రాష్ట్ర గవర్నర్ నరసింహన్ దంపతులు బుధవారం ఉదయం ఓటు వేశారు.
హైదరాబాద్ : రాష్ట్ర గవర్నర్ నరసింహన్ దంపతులు బుధవారం ఉదయం ఓటు వేశారు. గవర్నర్, ఆయన సతీమణి విమలా నరసింహన్ ఖైరతాబాద్ ఎంఎస్ మక్తాలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా నరసింహన్ ఓటు వేసే క్రమంలో ఈవీఎం మెరాయించటంతో అధికారులు ఈవీఎంను సరిచేసారు. అనంతరం గవర్నర్ దంపతులు ఓటు వేశారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ ఓటు హక్కు ఎంతో విలువైనదని, దాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు.
ఓటు హక్కు వినియోగించుకున్న పలువురు రాజకీయ నేతలు
*ఖైరతాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయారెడ్డి ఫిల్మ్ నగర్లో ఓటు వేశారు.
*చిక్కడపల్లిలో సీపీఎం నేత రాఘవులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
*బీజేపీ అభ్యర్థి డాక్టర్ లక్ష్మణ్ చిక్కడపల్లిలో ఓటు వేశారు.
*బర్కత్పురాలో బీజేపీ నేత కిషన్ రెడ్డి ఓటు వేశారు.
* డీజీపీ ప్రసాదరావు మసబ్ ట్యాంక్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.