అధికార దాహంతో కుట్ర | mp bura narasiah gowd fire on Opposition | Sakshi
Sakshi News home page

అధికార దాహంతో కుట్ర

Published Thu, Jul 28 2016 3:17 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

అధికార దాహంతో కుట్ర - Sakshi

అధికార దాహంతో కుట్ర

ప్రతిపక్షాలపై మండిపడ్డ  ఎంపీ బూర నర్సయ్య గౌడ్
ఎన్ని అడ్డంకులు సృష్టించినా ‘మల్లన్నసాగర్’ పూర్తి చేస్తాం

 

న్యూఢిల్లీ: మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణం విషయంలో ప్రతిపక్షాలు కుట్రలు పన్నుతున్నాయని టీఆర్‌ఎస్ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ మండిపడ్డారు. అధికార దాహంతోనే కాంగ్రెస్, టీడీపీలు.. ప్రాజెక్ట్ ముంపు బాధితులను రె చ్చగొడుతున్నాయని ఆయన విమర్శించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రాజెక్టును పూర్తి చేసి మెదక్, నిజామాబాద్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల పరిధిలో 18 లక్షల ఎకరాలకు సాగునీరందిస్తామన్నారు. ముంపుప్రాంతాలు లేకుండా ఏ ప్రాజెక్టును నిర్మించలేమని, అలా నిర్మించిన ప్రాజెక్టులు దేశంలో ఏమైనా ఉంటే చూపించాలని ప్రతిపక్షాలకు ఆయన సవాల్ విసిరారు.

ప్రాజెక్ట్ ముంపు బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు. ముంపు బాధితులకు డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు చేయడంతోపాటు అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. పులిచింతల ప్రాజెక్ట్ వల్ల 12 వేల కుటుం బాలు నిర్వాసితులైన విషయాన్ని కాంగ్రెస్ నాయకులు మరిచారా అని నర్సయ్య ప్రశ్నించారు. రాజధాని నిర్మాణం పేరుతో ఏపీలో వేల ఎకరాలను రైతుల నుంచి బలవంతంగా లాక్కుంటున్న టీడీపీ.. తెలంగాణలో నీతులు చెప్పడం సరికాదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement