చట్టం అమలు చేయమనడం తప్పా: జీవన్
సాక్షి, హైదరాబాద్: మల్లన్నసాగర్ రిజర్వాయర్ కోసం భూములు కోల్పోతున్న నిర్వాసితులకు భూసేకరణ చట్టం-2013 ప్రకారం పునరావాసం కల్పించాలని కోరడం తప్పా అని సీఎల్పీ ఉపనాయకుడు టి.జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. అసెంబ్లీ ఆవరణలో మంగళవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ మల్లన్నసాగర్ ముంపు గ్రామాల్లో ప్రభుత్వం నియంతృత్వ పోకడలతో వ్యవహరిస్తోందని విమర్శించారు. మల్లన్నసాగర్‌లో రైతులకు జరుగుతున్న నష్టానికి ప్రతిపక్ష పార్టీలన్నీ సంఘీభావం తెలుపుతున్నాయని, దీనికే టీడీపీతో కలసిపోయినట్టుగా టీఆర్‌ఎస్ నేతలు మాట్లాడటం సరికాదన్నారు. ఓటుకు కోట్లు కేసులో టీడీపీతో టీఆర్‌ఎస్ మధ్య క్విడ్ ప్రోకో జరిగిందని ఆయన ఆరోపించారు.