ఓటుహక్కు వినియోగించుకున్న సెలబ్రిటీలు
హైదరాబాద్ : పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఓటు వేశారు. జూబ్లీహిల్స్లోని పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోవైపు సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఎన్టీఆర్తో పాటు ఆయన తల్లి షాలిని కూడా ఓటు వేశారు. అలాగే నాగార్జున, సుమంత్, గీతా మాధురి, రామానాయుడు, సురేష్ బాబు, సి. నారాయణరెడ్డి తదితరులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే కేంద్ర మంత్రి చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ, కుమారుడు రామ్ చరణ్ ఓటు వేసారు. దర్శకుడు తేజ, ఆయన సతీమణి, రాజమౌళి, ఆయన భార్య రమా రాజమౌళి, కుమారుడు ఓటు హక్కు వేసుకున్నారు.
సెలబ్రిటీ పోలింగ్ కేంద్రాలివే..
ఈ ఎన్నికల్లో నగర ప్రముఖులు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని గత కొద్ది రోజులుగా ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లు భారీ ప్రచారం చేస్తున్నందున చాలామంది ఈసారి ఓటు వేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖులు ఓటేసే కేంద్రాలు సెలబ్రిటీ పోలింగ్ కేంద్రాలుగా ప్రాముఖ్యత సంతరించుకోనున్నాయి. ప్రముఖుల్లో ఎవరెవరు ఎక్కడెక్కడ ఓటు వినియోగించుకుంటున్నారంటే...
ప్రముఖులు పోలింగ్ కేంద్రం
టీడీపీ అధినేత చంద్రబాబు, భువనేశ్వరి, లోకేష్ - జూబ్లీహిల్స్ రోడ్ నెం.45లోని బీఎస్‌ఎన్‌ఎల్ ఆఫీసు
కేంద్ర మంత్రి చిరంజీవి, రాంచరణ్ తేజ్ - జూబ్లీహిల్స్ క్లబ్ పోలింగ్ కేంద్రం
సినీ నటుడు బాలకృష్ణ - జూబ్లీహిల్స్ రోడ్ నెం.45లోని బీఎస్‌ఎన్‌ఎల్ ఆఫీసు
మాజీ డీజీపీ దినేశ్‌రెడ్డి - జూబ్లీహౌస్ హౌసింగ్ సొసైటీ పోలింగ్ స్టేషన్ నెం. 142
లోక్‌సత్తా అధినేత జేపీ - ఎర్రమంజిల్‌లోని సివిల్ సప్లయ్స్ బిల్డింగ్
కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు - జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45లోని మహిళా ఆర్థిక సహకార సంస్థ
జనసేన అధినేత, హీరో పవన్‌కల్యాణ్ - గాయత్రి హిల్స్‌లోని లిటిల్‌స్టార్ స్కూల్
హీరోలు మోహన్‌బాబు, విష్ణు, మనోజ్, లక్ష్మి - జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ పోలింగ్ కేంద్రం
హీరో మహేష్‌బాబు, నమ్రతా శిరోద్కర్ - జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ పోలింగ్ కేంద్రం
హీరో నాగార్జున, అక్కినేని అమల - జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45లోని మహిళా ఆర్థిక సహకార సంస్థ
నిర్మాత రామానాయుడు, వెంకటేష్ - ఫిలింనగర్ క్లబ్ పోలింగ్ కేంద్రం
జూనియర్ ఎన్టీఆర్ - జూబ్లీహిల్స్ క్లబ్ పోలింగ్ కేంద్రం
జిల్లా ఎన్నికల అధికారి, సోమేశ్‌కుమార్ - రాజేంద్రనగర్ ఏవీఎం స్కూల్ పోలింగ్ స్టేషన్ నెం. 171