డ్రైవర్ కుమార్తె పెళ్లికి హాజరైన కేసీఆర్ | CM kcr attends his car driver daughter marriage | Sakshi
Sakshi News home page

డ్రైవర్ కుమార్తె పెళ్లికి హాజరైన కేసీఆర్

Published Fri, Nov 13 2015 1:48 PM | Last Updated on Wed, Aug 15 2018 9:30 PM

డ్రైవర్ కుమార్తె పెళ్లికి హాజరైన కేసీఆర్ - Sakshi

డ్రైవర్ కుమార్తె పెళ్లికి హాజరైన కేసీఆర్

శామీర్‌పేట: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం తన కారు డ్రైవర్ గరిపెల్లి బాలయ్య కుమార్తె వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. మెదక్ జిల్లా సిద్ధిపేట ప్రాంతానికి చెందిన గరిపెల్లి బాలయ్య కేసీఆర్ కారు డ్రైవర్‌గా పనిచేస్తూ హైదరాబాద్‌లో స్థిరపడ్డారు.

బాలయ్య కుమార్తె రమ్యకృష్ణ వివాహం గోదావరిఖని ప్రాంతానికి చెందిన రాజారాం మల్లేశ్‌తో శుక్రవారం శామీర్‌పేట మండలం దేవరయాంజల్‌లోని కల్యాణ మండపంలో జరిగింది. వివాహ సుముహూర్తం 11 గంటలు కాగా, సీఎం కేసీఆర్ తన సతీమణితో కలసి పది నిమిషాలు ముందే కల్యాణ మండపానికి  చేరుకుని వధూవరులను ఆశీస్సులు అందజేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement