
'టి.ప్రభుత్వం వద్ద అంత భూమి లేదు'
హైదరాబాద్: దళితులకు భూమి ఇవ్వడంతోనే ప్రభుత్వం చేతులు దులుపుకోకుండా వ్యవసాయం చేసుకునేందుకు సాగునీరు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఉపాధి అవకాశాలు కల్పించడంపైనా కూడా ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు. అయితే కొద్దిమందికి మాత్రమే భూములు పంపిణీ చేయడాన్ని ఆయన తప్పుబట్టారు.
తెలంగాణలో భూమిలేని దళిత కుటుంబాలు 8 లక్షలు ఉన్నాయని తెలిపారు. ఇంతమందికి పంచాలంటే 24 లక్షల ఎకరాలు కావాలని, ఇవ్వడానికి ప్రభుత్వం వద్ద అంత భూమి లేదన్నారు. ఇంతభూమి కొనుగోలు చేయలంటే రూ. లక్షా 20 వేలకోట్లు కావాలని తెలిపారు. కాబట్టి ప్రభుత్వం దళితులను మభ్యపెట్టకుండా వారిని ఆదుకోవాలని జీవన్రెడ్డి కోరారు.