టీడీపీ, జనసేన పార్టీ ల నుంచి భారీగా వలసలు
సీపీఎం నుంచి సైతం వైఎస్సార్‌సీపీలో చేరిక
సీఎం జగన్ పాలనను మెచ్చి చేరినట్టు వెల్లడి
గుమ్మలక్ష్మీపురం/పెదవేగి/ఉండి/నరసాపురం రూరల్/తణుకు అర్బన్: పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలానికి చెందిన టీడీపీ, జనసేన, సీపీఎం నుంచి నాయకులు, కార్యకర్తలు మంగళవారం పెద్దసంఖ్యలో వైఎస్సార్‌సీపీలో చేరారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఐదేళ్లలో అందించిన సంక్షేమ పాలనను మెచ్చి తామంతా కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి నేతృత్వంలో వైఎస్సార్‌సీపీలో చేరినట్టు ప్రకటించారు.
గుమ్మలక్ష్మీపురం ఎంపీపీ కుంబురుక దీనమయ్య, జెడ్పీటీసీ మండంగి రాధిక, రజక కార్పొరేషన్ డైరెక్టర్ గోరిశెట్టి గిరిబాబు, వైస్ ఎంపీపీ నిమ్మక శేఖర్, లక్ష్మణరావు ఆధ్వర్యంలో కేదారిపురం, డుమ్మంగి, పెదఖర్జ, తోలుఖర్జ, ఎల్విన్‌పేట, గుమ్మలక్ష్మీపురం, లక్కగూడ, చాపరాయి బిన్నిడి గ్రామాలకు చెందిన 200 కుటుంబాల వారు వైఎస్సార్‌సీపీలో చేరారు.
వీరికి పార్వతీపురం మన్యం జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహా్వనించారు. పార్టీ లో చేరిన వారిలో లక్కగూడ గ్రామానికి చెందిన టీడీపీసీనియర్ నాయకుడు బోగపురపు నాగు, కురుపాం మండలం పి.లేవిడికి చెందిన పత్తిక మోహన్‌దాసు, జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి కీలకపాత్ర పోషించిన వై.తారకేశ్వరరావుతోపాటు విశ్రాంత ఉద్యోగులు పార్టీ లో చేరారు.
దెందులూరులో టీడీపీకి షాక్
ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రవర్తనతో విసుగు చెందిన టీడీపీ సీనియర్ నాయకులు పాలడుగు భానుప్రకాష్ మంగళవారం ఆ పార్టీ కి రాజీనామా చేశారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు.
భానుప్రకాష్ తోపాటు టీడీపీ నాయకులు కమ్మ రాజారావు, కండేపు బాబూరావు, పిట్టా రవి వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. కాగా.. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలోని కూర్మారావుపేటలో 30 మంది మహిళలు, గౌడపేటలో 25 మంది టీడీపీ, జనసేన కార్యకర్తలు మంగళవారం వైఎస్సార్‌సీపీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే అభ్యర్థి పీవీఎల్ నరసింహరాజు పార్టీ కండువాలు కప్పి సాదరంగా వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వానించారు.
తణుకులో భారీగా చేరికలు
పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలోని 25, 27, 30 వార్డులకు చెందిన 200 మంది టీడీపీ, జనసేన కార్యకర్తలు పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. వారందరికీ మంత్రి కారుమూరి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ చిట్టూరి శ్రీవెంకట సుబ్బారావు, వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు మంగెన సూర్య తదితరులు పాల్గొన్నారు
జనసేన నుంచి వైఎస్సార్‌సీపీలోకి...
పశ్చిమ గోదావరి జిల్లా పెదమైనవానిలంకలో అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ తిరుమాని నాగరాజు ఆధ్వర్యంలో జనసేన నుంచి నాయకులు పెద్దఎత్తున వైఎస్సార్‌సీపీలో చేరారు. ప్రభుత్వ చీఫ్ విప్, నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు వీరికి పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. పార్టీ లో చేరిన వారిలో సంకరపు పాండురంగారావు, వాతాడి హరిచంద్ర, బొడ్డు సోమరాజు, మైలా శాంతారావు, మైలా లక్ష్మీనరసింహ (నాని), సంకరపు విష్ణు, ఒడుగు సురేష్ తదితరులు జనసేన నుంచి వైఎస్సార్‌సీపీలో చేరారు.
Comments
Please login to add a commentAdd a comment