AP CM YS Jagan Attends TS Speaker Pocharam Srinivas Reddy Grand Daughter Marriage - Sakshi
Sakshi News home page

ఒకే వేదికపై రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు.. 

Published Sun, Nov 21 2021 1:15 PM | Last Updated on Sun, Nov 21 2021 8:10 PM

AP CM YS Jagan Attends TS Speaker Pocharam Grand Daughter Marriage - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి మనవరాలు స్నిగ్దా రెడ్డి వివాహం.. ఓఎస్‌డీ కృష్ణమోహన్‌రెడ్డి కుమారుడు రోహిత్‌ రెడ్డితో వీఎన్‌ఆర్‌ ఫామ్స్‌లో ఆదివారం ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్‌, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. ఒకరినొకరు పలకరించుకున్న ఇరు రాష్ట్రాల సీఎంలు ఒకే వేదిక మీద.. పక్కపక్కన కూర్చుని కాసేపు ముచ్చటించుకున్నారు. అనంతరం వేదిక మీదకు వెళ్లి వధువరూలను ఆశీర్వదించారు. 

ఈ వివాహ వేడుకకు వైఎస్‌ విజయమ్మతో పాటు ఇరు రాష్ట్రాల నుంచి పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అలానే ఏపీ స్పీకర్‌ తమ్మినేని కూడా హాజరయ్యారు. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement