సాక్షి, తిరుపతి : ఏపీ ఎన్జీవో మాజీ అధ్యక్షుడు అశోక్ బాబుపై ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు...ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడంపై ఉద్యోగ సంఘాల నేతలు భగ్గుమంటున్నారు. అశోక్ బాబు ఉద్యోగుల ప్రయోజనాలు తాకట్టు పెట్టారని, ఓ పార్టీ ముసుగులో ఉండి ఉద్యోగులకు అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. తమ ప్రయోజనాలు తాకట్టు పెట్టి అశోక్ బాబు ఎమ్మెల్సీ పదవి పొందారని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ విమర్శించారు. ఇళ్ల స్థలాల పేరుతో ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేసిందని ఆయన మండిపడ్డారు.
కాగా అశోక్ బాబు నిన్న (గురువారం) లుగుదేశం పార్టీలో చేరిన విషయం తెలిసిందే. చంద్రబాబు నాయుడు తనకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన... టీడీపీతోనే రాష్ట్రభివృద్ధి సాధ్యమని చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment