు. తాను నిర్వహించే ప్రతి సమావేశానికీ డెప్యూటీ కమిషనర్ స్థాయి అధికారులు రావాలని ఆదేశించే వారు. బిగ్బాబ్ వ్యవహారం వాణిజ్య పన్నుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వరకు చేరింది. రాజధానిలో రెవెన్యూ పడిపోతే తాము బాధ్యత వహించబోమంటూ బిగ్‌బాస్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఘాటుగా లేఖ రాశారు. తమ శాఖను ఉపయోగించి వ్యాపారుల వద్ద చందాలు వసూలు చేయొ ద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. ► విజయవాడలోని ఇరిగేషన్ భవనాన్ని సీఎం క్యాంపు కార్యాలయంగా మార్చే పనులన్నింటినీ బిగ్‌బాసే పర్యవేక్షించారు. ఇందులో జరిగిన పనులకు ముందుగా అంచనాలు, టెండర్లు లేకపోవడంతో ఈఈ స్థాయి అధికారి బిల్లులు మంజూరు చేయబోమంటూ ఎదురు తిరిగారు. దీంతో బిగ్‌బాస్ జోక్యం చేసుకుని ఆ ఈఈని మార్చి మరో ఈఈకి బాధ్యతలు అప్పగించి ఆయన ద్వారా బిల్లులు ఇప్పించారు. ఆ బిల్లుల్లో బిగ్‌బాస్‌కు రూ.లక్షల్లో మిగిలిందని ఇరిగేషన్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ► వాస్తవంగా ప్రభుత్వశాఖల్లో బదిలీలను ఆ యా శాఖల ముఖ్య అధికారులే చేయాలి. అయితే బిగ్‌బాస్ జోక్యం చేసుకుని తన ఇష్టానుసారంగా బది లీలు చేసేందుకు ప్రయత్నించారు. దీంతో ఉద్యోగ సంఘాలు స్పందించి బదిలీల్లో బిగ్‌బాస్ జోక్యంపై తీవ్ర ఆక్షేపణ తెలిపాయి. దీంతో ఆయన వెనక్కు తగ్గక తప్పలేదు. ► జిల్లాలో సిబ్బందికి ఐదేళ్లకు ఒకసారి జరిగే రివైజ్డ్ పే స్కేల్స్‌కు కొత్తగా ప్రవేశపెట్టిన సాఫ్ట్వేర్ ఉపయోగించాలని బిగ్‌బాస్ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆ సాఫ్ట్‌వేర్‌లో అనేక లోపాలు ఉండటంతో ముందుకు సాగలేదు. ఈ విషయం తెలుసుకున్న మిగిలిన 12 జిల్లాల అధికారులు పాత సాఫ్ట్వేర్ ప్రకారం ఉద్యోగుల పేస్కేల్ మార్చారు. అయితే కృష్ణాజిల్లాలో మారకపోవడంతో చివరకు ఉద్యోగసంఘాలు జోక్యం చేసుకుని నిరసనకు దిగుతామని హెచ్చరికలు జారీ చేయడంతో బిగ్‌బాస్ దిగి వచ్చారు. పాత సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి రివైజ్డ్ పేస్కేల్స్ తయారు చేయడానికి అంగీకరించారు. ► వివిధ కారణాలు వల్ల సస్పెండ్ అయిన వీఆర్వోలకు తిరిగి పోస్టింగ్‌లు ఇవ్వకుండా ఈ బిగ్‌బాస్ వేధిస్తున్నారు. సుమారు 70 మంది వీఆర్వోలను పక్కన పెట్టడంతో రెవెన్యూ శాఖలో పాలన కుంటుపడింది. ► విజయవాడ దుర్గగుడి సమీపంలోని అర్జున వీధి ప్రారంభంలో ఉన్న కేంద్ర జలభవ¯న్ను తొలగించ వద్దంటూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. అయితే పుష్కరాల సమయంలో బిగ్‌బాస్ ఆ ఉత్తర్వులను లెక్క చేయకుండా భవనాన్ని కూల్చివేశారు. అనంతరం కేంద్ర జలవనరుల శాఖకు ప్రత్యామ్నాయం చూపించలేదని అప్పటి ఇరిగేషన్ ఎస్ఈ, ఈఈలపై బిగ్‌బాస్ తోకతొక్కిన తాచులాగా చిందులు తొక్కడంతో ఇరిగేషన్ అధికారులు చిన్నబుచ్చుకున్నారు. ► వివిధ శాఖలకు చెందిన అధికారులతో సమావేశం నిర్వహించినప్పుడు వారు చిన్నచిన్న తప్పులు చేసినా యూజ్లెస్ ఫెలో, వేస్ట్ ఫెలో అంటూ తిట్టడం బిగ్‌బాస్‌కు సర్వసాధారణం. సమావేశానికి రాకపోయినా, కొద్దిగా ఆలస్యంగా వచ్చినా, ఆయన చెప్పినట్లు చేయకపోయినా వారిపై విరుచుకుపడతారు. -
'ఉద్యోగ నేతలను అశోక్‌బాబు బెదిరిస్తున్నారు'
విజయవాడ: ఏపీ ఎన్జీవో ఎన్నికలకు, జేఏసీ ఏర్పాటుకు సంబంధం లేదని ఏపీ నూతన జేఏసీ చైర్మన్ బొప్పారాజు వెంకటేశ్వర్లు తెలిపారు. అశోక్‌బాబు నాయకత్వంలో ఉద్యోగులకు న్యాయం జరగక పోవడం వల్లే కొత్త జేఏపీ ఆవిర్భవించిందన్నారు. కొత్త జేఏసీ నుంచి అశోక్‌బాబుకు పోటీగా ఏన్జీవో ఎన్నికలకు ఎవరినీ ప్రోత్సహిండం లేదన్నారు. అశోక్‌బాబు ఒంటెద్దు పోకడల వల్లే బలమైన ఉద్యోగ సంఘం నూతన జేఏసీ ఏర్పడిందని తెలిపారు. కొత్తగా ఏర్పాటైన జేఏసీలోని ఉద్యోగ నేతలను అశోక్‌బాబు బెదిరించి, చీలికలకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. -
అశోక్‌బాబుపై తిరుగుబాటు
ఉద్యోగ సంఘాల నూతన జేఏసీ అధ్యక్షుడుగా బొప్పరాజు తిరుపతి వేదికగా ఎన్నుకున్న 73 సంఘాల ప్రతినిధులు తిరుపతి రూరల్: ఉద్యోగ సంఘాలన్నీ ఏకమయ్యాయి. తిరుపతిలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన జేఏసీ నవ నిర్మాణ సదస్సులో అశోక్‌బాబుకు వ్యతిరేకంగా గర్జించాయి. వందలాది మంది ప్రతినిధుల సమక్షంలో 73 ఏపీ ఉద్యోగ సంఘాలు కొత్త జేఏసీని ప్రకటించాయి. దానికి రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లును అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా తమ సంఘాల నుంచి తీసుకువచ్చిన తీర్మానాల కాపీలను నూతన జేఏసీ అధ్యక్షుడికి ఉద్యోగ సంఘాల నేతలు సభాముఖంగా అందించారు. అశోక్‌బాబు తీరుపై నిప్పులు ఉద్యోగుల సంఘాల జేఏసీ అధ్యక్షుడుగా వ్యవహరిస్తున్న ఏపీ ఎన్జీవోల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు నాయకత్వంపై ఉద్యోగ సంఘాల ప్రతినిధులు నిప్పులు చెరిగారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకుండా దళారీలా వ్యవహరిస్తున్నారని ట్రెజరీ ఉద్యోగుల సంఘ రాçష్ట్ర అధ్యక్షుడు రవికుమార్ ఆరోపించారు. రాజకీయ పార్టీలు విఫలమై ప్రజలు కోరితే ప్రత్యేక హోదాపై జేఏసీ ఆధ్వర్యంలో ముందుండి పోరాడతామని ఏపీ జేఏసీ నూతన అధ్యక్షుడుబొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. -
నేడు తిరుపతిలో ఉద్యోగ సంఘాల భేటి
-
ప్రభుత్వ ఉద్యోగుల కొత్త జేఏసీ!
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంయుక్త కార్యాచరణ సమితి (జేఏసీ)లో చీలిక అనివార్యంగా కనిపిస్తోంది. నూతన జేఏసీ ఆవిర్భావానికి రంగం సిద్ధమవుతోంది. ప్రస్తుతం జేఏసీకి నేతృత్వం వహిస్తున్న అశోక్‌బాబుపై తిరుగుబాటు బావుటా ఎగరేసేందుకు 30 ఉద్యోగ సంఘాలు ఏకమవుతున్నాయి. ఏపీఏన్జీవో అసోసియేషన్ అధ్యక్షుడిగా అశోక్‌బాబు రాష్ట్ర ప్రభుత్వానికి సాగిలపడి వ్యవహరిస్తున్నారని, ఉద్యోగుల సమ స్యలు పట్టించుకోవడం లేదని సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యం లోనే 5న తిరుపతిలో సమావేశం కావాలని ఆయా సంఘాలు నిర్ణయించినట్టు సమాచారం. నవనిర్మాణ సదస్సు పేరిట తిరు పతి రెవెన్యూ అసోసియేషన్ హాలులో ఈ భేటీ జరగనుంది. కొత్త జేఏసీ విధివిధా నాల రూపకల్పన తదితర అంశాలపై నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. -
జీతాలకు ఢోకా లేదు
నగదుగా చెల్లించేందుకు మాత్రం వీలుకాదు: ఈటల సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు ఢోకా లేదని.. జీతాలు ఆపాలన్న ప్రతిపాదనేదీ లేదని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. అరుుతే ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నట్లుగా జీతాలు నగదు రూపంలో ఇచ్చేందుకు ఆస్కారం లేదని తెలిపారు. మంత్రి మంగళవారం హైదరాబాద్‌లో ‘సాక్షి’తో మాట్లాడారు. నోట్ల రద్దుతో తెలంగాణకు ఎంత నష్టమో, పరిస్థితి ఎప్పటికి చక్కబడుతుందో తేలేందుకు సమయం పడుతుందని... అప్పటివరకు ప్రజలు అర్థం చేసుకొని ఓపిక పట్టాలని సూచించారు. నోట్ల రద్దు తర్వాత జరుగుతున్న పరిణామాలు బాధాకరంగా ఉన్నాయని... నల్లధనం పేరుతో మెజారిటీ ప్రజలను ఇబ్బంది పెట్టడం సమంజసంగా లేదని వ్యాఖ్యానించారు. ప్రజల అవస్థలను సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రధాని, కేంద్ర ఆర్థిక మంత్రుల దృష్టికి తీసుకెళ్లారన్నారు. భారీ మొత్తంలో నోట్ల ముద్రణకు సమయం పడుతుందని, ప్రజలకు చేరటం ఆలస్యమవుతోందని ఈటల చెప్పారు. అందువల్ల పరిస్థితి మెరుగుపడేదాకా పాత కరెన్సీని కొనసాగించాల్సిందని అభిప్రాయపడ్డారు. సహకార బ్యాంకుల్లో నోట్ల మార్పిడికి అవకాశమివ్వాలని కోరినా.. కేంద్రం అనుకూలంగా లేదని, అవి ప్రభుత్వ అధీనంలో లేవనే అభిప్రాయంతో ఉందని తెలిపారు. నగదుగా చెల్లించండి: ఉద్యోగ సంఘాలు డిసెంబర్ ఒకటో తేదీన చెల్లించే జీతాలను నగదు రూపంలో ఇవ్వాలని తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. టీఎన్జీవో ప్రతినిధులు దేవీప్రసాద్, రవీందర్‌రెడ్డి, రాజేందర్ మంగళవారం సాయంత్రం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను కలిశారు. నోట్ల రద్దు నేపథ్యంలో ఉద్యోగులందరూ ఇబ్బంది పడుతున్నారని, వచ్చేనెల వేతనాన్ని నగదు రూపంలో చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. అలా కుదరని పక్షంలో కనీసం రూ.10 వేలు అరుునా నగదుగా ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక కొత్త జిల్లాల్లో కొనసాగుతున్న ఉద్యోగులకు పాత జిల్లాల స్థారుు హెచ్ఆర్ఏను ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. -
ముదిరిన ‘ఆస్తి’ వివాదం
ఉద్యోగ సంఘాల మధ్య ఘర్షణకు దారితీసిన విచారణ - ఏపీఎన్జీవో నేతలపై దాడికి బీటీఎన్జీవో నాయకుని యత్నం - అర్ధంతరంగా విచారణ వాయిదా హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉభయ రాష్ట్రాలకు చెందిన ఉద్యోగ సంఘాల నేతలు ఆస్తుల వాటా విషయమై మరోసారి బాహాబాహీకి దిగారు. దీంతో బుధవారం నాంపల్లిలోని తహసీల్దార్ కార్యాలయంలో ఉద్యోగ సంఘాల ఆస్తుల వాటాకు సంబంధించిన విచారణ ఉద్రిక్తతకు దారి తీసింది. గన్‌ఫౌండ్రీలోని ఏపీఎన్జీవో కార్యాలయంలో తమకు వాటా కల్పించాలని కోరుతూ ఏపీఎన్జీవో నుంచి విడిపోరుు భాగ్యనగర్ తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం(బీటీఎన్జీవో) హైదరాబాద్ రెవెన్యూ డివిజనల్ అధికారి(ఆర్డీవో)కు సెప్టెంబర్ 1న విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. విజ్ఞాపన పత్రాన్ని స్వీకరించిన ఆర్డీవో విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన కలెక్టర్ ఆస్తుల వాటా అంశం పరిశీలన నిమిత్తం విచారణాధికారిగా నాంపల్లి తహసీల్దార్ వెంకటేశ్వర్లును నియమించారు. ఇరు ఉద్యోగ సంఘాల నేతలను సెప్టెంబర్ 14న నాంపల్లి తహసీల్దార్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. విచారణలో ఇరు సంఘాల నేతలు సమయాన్ని ఇవ్వాల్సిందిగా తహసీల్దార్ వెంకటేశ్వర్లును కోరడంతో అక్టోబర్ 5కి విచారణ వారుుదావేశారు. దీంతో బుధవారం ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు, బీటీఎన్జీవో సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ తమ కార్యవర్గం సభ్యులతో కలసి విచారణకు హాజరయ్యారు. ఇరు సంఘాల నేతలు తమ వాదనలు వినిపించారు. ఈ నెల 16న ఏపీఎన్జీవో కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించి సభ్యులతో చర్చించి తుది నివేదికను అందజేసేందుకు సమయం ఇవ్వాలని అశోక్‌బాబు అభ్యర్థించా రు. తాము ఏపీఎన్జీవోలో పనిచేసిన సభ్యులమేనని, తాము సభ్యత్వంతో పాటుగా, గచ్చిబౌలిలోని ఏపీఎన్జీవో హౌసింగ్ కార్పొరేషన్‌కు డబ్బులు చెల్లించామని, దీనిలో తాము పూర్తిగా నష్టపోరుునట్లు వివరించారు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీఎన్జీవో అనుబంధంగా కొనసాగిన నగరశాఖ నుంచి విడిపోరుు బీటీఎన్జీవో ఆవిర్భవించిందని, తమకు ప్రస్తుత ఏపీఎన్జీవో కార్యాలయంలో వాటా కావాలని సత్యనారాయణ కోరారు. ఇరువురు తమ వాదనలు వినిపిస్తుండగానే తహసీల్దార్ ఎదుటే బీటీఎన్జీవో నాయకుడు ఒకరు ఏపీఎన్జీవో ఉద్యోగులపై దాడికి ప్రయత్నించాడు. ‘‘రాష్ట్రం విడిపోరుునా మీకు సిగ్గు లేదురా., ఇక్కడెందుకున్నార్రా.. ఏపీఎన్జీవోలు కనిపిస్తే కొట్టండ్రా’’ అంటూ వీరంగం సృష్టించాడు. మీ వల్ల తాను ఆర్థికంగా చితికిపోయానని, బంగారం అమ్మేసి గచ్చిబౌలిలో ప్లాట్ కేటారుుంపు కోసం లక్షన్నర రూపాయలు ఇచ్చానంటూ ఆ నాయకుడు ఊగిపోయాడు. దీంతో విచారణ అర్ధంతరంగా వారుుదా పడింది. అన్నీ పరిశీలించాకే.. ఉద్యోగ సంఘాల వాదోపవాదనలు విన్నాం. రికార్డులను పరిశీలించాల్సి ఉంది. అన్నీ పరిశీలించాక సమగ్ర నివేదికను అందజేస్తాం. రికార్డును ఫాలో అయ్యాకే తుది తీర్పును ఇస్తాం. ఉద్యోగులు విచారణలో ఘర్షణకు దిగడం బాధాకరం. - వెంకటేశ్వర్లు, తహిసీల్దార్ ముమ్మాటికీ మాకూ వాటా ఉంది రాష్ట్ర విభజనకు ముందు ఏపీఎన్జీవో భవన్ నిర్మాణం కోసం నిధులు సమీకరించాం. నగరంలో ఎంతో కష్టపడి సభ్యత్వాన్ని పెంచాం. ఇప్పుడు కాదు కూడదంటే ఎలా. ముమ్మాటికీ మాకు అందులో వాటా ఉంది. ఆ కార్యాలయంలోనే మాకూ కార్యాలయాన్ని కేటారుుంచాలి. - సత్యనారాయణ, బీటీఎన్జీవో అధ్యక్షుడు అది ప్రైవేట్ ఆస్తి గన్‌ఫౌండ్రీలోని ఏపీఎన్జీవో కార్యాలయం ప్రైవేట్ ఆస్తి. అది ప్రభుత్వానికి చెందినది కానే కాదు. ఇందులో ఎవరికీ వాటాలు ఉండవు. బీటీఎన్జీవోలు అనవసరంగా వివాదాన్ని సృష్టిస్తున్నారు. విచారణకు ఆహ్వానించి దాడి చేయడం దారుణం. - అశోక్ బాబు, ఏపీఎన్జీవో అధ్యక్షుడు -
జోనల్ వ్యవస్థను రద్దు చేయండి
ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా జోనల్ వ్యవస్థను రద్దు చేయాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. యూటీఎఫ్, ఎస్టీయూ ఉపాధ్యాయ సంఘాలు మినహా మిగతా సంఘాలన్నీ జోనల్ వ్యవస్థ రద్దుకే మొగ్గు చూపాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ గురువారం సచివాలయంలో ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమయ్యారు. అనంతరం ఉద్యోగ సంఘాల నేతలు విలేకరులతో మాట్లాడారు. కేడర్ పోస్టులు కొనసాగించాలి అసమానతలకు గురి చేస్తున్న జోనల్ వ్యవస్థను రద్దు చేయాలి. కొత్త నియామకాల్లో రాష్ట్ర, జిల్లా స్థాయి పోస్టులే ఉంచాలి. జిల్లా స్థాయి పోస్టులను ఆయా విభాగాలతో సంప్రదించి నిర్ణయించాలి. కొత్త జిల్లాల నేపథ్యంలో ప్రస్తుత జోనల్ స్థాయి అధికారుల సీనియారిటీ దెబ్బ తినకుండా చూడాలని కోరాం. ప్రస్తుత కేడర్ పోస్టులను యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేశాం. కొత్త జిల్లాల నేపథ్యంలో పోస్టులు కుదించొద్దని స్పష్టం చేశాం. ఉద్యోగుల పంపకాలు, సమస్యల పరిష్కారానికి కమలనాథన్ కమిటీ మార్గదర్శకాలను కొద్దిగా మార్చి రాష్ట్రంలోనూ ఒక ఐఏఎస్ నేతృత్వంలో కమిటీ వేయాలని, సీనియారిటీ, మల్టీ జోనల్ సమస్యలను పరిష్కరించాలని సూచించాం. జోనల్ వ్యవస్థ ఇబ్బందికరంగా మారకుండా రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించాలన్నాం. స్థానికత కోసం ఏపీ ప్రభుత్వ విధానాన్ని అనుసరించాలన్నారు. కొత్త జిల్లాలొస్తున్నందున హెచ్ఆర్ఏ అందరికీ సమానంగా ఇవ్వాలని కోరాం. - దేవీప్రసాద్, శ్రీనివాస్‌గౌడ్, మమత (టీఎన్జీవో) సమానావకాశాలు కొత్త జిల్లాల నేపథ్యంలో జిల్లా, జోనల్, రాష్ట్ర స్థాయి పోస్టులకు రక్షణ కల్పించాలని కోరాం. ఎవరూ ఆందోళన చెందే పని లేకుండా ఉద్యోగుల సర్వీస్ రూల్స్ అలాగే కొనసాగుతాయి. - పాతూరి సుధాకర్‌రెడ్డి, టీచర్స్ ఎమ్మెల్సీ రిటైర్మెంట్ ఏజ్ 60 ఏళ్లు పాలన ఇబ్బందులు రాకుండా ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 60 ఏళ్లకు పెంచాలన్నాం. గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, గ్రేడ్-2 ఎంఈవో, డైట్ సీనియర్ లెక్చరర్లు, బీఎడ్, డిగ్రీ లెక్చరర్లు, ప్రిన్సిపల్ పోస్టులను రాష్ట్ర కేడర్‌లో ఉంచాలి. డీఈవోలను అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున కేటాయించాలి. - పూల రవీందర్, పి.సరోత్తమ్‌రెడ్డి, నరహరి లకా్ష్మరెడ్డి (పీఆర్టీయూ-టీఎస్) పాలకుల సౌలభ్యం కోసమే కొత్త జిల్లాల ఏర్పాటు కేవలం పాలకుల సౌలభ్యానికే చేస్తున్నట్టుగా ఉంది. ఉన్న సిబ్బందితోనే సర్దుబాటు చేస్తే పాలనసౌలభ్యమెలా అవుతుంది? జోనల్ వ్యవస్థను యథాతథంగా కొనసాగించాలి. లేదంటే వెనకబడిన జిల్లాలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముంది. కొత్త జిల్లాలకు అనుగుణంగా డీఈవో, ఎంఈవో పోస్టులు మంజూరు చేయాలి. - భుజంగరావు, సదానందగౌడ్ (ఎస్టీయూ) ఆరు జోన్లుండాలి సామాజికంగా, ఆర్థికంగా ఒకే స్థాయిలో ఉన్న ప్రాంతాలతోనే కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలి. జోనల్ వ్యవస్థను కొనసాగించి వాటి సంఖ్యను ఆరుకు పెంచాలి. - నర్సిరెడ్డి, చావ రవి (టీఎస్-యూటీఎఫ్) -
సాధారణ బదిలీలు లేనట్లే!
- ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ఏడాదీ నిరాశే - స్పౌస్ కేటగిరీలో మాత్రమే అనుమతిస్తూ సర్కారు నిర్ణయం సాక్షి, హైదరాబాద్: రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆతృతగా ఎదురుచూస్తున్న సాధారణ బదిలీలు ఈ ఏడాది కూడా ఉండే అవకాశం కనిపించడం లేదు. కేవలం భార్యాభర్తల (స్పౌస్) కేటగిరీలో మాత్రమే ఈ ఏడాది బదిలీలకు అవకాశం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం సంతకం చేశారు. ఈ బదిలీల షెడ్యూల్, విధి విధానాలు ఒకటి రెండు రోజుల్లో జారీకానున్నాయి. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై నిషేధం కొనసాగుతోంది. ఈ నిషేధాన్ని సడలించి సాధారణ బదిలీలకు అవకాశమివ్వాలని ఉద్యోగ సంఘాలు ఇప్పటికే పలుమార్లు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశాయి. కానీ తొలి నుంచీ సాధారణ బదిలీల అంశంపై ముఖ్యమంత్రి విముఖంగా ఉన్నారు. కానీ వేర్వేరు ప్రాంతాల్లో పనిచేస్తున్న భార్యాభర్తలకు ఒకే ప్రాంతంలో పనిచేసేందుకు అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో.. స్పౌస్ కేటగిరీలో బదిలీలకు మాత్రం అనుమతించారు. ఇందుకు వీలుగా మార్గదర్శకాలు రూపొందించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో బదిలీ కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగులకు నిరాశే ఎదురవుతోంది. -
బదిలీలకు కొత్త జిల్లాల పీటముడి
సీఎంకు చేరిన బదిలీల ఫైలు సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల సాధారణ బదిలీలపై ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ఉద్యోగ సంఘాల వరుస విజ్ఞప్తులతో ఈ నెలాఖరున సాధారణ బదిలీలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అందుకు సంబంధించి ఆర్థిక శాఖ సిద్ధం చేసిన ఫైలును ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ముఖ్యమంత్రికి పంపించారు. సీఎం ఆమోద ముద్ర పడితే ఈ నెల 25వ తేదీ నుంచి సాధారణ బదిలీలు మొదలవుతాయి. 15 రోజుల పాటు అన్ని శాఖల్లో కౌన్సెలింగ్ నిర్వహించి బదిలీలు చేపడుతారు. కొత్త రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచీ బదిలీలపై నిషేధం కొనసాగుతోంది. ఈ నిషేధాన్ని 25వ తేదీ నుంచి జూన్ 11 వరకు సడలించాలని ఆర్థిక శాఖ ప్రతిపాదించింది. ఒకేచోట కనీసం రెండేళ్లకు మిం చి పని చేసిన ఉద్యోగులకు బదిలీ అవకాశమివ్వాలని, అయిదేళ్లు ఒకేచోట పని చేసిన వారిని తప్పనిసరిగా బదిలీ చేయాలని, అన్ని శాఖల్లో బదిలీల సంఖ్య 20 శాతం మించకూడదని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. గత ఏడాది మే నెలలోనూ ఆర్థిక శాఖ సాధారణ బదిలీల ఫైలును సీఎంకు పంపించటం.. అక్కడ తిరస్కరణకు గురవటంతో ఈ ప్రక్రియ అమలుకు నోచుకోలేదు. ఈసారి సీఎస్ ఈ ఫైలును పంపించాలని ఆర్థిక శాఖను కోరటంతో బదిలీల ప్రక్రియ మొదలవుతుందని ఉద్యోగులు ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. కానీ కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. జూన్ రెండో తేదీన కొత్త జిల్లాలను ప్రకటించేందుకు కసరత్తును వేగవంతం చేసింది. ఈ సమయంలో ఉద్యోగుల సాధారణ బదిలీల ప్రక్రియ చేపట్టడం సరైంది కాదని ముఖ్యమంత్రి ఉన్నతాధికారులవద్ద అభిప్రాయపడ్డట్లు తెలిసింది. సాధారణ బదిలీలపై సీఎం ఇప్పటికే అయిష్టంగా ఉన్నారు. గతేడాది ఉపాధ్యాయుల బదిలీలకు అవకాశం కల్పిస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చిందని, భారీగా అవకతవకలు చోటు చేసుకున్నాయని, రాష్ట్రంలో ముగ్గురు డీఈవోలు సస్పెండ్ అయ్యారని ఇటీవల తనను కలిసిన టీఎన్జీవో నేతలతో వ్యాఖ్యానించినట్లు తెలిసింది. దీంతో బదిలీల ప్రక్రియపై సందిగ్ధత కొనసాగుతోంది. ‘ముఖ్యమంత్రి ఆమోద ముద్ర పడి తే జూన్ ఒకటో తేదీ లోగా సాధారణ బదిలీలు మొదలవుతాయి.. లేకుంటే అక్టోబర్‌లో బదిలీలు జరిగే అవకాశం ఉంది...’ అని టీఎన్జీవో నేత దేవిప్రసాద్ పేర్కొన్నారు. -
టీ జేఏసీ నిర్వీర్యానికి భారీ కుట్ర: జీవన్‌రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో పెద్దన్న పాత్ర పోషించిన పొలిటికల్ జేఏసీని నిర్వీర్యం చేసేందుకు పెద్ద కుట్ర జరుగుతోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి ఆరోపించారు. టీజేఏసీ నుంచి వైదొలగుతున్నట్లు ఉద్యోగ సంఘాలు ప్రకటించడం సరి కాదని అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద గురువారం ఆయన మాట్లాడారు. రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన వారు... అభివృద్ధి విషయంలో ప్రభుత్వం సరైన పద్దతిలో తీసుకెళ్లేందుకు దోహదపడాలన్నారు. ప్రస్తుతం జేఏసీ టీమ్‌కు గతంలో కంటే ప్రస్తుతం బాధ్యత మరింత పెరిగిందన్నారు. కానీ ఉద్యోగ సంఘాలు వారి సమస్యలకే ప్రాధాన్యం ఇస్తామంటూ పక్కకు తప్పుకోవడం బాధాకరమన్నారు. టీజేఏసీని బలోపేతం చేయాల్సిన అవసరం తెలంగాణ సమాజంపై ఉందని, కనుక కాంగ్రెస్ పార్టీ కూడా వెనక ఉంటుందన్నారు. -
ఓటుతో వేటు
సాక్షి, చెన్నై : డిమాండ్లపై స్పందించకుంటే అన్నాడీఎంకేకు వ్యతిరేకంగా ఓటు ఆయుధాన్ని ప్రయోగించాల్సి ఉంటుందన్న హెచ్చరికలకు ఉద్యోగ సంఘాలు సిద్ధమవుతున్నాయి. సోమవారం మూడు లక్షల మందితో కూడిన కార్యాలయ అసిస్టెంట్ , కింది స్థాయి ఉద్యోగుల సంఘం ఏకంగా హెచ్చరికల్ని జారీ చేసింది. తమ డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగ, కార్మికులు ఆందోళన బాట పట్టి ఉన్న విషయం తెలిసిందే. వీరిని బుజ్జగించేందుకు ప్రయత్నాలు జరిగినా, ఫలితం శూన్యం. అసెంబ్లీలో తమకు అనుకూలంగా సీఎం జయలలిత ఎలాంటి ప్రకటన చేయని దృష్ట్యా, ఆయా సంఘాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార పక్షానికి గట్టిగా బుద్ధి చెప్పే దిశగా హెచ్చరికలకు సిద్ధమవుతున్నాయి. గత ఎన్నికల సమయంలో తమకు కళ్లబొల్లి హామీలు ఇచ్చి గద్దెనెక్కి, చివరకు హామీల్ని విస్మరించిన జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకేకు ఓటు ఆయుధంతో బుద్ది చెప్పేందుకు ఉద్యోగ సంఘాలు సిద్ధమవుతున్నాయి. ఒక్క సంఘం ఏ విధంగా నిరసనల బాట పట్టి ఉన్నాయో అదే తరహాలో హెచ్చరికల స్వరాన్ని పెంచేందుకు చర్యల్లో మునిగి ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో సోమవారం ఏకంగా కార్యాలయ అసిస్టెంట్, కింది స్థాయి ఉద్యోగుల సంఘం ఎన్నికల్లో బుద్ది చెబుతామంటూ హెచ్చరికలు జారీ చేసింది. ఉదయం చెన్నైలో జరిగిన ఆ సంఘం సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు. ఆ సంఘం నేత గణేషన్ మీడియాతో మాట్లాడుతూ, తమ డిమాండ్లను గుర్తు చేశారు. వాటిపై సీఎం జయలలిత స్పందించాలని, లేని పక్షంలో రానున్న ఎన్నికల్లో ఓటు ఆయుధాన్ని వ్యతిరేకంగా ఉపయోగించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఎ న్నికల్ని బహిష్కరించడం లేదా, మూడు లక్షల మంది ఉద్యోగులు, వారి కుటుంబాలు అన్నాడీఎంకేకు వ్యతిరేకంగా ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించడం గమనార్హం. ఓ వైపు ఉద్యోగులు ఎన్నికల బహిష్కరణ నినాదాన్ని అందుకుంటుంటే, మరో వైపు ఓటింగ్ శాతం పెంపునకు అన్ని వర్గాల్ని సమావేశ పరిచే విధంగా ఎన్నికల కమిషనర్ రాజేష్ లఖాని చర్యలకు సిద్ధమయ్యారు. ఓటింగ్ శాతం పెంపు : సర్వత్రా ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం అందరి అభిప్రాయాల సేకరణ, సమస్యల అధ్యయనం కోసం సమావేశాలకు రాజేష్ లఖాని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఉదయం మానసిక వికలాంగులతో సమావేశమయ్యారు. వికలాంగులు, అంధుల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఈసందర్భంగా మీడియాతో రాజేష్ లఖాని మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపు నిస్తూ ముందుకు సాగుతున్నామని, అందర్నీ ఓటు హక్కు వినియోగించుకునేలా చైతన్యం తీసుకొస్తామన్నారు. వికలాంగుల సమస్యల్ని అధ్యయనం చేశామని, 1918 పోలింగ్ కేంద్రాల్లో వీరి కోసం ప్రత్యేకంగా ర్యాంప్, వీల్ చైర్స్లను ఏర్పాటు చేయబోతున్నామన్నారు. అలాగే, బ్రెయిలి విధానంతో ఓటు హక్కు వినియోగించుకునే ఏర్పాట్లు చేయనున్నామన్నారు. -
పెన్షనర్లకు ఇప్పటికీ నిరీక్షణే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు చెల్లించాల్సిన గ్రాట్యుటీ బకాయిలను ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టడంతో దాదాపు 8 వేల మంది రిటైర్డ్ ఉద్యోగులు గ్రాట్యుటీ బకాయిలు ఎప్పుడొస్తాయా అని ఎదురుచూస్తున్నారు. పీఆర్సీ సిఫారసుల ప్రకారం రిటైరైన ఉద్యోగులకు ఇచ్చే గ్రాట్యుటీని భారీగా పెంచిన ప్రభుత్వం... బకాయిల చెల్లింపులపై మాత్రం ఉలుకూ పలుకూ లేనట్లుగా వ్యవహరిస్తోంది. రిటైరైన ఉద్యోగులకు గతంలో రూ. 8 లక్షలున్న గ్రాట్యుటీని రూ. 12 లక్షలకు పెంచుతూ గత ఏడాది జూలైలోనే ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు...తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి పెరిగిన గ్రాట్యుటీ వర్తిస్తుందని ప్రకటించింది. 2015 మార్చి నుంచి రిటైరైన వారికి నగదు రూపంలో గ్రాట్యుటీ చెల్లిస్తామని, 2014 జూన్ 2 నుంచి 2015 ఫిబ్రవరి 28 మధ్య రిటైరైన ఉద్యోగులకు గ్రాట్యుటీ వ్యత్యాస బకాయిలు చెల్లిస్తామని పేర్కొంది. వీటికి సంబంధించి ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేస్తామని సర్కారు తెలిపింది. కానీ ఆరు నెలలు కావస్తున్నా ఈ ఉత్తర్వులు జారీ చేయకుండా ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టడంతో బకాయిలు పొందాల్సిన పెన్షనర్లలో ఆందోళన వ్యక్తమవుతోంది. తమ తర్వాత రిటైరైన ఉద్యోగులకు పెరిగిన గ్రాట్యుటీ చెల్లించిన ప్రభుత్వం తమకు ఇస్తామన్న బకాయిలు ఇవ్వకపోవటంపై వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరందరికీ రూ. 8 లక్షల గ్రాట్యుటీ చెల్లించామని, వ్యత్యాస బకాయిల ఫైలు పెండింగ్‌లో ఉందని అధికారులు చెబుతున్నారు. గ్రాట్యుటీ బకాయిలు చెల్లించేందుకు దాదాపు రూ. 200 కోట్లు కావాల్సి ఉండటం, కొత్త బడ్జెట్ తయారీ నేపథ్యంలో ఈ చెల్లింపుల ఫైలు మరో రెండు నెలల వరకు ముందుకు కదిలేటట్లు లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వేతన బకాయిలకు మోక్షం లేనట్లే! ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ బకాయిల చెల్లింపులకు రానున్న బడ్జెట్లోనైనా మోక్షం లభించడం ప్రశ్నార్థకంగా మారింది. ప్రణాళికేతర వ్యయాన్ని వీలైనంత మేరకు తగ్గించాలని సర్కారు కసరత్తు చేస్తుండటంతో బడ్జెట్లో బకాయిల అంశం ప్రస్తావనకు వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. పీఆర్సీ ఉత్తర్వుల ప్రకారం పెరిగిన వేతనాలకు సంబంధించిన 9 నెలల బకాయిలను ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించాల్సి ఉంది. వీటికి దాదాపు రూ. 2,500 కోట్లు అవసరమవుతాయి. ఇది భారీ మొత్తం కావటంతో ఆర్థికశాఖ బకాయిలను చెల్లించకుండా వాయిదా వేస్తూ వస్తోంది. మరోవైపు బకాయిలు నగదుగా ఇవ్వాలా లేక జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేయాలా అనే సందిగ్ధతపై స్పష్టత లేదు. కొత్తగా చేరిన ఉద్యోగులకు జీపీఎఫ్ ఖాతాలు లేకపోవటం, పెన్షన్‌దారులకు జీపీఎఫ్ వర్తించకపోవటంతో ఈ చెల్లింపులు సంక్లిష్టంగా మారాయి. బకాయిల మొత్తంలో సగం జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేయాలని, మిగతా సగం నగదు రూపంలో ఇవ్వాలంటూ ఉద్యోగ సంఘాలు చేసిన విజ్ఞప్తులు ప్రభుత్వం పరిశీలనలోనే నిలిచిపోయాయి. -
గొడ్డు చాకిరీకి బహుమానం తొలగింపా..?
* ఉద్యోగ సంఘాలు ఏకమవ్వాలి * దాన్యం కొనుగోలు ఇష్టం లేదా, డబ్బులు లేవా * వైఎస్ఆర్సీపీ శ్రీకాకుళం ఇన్చార్జి బేబీనాయన బొబ్బిలి: రాష్ర్ట ప్రభుత్వం మహిళలు, రైతులు ఉసురు పోసుకుంటోందని, ఇది రాష్ట్ర భవిష్యత్తుకు ఎంత మాత్రం మంచిది కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం జిల్లా ఇన్చార్జి ఆర్వీఎస్కేకే రంగారావు (బేబీనాయన) అన్నారు... బొబ్బిలి కోటలోని దర్బార్ మహల్లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అంగన్వాడీల చేత గొడ్డు చాకిరీ చేయించుకుని వారు పడుతున్న కష్టానికి ఫలితం ఇవ్వలేదు సరికదా ఇప్పుడు వారిని విధుల నుంచి తొలగించడానికి నిర్ణయం తీసుకోవడం నీచమైన చర్యగా అభివర్ణించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ఉందని, వీడియో పుటేజ్‌ల ద్వారా గుర్తించి వారిని విధుల్లోంచి తొలగించడానికి ఉత్తర్వులు ఇవ్వడం దారుణమన్నారు. అంగన్వాడీలకు మద్దతుగా ఉద్యోగ సంఘాలు నిలవాలని కోరారు. ఆడవారిని కండతడి పెట్టించారని, వారి ఉసురుతో రాజకీయ పతనం తధ్యమని జోస్యం చెప్పారు. కొనుగోలు ఇష్టం లేదా..? డబ్బులు లేవా..? రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యానికి నిబంధనలు పెట్టి ప్రభుత్వం చిత్రహింసలకు గురి చేస్తోందని, అసలు ధాన్యం కొనుగోలు చేయడానికి ఇష్టం లేదా? లేక చెల్లించేందుకు డబ్బులు లేవా? అని బేబీనాయన ప్రశ్నించారు.. ఇన్ని నిబంధనలు మునుపెన్నడూ చూడలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పండించిన పంటను తీసుకోకపోవడంతో రైతు కన్నీరు పెడుతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. కౌలురైతులకు కార్డులుండాలని, ఎకరాకు 25 క్వింటాళ్లే తీసుకురావాలనే నిబందన పెట్టి వారికి ఇబ్బందులకు గురి చేస్తుండడం అన్నాయమన్నారు. క్షేత్రస్థాయిలో రైతులు పడుతున్న కష్టాలు, ఇబ్బందుల గురించి పరిశీలన చేయాలన్నారు. నిబంధనలను సడలించి రైతులు స్వేచ్ఛగా అమ్ముకునే విధంగా ఉత్తర్వులను వెంటనే ఇవ్వాలని బేబీనాయన డిమాండ్ చేశారు. -
‘స్థానికత‘కు చుక్కెదురు
♦ ఏపీ నుంచి 21 మంది ఉద్యోగుల కేటాయింపు ♦ ఉద్యోగులను చేర్చుకోని కార్మిక శాఖ కమిషనర్ ♦ బోర్డుల విభజనతో ముడిపెడుతూ ప్రభుత్వానికి లేఖ ♦ కమిషన్‌కు నోటీసులు ఇచ్చిన ఉద్యోగ సంఘాలు ♦ చేర్చుకోకుంటే 12న సమ్మెకు సై.. సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖలో ‘స్థానికత’కు చుక్కెదురైంది. ఆంధ్రప్రదేశ్ నుంచి స్థానికత ఆధారంగా రాష్ట్రానికి కేటాయించి, రిలీవ్ అయిన ఉద్యోగులను చేర్చుకునేందుకు కార్మిక శాఖ కమిషనర్ అహ్మద్ నదీమ్ నిరాకరించారు. కార్మిక బోర్డు విభజనతో స్థానికతను ముడిపెడుతూ ఉద్యోగులను చేర్చుకునే అంశంపై స్పష్టత కోసం ప్రభుత్వానికి లేఖ రాశారు. దీంతో ఏపీ నుంచి రిలీవ్ అయిన ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. దీంతో టీఎన్జీవో కార్మిక శాఖ విభాగం.. కమిషనర్‌కు నోటీసులు అందజేసింది. ఈ నెల 11 వరకు ఉద్యోగులను చేర్చుకోకుంటే 12న సమ్మెకు దిగుతామని ఆ విభాగం అధ్యక్షుడు ఎన్. చంద్రశేఖర్ గౌడ్ అల్టిమేటం ఇచ్చారు. 21 మంది కేటాయింపు కమలనాథన్ కమిటీ నిర్ణయం మేరకు ఏపీ కార్మిక శాఖలో పనిచేస్తున్న 21 మంది ఉద్యోగులను స్థానికత ఆధారంగా తెలంగాణకు కేటాయించారు. వారిని అక్కడి నుంచి రిలీవ్ చేసి తెలంగాణ రాష్ట్ర కమిషనరేట్లోరిపోర్టు చేయాల్సిందిగా గత నెల 30న ఏపీ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. అదేరోజు రిపోర్టు చేసేందుకు వచ్చిన ఉద్యోగులను చేర్చుకునేందుకు తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ కమిషనరేట్ వర్గాలు అంగీకరించలేదు. కమిషనర్ వర్గాలు గత వారం రోజులుగా తెల్లకాగితంపై పేర్లు రాసి సంతకాలు పెట్టించుకుంటూ ఉండటంతో ఉద్యోగుల పరిస్థితి అయోమయంగా మారింది. బోర్డులతో స్థానికత ముడి రాష్ట్ర విభజన చట్టం ప్రకారం స్థానికత ఆధారంగా ఉద్యోగుల కేటాయింపులు... రాష్ట్ర భవన నిర్మాణ, కార్మిక సంక్షేమ బోర్డు, కార్మిక సంక్షేమ నిధి బోర్డులతో కలిపి విభజన చేయాలని తెలంగాణ కార్మిక శాఖ కమిషనర్ అహ్మద్ నదీమ్ ముందస్తుగానే కమలనాథన్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే కమలనాథన్ పరిధిలోకి కార్మిక బోర్డులు, మండలిలు రాని కారణంగా స్థానికత ఆధారంగా ఉద్యోగుల జాబితాలో అభ్యంతరాలు లేని వారిని తెలంగాణకు కేటాయించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బోర్డు సమస్యలుంటే ఇరు రాష్ట్రాల కమిషనర్లు సంబంధిత ప్రభుత్వ కార్యదర్శులతో చర్చించి తేల్చుకోవాలని సూచించింది. స్పష్టత కోసం.. బోర్డుల విభజన జరగక ముందే స్థానికత ఆధారంగా వచ్చిన ఉద్యోగులను చేర్చుకునే అంశంపై స్పష్టత ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ కమిషనర్ ఈ నెల 4న లేఖ రాశారు. మరోపక్క స్థానికత ఆధారంగా వచ్చిన ఉద్యోగులను చేర్చుకోకపోవడం విభజన చట్టం ఉల్లంఘనే అవుతుందని, వెంటనే చేర్చుకోకుంటే సమ్మెకు దిగుతామని ఉద్యోగ సంఘాలు నోటీసులు అందజేశాయి. -
ఏపీ ఉద్యోగుల తరలింపు ఈ ఏడాదే
* దశలవారీ తరలింపు యోచనే లేదు * అన్ని కార్యాలయాలూ ఒకేసారి... * 3-4 నెలల్లో రోడ్‌మ్యాప్ సిద్ధం * ఉద్యోగ సంఘాలకు స్పష్టం చేసిన ఏపీ ప్రభుత్వం * సంఘాల నేతలతో సీఎస్, ఉన్నతాధికారుల భేటీ సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నుంచి రాజధాని ప్రాంతానికి ఉద్యోగుల తరలింపును ఈ ఏడాదే పూర్తి చేయాలని, వచ్చే సంవత్సరం అనే మాటే అనవద్దని ఉద్యోగ సంఘాలకు ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ‘కొన్ని శాఖల తరలింపు-దశలవారీ తరలింపు’ ప్రతిపాదననూ ప్రభుత్వం తోసిపుచ్చింది. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భాగస్వామ్య సంఘాలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావు, సీఎం వో ముఖ్య కార్యదర్శి సతీష్‌చంద్ర, రాజధాని తరలింపు కమిటీకి నేతృత్వం వహిస్తున్న జవహర్‌రెడ్డి బుధవారం సమావేశమయ్యారు. ఉద్యోగసంఘాల నేతలు అశోక్‌బాబు, మురళీకృష్ణ, ఐ.వెంకటేశ్వరరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు, యోగేశ్వరరెడ్డి, ఫణిపేర్రాజు తదితరులు హాజరయ్యారు. కార్యాలయాల తరలింపునకు అవసరమయ్యే వసతి, అందుబాటులో ఉన్న భవనాలు.. తదితర అంశాలను అధికారులు ఉద్యోగ సంఘాల నేతలకు వివరించారు. విద్యాసంవత్సరం మధ్యలో తరలించడం వల్ల ఇబ్బందులు వస్తాయని ఉద్యోగ సంఘాలు వ్యక్తం చేసిన అభ్యంతరాలను అధికారులు పట్టించుకోలేదు. తరలింపు ప్రక్రియను ప్రారంభించడం, ముగించడం ఒకేసారి జరగాలన్నారు. ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన ప్రధాన సమస్యలివీ.. 1. కనీసం 25వేల మంది ఉద్యోగులు తరలివెళ్లాల్సి ఉంటుందని, వారి పిల్లల ‘స్థానికత’ ఇబ్బందుల్లో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 371-డిని సవరించి ‘స్థానికత’ సమస్యను అధిగమించడానికి చర్యలు తీసుకోవాలి. 2. వేల సంఖ్యలో తరలివెళ్లడం వల్ల విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో అద్దె ఇళ్లు దొరకవు. దొరికినా అద్దెలు అందుబాటులో ఉండవు. వసతి కల్పించే బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలి. పిల్లల చదువుల దృష్ట్యా కుటుంబాలను వెంటనే తరలించడం సాధ్యం కాదు. రెండుచోట్ల నివాసం ఉండాలంటే ఖర్చులు తడిసి మోపెడవుతాయి. ప్రభుత్వం ప్రోత్సాహకం ప్రకటించాలి. 3. హైదరాబాద్‌లో ప్రస్తుతం ఉద్యోగులకు 30 శాతం ఇంటి అద్దెభత్యం(హెచ్ఆర్ఏ) ఇస్తున్నారు. విజయవాడలో 20 శాతం, అమరావతిలో 12 శాతం హెచ్ఆర్ఏ వస్తుంది. తరలివెళ్లే ఉద్యోగులకు హెచ్ఆర్ఏలో కోతపడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అన్ని విషయాలూ సీఎం దృష్టికి.. ఉద్యోగుల వ్యక్తంచేసిన అభిప్రాయాలు, సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతామని అధికారులు ఉద్యోగ సంఘాలకు హామీ ఇచ్చారు. కేవలం ‘జాయింట్ స్టాఫ్ కౌన్సిల్’లోని ఉద్యోగ సంఘాలనే పిలిచామని, వచ్చే సమావేశానికి శాఖాధికార్యాలయాల్లోని అన్ని సంఘాలను పిలుస్తామని తెలిపారు. పది రోజుల్లోనే తదుపరి సమావేశం, దాని తర్వాత మరో సమావేశం ఏర్పాటు చేసి తుది నిర్ణయం తీసుకుందామని చెప్పారు. 3-4 నెలల్లోనే రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తామని పేర్కొన్నారు. మనోభిప్రాయాలను గౌరవిస్తేనే.. తమ మనోభిప్రాయాలను గౌరవిస్తేనే ఉద్యోగుల తరలింపునకు సహకరిస్తామని ప్రభుత్వానికి సచివాలయ ఉద్యోగులు తెగేసి చెప్పారు. భేటీ అనంతరం సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ మీడియాతో మాట్లాడారు. తరలివెళ్లే ఉద్యోగులు, వ్యాపారులు పిల్లలకు లోకల్ స్టేటస్(స్థానికత) కల్పించేందుకు 371డీ అధికరణను తక్షణమే సవరించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించడంతోపాటూ హైదరాబాద్‌లో తమకు ఇచ్చిన ఇళ్లస్థలాలు ఇప్పటిదాకా తమ పేర్లపై రిజిస్ట్రేషన్ కాలేదని.. ఈ నేపథ్యంలో ఆ స్థలాల్లో గృహాలు నిర్మించుకోవడానికి సర్కారే పూచీకత్తు ఇచ్చి రుణాలు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. -
సెప్టెంబర్ 2న సార్వత్రిక సమ్మె
* రైతుల గోడును ఏపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు * కార్మిక, ఉద్యోగ సంఘాల సమరభేరిలో నేతలు సాక్షి, విజయవాడ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న కార్మిక, ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు నిరసనగా సెప్టెంబర్ 2న సార్వత్రిక సమ్మె చేయాలని జాతీయ, రాష్ట్ర కార్మిక, ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. ఆదివారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన కార్మిక, ఉద్యోగ సంఘాల సమరభేరిలో ఏఐటీయూసీ జాతీయ కార్యదర్శి అమర్జిత్ కౌర్ మాట్లాడారు. కేంద్రం ప్రతిపాదిస్తున్న కార్మిక నిబంధనావళి బిల్లు-2015 కార్పొరేట్ కంపెనీలకు లబ్ధి చేకూర్చేదిగానూ, కార్మిక వ్యతిరేకంగానూ ఉందని దుయ్యబట్టారు. సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షుడు బాసుదేవ ఆచార్య మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం రైతుల గోడును పట్టించుకోకుండా వేలాది ఎకరాల జరీబు భూముల్ని రాజధాని నిర్మాణానికి తీసుకుందని ఆరోపించారు. కార్మికులకు కనీస వేతన చట్టాలు అమలు చేయడానికి ప్రభుత్వాల వద్ద నిధులు ఉండవని, కార్పొరేట్ శక్తులకు రూ.కోట్లలో రాయితీలిచ్చేందుకు మాత్రం డబ్బు ఉంటుందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.గౌతంరెడ్డి మాట్లాడుతూ కార్మికులకు అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఏడాది గడిచినా ఒక్కటీ నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమ్మె జరగడానికి ముందే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కళ్లు తెరిచి వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పి.ఎస్.చంద్రశేఖరరావు (ఏఐటీయూసీ), వెంకటసుబ్బయ్య (ఐఎన్టీయూసీ), శ్రీనివాసరావు (హెచ్ఎంఎస్), వి.ఉమామహేశ్వరరావు (సీఐటీయూ), కె.సుధీర్ (ఏఐటీయూసీ), ప్రసాద్, రామారావు (ఐఎఫ్టీయూ) పాల్గొన్నారు. -
ఓయూ సీఎం ఫాంహౌస్ కాదు
- ముఖ్యమంత్రి ప్రకటనపై విద్యార్థుల నిరసన - సీఎం దిష్టిబొమ్మ దహనం - ఉద్యోగ సంఘాల ఆగ్రహం ఉస్మానియా యూనివర్సిటీ: ముఖ్యమంత్రి కేసీఆర్ తన రాజకీయ ప్రయోజనాల కోసం ఉస్మానియా యూనివర్సిటీని ఇతరులకు ధారాదత్తం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ఓయూపై ఆయన ప్రకటనలు మానుకోవాలని విద్యార్థి, ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ప్రకటనలకు నిరసనగా సోమవారం వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో మెయిన్ గేట్ వద్ద సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆర్ట్స్ కళాశాల ఎదుట పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఓయూ విద్యార్థి నేతల అరెస్టు ఖైరతాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో పేదలకు ఇళ్లు కట్టిస్తామని ముఖ్యమంత్రి చేసిన ప్రకటన ను వ్యతిరేకిస్తూ సోమవారం సచివాలయం వద్ద నిరసన తెలిపేందుకు వచ్చిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఓయు జేఏసీ నేతలను సైఫాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా నాయకులు కైలాస్నేత, మహ్మద్ ఇబ్రహిం, ఎ. ఉదయ్‌కుమార్, చరన్ కౌషిక్ యాదవ్ మట్లాడుతూ ముఖ్యమంత్రి రాజకీయ ప్రయోజనాలకోసం ఓయూను వాడుకుంటే సహించేది లేదన్నారు. అన్ని వర్గాల విద్యార్థులకు ఓయూ కేంద్రంగా ఉందని, క్యాంపస్‌లో భవనాలు కూలిపోవడానికి సిద్దంగా ఉన్నా పట్టించుకోకుండా ఇళ్లు నిర్మిస్తామంటే ఊరుకునేది లేదని హ్చురించారు. ఈ సందర్భంగా నిరసన తెలుపుతున్న 9మందిని సైఫాబాద్ పోలీసులు 151 సెక్షన్ కింద అరెస్ట్‌చేసి నాంపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. -
కలెక్టర్ దూకుడుకు కళ్లెం వేయండి!
సాక్షి ప్రతినిధి, విజయవాడ : జిల్లా కలెక్టర్ బాబు.ఎ పై ప్రజాప్రతినిధులు కత్తులు దూస్తుండగా, ఉద్యోగ సంఘాల వారు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల క్రితం పలువురు ఎమ్మెల్యేలు కలెక్టర్ పనితీరును తప్పుపడుతూ సీఎంకు ఫిర్యాదు చేశారు. శనివారం ఉదయం జిల్లాకు చెందిన కొందరు ఉద్యోగ సంఘాల నాయకులు ఎన్జీవో సంఘ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు ద్వారా సీఎంను కలిసి కలెక్టర్ బాబు తీరును వివరించారు. అధికారులను చిన్నా పెద్దా తేడా చూడకుండా విరుచుకు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన దూకుడుకు కళ్లెం వేయాలని సీఎంను వారు కోరారు. తగిన గౌరవం ఇవ్వడం లేదు... పలువురు ఎమ్మెల్యేలు సీఎం వద్ద జిల్లా కలెక్టర్ పనితీరును తప్పుపట్టారు. తాము నిత్యం ఏదోక పనిపై వెళుతుంటామని, వస్తున్నట్లు ముందే చెప్పినా కలెక్టర్ పట్టించుకోవడం లేదని చెప్పారు. ఎమ్మెల్యే హోదాలో వెళ్లినా తగు గౌరవం ఇవ్వటం లేదని తెలిపారు. టీడీపీ పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు, పామర్రు నియోజకవర్గ ఇన్చార్జి వర్ల రామయ్య, గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ సీఎం వద్ద కలెక్టర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి అధికారి ఉంటే పనులు చేయించడం సాధ్యం కాదని అధికారులు చెబుతున్నట్లు తెలిపారు. తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ భార్య మాధవీలత కృష్ణా జిల్లా డ్వామా పీడీగా పనిచేస్తున్నారు. కలెక్టర్ సమీక్షల సమయంలో మందలించడంపై తనకు జరిగిన అవమానాన్ని ఆమె తన భర్తకు వివరించినట్లు సమాచారం. శ్రావణ్‌కుమార్ గతంలో జిల్లా పంచాయతీ అధికారిగా పనిచేశారు. శ్రావణ్‌కుమార్, కాగిత వెంకట్రావు నేరుగా సీఎంతో మాట్లాడి ఆయనపై చర్యలు తీసుకోవాలని గట్టిగా చెప్పినట్లు సమాచారం. అదే బాటలో ఉద్యోగ సంఘాల నాయకులు... వివిధ శాఖలకు చెందిన ఉద్యోగ సంఘాల నాయకుల వద్ద జిల్లా, మండల స్థాయి అధికారులు కలెక్టర్ తీరుపై మొరపెట్టుకుంటున్నారు. సమీక్షల పేరుతో గంటల తరబడి అధికారులను ప్రశ్నిస్తున్నారని, ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు సమీక్షలు కొనసాగిస్తున్నారని వారు చెబుతున్నారు. సమీక్షల సమయంలో కలెక్టర్‌ను కలిసేందుకు ఎవరు వచ్చినా పట్టించుకోవడం లేదని, గంటల తరబడి వేసి చూసి వెనుదిరిగి వెళుతున్నారని పేర్కొంటున్నారు. సమీక్ష నిర్వహించే సమయంలో అధికారులు సరైన సమాధానం చెప్పకపోతే యూజ్లెస్, అన్‌ఫిట్ అంటూ అవమానపరుస్తున్నారని వారు తమ సంఘ నాయకుల వద్ద వాపోయారు. దీంతో పలు సంఘాలకు చెందిన నాయకులు ఎన్జీవో సంఘ నేతలతో కలిసి శనివారం సీఎంను కలిశారని, ఈ విషయం వివరించారని సమాచారం. వారంలో ఐదు రోజులు సమీక్షలా... వారంలో ఐదు రోజులు సమీక్షలు ఉంటున్నాయని, సాయంత్రం మూడు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కలెక్టర్ సమీక్షలు పెడుతున్నారని, సమీక్ష సమావేశానికి వెళ్లిన అధికారులు ఎప్పుడు తిరిగి వస్తారో తెలియని పరిస్థితి ఉందని కొందరు అధికారులు చెబుతున్నారు. కొన్ని శాఖలను ఒకేసారి పిలిచి సమీక్ష పేరుతో కూర్చోబెడతారని, ఒక శాఖతో మాట్లాడే సమయంలో వేరే శాఖ వారు ఊరకే కూర్చోవాల్సి వస్తోందని పేర్కొంటున్నారు. కొందరు అధికారులు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని వాపోతున్నారు. మచిలీపట్నంలోని కలెక్టర్ కార్యాలయానికి వెళితే తిరిగి ఇంటికి వచ్చే సరికి రాత్రి రెండు గంటలవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితి నుంచి తమను గట్టెక్కించాలని ఉద్యోగులు ఆయా సంఘాల నాయకుల వద్ద వాపోయారు. రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ఆగ్రహం విధినిర్వహణ ముగిసిన తరువాత కలెక్టర్ ఆదేశాలకు సహకరించేది లేదని రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ నిర్ణయించింది. జాబ్ చార్ట్‌లో లేని పనులను ఎప్పుడంటే అప్పుడు చేయమంటే ఎలా చేస్తామని వారు ప్రశ్నించారు. రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ శనివారం సాయంత్రం ఆరు గంటలకు విజయవాడలో సమావేశమైంది. తమ ఇబ్బందులను చర్చించడంతో పాటు తహశీల్దార్లు, ఇతర అధికారులను కలెక్టర్ అవమానకరంగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. మహిళా తహశీల్దార్లను కూడా ఇష్టానుసారం మాట్లాడుతుండటంపై సమావేశం గర్హించింది. క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు... కలెక్టర్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. పాఠశాలలు, ప్రభుత్వ రేషన్ షాపులు, మండల స్థాయిలో ప్రభుత్వ కార్యాలయాలను ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. ఏరోజు ఏ ఊర్లో తనిఖీకి వెళతారో అధికారులకు ముందుగా తెలియడం లేదు. కలెక్టర్ వచ్చి తనిఖీ చేసి వెళ్లిన విషయం తెలుసుకున్న తహశీల్దార్ ఏం జరుగుతుందోననే భయంతో వణికిపోతున్నారు. టెక్నాలజీని అందుకోలేకపోతున్నారు.. ఈ పోస్ విధానం ద్వారా రేషన్ సరకుల పంపిణీని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు. కంప్యూటర్ నాలెడ్జ్ డీలర్లకు సరిగా లేకపోవడంతో 15వ తేదీ వస్తున్నా రేషన్ పంపిణీ పూర్తి కాలేదు. దీంతో డీలర్లపై కలెక్టర్ ఆగ్రహంతో ఉన్నారు. పేపర్ లెస్‌గా వర్క్ జరగాలని కలెక్టర్ భావిస్తున్నారు. ప్రతి సర్టిఫికెట్, ఇతర కాగితాలు ఏమి కావాలన్నా కంప్యూటర్లో ప్రింట్ తీసి డిజిటల్ సంతకం ద్వారానే ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఒక్క రెవెన్యూ కార్యాలయాల్లో మాత్రమే సాధ్యమవుతున్నది. అధికారులు టెక్నాలజీని అందుకోకపోవడం వల్ల ఈ పరిస్థితి నెలకొంది. దీంతో అధికారుల తీరును కలెక్టర్ తప్పు పడుతున్నారు. మరోపక్క టెక్నాలజీలో లోపాలను కూడా సరిదిద్దాల్సి ఉందని సమాచారం. కలెక్టర్ ఆలోచన మంచిదే కానీ... జిల్లాలో వేగంగా పనులు జరగాలని కలెక్టర్ చేస్తున్న ఆలోచన మంచిదే. కానీ అందరినీ ఇబ్బందులపాలు చేసే ఆలోచన ఎందుకనేది పలువురి ప్రశ్న. కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న ఉద్యోగులను గుర్తించి వారి ద్వారా కావాల్సిన పనులు చేయిస్తే బాగుంటుందనేది పలువురి వాదన. వచ్చే ఏడాదిలో రిటైరయ్యే జాబితాలో సుమారు 12 మంది తహశీల్దార్లు, ఇతర అధికారులు ఉన్నారు. వీరు ఇప్పుడు కంప్యూటర్ నాలెడ్జ్‌ను వంట బట్టించుకోవాలంటే సాధ్యమయ్యే పనికాదని పలువురు ఉద్యోగులు చెబుతున్నారు. తహశీల్దార్లకు కనీసం డిజిటల్ సిగ్నేచర్ చేసే సమయం కూడా లేకపోవడంతో కంప్యూటర్ ఆపరేటర్స్‌ను నమ్మి వారికి ఇస్తే వారు అమ్మేస్తున్నారు. ఈ సంఘటనలు ఇటీవల కొన్ని జరిగాయి. ఇటువంటి ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. జిల్లా కలెక్టర్‌గా అందరి బాగోగులు చూడాల్సిన బాధ్యత కలెక్టర్‌పై ఉంటుందనే విషయాన్ని విస్మరించ కూడదని పేర్కొంటున్నారు. -
పీఆర్సీపై కసరత్తు ప్రారంభం
అధికారులతో సమావేశమైన ఆర్థిక మంత్రి పీఆర్సీ ప్రకటించకపోతే ఉద్యమానికి సిద్ధం: జేఏసీ నేతలు సాక్షి, హైదరాబాద్: పీఆర్సీ అమలు దిశగా ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఫిట్మెంట్, ఆర్థిక లబ్ధి తదితర అంశాల మీద ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆదివారం అధికారులతో మాట్లాడారు. 43 శాతం ఫిట్మెంట్ ప్రకటిస్తే ఖజానాపై వాస్తవంగా ఎంత భారం పడుతుందనే విషయం మీద చర్చ జరిగినట్లు తెలిసింది. ఉద్యోగుల వాస్తవ సంఖ్యతో పాటు ఖాళీలను లెక్కలోకి తీసుకుని 43 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు చేస్తే ఏటా రూ.7 వేల కోట్ల భారం పడుతుందని అధికారులు అంచనా వేశారు. అయితే ఉద్యోగుల వాస్తవ సంఖ్య ప్రకారం చూస్తే పీఆర్సీ అమలు భారం ఏటా రూ.3,500 కోట్లకు మించదని అంచనాకు వచ్చినట్లు సమాచారం. 43 శాతం ఫిట్మెంట్ ఇస్తే అన్ని క్యాడర్ ఉద్యోగులకు 3 స్టేజీల ఇంక్రిమెంట్ పెరుగుతుందని, 46 శాతం ఫిట్మెంట్ ప్రకటించినా ఇదే పెంపు వర్తిస్తుందని, 47 శాతం అమలు చేస్తేనే నాలుగో స్టేజి ఇంక్రిమెంట్ వర్తిస్తుందని అధికారులు నివేదించినట్లు తెలిసింది. 44-45 శాతం ఫిట్మెంట్ ప్రకటించి తెలంగాణ కంటే ఎక్కువ ఇచ్చామనే భావన ఉద్యోగుల్లో కల్పించాలని, ఈ విధంగా చేస్తే ఖజానా మీద అదనపు భారం పడదని చెప్పినట్లు సమాచారం. అయితే ఆర్థిక లబ్ధిని ఈ ఏడాది జనవరి నుంచి అమలు చేస్తే భారం చాలావరకు తగ్గించుకోవచ్చనే యోచనలో ఆర్థిక మంత్రి ఉన్నట్లు అధికారవర్గాల ద్వారా తెలిసింది. ఈ విషయాలను సోమవారం జరగనున్న ఉపసంఘ సమావేశంలో చర్చించి, వెంటనే ముఖ్యమంత్రికి నివేదిక ఇవ్వడానికి సమాయత్తమవుతున్నారు. పీఆర్సీ సిఫారసు చేసినట్లు ఆర్థిక లబ్ధిని 2013 జూలై నుంచి అమలు కు ఉద్యోగ సంఘాల జేఏసీ పట్టుబడుతోంది. నేడు జేఏసీ భేటీ తెలంగాణ ప్రభుత్వం పీఆర్సీ ప్రకటించిన నేపథ్యంలో ఏపీలో కూడా పీఆర్సీ అమలు కోసం ఉద్యోగుల నుంచి అన్ని సంఘాల నేతలకు ఒత్తిడి వస్తోంది. జేఏసీ నాయకత్వ మెతక వైఖరి వల్లే పీఆర్సీ అమల్లో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శలు వచ్చిన నేపథ్యంలో.. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని జేఏసీ నాయకత్వం భావిస్తోంది. సోమవారం ప్రభుత్వం పీఆర్సీ ప్రకటించని పక్షంలో ఉద్యమ కార్యాచరణ ఖరారు చేయాలని నిర్ణయించింది. ఉపసంఘం సీఎం నివేదిక సమర్పించిన వెంటనే ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం మాట్లాడే అవకాశం ఉందని జేఏసీ నేతలు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి పిలుపు వస్తే ఏం మాట్లాడాలనే విషయాన్ని నిర్ణయించడానికి ఉదయం 11 గంటలకు జేఏసీ నేతలు ఏపీఎన్జీవో హోంలో సమావేశం కావాలని నిర్ణయించారు. స్పందించకపోవడం నష్టమే తెలంగాణ ప్రకటించిన తర్వాత కూడా పీఆర్సీ అమలు గురించి ఏపీ స్పందించకపోవడం ప్రభుత్వానికి నష్టం కలిగిస్తుం ది. హామీ అమలు చేయడానికైనా తెలంగాణ కంటే మెరుగైన ఫిట్మెంట్, ఆర్థిక లబ్ధి అమలు చేయాలి. లేదంటే ఉద్యమం తప్పదు. - ఐ.వెంకటేశ్వరరావు, జేఏసీ సెక్రటరీ జనరల్ డిమాండ్లపై వెనక్కితగ్గం ఫిట్మెంట్, ఆర్థిక లబ్దితో సహ జేఏసీ ఇప్పటికే సమర్పించిన డిమాండ్ల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడం. అవసరమైతే ఉద్యమానికీ సిద్ధమే. - కత్తి నరసింహారెడ్డి, జేఏసీ కో చైర్మన్ వెంటనే ప్రకటించాలి తెలంగాణ కంటే మెరుగైన పీఆర్సీని ప్రకటించాలి. ఆర్థిక లబ్దిని 2013 జూలై నుంచి వర్తింపజేయాలి. తగ్గించాలని చూ స్తే ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించం. - బొప్పరాజు వెంకటేశ్వర్లు, జేఏసీ కో చైర్మన్ -
3 నుంచి పీఆర్సీ హైపవర్ కమిటీ భేటీలు
* తొలుత టీఎన్జీవోలతో సమావేశం * రెండు మూడు రోజులకో సంఘంతో చర్చలు జరిపే అవకాశం * ఈ లెక్కన రెండు మూడు నెలలు సమావేశాలకే సరి! సాక్షి, హైదరాబాద్: పీఆర్సీ అమలుకు సంబంధించి ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ ఉద్యోగ సంఘాలతో చర్చలను వచ్చే నెల 3వ తేదీ నుంచి ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. అందులో పీఆర్సీ నివేదికలోని అంశాలు, ఉద్యోగ సంఘాల డిమాండ్లపై సవివరంగా తెలుసుకోనుంది. తొలుత మంగళవారం (27వ తేదీ) నుంచే ఉద్యోగ సంఘాలతో చర్చలు ప్రారంభించాలని భావించినా... సాధ్యమయ్యే అవకాశాలు కనిపించకపోవడంతో 3వ తేదీకి వాయిదా వేసినట్లు సమాచారం. దీనిలో భాగంగా రెండు మూడు రోజులకు ఒక సంఘంతో చర్చలు జరిపే అవకాశం ఉంది. తొలుత తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల (టీఎన్జీవో) సంఘంతో చర్చించనున్నట్లు తెలిసింది. అయితే పీఆర్సీ అమలులో ప్రధాన అంశాలైన కనీస మూల వేతనం రూ. 13 వేల నుంచి రూ. 15 వేలకు పెంపు, 69 శాతం ఫిట్మెంట్ డిమాండ్, 2013 జూలై 1 నుంచే నగదు రూపంలో వర్తింపు, గ్రాట్యుటీ రూ.15 లక్షలకు పెంపు, హెచ్ఆర్ఏ పెంపు వంటివాటిపై సీఎం స్థాయిలోనే నిర్ణయం జరగాల్సి ఉన్నందున... కమిటీ చర్చించినా తేలే అవకాశం లేదు. వీటిని యథాతథంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనుంది. మిగతా అంశాలు, ఇతర అలవెన్సులు, వేతన వ్యత్యాసాలు తదితరాలపై హైపవర్ కమిటీ ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించే అవకాశం ఉంది. అయితే చర్చల పేరుతో ప్రభుత్వం పీఆర్సీ అమల్లో కాలయాపన చేస్తుందేమోనన్న ఆందోళన ఉద్యోగుల్లో నెలకొంది. జనవరి మూడో వారం కల్లా పీఆర్సీ అమలుపై స్పష్టత వస్తుందని ఇటీవలే సీఎం కేసీఆర్ ప్రకటించినా... అది ఆచరణలోకి రాలేదు. కేవలం కమిటీ ఏర్పాటుకే ప్రభుత్వం పరిమితమైంది. ఇపుడు చర్చలు ముగియాలంటే కనీసం రెండు మూడు నెలలు పడుతుందని, దీంతో పీఆర్సీ అమలు ఆలస్యం అవుతుందని ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. -
బ్యాంకుల సమ్మె వాయిదా
* ఫిబ్రవరి మొదటి వారంలో చర్చలు * తేలకుంటే నెలాఖరులో మళ్లీ సమ్మె * ఉద్యోగ సంఘాల ప్రకటన హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బుధవారం నుంచి వరుసగా నాలుగు రోజుల పాటు తలపెట్టిన సమ్మెను వాయిదా వేస్తున్నట్లు యునెటైడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) ప్రకటించింది. వేతనాల పెంపుపై ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ (ఐబీఏ)తో జరుపుతున్న చర్చలు ఇంకా కొలిక్కి రాకపోవడంతో జనవరి 21 నుంచి తలపెట్టిన సమ్మెను ఫిబ్రవరి మాసాంతానికి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు యూఎఫ్‌బీయూ ప్రతినిధులు తెలిపారు. సమ్మె చేయాలా వద్దా అన్న విషయంలో యూనియన్ల మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు వచ్చినప్పటికీ అంతిమంగా వాయిదా వేయడానికే మొగ్గు చూపినట్లు తెలిసింది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పర్యటన సందర్భంగా సమ్మె చేయడం ద్వారా ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచవచ్చని రెండు మూడు యూనియన్లు వాదించాయి. అయితే, చర్చలు జరుగుతున్న సమయంలో సమ్మె చేయడం సరికాదని మరికొన్ని యూనియన్లు వాదించాయి. చివరకు తొమ్మిది ప్రధాన యూనియన్లతో ఏర్పడిన యూఎఫ్‌బీయూ సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఐబీఏతో జరిగిన చర్చల్లో ఎటువంటి పురోగతి లేదని, ఫిబ్రవరి మొదటి వారంలో జరిగే సమావేశంలో సమస్యను పరిష్కరిస్తామని ఐబీఏ హామీ ఇవ్వడంతో సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు యూనియన్ నేతలు తెలిపారు. ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగుల వేతన సవరణ 2012 ఏడాది నుంచి పెండింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. గత చర్చల్లో యూనియన్లు 23 శాతం పెంపు డిమాండ్ నుంచి 19.5 శాతానికి దిగిరాగా, ఐబీఏ 11 నుంచి 12.5 శాతానికి వచ్చింది. -
నేడు బ్యాంకు ఉద్యోగుల సమ్మె లేదు...
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వేతన సవరణ కోరుతూ బ్యాంకు ఉద్యోగ సంఘాలు చేపట్టిన బుధవారం నాటి సమ్మె (జనవరి 7 ) వాయిదా పడింది. ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్(ఐబీఏ)తో జరుపుతున్న చర్చల్లో పురోగతి ఉండటంతో సమ్మెను వాయిదా వేసినట్లు యునెటైడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) ప్రకటించింది. వేతన పెంపుపై గతంలో ప్రతిపాదించిన 11 శాతం నుంచి 12.5 శాతానికి రావడంతో చర్చలు జరపడానికి సమ్మెను వాయిదా వేసినట్లు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కార్యదర్శి బి.ఎస్.రాంబాబు తెలిపారు. దీనికి తగ్గట్లుగా బ్యాంకు యూనియన్లు కూడా 23 శాతం నుంచి 19.5 శాతానికి దిగొచ్చినట్లు ఆయన తెలిపారు. బుధవారం కూడా చర్చలు జరుగుతాయి. మధ్యే మార్గంగా 14.5- 15 శాతం వద్ద చర్చలు కొలిక్కి వచ్చే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. వేతనాల గురించి ఇప్పటికే నాలుగు సార్లు సమ్మె చేసిన నేపథ్యంలో ఇదే అంశంపై ఎక్కువసార్లు సమ్మె చేస్తే ప్రభుత్వానికి ప్రతికూల సంకేతాలు వెళ్తాయన్న ఉద్దేశంతో ఉద్యోగ సంఘాలు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఐఎన్జీ వైశ్యాఉద్యోగుల సమ్మె యధాతథం కాగా, కోటక్ మహీంద్రా బ్యాంక్‌లో విలీనమవుతున్న ఐఎన్జీ వైశ్యా బ్యాంక్ .. ఉద్యోగులు బుధవారం తమ సమ్మెను యధాప్రకారం కొనసాగించాలని నిర్ణయించారు. అఖిల భారత ఐఎన్జీ వైశ్యా బ్యాంక్ ఉద్యోగుల సంఘం జనరల్ సెక్రటరీ కేజే రామకృష్ణ రెడ్డి ఈ విషయాన్ని తెలిపారు -
20 లోగా మార్గదర్శకాలు
ఉద్యోగుల ఆకాంక్షలకు తగినట్లుగానే ఉంటాయి అనిల్ గోస్వామి హామీ హైదరాబాద్: ఉద్యోగ సంఘాల ఆకాంక్షలకు అనుగుణంగానే మార్గదర్శకాలు ఉంటాయని కేంద్ర హోం శాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి హామీ ఇచ్చారు. ఏపీఎన్జీవో, టీఎన్జీవో, సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం, తెలంగాణ ఉద్యోగుల సంఘం, పలు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధి బృందాలు మంగళవారం వేర్వేరుగా లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌లో గోస్వామిని కలిసి వినతిపత్రాలు సమర్పించారుు. సంఘాల ప్రతినిధులు చెప్పిన విషయాలను హోం శాఖ కార్యదర్శి సావధానంగా విన్నారు. ఈనెల 19 లేదా 20న మార్గదర్శకాలు వెల్లడిస్తామని చెప్పారు. ప్రస్తుతం తాత్కాలికంగానే ఉద్యోగుల విభజన జరుగుతుందని, తదుపరి రెండు ప్రభుత్వాలు శాశ్వతంగా ఉద్యోగుల పంపిణీ చేస్తాయన్నారు. 371(డీ)లో పేర్కొన్న జోన్ల సంఖ్య పెంపు లేదా కుదింపు కోరుతూ ఆయా ప్రభుత్వాలు కేంద్రానికి ప్రతిపాదనలు అందజేయవచ్చునని చెప్పారు. అందరికీ ఆప్షన్లు ఇవ్వాలి: సీమాంధ్ర ఉద్యోగ సంఘాలు ఉద్యోగులందరికీ ఆప్షన్లు ఇవ్వాల్సిందే. రాష్ట్రస్థాయి నియామకాల్లో ఉద్యోగాలు సంపాదించి సచివాలయం, హెచ్వోడీల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు జోనల్ వ్యవస్థ వర్తించదు. వారిని స్థానికత ఆధారంగా కాకుండా ఆప్షన్ల మేరకు ఇరు రాష్ట్రాలకు కేటాయించాలి.జిల్లాల నిష్పత్తిలో కాకుండా జనాభా నిష్పత్తిలో ఉద్యోగుల విభజన జరగాలి.రాజధానిలో ఉన్న ఉద్యోగుల పిల్లల స్థానికతను ఎంపిక చేసుకోవడానికి ఆప్షన్లు ఇవ్వాలి. హైదరాబాద్‌లో పుట్టిపెరిగిన పిల్లలు సీమాంధ్రకు వెళ్లాలనుకుంటే అక్కడ వారిని ‘స్థానిక’ అభ్యర్థులుగా పరిగణించాలి.విభజనలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి హైదరాబాద్‌లో ఉండే అధికారుల కమిటీని ఏర్పాటు చేయాలి. స్థానికత ఆధారంగా విభజించాలి: తెలంగాణ ఉద్యోగ సంఘాలు స్థానికత ఆధారంగా ఉద్యోగుల విభజన జరగాలి. తాత్కాలిక కేటాయింపునకు కూడా స్థానికతనే ఆధారంగా తీసుకోవాలి.సీమాంధ్రలో అన్ని స్థాయిల్లో పనిచేస్తున్న ఉద్యోగులను తెలంగాణకు పంపించాలి. అదే విధంగా తెలంగాణ నుంచి సీమాంధ్రకు పంపించాలి.ఉద్యోగుల విభజన మార్గదర్శకాల్లో 610 జీవో, గిర్గ్లానీ కమిటీ నివేదికలను పరిగణనలోకి తీసుకోవాలి.టీచర్లకూ ఆప్షన్లు ఇవ్వాలి: పీఆర్టీయూ, ఎస్టీయూవిభజన నేపథ్యంలో టీచర్లు సొంత జిల్లా, రాష్ట్రానికి వెళ్లడానికి వీలుగా ఆప్షన్ సౌకర్యం కల్పించాలి. దంపతులైన టీచర్లకూ ఈ సౌకర్యం ఉండాలి.కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న టీచర్ల ఏకీకృత సర్వీస్ రూల్స్ సమస్యను పరిష్కరించాలి.సీమాంధ్రకు లోటు బడ్జెట్ ఉన్నందున ఉద్యోగుల జీతభత్యాలకు ఇబ్బంది రాకుండా కేంద్రం సహకరించాలి. -
ఎమ్మెల్యే రమేశ్ కుమార్‌పై విద్యుత్ ఉద్యోగుల కన్నెర్ర
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : కోలారు జిల్లా శ్రీనివాసపురం ఎమ్మెల్యే రమేశ్ కుమార్ తమపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఇక్కడి కేపీటీసీఎల్ కార్యాలయం వద్ద బెస్కాం ఉద్యోగులు సోమవారం ప్రదర్శన చేపట్టారు. ఆయన శాసన సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గత వారం కోలారులో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమస్యలపై స్పందించని విద్యుత్ ఉద్యోగులను చెట్టుకు కట్టేసి కొట్టాలని, ఆహారం, నీరు అందకుండా చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దీనిపై విద్యుత్ ఉద్యోగుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. బాధ్యత కలిగిన ఎమ్మెల్యే ఇలా రెచ్చ గొట్టే వ్యాఖ్యలు చేయవచ్చునా అని ఉద్యోగ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. వ్యవహార శైలిని మార్చుకోవాల్సిందిగా ఆయనను హెచ్చరించాయి. -
‘జై సమైక్యాంధ్ర..’ అనడమే నేరమా!
విజయనగరం క్రైం, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర ఉద్యమం.. విద్యార్థు ల పాలిట శాపంగా మారనుందా..? జై సమైక్యాంధ్ర అని అనడమే వారు చేసిన నేరమా..? సమైక్యాంధ్ర ఉద్యమంలో కేసులు ఉన్న విద్యార్థులకు.. ఆ సాకు చూపి ప్రభుత్వ ఉద్యోగాలను దూరం చేయనున్నారా..? అనే ప్రశ్నలకు అవున నే సమాధానం వస్తోంది. ఇటీవల కాలం లో పలువురు నిరుద్యోగ యువకులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. అయితే, వారు సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనలేదని పోలీసుల నుంచి కాండక్ట్ సర్టిఫికెట్ తెస్తేనే ఉద్యోగం ఇస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. గంట్యాడ మండలం పెదవేమలికి చెందిన యువకుడు ఆర్మీలో ఉద్యోగం పొందాడు. సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనలేనట్లుగా ఆ పరిధిలో ఉన్న పోలీసుస్టేషన్ నుంచి కండక్ట్ సర్టిఫికెట్ తీసుకురావాలని ఆర్మీ అధికారులు ఆ యువకుడికి సూచించారు. దీంతో ఆ విద్యార్థి పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించాడు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని.. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమని, ఉద్యోగ అవకాశాలూ మెండుగా ఉంటాయని వేలాది మంది విద్యార్థులు, యువత రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు చేపట్టారు. విజయనగరం పట్టణంలో ఉద్యమం కాస్త తీవ్ర స్థాయికి చేరి, ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. పీసీసీ చీఫ్ బొత్స ఇంటి, ఆస్తులు, అనుచరుల ఇళ్లపై సమైక్యాంధ్ర ఉద్యమకారు లు దాడులు చేశారు. దీంతో పట్టణంలో కర్ఫ్యూ విధించారు. ఈ నేపథ్యంలో ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిపైనా పోలీసులు కేసులు పెట్టారు. ఈ కేసులు పీసీసీ చీఫ్ బొత్స ఆదేశాలకు అనుగుణంగానే జరిగాయన్న విమర్శలు అప్పట్లో వచ్చాయి. మంత్రి మెప్పుకోసం కేసులు పెట్టి... మంత్రి మెప్పుకోసం విద్యార్థులపైన, సమైక్యాంధ్ర ఉద్యమకారులపైన పోలీసులు కేసులు పెట్టారు. దొరికిన వారిని దొరికినట్లుగానే స్టేషన్‌కు తీసుకెళ్లి చితకబాదినట్లు అప్పట్లో ఆరోపణలు వినిపించాయి. ప్రతిపక్ష పార్టీలకు చెంది న వారిపై ముఖ్యంగా కొరడా ఝులి పించారు. ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులను వెంటాడి.. వెంటాడి మరీ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. జిల్లా కేంద్రంలో సుమారు 800 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. కేసులు ఎత్తివేసినట్లు ప్రకటించలేదేం..? తెలంగాణ ఉద్యమంలో విధ్వంసాలకు పాల్పడిన విద్యార్థులు, యువతపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని పార్టీల కు అతీతంగా ఆ ప్రాంత ప్రజాప్రతి నిధులు, ఉద్యోగ సంఘాల నేతలు పోరాటాలు చేశారు. వారందరూ ముఖ్యమంత్రిని కలిసి ఈ మేరకు విన్నవించారు. దీంతో అక్కడి ఉద్యమకారులపై కేసులను ప్రభుత్వం ఎత్తివేసింది. సీమాంధ్రకు వచ్చేసరికి సమైక్యాంధ్రలో పాల్గొన్న విద్యార్థులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని ప్రజాప్రతినిధులు మాట్లాడకపోవడం శోచనీయం. మన ప్రజాప్రతినిధుల తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. -
నిప్పులు కక్కిన నెలబాలుడు
సమైక్యాంధ్ర ఉద్యమం ప్రతి గడపనూ తాకింది. సమైక్య నినాదాలతో జిల్లా మార్మోగుతోంది. రాష్ట్రాన్ని విభజిస్తున్నట్టు సీడబ్ల్యూసీ ప్రకటించి సరిగ్గా నెల రోజులయింది. అప్పట్నుంచి ఉద్యమం కొనసాగుతూనే ఉంది. బంద్‌లు, రాస్తారోకోలు, మానవహారాలు, నిరాహార దీక్షలు, రహదారుల దిగ్బంధాలతో అట్టుడికిపోతోంది. విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కట్లేదు. ప్రభుత్వోద్యోగులు విధులకు హాజరుకావడం లేదు. విద్యా సంస్థలు సక్రమంగా పని చేయడం లేదు. వ్యాపార సంస్థలు వెలవెలబోతున్నాయి. నెల రోజులుగా ఇదే పరిస్థితి. సమైక్యాంధ్ర ఉద్యమం ఫలితంగా జనజీవనం అస్తవ్యస్తంగా ఉంది. నెల రోజులుగా సమైక్య ఉద్యమం మహోగ్రరూపం దాలుస్తూ పల్లె పల్లెకు విస్తరించింది. ఈ నెల 12వ తేదీ అర్ధరాత్రి నుంచి ఏపీఎన్జీఓల సమ్మెతో ఉద్యమం ఉధృతమైంది. రోజుకో ఉద్యోగ సంఘం విధులను బహిష్కరించి రోడ్ల మీదకు వచ్చి సమైక్యాంధ్ర కోసం చేస్తున్న నినాదాలతో జిల్లా మార్మోగిపోతోంది. ప్రస్తు తం జిల్లాలో ఇన్చార్జి కలెక్టర్ మినహా మిగిలిన అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది విధులను బహిష్కరించారు. దీంతో జిలాల్లో ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు పడ్డాయి. పాల న పూర్తిగా స్తంభించిపోయింది. తెలంగాణకు చెందిన ఒక డిప్యూటీ కలెక్టర్‌తో పాటు మరో ఇద్దరు తహశీల్దార్లు కూడా సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొంటుండడం గమనార్హం. రోజుకో కార్యాచరణ : ఉద్యమం ప్రారంభమైన నాటి నుంచి రోజుకో కార్యాచరణతో ఉద్యోగ సంఘాలు ముందుకు సాగుతున్నాయి. కలెక్టరేట్ ఎదుట ఎపీఎన్జీలు రిలే నిరాహార దీక్షలకు అన్ని వర్గాలు సంఘీభావం వ్యక్తం చేస్తున్నాయి. రెవెన్యూ, ఆర్టీసీ, విద్యుత్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, జీవీఎంసీ, సర్వే, వీఆర్వో ఇలా అన్ని ఉద్యోగ సంఘాలు ఈ దీక్షల్లో పాల్గొంటున్నాయి. జిల్లా అంతటా విభిన్న కార్యక్రమాలు, నిరసనలతో ఉద్యమానికి తారస్థాయికి తీసుకువెళుతున్నాయి. ఈ నెల 24 నుంచి జిల్లా అధికారులు కూడా సామూహిక సెలవులు పెట్టారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి జిల్లాలో ఉన్న 72 శాఖల ఉన్నతాధికారులు సైతం సమ్మె బాట పట్టాలని నిర్ణయించారు. తాజాగా ఈ నెల 31న జీవీఎంసీ ఎదురుగా భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు ఉద్యోగ సంఘాలు సన్నాహాలు చేస్తున్నాయి. సుమారుగా 60 వేల మంది ఉద్యోగ, కార్మిక, విద్యార్థి, యువజన, ప్రజలు పాల్గొంటారని చెబుతున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు మాత్రమే సమైక్యాంధ్ర కోసం ఉద్యమ బాట పట్టగా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు కూడా వీరికి సంఘీభావం తెలియజేయాలని నిర్ణయించాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థలు, పరిశ్రమల్లో కార్యకలాపాలను స్తంభించడం ద్వారా యూపీఏ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఉద్యోగ సంఘాలు ఆలోచన చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఈ నెల 31న జరిగే బహిరంగ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు, పరిశ్రమల ఉద్యోగ సంఘాలు కూడా పాల్గొననున్నాయి. 30, 31 తేదీల్లో రవాణా వ్యవస్థ బంద్ : ఆర్టీసీ యూనియన్లు సమ్మె బాట పట్టడంతో గత నెల రోజులు నుంచి బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. యూనియన్లపై ప్రభుత్వం ఎంత ఒత్తిడి చేసినా, ఎస్మా, ఇతరత్రా జీవోలు విడుదల చేసినా కార్మికులు వెరవలేదు. గత 30 రోజుల నుంచి బస్సులను తిప్పకుండా యూనియన్ నాయకులు భారీ స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. దీంతో బస్సులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేటు వాహనాలైన ఆటోలు, ట్యాక్సీలు, ఇతర వాటిపై ఆధారపడుతున్నారు. తాజాగా జిల్లాలో ఈ నెల 30, 31 తేదీలలో ఆటోలు యూనియన్లు కూడా ఉద్యమంలో పాల్గొంటున్నాయి. దీంతో ఈ రెండు రోజులు ఆటోలు బంద్ కానున్నాయి. అలాగే 31న ట్యాక్సీలు కూడా నిలిచిపోనున్నాయి. దీంతో ఈ రెండు ప్రజలు మరింత ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. నేడు దుకాణాలు బంద్ : సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా శుక్రవారం దుకాణాలు బంద్ నిర్వహిస్తున్నట్లు ది వైజాగ్‌పటం చాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ అధ్యక్షుడు కంచర్ల రామబ్రహ్మం ప్రకటించారు. సంస్థ కార్యాలయంలో గురువారం జరిగిన సమావేశంలో బంద్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడానికి సమైక్యాంధ్ర పరిరక్షణ వర్తక, వాణిజ్య సంయుక్త కార్యాచరణ కమిటీని రూపొందించినట్టు తెలిపారు. త్వరలోనే ముఖ్యమంత్రిని 13 జిల్లాల జేఏసీ ఆధ్వర్యంలో కలిసి వినతిపత్రం అందజేస్తామన్నారు. ఆదాయానికి గండి : నెల రోజులుగా జరుగుతున్న ఉద్యమాలు కారణంగా ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం వాటిల్లింది. ప్రధానంగా ఆర్టీసీపై తీవ్ర ప్రభావం పడింది. జిల్లాలో 1066 బస్సు సర్వీసులు నడుస్తున్నాయి. ఈ నెల 12వ తేదీ అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేస్తుండడంతో ఇప్పటి వరకు సంస్థకు రూ.12 కోట్లు మేర నష్టం వచ్చింది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు రోజుకు రూ.1.5 కోట్లు వరకు ఆ దాయం వస్తుంటుంది. ఈ శాఖ ఉద్యోగులు కూడా విధులను బహిష్కరించడంతో సుమారుగా రూ.25.5 కోట్లు వరకు ఆదా యం రాకుండాపోయింది. ఖజానాశాఖలో రోజుకు రూ.5 కోట్లు వరకు జమలు జరుగుతుంటాయి. వీరు కూడా ఆందోళన బాట పట్టడంతో ఇప్పటి వరకు రూ.375 కోట్లు వరకు ఖజానాకు చేరలేదు. ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నప్పటికీ సమైక్యాంధ్ర కోసం ప్రజలుకూడా ఉద్యోగ సంఘాలకు మద్దతు తెలుపుతూ స్వచ్ఛందంగా నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.