రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన కేసీఆర్: జీవన్ రెడ్డి
హైదరాబాద్: గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా కేసీఆర్ స్వయంగా పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నారని సీఎల్పీ ఉప నాయకుడు టి. జీవన్ రెడ్డి ఆరోపించారు. నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి టీఆర్ఎస్ లో చేర్చుకుని రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని అన్నారు. మంగళవారం సాయంత్రం తెలంగాణ కాంగ్రెస్ నాయకులు గవర్నర్ నరసింహన్ ను కలిశారు.
అనంతరం జీవన్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్న కేసీఆర్ ను సీఎం పదవికి అనర్హుడిగా ప్రకటించాలని గవర్నర్ ను కోరినట్టు జీవన్ రెడ్డి తెలిపారు. చట్టపరంగా చర్యలు చేపడతానని గవర్నర్ తమకు హామీయిచ్చారని చెప్పారు. టీఆర్ఎస్ కు ప్రజల్లో ఆదరణ ఉంటుందనుకుంటున్న కేసీఆర్ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలని సూచించారు.