బ్రహ్మానందం దంపతుల ఓట్లు గల్లంతు | comedian Brahmanandam name missing from voters' list | Sakshi
Sakshi News home page

బ్రహ్మానందం దంపతుల ఓట్లు గల్లంతు

Published Wed, Apr 30 2014 12:32 PM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM

బ్రహ్మానందం దంపతుల ఓట్లు గల్లంతు - Sakshi

బ్రహ్మానందం దంపతుల ఓట్లు గల్లంతు

హైదరాబాద్ : బాధ్యత గల పౌరుడిగా ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని  ప్రచారం చేసిన సినీ నటుడు బ్రహ్మానందంకు చేదు అనుభవం ఎదురైంది. బ్రహ్మానందం కుటుంబ సభ్యుల ఓట్లు గల్లంతు అయ్యాయి. దాంతో వారు తమ ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. ఓటు హక్కు వినియోగించుకోవాలని బ్రహ్మానందం ఎన్నికల సంఘం ప్రచారం చేసిన విషయం తెలిసిందే.

బ్రహ్మానందం దంపతులు జూబ్లీహిల్స్లో ఓటు వేసేందుకు  జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ పోలింగ్ కేంద్రానికి వచ్చారు. అయితే ఓటర్ల జాబితాలో తన ఓటు గల్లంతైపోయినట్టు తెలుసుకున్న ఆయన అవాక్కయిపోయాడు. మరోసారి పరిశీలించమని బ్రహ్మానందం ఎన్నికల సిబ్బందిని కోరారు. అయినా ఫలితం లేకపోవటంతో వారు ఓటు వేయకుండానే వెనుదిరిగారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement