నేడు సీఎం రాక | cm kcr arrival to warngal | Sakshi
Sakshi News home page

నేడు సీఎం రాక

Published Thu, Mar 24 2016 1:58 AM | Last Updated on Wed, Aug 15 2018 9:30 PM

నేడు సీఎం రాక - Sakshi

నేడు సీఎం రాక

వరంగల్ : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు గురువారం వరంగల్‌కు వస్తున్నారు. మహబూబాబాద్ లోక్‌సభ సభ్యుడు అజ్మీరా సీతారాంనాయక్ కుమారుడి వివాహానికి  సీఎం కేసీఆర్ వస్తున్నట్ల టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్‌రావు తెలిపారు. కేసీఆర్ వరంగల్ పర్యటనపై ముఖ్యమంత్రి కార్యాలయం సైతం అధికారికంగా ప్రకటన జారీ చేసింది. శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో ఉదయం 11.30 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ బయలుదేరుతారు. 12.10 గంటలకు హన్మకొండలోని ఆర్ట్స్‌కాలేజీ మైదానంలోని హెలిపాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి కారులో హంటర్‌రోడ్టులోని విష్ణుప్రియ గార్డెన్స్‌లో జరిగే వివాహానికి హాజరవుతారు. వివాహం అనంతరం కారులో ఆర్ట్స్‌కాలేజీ మైదానంలోని హెలిపాడ్‌కు వెళ్తారు. మధ్యాహ్నం 1.10 గంటలకు హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు బయలుదేరుతారు.


మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్ కుమారుడి వివాహానికి సీఎం కేసీఆర్‌తోపాటు పలువురు ప్రముఖులు వస్తున్నారు. శాసనసభ స్పీకర్ ఎస్.మధుసూదనాచారి, ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, భారీనీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు, గిరిజన సంక్షేమ మంత్రి ఎ.చందులాల్, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరారావు, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తదితరులు వస్తున్నారు. వివాహంతోపాటు జిల్లాలో జరగనున్న పలు అధికారిక కార్యక్రమాల్లోనూ మంత్రులు పాల్గొననున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement