
'చంద్రబాబుతో స్నేహం మానుకోండి'
హైదరాబాద్: పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని నిర్మించవద్దంటూ కేంద్రానికి లేఖ రాఖ రాయడం ద్వారా చంద్రబాబు మరోసారి తెలంగాణ వ్యతిరేకి అని రుజువైందని కాంగ్రెస్ నేతలు టి. జీవన్రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. తెలంగాణ టీడీపీ నాయకులకు చీము నెత్తురు ఉంటే ఆ పార్టీ నుంచి బయటకు రావాలన్నారు. లేదంటే చంద్రబాబుతో లేఖను ఉపసంహరింపజేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ బీజేపీ నాయకులు కూడా చంద్రబాబు స్నేహాన్ని వీడాలని సూచించారు. తెలంగాణకు న్యాయం జరిగేలా కేంద్రాన్ని ఒప్పించాలని కోరారు. పలు అంశాల్లో తెలంగాణ ప్రయోజనాలకు అడ్డుపడుతూ చంద్రబాబు తెలంగాణ ద్రోహిగా మిగిలారని మండిపడ్డారు. బీబీ నగర్ నిమ్స్ ఆస్పత్రిని పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.