'ఉద్యోగ నేతలను అశోక్‌బాబు బెదిరిస్తున్నారు'
'ఉద్యోగ నేతలను అశోక్‌బాబు బెదిరిస్తున్నారు'
Published Wed, Feb 8 2017 2:32 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM
విజయవాడ: ఏపీ ఎన్జీవో ఎన్నికలకు, జేఏసీ ఏర్పాటుకు సంబంధం లేదని ఏపీ నూతన జేఏసీ చైర్మన్ బొప్పారాజు వెంకటేశ్వర్లు తెలిపారు. అశోక్‌బాబు నాయకత్వంలో ఉద్యోగులకు న్యాయం జరగక పోవడం వల్లే కొత్త జేఏపీ ఆవిర్భవించిందన్నారు. కొత్త జేఏసీ నుంచి అశోక్‌బాబుకు పోటీగా ఏన్జీవో ఎన్నికలకు ఎవరినీ ప్రోత్సహిండం లేదన్నారు. అశోక్‌బాబు ఒంటెద్దు పోకడల వల్లే బలమైన ఉద్యోగ సంఘం నూతన జేఏసీ ఏర్పడిందని తెలిపారు. కొత్తగా ఏర్పాటైన జేఏసీలోని ఉద్యోగ నేతలను అశోక్‌బాబు బెదిరించి, చీలికలకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
Advertisement
Advertisement