
'మోదీ మెప్పు కోసమే చండీయాగం'
కరీంనగర్: ప్రధాని నరేంద్ర మోదీ మెప్పు కోసమే తెలంగాణ సీఎం కేసీఆర్.. ఆయుత చండీయాగం నిర్వహిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే టి. జీవన్ రెడ్డి ఆరోపించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ఎన్డీఏ కూటమిలో కలిసిపోవడానికే చండీ యాగం తలపెట్టారని అన్నారు.
ఈ కార్యక్రమం ప్రభుత్వపరంగానా లేదా వ్యక్తిగతంగా నిర్వహిస్తున్నారా అనేది కేసీఆర్ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. సెక్యులర్ రాష్ట్రంలో ప్రభుత్వ పరంగా యాగాలకు, పూజలకు అవకాశముందా అని ప్రశ్నించారు. తన మొక్కు తీర్చుకోవడానికి దేవుళ్లకు కేసీఆర్ నగలు సమర్పించిన విషయాన్ని జీవన్ రెడ్డి గుర్తు చేశారు.