రాజమండ్రిలో కేసీఆర్ పై కేసు నమోదు!
రాజమండ్రిలో కేసీఆర్ పై కేసు నమోదు!
Published Sun, Aug 4 2013 8:26 PM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కే చంద్రశేఖరరావు (కేసీఆర్)పై తూర్పు, పశ్చిమ గోదావరి బార్ అసోసియేషన్, లాయర్ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) రాజమండ్రి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఆదివారం పిటిషన్ దాఖలు చేశారు.
ఇటీవల ఆంధ్రా ఉద్యోగులను దృష్టిలో ఉంచుకొని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఇంకా నిరసన కొనసాగుతునే ఉంది. హైదరాబాద్ లో పనిచేస్తున్న తెలంగాణేతర ఉద్యోగులపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా లాయర్ జేఏసీ కన్వీనర్ ముప్పాళ్ల సుబ్బారావు రాజమండ్రిలో కేసు నమోదు చేశారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజనను నిరసిస్తూ జేఏసీ మానవహారాన్ని ఏర్పాటు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ లో పనిచేస్తున్న తెలంగాణేతర ఉద్యోగులు ఆంధ్ర ప్రాంతానికి వెళ్లిపోవడం తప్ప మరో ఆప్షన్ లేదని ఆగస్టు 2 తేదిన కేసీఆర్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
Advertisement
Advertisement