సాక్షి, హైదరాబాద్: మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్న సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డిని శుక్రవారం టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని పొన్నాల, మాజీమంత్రి శ్రీధర్‌బాబు అభిలషించారు. అలాగే, శుక్రవారం పుట్టినరోజు జరుపుకొన్న దామోదర రాజనర్సింహకు వారు శుభాకాంక్షలు తెలిపారు.