T. Jeevan Reddy
-
తప్పైపోయింది..మాట్లాడనయ్యా: జేసీ
-
జేసీ దివాకర్‌రెడ్డిపై ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శుక్రవారం(సెప్టెంబర్ 24వ తేదీ) టీడీపీ నేత, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి అసెంబ్లీకి వచ్చారు. శాసనసభా ప్రాంగణంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లను కలిశారు. అనంతరం సీఎల్పీలో కార్యాలంయంలో తన పాత మిత్రులు జీవన్‌రెడ్డి, భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి తదితరులతో సమావేశమయ్యారు. చదవండి: (దిక్కులేకే తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నా: జేసీ) ఈ సందర్భంగా జేసీ దివాకర్ రెడ్డిపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్కు అనుకూలంగా జేసీ వ్యాఖ్యలు చేస్తున్నారంటూ జీవన్‌రెడ్డి మండిపడ్డారు. భవిష్యత్తులో మరెప్పుడూ ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని జేసీకి సూచించారు. చదవండి: (లాయర్ దుస్తుల్లో వచ్చి కోర్టు ఆవరణలో కాల్పులు.. నలుగురు మృతి) -
'సిరిసిల్ల ఎస్పీ హిట్లర్.. వదిలిపెట్టం'
కొత్తపల్లి(కరీంనగర్): ఇసుకను అక్రమంగా దోస్తున్నది సీఎం కేసీఆర్ బంధువర్గమేనని సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. కరీంనగర్ జిల్లా చింతకుంటలో అరెస్టు అయి కొత్తపల్లి ఠాణాలో ఉన్న మాజీ మంత్రి సుద్దాల దేవయ్య, జెడ్పీ మాజీ చైర్మన్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గజ్జెల కాంతం, అంబేద్కర్ సంఘాల నాయకులు బాపన్న, మేడి మహేశ్, కన్నం అంజయ్య, దామెర సత్యం తదితరులను శుక్రవారం ఆయన పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఇసుకపై వస్తున్న ఆదాయాన్ని చెప్పిన కేటీఆర్.. ఇసుక దోపిడీ వెనక ఉన్నదెవరో చెప్పేందుకు భయమెందుకని ప్రశ్నించారు. ఇసుక క్వారీలో కేసీఆర్ కుటుంబ సభ్యులకు భాగస్వామ్యం ఉన్నట్లు ఆధారాలతో సహా నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. అక్రమ ఇసుకను కొల్లగొడుతున్న సీఎం బంధువర్గానికి అండగా నిలిచేందుకు సిరిసిల్ల ఎస్పీ హిట్లర్‌లా వ్యవహరించిన తీరును వదిలిపెట్టేది లేదన్నారు. దళితులని చూడకుండా పరుష పదజాలంతో దూషించడమే కాకుండా మాజీ సర్పంచ్ భానయ్య ఛాతీపై తన్నిన ఎస్పీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడంతో పాటు సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులను వెనకేసుకొస్తున్న మంత్రి కేటీఆర్‌పైనా అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు. పోలీసుల దాష్టీకాన్ని నిరసిస్తూ.. పౌర హక్కులను కాపాడాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 31న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సిరిసిల్లలో మాజీ స్పీకర్ మీరాకుమారి నేతృత్వంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు వివరించారు. -
నిజాం షుగర్స్‌పై అఖిలపక్షం ఏమైంది
సాక్షి, హైదరాబాద్: నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వమే నడిపించాలని సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం విలేకరులతో మాట్లాడుతూ.. నిజాం షుగర్స్‌ను తెరిపిస్తామని హామీ ఇచ్చి టీఆర్ఎస్ మోసం చేసిందన్నారు.రైతులు నడిపించుకుంటామంటే ఇస్తా మని, అఖిలపక్షం ఏర్పాటుచేసి చర్చి ద్దామని చెప్పిన సీఎం కేసీఆర్.. ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నిం చారు. కొందరు ప్రైవేటు వ్యక్తులతో కుమ్మక్కై నిజాం షుగర్స్‌ని ప్రభుత్వం పట్టించు కోవడంలేదని ఆరోపించారు. దీనిపై వెంటనే అఖిలపక్షం వేయాలని, నిజాం షుగర్స్‌ను తెరిపించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. -
‘ప్రాణహిత’కే జాతీయ హోదా సులభం
ప్రభుత్వానికి కాంగ్రెస్ నేత టి.జీవన్‌రెడ్డి సూచన ⇒ అక్కడ 120 టీఎంసీలు తీసుకున్నాకే కాళేశ్వరం వద్దకు వెళ్లాలి ⇒ కాళేశ్వరాన్ని స్టేజ్–2 కింద పరిగణించాలి ⇒ లేదంటే ప్రభుత్వంపై అనవసర నిర్మాణ, నిర్వహణ భారం ⇒ ప్రతిపక్షాలపై విమర్శలు మాని ప్రాజెక్టులు పూర్తి చేయాలని హితవు సాక్షి, హైదరాబాద్: ‘ప్రాణహిత–చేవెళ్ల’ ప్రాజెక్టులో భాగంగా తమ్మిడిహెట్టి దగ్గరే గరి ష్టంగా నీటిని వినియోగించుకునేందుకు ప్రయ త్నించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి ప్రభుత్వానికి సూచించారు. అక్కడ కొరతగా ఉండే నీటిని కాళేశ్వరం సమీపంలోని మేడిగడ్డ నుంచి తీసుకోవాలని.. అలాచేస్తే ప్రాజెక్టు వ్యయభారం గణనీయంగా తగ్గుతుందని స్పష్టం చేశారు. తమ్మిడిహెట్టి వద్ద 120 టీఎంసీల మేర నీటిని వినియోగించుకునే అవకాశముందని, ఆ ప్రాజెక్టుకు 13 రకాల కేంద్ర డైరెక్టరేట్ల అనుమతులున్న దృష్ట్యా దాన్నే స్టేజ్–1గా తీసుకుని.. కాళేశ్వరాన్ని స్టేజ్–2గా చేర్చాలని చెప్పారు. ఇలాగైతేనే ప్రాజెక్టుకు జాతీయ హోదా సులభంగా వస్తుందని తేల్చి చెప్పారు. అదే కాళేశ్వరం ప్రధాన ప్రాజెక్టుగా చేపడితే అనుమతుల కోసం మళ్లీ తొలినుంచీ ప్రయత్నం చేయాల్సి ఉంటుందని పేర్కొ న్నారు. మంగళవారం శాసనసభలో సాగునీటి పద్దులపై చర్చ సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు రీడిజైనింగ్‌పై ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. ‘‘ఈ ప్రాజెక్టు రీడిజైన్ పూర్తిగా లోపభూయిష్టం. తమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో మహారాష్ట్రలో కేవలం 3 వేల ఎకరాలే ముంపు ఉన్నప్పటికీ ఆ రాష్ట్రాన్ని ఒప్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. మహారాష్ట్రకు రాష్ట్ర ప్రతినిధుల బృం దాన్ని తీసుకెళ్లాలని కోరినా పట్టించుకోలేదు. ఇప్పటికైనా తమ్మిడిహెట్టి వద్ద లభ్యత నీటినంతా వాడుకుని, మిగతా నీటికోసం కాళేశ్వరం వెళ్లడం మంచిది..’’అని జీవన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇక 450 మీటర్ల ఎత్తున ఉన్న అప్పర్ మానేరు నుంచి 428 మీటర్ల ఎత్తులో ఉన్న నిజాంసాగర్‌కు గ్రావిటీ ద్వారా నీటిని తరలించకుండా.. 557 మీటర్ల ఎత్తున ఉన్న మల్లన్నసాగర్ నుంచి నిజాంసాగర్‌కు నీటిని ఎత్తిపోయడం ఏమిటని నిలదీశారు. న్యాయం చేయాలంటే నిందలు వేస్తారా? భూసేకరణ విషయంలో నిర్వాసితులకు, రైతులకు న్యాయం చేయాలని.. భూసేకరణ చట్టం మేరకు పరిహారం చెల్లించాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయని జీవన్‌రెడ్డి స్పష్టం చేశారు. కానీ ప్రతిపక్షాలు ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నాయని ప్రభుత్వం విమర్శిం చడం సరికాదన్నారు. గత రెండున్నరేళ్లలో ఒక్క ప్రాజెక్టునూ పూర్తి చేయని సర్కారు.. ప్రతిపక్షాలను ఆడిపోసుకోవడానికే ఎక్కువ సమయం కేటాయించిందని విమర్శించారు. ఎల్లంపల్లి, మిడ్‌మానేరు ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడంతో ఈ ఏడాది 100 టీఎంసీలు వృథా అయ్యాయని.. ఇప్పటికైనా విమర్శలు మాని ప్రాజెక్టుల పూర్తికి శ్రద్ధ చూపాలని సూచించారు. తాగునీటి సమస్య తీర్చండి: ఎంఐఎం హైదరాబాద్‌లోని పాతబస్తీలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, దానిని వెంటనే పరిష్కరించాలని ఎంఐఎం సభ్యుడు జాఫర్ హుస్సేన్ ప్రభుత్వాన్ని కోరారు. 20 టీఎంసీల సామర్థ్యంతో రెండు రిజర్వాయర్లు నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటిం చిందని, వెంటనే ఆ పని చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో చెత్త నిర్వహణ తీరు అస్తవ్యస్తంగా ఉందని, రోడ్లన్నీ అధ్వాన స్థితికి చేరుకున్నాయని ఎమ్మెల్యే సభ దృష్టికి తెచ్చారు. ‘పాలమూరు’ అక్రమాలను నిరూపిస్తాం ‘పాలమూరు–రంగారెడ్డి’ప్రాజెక్టు టెండర్లలో అక్రమాలు జరిగాయని, సభా సంఘం ఏర్పాటు చేస్తే అవినీతిని నిరూపించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని బీజేపీ సభ్యుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సవాల్ విసిరారు. ప్రభుత్వం ముందుకు వస్తే ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతం వద్ద అయినా చర్చకు సిద్ధమని చెప్పారు. రెండు కాంట్రాక్టు సంస్థల కోసం టెండర్ నిబంధనలను పూర్తిగా మార్చారని ఆరోపించారు. ప్రభుత్వం కృష్ణా, గోదావరి నదుల్లో ఒక్క చుక్క నీటినైనా అదనంగా దక్కించుకోలేకపోయిందని విమర్శించారు. ఈ సందర్భంగా కొందరు అధికార పక్ష సభ్యులు అడ్డుపడటంతో.. ‘సభ ఉన్నది డబ్బా కొట్టుకోవడానికి కాద’ంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. బాహుబలిని తలదన్నే ‘యోగి’వస్తాడు! రాష్ట్రానికి ప్రతి విషయంలో కేంద్రం సహకరిస్తోందని, సహకరించకపోతే తామూ ఓట్లడగబోమని ప్రభాకర్ పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే.. ఇక్కడా ఒక ‘యోగి’వస్తాడని, ఇక్కడి రూపురేఖలు మారుస్తాడని వ్యాఖ్యానించారు. దీంతో ‘బాహుబలి వద్దా?’అని కొందరు సభ్యులు వ్యాఖ్యానించడంతో..‘బాహుబలిని సైతం తలదన్నేవాడే యోగి’అని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో అప్రకటిత విద్యుత్ కోతలు కొనసాగుతున్నాయన్నారు. దీనిపై స్పందించిన మంత్రి జగదీశ్‌రెడ్డి.. రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేవని, డిమాండ్‌కు తగ్గ సరఫరా ఉందని చెప్పారు. -
ఈటలకు పేరు వస్తే ఓర్వని కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: బడ్జెట్ చర్చలు, ప్రభుత్వ వివరణల్లో ఆర్థికమంత్రి ఈటల రాజేందర్‌కు మాట్లాడ టానికి అవకాశం ఇవ్వకుండా స్వయంగా సీఎం కేసీఆరే మాట్లాడు తున్నారని సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి విమర్శించారు. బడ్జెట్‌పై చర్చలో ప్రభుత్వం తరఫున ఇచ్చే వివరణల్లో ఆర్థికమంత్రి అధ్యయనం చేసి సభలో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. అయితే బడ్జెట్ అవసరాలపై మాట్లాడితే ప్రజల్లో, రాజకీయాల్లో ఈటలకు ప్రతిష్ట పెరుగుతుందని, ఓర్వలేనితనంతో సభలో మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ప్రతిసారి ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. -
తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్‌ను ఉరితీయాలా!
సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీని ఉరి తీయాలని మంత్రి హరీశ్‌రావు మాట్లాడ టం దారుణమని, తెలంగాణ ఇచ్చినందు కు కాంగ్రెస్ పార్టీని ఉరితీయాలా.. అని సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లా డుతూ తెలంగాణ ప్రజలను మాటలతో మభ్యపెట్టి, అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేస్తున్న కేసీఆర్, హరీశ్‌రావులలో ఎవరిని ఉరితీయాలో చెప్పాలన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్పె నోటికొచ్చిన ట్టుగా మాట్లాడితే ప్రజలు సహించరన్నా రు. తెలంగాణ బిల్లు విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు సరికాదన్నా రు.పార్లమెంటు తలుపులు మూసి, తెలం గాణ బిల్లు ఆమోదించారని చంద్రబాబు మాట్లాడటం దారుణమన్నారు. -
సబ్‌ప్లాన్ నిధులు ఖర్చు చేయని ప్రభుత్వం
సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా 20వేల కోట్ల సబ్‌ప్లాన్ నిధులను ఖర్చు చేయలేదని, నిధులను కేటాయించినా ఖర్చు చేయకుండా ప్రభుత్వం మోసం చేస్తోందని సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి విమర్శించారు. అసెంబ్లీ ఆవరణలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. రానున్న బడ్జెట్లో ఇప్పటిదాకా ఖర్చు చేయకుండా మిగిలిన నిధులను ప్రత్యేక నిధుల కింద కేటాయించాలని డిమాండ్ చేశారు. వచ్చే బడ్జెట్లో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 10 శాతం నిధులను కేటాయించి, ఖర్చు చేయాలని ఆయన కోరారు. బడ్జెట్‌ను కేటాయింపులకు మాత్రమే పరిమితం చేయకుండా, ప్రతి మూడు నెలలకు ఒకసారి విడుదల చేసి, ఖర్చు చేయాలని అన్నారు. సబ్‌ప్లాన్‌కు నిధులను కేటాయించి, ఖర్చు చేయని రాష్ట్ర ప్రభుత్వం చీటింగ్ కేసును ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
పాడి బకాయిలు చెల్లించరేం?
• లక్ష కోట్ల బడ్జెట్లో ఈ చిన్న మొత్తం ఇవ్వలేరా?: కాంగ్రెస్ • తొమ్మిది నెలలుగా చెల్లించలేదంటూ విమర్శలు • రాజకీయం చేస్తున్నారని తలసాని మండిపాటు.. కాంగ్రెస్ వాకౌట్ సాక్షి, హైదరాబాద్: మూడ్రోజుల విరామం తర్వాత మంగళవారం ప్రారంభమైన శాసనసభ తొలిరోజే వాడివేడిగా సాగింది. ప్రశ్నోత్తరాల సమయంలో ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే ప్రయత్నం చేశాయి. పాడి రైతులకు చెల్లించాల్సిన బకాయిలు, ఎంఎన్‌జే ఆస్పత్రిలో రేడియేషన్ పరికరాల కొనుగోలు, భద్రాద్రి రామాలయంలో నగల మాయం అంశాలపై విమర్శలు కురిపించగా... ప్రభుత్వం వాటిని తిప్పికొట్టింది. తొలుత కాంగ్రెస్ సభ్యులు టి.జీవన్‌రెడ్డి, జి.చిన్నారెడ్డి పాడి బకాయిల అంశాన్ని లేవనెత్తారు. 2016 ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు రూ.22.59 కోట్ల పాడి ప్రోత్సాహక బకాయిలు పేరుకుపోయాయని, డిసెంబర్ వరకు ఆ మొత్తం ఇంకా ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. రూ.1.30 లక్షల కోట్ల బడ్జెట్లో పాడి రైతులకు చెందిన చిన్న మొత్తాలను విడుదల చేయలేదని విమర్శించారు. ఇందుకు పశుసంవర్థక, పాడి పరిశ్రమ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ బదులిస్తూ.. ఇప్పటికే ఆగస్టు వరకు బకాయిలు చెల్లించామని తెలిపారు. దీనిపై జీవన్‌రెడ్డి ప్రతిస్పందిస్తూ.. మంత్రి సభను తప్పుదోవ పట్టిస్తున్నారని, లిఖిత పూర్వకంగా ఒకలా చెప్పి, సమాధానం మరోలా చెబుతున్నారన్నారు. ఇందుకు మంత్రి స్పందిస్తూ... అది వాయిదా పడ్డ ప్రశ్న అని, ప్రశ్న తిరిగి వచ్చే సమయానికి బకాయిలు చెల్లింపు చేశామని వివరించారు. దీనిపై జీవన్‌రెడ్డి మళ్లీ మాట్లాడుతూ.. మంత్రి సభను తప్పుదోవ పట్టిస్తున్నారని, ఇందుకు తమకు నిరసన తెలిపే అవకాశం ఇవ్వాలన్నారు. అనంతరం తలసాని కల్పించుకొని.. పాడి రైతులను యాభై ఏళ్లుగా పట్టించుకోకుండా ఇప్పుడు రాజకీయం చేస్తున్నారనడం, అధికార పక్ష సభ్యులు సైతం మంత్రికి మద్దతుగా నినాదాలు చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. జీవన్‌రెడ్డి మైక్ ఇవ్వాలని కోరినా స్పీకర్ ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ సభ్యులంతా తమ స్థానాల్లో నిలబడి నిరసన తెలిపారు. దీంతో జీవన్‌రెడ్డికి స్పీకర్ మైక్ ఇచ్చారు. అనంతరం తొమ్మిది నెలల బకాయిలపై నిరసనగా వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించి కాంగ్రెస్ సభ్యులు బయటకెళ్లిపోయారు. రేడియేషన్ యంత్రాలపైనా మాటల మంట.. అంతకుముందు ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రిలో రేడియేషన్ యంత్రాల కొనుగోళ్లపైనా ఘాటు గా చర్చ జరిగింది. పరికరాల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని, దీనిపై కేంద్ర కమిటీ సైతం నివేదిక ఇచ్చిందని కాంగ్రెస్ సభ్యులు జీవన్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి ఆరోపించారు. దీనిపై సభాసంఘం వేయాలని డిమాండ్ చేశారు. వైద్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి సమాధానమిస్తూ.. ఆస్పత్రిలో రాజకీయాలున్నాయని, అందునే ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారని, దాన్ని పట్టుకొనే ప్రతిపక్ష సభ్యులు విమర్శలు చేస్తున్నారన్నారు. రేడియేషన్ పరికరాల కొనుగోళ్లలో ఎలాంటి అక్రమాలు జరగలేదన్నారు. మంత్రి సూటిగా సమాధానం చెప్పకుండా ఎదురుదాడి చేస్తున్నారని చిన్నారెడ్డి దుయ్యబట్టారు. దీనిపై మంత్రి స్పందిస్తూ.. అబద్ధాలు మాట్లాడితే కచ్చితంగా ఎదురుదాడి చేస్తామనడంతో ప్రతిపక్ష సభ్యులు అభ్యంతరం తెలిపారు. నగలపై విచారణ ఏమైంది? భద్రాద్రి రామాలయంలో సీతమ్మ మంగళసూత్రం, లక్ష్మణుడి లాకెట్లు మాయమైన ఘటనపై విచారణ ఏమైందని టీడీపీ నేత రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. నగలు ఎలా మాయమయ్యాయి? మళ్లీ ఎలా దొరికాయన్న అంశంపై విచారణ ఎక్కడి వరకు వచ్చిందన్నారు. దీనికి దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి స్పందిస్తూ.. మంగళసూత్రం పోలేదని, చిన్నచిన్న ఆభరణాలు మాత్రమే పోయాయని, తర్వాత దొరికాయని వివరించారు. కాగా ఈ నెల 9న ముక్కోటి ఏకాదశి కారణంగా సభకు సెలవు ప్రకటించాలని ఖమ్మం ఎమ్మెల్యే జలగం వెంకట్రావు కోరగా, ప్రతిపక్షాలతో మాట్లాడి దీనిపై నిర్ణయిస్తామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సహకరిస్తే 6 నెలల్లో కాల్వల పనులు: హరీశ్ భూసేకరణ త్వరగా జరిగేలా ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుంటే బునాదిగాని కాల్వ, పిల్లాయిపల్లి కాల్వ, ధర్మారెడ్డి కాల్వల ఆధునీకరణ పనులను ఆరు నెలల్లో పూర్తి చేస్తామని సాగునీటి శాఖ మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు. ఈ కాల్వల ద్వారా 63,012 ఎకరాల ఆయకట్టుకు నీరందించవచ్చని, వీటికోసం ఇప్పటికే రూ.284.85 కోట్లు విడుదల చేశామన్నారు. -
పేదలకంటే సచివాలయం ముఖ్యమా
సాక్షి, హైదరాబాద్: పేదలకు ఇళ్లు కట్టించకుండా, రైతులకు రుణమాఫీ చేయకుండా సచివాలయం నిర్మించడమే ప్రభుత్వానికి ముఖ్యమా అని సీఎల్పీ ఉప నేత టి.జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. మంగళవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ, ఉపాధి హామీ కూలీలకు వేతనాలు చెల్లించడం లేదని, విద్యార్థులకు ఫీజులు రీయింబర్స్మెంట్ చేయడం లేదని, ఆరోగ్యశ్రీకి బకాయిలు ఇవ్వడం లేదని, తాగునీటికి సంబంధించి 1,000 కోట్లు బకాయిలు ఉన్నాయన్నారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే కేసీఆర్ గొప్పలకు పోతున్నారన్నారు. -
మీ విశ్వాసాల కోసం భారం మోపుతారా?
సచివాలయం కూల్చద్దంటూ కేసీఆర్‌కు జీవన్‌రెడ్డి లేఖ సాక్షి, హైదరాబాద్: వ్యక్తిగత విశ్వాసాల కోసం కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేస్తారా అని సీఎల్పీ ఉపనాయకుడు టి.జీవన్‌రెడ్డి కేసీఆర్‌ను ప్రశ్నించారు. వాస్తు దోషం ఉందనే సాకుతో విశాలమైన, పటిష్టమైన సచివాలయ భవనాలను కూల్చేయవద్దంటూ కేసీఆర్‌కు గురువారం ఆయన లేఖ రాశారు. ఇప్పటికే అమరావతికి ఆంధ్రా సచివాలయం తరలివెళ్తున్న నేపథ్యంలో తెలంగాణకు మరో నాలుగు బ్లాకులు పెరుగుతాయని, దీనివల్ల సువిశాలమైన సదుపాయాలు, వసతులున్న సచివాలయం అందుబాటులో ఉంటుం దన్నారు. వాస్తుదోషం కారణంతో సచివాలయాన్ని కూల్చేసి, కొత్తది నిర్మించాలనే ప్రతిపాదన వల్ల ప్రజలపై కోట్లాది రూపాయల భారం పడుతుందన్నారు. -
'కొత్త క్యాంపు ఆఫీసు ఎందుకు?'
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ రాచరిక పోకడలు అనుసరిస్తున్నారని మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి విమర్శించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకాన్ని కావాలనే నీరుగారుస్తున్నారని ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ముఖ్యమంత్రికి మంచి క్యాంపు కార్యాలయం కావాలి కానీ పేదలకు ఇళ్లు అవసరం లేదా అని ప్రశ్నించారు. కొత్త క్యాంపు కార్యాలయం నిర్మించాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు. ప్రజారోగ్యంపై టీఆర్ఎస్ సర్కారు నిర్లక్ష్యంగా వ్యవరిస్తోందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి విమర్శించారు. పేద ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా సచివాలయం, సీఎం క్యాంపు కార్యాలయ నిర్మాణానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని దుయ్యబట్టారు. వైద్యారోగ్య శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేసి పేదలను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
చట్టం అమలు చేయమనడం తప్పా: జీవన్
సాక్షి, హైదరాబాద్: మల్లన్నసాగర్ రిజర్వాయర్ కోసం భూములు కోల్పోతున్న నిర్వాసితులకు భూసేకరణ చట్టం-2013 ప్రకారం పునరావాసం కల్పించాలని కోరడం తప్పా అని సీఎల్పీ ఉపనాయకుడు టి.జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. అసెంబ్లీ ఆవరణలో మంగళవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ మల్లన్నసాగర్ ముంపు గ్రామాల్లో ప్రభుత్వం నియంతృత్వ పోకడలతో వ్యవహరిస్తోందని విమర్శించారు. మల్లన్నసాగర్లో రైతులకు జరుగుతున్న నష్టానికి ప్రతిపక్ష పార్టీలన్నీ సంఘీభావం తెలుపుతున్నాయని, దీనికే టీడీపీతో కలసిపోయినట్టుగా టీఆర్ఎస్ నేతలు మాట్లాడటం సరికాదన్నారు. ఓటుకు కోట్లు కేసులో టీడీపీతో టీఆర్ఎస్ మధ్య క్విడ్ ప్రోకో జరిగిందని ఆయన ఆరోపించారు. -
రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిన కేసీఆర్: జీవన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రయోజ నాలను సీఎం కేసీఆర్ మహారాష్ట్రకు తాకట్టుపెట్టారని సీఎల్పీ ఉపనాయకుడు టి.జీవన్‌రెడ్డి అన్నారు. గురువారం ఇక్కడ ఆయన మాట్లాడు తూ.. తమ్మిడిహట్టి వద్ద 152 మీట ర్ల ఎత్తుతో ప్రాజెక్టు నిర్మాణం చేపడితే రాష్ట్రానికి ప్రయోజనం ఉండేదన్నారు. 152 మీటర్ల ఎత్తుతో 90 రోజులపాటు 160 టీఎంసీల నీటి వినియోగానికి ప్రతిపాదన, మహారాష్ట్ర ప్రభుత్వంతో సూత్రప్రాయ ఒప్పందం కూడా జరిగిందని, ప్రతిపక్షాలను నిందించినంత మాత్రాన వాస్తవాలు మారిపోవన్నా రు. రాష్ట్ర ప్రయోజనాల కోసం 152 మీటర్ల ఎత్తుతో ప్రాజెక్టు నిర్మించడానికి ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేసే ధైర్యం కేసీఆర్‌కు లేదన్నారు. 18 లక్షల ఎకరాలకు నీరు ఎలా ఇస్తారో, మరో 18 లక్షల ఎకరాలను ఎలా స్థిరీకరిస్తారో చెప్పాలన్నారు. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలు కేసీఆర్ అనాలోచిత నిర్ణయమన్నారు. అధికారం శాశ్వతం కాదని, అధికారంలో ఉన్నవారు ప్రజల పక్షాన ఆలోచించి ముందుచూపుతో వ్యవహరించాలన్నారు. -
రాష్ట్రంలో రాచరిక పాలన - సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి
మల్లన్నసాగర్ జలాశయం నిర్మాణంలో భూములు కోల్పోతున్న నిర్వాసితులు తమకు న్యాయమైన పరిహారం చెల్లించాలని శాంతియుతంగా ధర్నాచేస్తే పోలీసులు లాఠీచార్జీ చేయడం, కాల్పులు జరపడం రాష్ట్రంలో రాజరిక పాలనను తలపిస్తోందని కాంగ్రెస్ శాసనసభాపక్ష ఉపనేత టి.జీవన్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం ఆయన కరీంనగర్ జిల్లా జగిత్యాలలో విలేకరులతో మాట్లాడారు. మల్లన్నసాగర్ భూనిర్వాసితుల హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మల్లన్నసాగర్ ముంపు బాధితులను మోసం చేసేందుకు 123 జీవో ద్వారా భూములు సేకరించేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. ముంపు బాధితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ మెప్పు కోసమే మంత్రి హరీశ్‌రావు నిర్వాసితులను మభ్యపెడుతున్నారని, రైతులకు దాడులకు ఆయనే బాధ్యత వహించాలన్నారు. నిర్వాసితులకు భూసేకరణ చట్టం అమలు చేయకుండా భూములు లాక్కుంటే సహించేది లేదన్నారు. లాఠీచార్జీకి బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
హరీశ్ రాజకీయ లబ్ధికోసం రైతుల బలి: జీవన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: మంత్రి హరీశ్‌రావు రాజకీయ లబ్ధికోసం మల్లన్నసాగర్లో భూములు కోల్పోతున్న రైతులను బలిపెట్టేందుకు కుట్ర జరుగుతున్నదని సీఎల్పీ ఉపనాయకుడు టి.జీవన్‌రెడ్డి ఆరోపించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేయాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే భూసేకరణ చట్టం-2013 ప్రకారం భూముల విలువను పెంచి, నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని సూచించారు. అలాకాకుండా, రైతులను ముంచాలని ప్రభుత్వమే ప్రయత్నించడం దారుణమన్నారు. మంత్రి హరీశ్‌రావు రాజకీయ పబ్బం గడుపుకోవడానికి, కేసీఆర్ మెప్పు పొందడానికి భూ నిర్వాసితుల నోళ్లలో మట్టికొట్టాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. -
పది శాతం పని.. 90 శాతం గొప్పలు :జీవన్ రెడ్డి
సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి జగిత్యాల అగ్రికల్చర్: కేసీఆర్ ప్రభుత్వం పది శాతం పనులు చేసి.. 90 శాతం గొప్పలు చెప్పుకుంటోందని సీఎల్పీ ఉపనేత టి. జీవన్‌రెడ్డి విమర్శించారు. కరీంనగర్ జిల్లా జగిత్యాలలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రప్రభుత్వం పెట్టుబడిదారుల కొమ్ముకాస్తూ రైతులు, రైతుకూలీలను విస్మరిస్తోందని ఆరోపించారు. రుణమాఫీకి ఇంకా నిధులు విడుదల చేయలేదని, ఇన్పుట్ సబ్సిడీ అందించలేదని, కరువు మండలాల గుర్తింపులో అలసత్వం ప్రదర్శించి రైతులకేదో మేలు చేసినట్లు మాట్లాడుతోందన్నారు. వారంలో మూడు రోజులు తన వ్యవసాయక్షేత్రాన్నే చూసుకుంటున్న ముఖ్యమంత్రి.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతుల గురించి ఒక్కసారైనా ఆలోచిస్తే బావుంటుందని హితవుపలికారు. పంటల బీమా పథకం గడువు ఈనెల 14 వరకే ఉన్నా.. బ్యాంకర్లు ఇప్పటివరకు రుణ పంపిణీ ప్రారంభించలేదని తెలిపారు. గడువు లోపు ప్రీమియం చెల్లిస్తేనే పంట నష్టపోయిన రైతుకు మేలు జరుగుతుందన్నారు. రెండేళ్లుగా విత్తనోత్పత్తి అంటూ ఊదరగొడుతున్న ప్రభుత్వం.. ఇంకా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ నుంచి విత్తనాలను దిగుమతి చేసుకోకపోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. జిల్లాలోని కరువు మండలాల్లో 53,965 హెక్టార్లలో పంటనష్టం జరిగితే రూ.36.92 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ వచ్చినా ఇతర పనులకు ఖర్చు పెట్టడం శోచనీయమన్నారు. -
మహారాష్ట్రకు మేలు చేస్తున్న కేసీఆర్: జీవన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును తమ్మిడిహెట్టి వద్ద కాకుండా, మేడిగడ్డ వద్ద నిర్మించి మహారాష్ట్రకు మేలు, తెలంగాణకు అన్యా యం చేస్తున్నారని ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఆకుల లలిత విమర్శించారు. మంగళవారం హైదరాబాద్‌లో మాట్లాడుతూ.. మహారాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకే తమ్మిడిహెట్టి వద్ద కాకుండా ప్రాజెక్టులను కిందికి మార్చారన్నారు. కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యే అయిన తనకు కనీసం సమాచారం ఇవ్వకుండా కాళేశ్వరం వద్ద శంకుస్థాపన చేశారన్నారు. కేసీఆర్ వ్యక్తిగత ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రజల భవిష్యత్తును పణంగా పెట్టారన్నా రు. ముంపు బాధితులకు పరిహారం, పునరావాసం తేల్చకుండానే పనులు చేయడం వల్ల రైతులు నష్టపోతారన్నారు. తెలంగాణ ప్రయోజనాల కన్నా మహారాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అన్నట్టు సీఎం వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తమ్మిడిహెట్టి-మేడిగడ్డ మధ్య నీటిని మహారాష్ట్ర అక్రమంగా వాడుకోవడానికి అవకాశం కల్పించారని ఆరోపించారు. -
టీ జేఏసీ నిర్వీర్యానికి భారీ కుట్ర: జీవన్‌రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో పెద్దన్న పాత్ర పోషించిన పొలిటికల్ జేఏసీని నిర్వీర్యం చేసేందుకు పెద్ద కుట్ర జరుగుతోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి ఆరోపించారు. టీజేఏసీ నుంచి వైదొలగుతున్నట్లు ఉద్యోగ సంఘాలు ప్రకటించడం సరి కాదని అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద గురువారం ఆయన మాట్లాడారు. రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన వారు... అభివృద్ధి విషయంలో ప్రభుత్వం సరైన పద్దతిలో తీసుకెళ్లేందుకు దోహదపడాలన్నారు. ప్రస్తుతం జేఏసీ టీమ్‌కు గతంలో కంటే ప్రస్తుతం బాధ్యత మరింత పెరిగిందన్నారు. కానీ ఉద్యోగ సంఘాలు వారి సమస్యలకే ప్రాధాన్యం ఇస్తామంటూ పక్కకు తప్పుకోవడం బాధాకరమన్నారు. టీజేఏసీని బలోపేతం చేయాల్సిన అవసరం తెలంగాణ సమాజంపై ఉందని, కనుక కాంగ్రెస్ పార్టీ కూడా వెనక ఉంటుందన్నారు. -
'మోదీ మెప్పు కోసమే చండీయాగం'
కరీంనగర్: ప్రధాని నరేంద్ర మోదీ మెప్పు కోసమే తెలంగాణ సీఎం కేసీఆర్.. ఆయుత చండీయాగం నిర్వహిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే టి. జీవన్ రెడ్డి ఆరోపించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ఎన్డీఏ కూటమిలో కలిసిపోవడానికే చండీ యాగం తలపెట్టారని అన్నారు. ఈ కార్యక్రమం ప్రభుత్వపరంగానా లేదా వ్యక్తిగతంగా నిర్వహిస్తున్నారా అనేది కేసీఆర్ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. సెక్యులర్ రాష్ట్రంలో ప్రభుత్వ పరంగా యాగాలకు, పూజలకు అవకాశముందా అని ప్రశ్నించారు. తన మొక్కు తీర్చుకోవడానికి దేవుళ్లకు కేసీఆర్ నగలు సమర్పించిన విషయాన్ని జీవన్ రెడ్డి గుర్తు చేశారు. -
బస్సు చార్జీలు పెంచేందుకు కుట్ర: జీవన్ రెడ్డి
కరీంనగర్ (జగిత్యాల): తెలంగాణ ప్రభుత్వం బస్‌చార్జీలు పెంచి సామాన్యులపై భారం మోపేందుకు కుట్రపన్నుతోందని సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా జగిత్యాలలో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ఆర్టీసీ కార్మికులకు 44 శాతం ఫిట్మెంట్ ఇవ్వడం అభినందనీయమైనప్పటికీ సమ్మెకు దిగకముందు ఇస్తే బాగుండేదన్నారు. బస్‌చార్జీలు పెంచే కుట్రలో భాగంగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసే వరకు ప్రభుత్వం వేచి చూసిందని, ఫలితంగా ఆర్టీసీకి రూ.100 కోట్ల నష్టం వాటిల్లిందని అన్నారు. దీనికి ఆర్టీసీ కార్మికులను దోషులుగా చూపిస్తూ బస్‌చార్జీలు పెంచే ప్రయత్నం మొదలు పెట్టిందని విమర్శించారు. డీజిల్ ధర ప్రస్తుతం రూ.10 వరకు తగ్గిందని, వ్యాట్, ల్యుబ్రికేషన్ భారం తగ్గించి జనరల్ సేల్స్ టాక్స్‌కు ఎత్తివేస్తే ప్రజలపై భారం మోపాల్సిన అవసరం ఉండదని సూచించారు. ఇటీవల అవసరం లేనప్పటికీ 200 ఏసీ బస్సులను కొనుగోలు చేశారని, వీటిని నడిపేందుకు డ్రైవర్లు సైతం లేరన్నారు.. ప్రభుత్వ విధానాలు, ఉన్నత స్థారుులో అవినీతి, అక్రమాలకే ఆర్టీసీ నష్టాలకు కారణమని తెలిపారు. ప్రస్తుతం పెంచిన ఫిట్మెంట్ తాత్కాలికమేనని, ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా వేతనాలు ఇచ్చినప్పుడే ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. 108 సర్వీసుల నిర్వహణను ఆంధ్ర పెట్టుబడిదారు అయిన జీవీకేతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయూలని, ఆ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసి ప్రజలకు మెరుగైన సేవలందించేలా 108 సర్వీసులను తీర్చిదిద్దాలని డిమాండ్ చేశారు. -
సచివాలయాన్నే కాదు రాష్ట్రాన్నే అమ్మేస్తారేమో?
సీఎం కేసీఆర్ తీరుపై జీవన్‌రెడ్డి ధ్వజం సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు వ్యవహారశైలి, వివిధ అంశాలపై ఆయన చేస్తున్న ఏకపక్ష ప్రకటనలపై కాంగ్రెస్ శాసన సభాపక్షం ఉపనేత టి.జీవన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు చూస్తుంటే సచివాలయాన్నే కాదు, రాష్ట్రాన్ని కూడా అమ్మేసేలా ఉన్నారంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వాస్తుదోషం ఉందంటూ సచివాలయాన్ని ఎర్రగడ్డకు మార్చాలని సీఎం అనుకోవడం ఎంతమాత్రం సరికాదన్నారు. శుక్రవారం అసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ తన వ్యక్తిగత సెంటిమెంట్లను రాష్ర్టంపై రుద్దడం ఏమిటని నిలదీశారు. రాష్ట్రంలో ఒకవైపు అనేక సమస్యలున్నాయని, విద్యార్థులకు ఫీజు రీఇంబర్స్మెంట్, రైతులకు రుణమాఫీ, మరోవైపు తీవ్రరూపం దాలుస్తున్న కరువుపరిస్థితులు వీటన్నింటిని పట్టించుకోకుండా నేలవిడిచి సాము చేయడం సరికాదన్నారు. విద్యుత్ సమస్య తీవ్రమవుతోందని, ఏపీ నుంచి రావాల్సిన విద్యుత్ గురించి ఆలోచించకుండా ఎర్రగడ్డలో సచివాలయం ఏర్పాటు చేయడంపై ఆలోచిస్తే ఎలా నిలదీశారు. ఇసుక అక్రమరవాణాకు ప్రభుత్వానిదే బాధ్యత.. తెలంగాణలో ఇసుక అక్రమ రవాణాకు రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత అని, అందుకు బాధ్యులైన గనులశాఖ మంత్రి హరీశ్‌రావుపై ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు తీసుకోవాలని జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. సీఎంకు అల్లుడు కావడం వల్లే హరీశ్‌పై చర్యలు తీసుకోవడంలేదని, అమాయకుడైన మాజీ ఉపముఖ్యమంత్రి రాజయ్యపై మాత్రం వేటు వేశారన్నారు. తక్షణమే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో రిలేనిరాహార దీక్ష చేపట్టిన తెలంగాణ రాష్ట్ర డీఎస్సీ అభ్యర్థుల సంఘం ప్రతినిధులను శుక్రవారం ఆయన కలసి సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర డీఎస్సీ అభ్యర్థుల సంఘం అధ్యక్షుడు అలవాల మధుసూదన్, ప్రధాన కార్యదర్శి తిరుపతిరెడ్డి, నాయకులు రాంమోహన్ రెడ్డి, రాజారాం, చిరంజీవి, మధు, పి. శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జీవన్‌రెడ్డిని పరామర్శించిన పొన్నాల
సాక్షి, హైదరాబాద్: మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్న సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డిని శుక్రవారం టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని పొన్నాల, మాజీమంత్రి శ్రీధర్‌బాబు అభిలషించారు. అలాగే, శుక్రవారం పుట్టినరోజు జరుపుకొన్న దామోదర రాజనర్సింహకు వారు శుభాకాంక్షలు తెలిపారు. -
'చంద్రబాబుతో స్నేహం మానుకోండి'
హైదరాబాద్: పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని నిర్మించవద్దంటూ కేంద్రానికి లేఖ రాఖ రాయడం ద్వారా చంద్రబాబు మరోసారి తెలంగాణ వ్యతిరేకి అని రుజువైందని కాంగ్రెస్ నేతలు టి. జీవన్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. తెలంగాణ టీడీపీ నాయకులకు చీము నెత్తురు ఉంటే ఆ పార్టీ నుంచి బయటకు రావాలన్నారు. లేదంటే చంద్రబాబుతో లేఖను ఉపసంహరింపజేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ బీజేపీ నాయకులు కూడా చంద్రబాబు స్నేహాన్ని వీడాలని సూచించారు. తెలంగాణకు న్యాయం జరిగేలా కేంద్రాన్ని ఒప్పించాలని కోరారు. పలు అంశాల్లో తెలంగాణ ప్రయోజనాలకు అడ్డుపడుతూ చంద్రబాబు తెలంగాణ ద్రోహిగా మిగిలారని మండిపడ్డారు. బీబీ నగర్ నిమ్స్ ఆస్పత్రిని పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన కేసీఆర్: జీవన్ రెడ్డి
-
రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన కేసీఆర్: జీవన్ రెడ్డి
హైదరాబాద్: గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా కేసీఆర్ స్వయంగా పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నారని సీఎల్పీ ఉప నాయకుడు టి. జీవన్ రెడ్డి ఆరోపించారు. నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి టీఆర్ఎస్ లో చేర్చుకుని రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని అన్నారు. మంగళవారం సాయంత్రం తెలంగాణ కాంగ్రెస్ నాయకులు గవర్నర్ నరసింహన్ ను కలిశారు. అనంతరం జీవన్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్న కేసీఆర్ ను సీఎం పదవికి అనర్హుడిగా ప్రకటించాలని గవర్నర్ ను కోరినట్టు జీవన్ రెడ్డి తెలిపారు. చట్టపరంగా చర్యలు చేపడతానని గవర్నర్ తమకు హామీయిచ్చారని చెప్పారు. టీఆర్ఎస్ కు ప్రజల్లో ఆదరణ ఉంటుందనుకుంటున్న కేసీఆర్ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలని సూచించారు. -
ప్రత్యక్ష ఎన్నికలు రావాల్సిందే: జీవన్‌రెడ్డి
హైదరాబాద్: రేషన్ కార్డులు రద్దయితే ఆ భాద్యత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ లెక్కల ప్రకారమే 16 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు లేవని తెలిపారు. ప్రజా సమస్యల అమలు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణ సదస్సులో మాట్లాడుతూ... స్ధానిక ప్రజాప్రతినిధిలు ఫిరాయింపు ఆగాలంటే ప్రత్యక్ష ఎన్నికలు రావాల్సిందేనని అభిప్రాయపడ్డారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీల ఫిరాయింపు ఆగాలంటే మండల, జిల్లా పరిషత్ ఛైర్మన్ ప్రత్యక్ష ఎన్నికలు జరగాల్సిందేనని సూచించారు. -
'టి.ప్రభుత్వం వద్ద అంత భూమి లేదు'
-
'టి.ప్రభుత్వం వద్ద అంత భూమి లేదు'
హైదరాబాద్: దళితులకు భూమి ఇవ్వడంతోనే ప్రభుత్వం చేతులు దులుపుకోకుండా వ్యవసాయం చేసుకునేందుకు సాగునీరు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఉపాధి అవకాశాలు కల్పించడంపైనా కూడా ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు. అయితే కొద్దిమందికి మాత్రమే భూములు పంపిణీ చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. తెలంగాణలో భూమిలేని దళిత కుటుంబాలు 8 లక్షలు ఉన్నాయని తెలిపారు. ఇంతమందికి పంచాలంటే 24 లక్షల ఎకరాలు కావాలని, ఇవ్వడానికి ప్రభుత్వం వద్ద అంత భూమి లేదన్నారు. ఇంతభూమి కొనుగోలు చేయలంటే రూ. లక్షా 20 వేలకోట్లు కావాలని తెలిపారు. కాబట్టి ప్రభుత్వం దళితులను మభ్యపెట్టకుండా వారిని ఆదుకోవాలని జీవన్‌రెడ్డి కోరారు. -
'కిరణ్‌ను విభజన ద్రోహిగా గుర్తిస్తారు'
హైదరాబాద్: రాష్ట్ర విభజన బిల్లును అసెంబ్లీ తిరస్కరించిందనడం సరికాదని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి టి.జీవన్‌రెడ్డి అన్నారు. ఆర్టికల్ 3 ప్రకారం విభజన బిల్లుపై చర్చ ప్రక్రియ అసెంబ్లీలో సజావుగా జరిగిందని తెలిపారు. రూల్ 77 కింద విభజన బిల్లును వెనక్కి పంపాలనే తీర్మానాన్ని సభ ఆమోదించిందని చెప్పారు. అయితే విభజన బిల్లును తిరస్కరించినట్టు కాదని స్పష్టం చేశారు. విభజన బిల్లును తిరస్కరించారంటూ సీఎం, మంత్రులు ప్రజలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీమాంధ్ర ప్రజలు వాస్తవాన్ని గ్రహించి సీఎం కిరణ్‌ను విభజన ద్రోహిగా గుర్తిస్తారని జీవన్‌రెడ్డి తెలిపారు. -
సోనియమ్మకే సీఎం ద్రోహం చేశారు: జీవన్‌రెడ్డి
రాయికల్: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాజకీయ భిక్షతో ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్న కిరణ్‌కుమార్‌రెడ్డి ఆమెకే ద్రోహం చేశారని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి ధ్వజమెత్తారు. కరీంనగర్ జిల్లా రాయికల్ మండలం మూటపల్లిలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎలాంటి గుర్తింపు లేని కిరణ్‌ను సోనియాగాంధీ ముఖ్యమంత్రిని చేశారని, ఆమె తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న తర్వాత ఆమె నిర్ణయాన్నే ఎదిరించిన ఘనుడు కిరణ్ అని మండిపడ్డారు. కేవలం అధికారం కోసమే సోనియాగాంధీ తెలంగాణ నిర్ణయం తీసుకున్నారని కొంతమంది సీమాంధ్ర నాయకులు అనడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు. సీమాంధ్రలో 25 ఎంపీ స్థానాలు ఉంటే తెలంగాణలో 17 ఎంపీ స్థానాలే ఉన్న విషయం వారు మరిచినట్టున్నారన్నారు. వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, ఆంధ్ర, రాయలసీమకు ఎలాంటి పరిహారం ఇస్తున్నారో... అలాగే తెలంగాణ రైతులను కూడా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇటీవల వ్యవసాయశాఖ మంత్రి రఘువీరారెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశామని జీవన్‌రెడ్డి చెప్పారు. -
యూటీ ప్రతిపాదన అప్రజాస్వామికం: జీవన్‌రెడ్డి
తెలంగాణలో ఉన్న హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలనే ప్రతిపాదన అప్రజాస్వామికమని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో ఏపీఎన్జీవోల సభకు అనుమతించడం తెలంగాణ మనోభావాలను దెబ్బతీయడమేనని ఆయన అభిప్రాయపడ్డారు. హింసను ప్రోత్సహించేవిధంగా ఏపీఎన్జీవోల సభకు అనుమతివ్వడం సరికాదని అన్నారు. జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సివుంటుందని ఆయన హెచ్చరించారు. ఇప్పటికైనా సీఎం కిరణ్ విజ్ఞతను ప్రదర్శించి ఏపీఎన్జీవోల సభ అనుమతిని రద్దుచేయాలని, లేదంటే టీఎన్జీవోల ర్యాలీకి కూడా అనుమతివ్వాలని జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. సీడబ్ల్యూసీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్న సీమాంధ్ర కేంద్రమంత్రులు ఇప్పుడు దానిని వ్యతిరేకించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని జీవన్‌రెడ్డి అంతకుముందు అన్నారు. చంద్రబాబు రాజకీయ లబ్ధికోసం తెలంగాణకు మరోసారి అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. -
తెలంగాణకు చంద్రబాబు ద్రోహం: జీవన్‌రెడ్డి
సారంగాపూర్, న్యూస్‌లైన్: దివంగత ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, వైఎస్సార్ జీవించి ఉంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటనను స్వాగతించేవారని, సీమాంధ్రలో సమైక్యాంధ్ర పేరుతో కృత్రిమ ఉద్యమం పుట్టుకొచ్చేది కాదని మాజీ మంత్రి టి.జీవన్‌రెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా సారంగాపూర్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం వైఎస్సార్ 2009 ఫిబ్రవరి 12 అసెంబ్లీలో తీర్మానం చేశారని గుర్తుచేశారు. ఎన్టీఆర్ తన పాలనలో ఏనాడూ సమైక్యాంధ్ర అన్న పదం వాడలేదన్నారు. కానీ చంద్రబాబు రాజకీయ లబ్ధికోసం తెలంగాణకు మరోసారి అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. నాలుగు శతాబ్దాల చరిత్రగల హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని కేంద్రమంత్రి చిరంజీవి కోరడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సీమాంధ్ర పాలకులు హైదరాబాద్‌లో భూములు అమ్మిన సొమ్ములో తెలంగాణలో ఒక్కశాతం ఖర్చు చేస్తే, సీమాంధ్రలో 99శాతం ఖర్చు పెట్టుకున్నారని ఆరోపించారు. సీడబ్ల్యూసీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్న సీమాంధ్ర కేంద్రమంత్రులు ఇప్పుడు దానిని వ్యతిరేకించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని జీవన్‌రెడ్డి అన్నారు. -
తెలంగాణపై బాబు ద్వంద్వ నీతి: జీవన్‌రెడ్డి
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తెలంగాణపై ద్వంద్వ నీతితో, రెండునాల్కల ధోరణితో మాట్లాడుతున్నారని మాజీమంత్రి టి. జీవన్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణకు అనుకూలమని ప్రకటించి ఇప్పుడు కేంద్రం నిర్ణయం తీసుకున్న తరుణంలో తెలుగుజాతిని చీల్చుతారా? అంటూ తన నిజస్వరూపాన్ని బయటపెట్టారని విమర్శించారు. బుధవారం సీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బాబు పాలనలో ఈ ప్రాంతానికి తీరని అన్యాయం జరగడం వల్లే తెలంగాణప్రాంత కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరం ప్రత్యేక రాష్ట్రం కోసం సోనియాగాంధీకి లేఖ ఇచ్చామని తెలిపారు. వైఎస్ రాజశేఖరరెడ్డి దీనికి కారణమన్న విమర్శలు కొందరు చేస్తుంటే.. మరికొందరు ఆయన్ను తెలంగాణ వ్యతిరేకిగా విమర్శిస్తున్నారన్నారు. కేంద్రం, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వదనే ఉద్దేశంతోనే చంద్రబాబు తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చినట్లు కనిపిస్తోందన్నారు. నిర్ణయం వెలువడ్డాక.. తెలుగుజాతిని రెండు చేస్తారా? అని, టీడీపీని నిర్వీర్యం చేసేందుకే ఇలా చేస్తున్నారన్న ఆయన విమర్శలు తెలంగాణ వ్యతిరేకతను బయటపెడుతున్నాయన్నారు. హైదరాబాద్‌ను తాను అభివృద్ధి చేశానని చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. వాస్తవానికి బాబు సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణ చాలా నష్టపోయిందని, ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేసి ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టారన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని భూములను తెగనమ్మేశారని, కనీసం అక్కడి జిల్లా కార్యాలయాలకు కూడా భూముల్లేకపోవడం సిగ్గుచేటన్నారు.