కేసీఆర్ పై కరుణానిధి ప్రశంసల వర్షం
కేసీఆర్ పై కరుణానిధి ప్రశంసల వర్షం
Published Sun, Jun 1 2014 10:10 PM | Last Updated on Wed, Aug 15 2018 9:20 PM
చెన్నై: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేయనున్న టీఆర్ఎస్ అధినేత కే చందశేఖరరావు(కేసీఆర్)కు డీఎంకే అధ్యక్షుడు కే. కరుణానిధి అభినందనలు తెలిపారు. 'తాజా ఎన్నికల్లో పార్టీని విజయం వైపుకు నడిపించి.. ముఖ్యమంత్రి పదవి చేపడుతున్న కేసీఆర్ కు నా అభినందనలు' అని కరుణానిధి అన్నారు. 'మీ ఎత్తుగడలు, కఠోర శ్రమ, అకుంఠిత దీక్షను తెలంగాణ ప్రజలు గుండెల్లో ఉంచుకుంటారు' అని ఆయన ఓ ప్రకటనలో వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం 2004లో తనని కలిసి చర్చించిన విషయాన్ని కరుణానిధి గుర్తు తెచ్చుకున్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా.. లక్ష్యాన్ని కేసీఆర్ చేరుకున్నారని కేసీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించారు.
కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రాంతం అభివృద్దిని సాధిస్తుందని.. శాంతియుతమైన పాలన ఉంటుందనే విశ్వాసాన్ని కరుణానిధి వ్యక్తం చేశారు. 29వ రాష్ట్రంగా తెలంగాణ జూన్ 2 తేదిన అవతరిస్తున్న సంగతి తెలిసిందే.
Advertisement
Advertisement