అశోక్‌బాబుపై తిరుగుబాటు
- ఉద్యోగ సంఘాల నూతన జేఏసీ అధ్యక్షుడుగా బొప్పరాజు
- తిరుపతి వేదికగా ఎన్నుకున్న 73 సంఘాల ప్రతినిధులు
తిరుపతి రూరల్: ఉద్యోగ సంఘాలన్నీ ఏకమయ్యాయి. తిరుపతిలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన జేఏసీ నవ నిర్మాణ సదస్సులో అశోక్‌బాబుకు వ్యతిరేకంగా గర్జించాయి. వందలాది మంది ప్రతినిధుల సమక్షంలో 73 ఏపీ ఉద్యోగ సంఘాలు కొత్త జేఏసీని ప్రకటించాయి. దానికి రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లును అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా తమ సంఘాల నుంచి తీసుకువచ్చిన తీర్మానాల కాపీలను నూతన జేఏసీ అధ్యక్షుడికి ఉద్యోగ సంఘాల నేతలు సభాముఖంగా అందించారు.
అశోక్‌బాబు తీరుపై నిప్పులు
ఉద్యోగుల సంఘాల జేఏసీ అధ్యక్షుడుగా వ్యవహరిస్తున్న ఏపీ ఎన్జీవోల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు నాయకత్వంపై ఉద్యోగ సంఘాల ప్రతినిధులు నిప్పులు చెరిగారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకుండా దళారీలా వ్యవహరిస్తున్నారని ట్రెజరీ ఉద్యోగుల సంఘ రాçష్ట్ర అధ్యక్షుడు రవికుమార్ ఆరోపించారు. రాజకీయ పార్టీలు విఫలమై ప్రజలు కోరితే ప్రత్యేక హోదాపై జేఏసీ ఆధ్వర్యంలో ముందుండి పోరాడతామని ఏపీ జేఏసీ నూతన అధ్యక్షుడుబొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు.