land for dalits
-
దళితులకు మూడెకరాల భూమి ఏమైంది?
సాక్షి, సైదాపూర్(కరీంనగర్): దళితులకు మూడెకరాల భూమి పంపిణీ చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఏమైందని కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు చాడ కొండాల్‌రెడ్డి, సీపీఐ జిల్లా సభ్యుడు బత్తుల బాబు ప్రశ్నించారు. మండల కేంద్రంలో సోమవారం వేర్వేరు సమావేశాల్లో మాట్లాడుతూ.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పేదల బలహీనతలను గుర్తించి ఆశల పథకాలతో గెలవడం కేసీఆర్‌కు పరిపాటి అయిందన్నారు. గతంలో ప్రకటించిన మూడెకరాల భూమికంటే రూ.10 లక్షలు ఎక్కువ కాదని, ఆ డబ్బులకు మూడెకరాల్లో ప్రస్తుతం 10 గుంటల భూమి కూడా రాదన్నారు. మూడెకరాలు ఇస్తే రూ.60 లక్షలు అవుతుందని గమనించి, రూ.10 లక్షల నగదు ఇస్తామని దళితులను మోసం చేస్తున్నారన్నారు. దళితులకు టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని దళిత సమాజం గమనిస్తుందన్నారు. ఈ పథకం హుజూరాబాద్ ఎన్నికల వరకే ఉంటుందన్నారు. -
'టి.ప్రభుత్వం వద్ద అంత భూమి లేదు'
-
'టి.ప్రభుత్వం వద్ద అంత భూమి లేదు'
హైదరాబాద్: దళితులకు భూమి ఇవ్వడంతోనే ప్రభుత్వం చేతులు దులుపుకోకుండా వ్యవసాయం చేసుకునేందుకు సాగునీరు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఉపాధి అవకాశాలు కల్పించడంపైనా కూడా ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు. అయితే కొద్దిమందికి మాత్రమే భూములు పంపిణీ చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. తెలంగాణలో భూమిలేని దళిత కుటుంబాలు 8 లక్షలు ఉన్నాయని తెలిపారు. ఇంతమందికి పంచాలంటే 24 లక్షల ఎకరాలు కావాలని, ఇవ్వడానికి ప్రభుత్వం వద్ద అంత భూమి లేదన్నారు. ఇంతభూమి కొనుగోలు చేయలంటే రూ. లక్షా 20 వేలకోట్లు కావాలని తెలిపారు. కాబట్టి ప్రభుత్వం దళితులను మభ్యపెట్టకుండా వారిని ఆదుకోవాలని జీవన్‌రెడ్డి కోరారు.