రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిన కేసీఆర్: జీవన్‌రెడ్డి | T. Jeevan Reddy Comments on CM KCR | Sakshi

రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిన కేసీఆర్: జీవన్‌రెడ్డి

Aug 26 2016 2:17 AM | Updated on Sep 27 2018 5:56 PM

రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిన కేసీఆర్: జీవన్‌రెడ్డి - Sakshi

రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిన కేసీఆర్: జీవన్‌రెడ్డి

రాష్ట్ర ప్రయోజనాలను సీఎం కేసీఆర్ మహారాష్ట్రకు తాకట్టుపెట్టారని సీఎల్పీ ఉపనాయకుడు టి.జీవన్‌రెడ్డి అన్నారు.

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రయోజ నాలను సీఎం కేసీఆర్ మహారాష్ట్రకు తాకట్టుపెట్టారని సీఎల్పీ ఉపనాయకుడు టి.జీవన్‌రెడ్డి అన్నారు. గురువారం ఇక్కడ ఆయన మాట్లాడు తూ.. తమ్మిడిహట్టి వద్ద 152 మీట ర్ల ఎత్తుతో ప్రాజెక్టు నిర్మాణం చేపడితే రాష్ట్రానికి ప్రయోజనం ఉండేదన్నారు. 152 మీటర్ల ఎత్తుతో 90 రోజులపాటు 160 టీఎంసీల నీటి వినియోగానికి ప్రతిపాదన, మహారాష్ట్ర ప్రభుత్వంతో సూత్రప్రాయ ఒప్పందం కూడా జరిగిందని, ప్రతిపక్షాలను నిందించినంత మాత్రాన వాస్తవాలు మారిపోవన్నా రు. రాష్ట్ర ప్రయోజనాల కోసం 152 మీటర్ల ఎత్తుతో ప్రాజెక్టు నిర్మించడానికి ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేసే ధైర్యం కేసీఆర్‌కు లేదన్నారు.

18 లక్షల ఎకరాలకు నీరు ఎలా ఇస్తారో, మరో 18 లక్షల ఎకరాలను ఎలా స్థిరీకరిస్తారో చెప్పాలన్నారు. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలు కేసీఆర్ అనాలోచిత నిర్ణయమన్నారు. అధికారం శాశ్వతం కాదని, అధికారంలో ఉన్నవారు ప్రజల పక్షాన ఆలోచించి ముందుచూపుతో వ్యవహరించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Video

View all
Advertisement