వెళ్లామా.. ఓటేసేమా.. వచ్చామా కాదు!
పోలింగ్ బూత్‌కి వెళ్లామా.. ఓటేసేమా.. వచ్చామా.. ఈ మాదిరి కాదు.. ఎవరికి ఓటేస్తున్నాం.. ఎలాంటి వాళ్లను ఎన్నుకుంటున్నాం... మన జీవితాలను, దేశ, రాష్ట్రాల ప్రగతిని ప్రభావితం చేసే సమర్థులైన నేతలనే ఎన్నుకుంటున్నామా.. అని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. డబ్బు, ప్రలోభాలకు ఓటును అమ్మేసి మన భవిష్యత్తును పణంగా పెట్టొద్దు.
ఇక ఓటేసేందుకు ఎండలో బయటకేం వెళ్తాం అనుకుని పోలింగ్ నాడు సెలవురోజుగా భావించి ఇంట్లో పిల్లాపాపలతో, టీవీ, ఇంటర్‌నెట్‌లతో కాలక్షేపం చేసే బాపతు చాలామంది ఉంటారు.. అలాంటి వారి పట్ల విదేశాల్లో కఠినంగా వ్యవహరించే చట్టాలున్నాయి. కానీ మన వద్ద లేవు. అలాంటి చట్టాలకు మన భారత్‌లో పని లేకుండా దేశ పౌరులుగా కనీస కర్తవ్యంగా భావించి ప్రతి ఒక్కరూ ఓటేసేందుకు ముందుకు కదలాలి. - విమలా రామన్, హీరోయిన్