
పేదలకంటే సచివాలయం ముఖ్యమా
సాక్షి, హైదరాబాద్: పేదలకు ఇళ్లు కట్టించకుండా, రైతులకు రుణమాఫీ చేయకుండా సచివాలయం నిర్మించడమే ప్రభుత్వానికి ముఖ్యమా అని సీఎల్పీ ఉప నేత టి.జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. మంగళవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ, ఉపాధి హామీ కూలీలకు వేతనాలు చెల్లించడం లేదని, విద్యార్థులకు ఫీజులు రీయింబర్స్‌మెంట్ చేయడం లేదని, ఆరోగ్యశ్రీకి బకాయిలు ఇవ్వడం లేదని, తాగునీటికి సంబంధించి 1,000 కోట్లు బకాయిలు ఉన్నాయన్నారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే కేసీఆర్ గొప్పలకు పోతున్నారన్నారు.