
మీ విశ్వాసాల కోసం భారం మోపుతారా?
వ్యక్తిగత విశ్వాసాల కోసం కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేస్తారా అని సీఎల్పీ ఉపనాయకుడు టి.జీవన్‌రెడ్డి కేసీఆర్‌ను ప్రశ్నించారు.
సచివాలయం కూల్చద్దంటూ కేసీఆర్‌కు జీవన్‌రెడ్డి లేఖ
సాక్షి, హైదరాబాద్: వ్యక్తిగత విశ్వాసాల కోసం కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేస్తారా అని సీఎల్పీ ఉపనాయకుడు టి.జీవన్‌రెడ్డి కేసీఆర్‌ను ప్రశ్నించారు. వాస్తు దోషం ఉందనే సాకుతో విశాలమైన, పటిష్టమైన సచివాలయ భవనాలను కూల్చేయవద్దంటూ కేసీఆర్‌కు గురువారం ఆయన లేఖ రాశారు. ఇప్పటికే అమరావతికి ఆంధ్రా సచివాలయం తరలివెళ్తున్న నేపథ్యంలో తెలంగాణకు మరో నాలుగు బ్లాకులు పెరుగుతాయని, దీనివల్ల సువిశాలమైన సదుపాయాలు, వసతులున్న సచివాలయం అందుబాటులో ఉంటుం దన్నారు. వాస్తుదోషం కారణంతో సచివాలయాన్ని కూల్చేసి, కొత్తది నిర్మించాలనే ప్రతిపాదన వల్ల ప్రజలపై కోట్లాది రూపాయల భారం పడుతుందన్నారు.