టీ జేఏసీ నిర్వీర్యానికి భారీ కుట్ర: జీవన్‌రెడ్డి | a huge conspiracy to disposal of T JAC: Jevan reddy | Sakshi
Sakshi News home page

టీ జేఏసీ నిర్వీర్యానికి భారీ కుట్ర: జీవన్‌రెడ్డి

Published Thu, Mar 17 2016 5:58 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

a huge conspiracy  to disposal of T JAC: Jevan reddy

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో పెద్దన్న పాత్ర పోషించిన పొలిటికల్ జేఏసీని నిర్వీర్యం చేసేందుకు పెద్ద కుట్ర జరుగుతోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి ఆరోపించారు. టీజేఏసీ నుంచి వైదొలగుతున్నట్లు ఉద్యోగ సంఘాలు ప్రకటించడం సరి కాదని అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద గురువారం ఆయన మాట్లాడారు. రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన వారు... అభివృద్ధి విషయంలో ప్రభుత్వం సరైన పద్దతిలో తీసుకెళ్లేందుకు దోహదపడాలన్నారు.

ప్రస్తుతం జేఏసీ టీమ్‌కు గతంలో కంటే ప్రస్తుతం బాధ్యత మరింత పెరిగిందన్నారు. కానీ ఉద్యోగ సంఘాలు వారి సమస్యలకే ప్రాధాన్యం ఇస్తామంటూ పక్కకు తప్పుకోవడం బాధాకరమన్నారు. టీజేఏసీని బలోపేతం చేయాల్సిన అవసరం తెలంగాణ సమాజంపై ఉందని, కనుక కాంగ్రెస్ పార్టీ కూడా వెనక ఉంటుందన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement