votes missing
-
ఓట్లను తొలగిస్తున్నారు
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ కుట్రపూరితంగా ఓట్లను పెద్ద సంఖ్యలో తొలగిస్తోందని అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలో ఆప్ ప్రతినిధి బృందం బుధవారం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. దళితులు, ఎస్పీలు, పూర్వాంచల్‌కు చెందిన బలహీనవర్గాల ఓట్లను బీజేపీ పనిగట్టుకొని తొలగించేలా చేస్తోందని కేజ్రీవాల్ ఆరోపించారు. ‘భారత పౌరులుగా ప్రజలకు ఉన్న ఓటు హక్కును బీజేపీ లాగేసుకుంటోంది. ఓటర్లను తొలగించడానికి బీజేపీ కార్యకర్తలకు దరఖాస్తు ఫారాలను అందించింది. చాలా నియోజకవర్గాల్లో ఇది జరుగుతోంది’ అని కేజ్రీవాల్ అన్నారు. భారత పౌరులుగా ప్రజలకున్న హక్కులను బీజేపీ లాగేస్తోందని ఆరోపించారు. ఢిల్లీలో చాలా నియోజకవర్గాల్లో ఈ విధంగా ఓట్లను తొలగిస్తున్నారని ధ్వజమెత్తారు. ఓట్ల తొలగింపునకు సంబంధించి ఈసీకి మూడు వేల పేజీల ఆధారాలను సమర్పించామని కేజ్రీవాల్ తెలిపారు. భారీస్థాయిలో ఓట్ల తొలగింపు జరుగుతోందన్నారు. దీన్ని అడ్డుకోవాలని, ఓట్ల తొలగింపునకు దరఖాస్తు చేసిన వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. షాహ్దారా నియోజకవర్గంలో ఒక బీజేపీ నాయకుడు ఏకంగా 11,008 ఓట్లను తొలగించాలని ఈసీకి ఒక జాబితాను సమర్పించారని, ఈసీ రహస్యంగా వీటిని తొలగించే పనిలో ఉందని ఆరోపించారు. పెద్ద ఎత్తున ఓట్ల తొలగింపు ఉండదని ఈసీ తమకు హామీ ఇచ్చిందని వెల్లడించారు. ఇప్పటివరకు తొలగించిన ఓట్లపై దృష్టి పెడతామని, బూత్‌స్థాయి అధికారితో విచారణ జరిపిస్తామని తెలిపిందన్నారు. ఢిల్లీ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. -
రాత్రికి రాత్రే నా ఓట్లు మాయం..
వాషింగ్టన్: ఎన్నికలు జరిగిన రాత్రికి రాత్రే తన ఓట్లు అనూహ్యంగా అదృశ్యమయ్యాయని, అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇలా అదృశ్యమైన అనేక ఓట్లను గుర్తించినట్లు మీడియాకి తెలిపారు. రాత్రి పదిగంటలకు తన విజయం తథ్యమని, తాను అత్యంత సులభంగా గెలుస్తానని అంతా చెప్పారు. అయితే హఠాత్తుగా తన ఓట్లు మాయమవడం ప్రారంభమైందన్నారు. డెమొక్రటిక్ పార్టీకి చెందిన జో బైడెన్ ట్రంప్‌పై గెలిచినప్పటికీ ట్రంప్ తన ఓటమిని అంగీకరించకుండా సాకులు వెతుకుతున్న విషయం తెలిసిందే. -
ఓటు సిరామరక కాదు.. మన హక్కు
ప్రజలందరికీ ఓటుహక్కు కోసం పోరాడిన బాబాసాహెబ్ అంబేడ్కర్ సార్వత్రిక ఓటింగ్ హక్కు ప్రాథమిక హక్కుల్లో ఉండాలని ప్రతిపాదించారు. కానీ సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ లాంటి వాళ్ళు ఒప్పుకోకుండా ఆర్టికల్ 326గా ఉంచారు. దాని ఫలితాన్ని మనం ఈనాటికీ అనుభవించాల్సి వస్తోంది. ఆ ఒక్కతప్పిదం కారణంగానే అధికారపక్షం ఇష్టారాజ్యంగా ఓట్లను గల్లంతు చేసే పరిస్థితులేర్పడ్డాయి. ఓటు హక్కును ప్రాథమిక హక్కుల్లో చేర్చి ఉంటే కులం పేరుతోనో, మతం పేరుతోనో, తమ వర్గం కాదనో, తమ పార్టీకి చెందిన వాళ్ళు కారనో అవలీలగా వేల సంఖ్యలో ఓట్లను గల్లంతుచేసే దుస్సాహసానికి ఒడిగట్టేవారు కాదు. మగధ రాజ్యంలోని రాజగృహంలో విశ్రాంతి తీసుకొంటున్న శాక్యముని గౌతమ బుద్ధుని దగ్గరికి మగధ దేశరాజు ప్రసేనజిత్తు తన ప్రధాన వస్సకరను పంపించారు. ‘‘వజ్జి రిపబ్లిక్ మీద దాడిచేసి వాళ్ళకు తగు గుణపాఠం చెప్పాలని ప్రసేన జిత్తుకు ఆలోచన ఉందని, ఆ విష యమై మీ సలహా కావాలని రాజు కోరుతున్నారు.’’ అని వస్సకర బుద్ధునితో ప్రస్తావించారు. వజ్జి రిపబ్లిక్ స్వతంత్రంగా పాలన సాగి స్తున్నది. అందువల్ల దానిని జయించి, మగధలో కలుపుకోవాలని ప్రసేన జిత్తు పథకం వేశారు. వస్సకర అడిగిన సలహాకు గౌతమ బుద్దుడు నేరుగా సమాధానం చెప్పలేదు కానీ తన ప్రథమ శిష్యుడైన ఆనందునితో చర్చించాడు. ఈ çసందర్భంగా గౌతమ బుద్ధుడు ఆనందుడిని ఏడు ప్రశ్నలు అడిగాడు. అవి... 1) వజ్జి రిపబ్లిక్ ప్రజలు క్రమం తప్పకుండా సమావేశాలు జరుపుతుంటారా? 2) ఏకపక్షంగా కాకుండా చర్చల ద్వారా సమష్టి నిర్ణయాలు తీసుకుంటారా? 3) మోసంతో కాకుండా, మంచి మార్గంలో వ్యాపారాలను, వృత్తులను సాగిస్తున్నారా? 4) ఒకసారి సమష్టిగా తీసు కున్న నిర్ణయాలను ఉల్లంఘన లేకుండా అమలు చేస్తున్నారా? 5) పెద్దలను గౌరవించి, వారి మాటలకు విలువనిస్తున్నారా? పూర్వకాలం నుంచి తమ పెద్దలు నిర్మించిన ప్రార్థనామందిరాలను కాపాడుకుంటు న్నారా? 6) మహిళలనూ, పిల్లలనూ గౌరవిస్తూ, బాధ్యతగా చూసుకుం టున్నారా? 7) జ్ఞానులకు, గురువులకు రక్షణ కల్పిస్తూ, వారిని గౌర విస్తూ వారు సూచించిన మార్గాలను అనుసరిస్తున్నారా? అని బుద్దుడు, ఆనందుడిని ప్రశ్నించారు. దానికి ఆనందుడు ‘అవును’ అని సమాధా నమిచ్చాడు. మీరు అడిగిన విషయాలన్నింటిలోనూ వారు అగ్రగామి గానే ఉన్నారని ఆనందుడు బదులిచ్చాడు. ఇది విన్న బుద్ధుడు ‘‘వజ్జి ప్రజలు ఆ విషయాలను పాటిస్తున్నంత కాలం వారిది ప్రగతి పథమే తప్ప వారికి పతనం అనేదే లేదని తేల్చి చెపుతాడు. వారిని ఎవరూ జయించలేరని కూడా స్పష్టం చేస్తాడు. మగధరాజు ప్రసేన జిత్తు ప్ర«ధాని వస్సకరకు బుద్ధుని అంతరంగం అర్థమైపోయింది. అదే విషయాన్ని మగధ రాజుకు చెప్పి, వజ్జి రిపబ్లిక్ మీద దాడిని నిలిపి వేశారు. ఒకదేశం గానీ, రాజ్యంగానీ, ప్రాంతంగానీ ప్రగతిదారిలో వెళ్లా లన్నా, విజేతగా నిలబడాలన్నా ప్రజలే కేంద్రబిందువుగా పరిపాలన సాగాలి. అదేవిధంగా పాలనలో ప్రజలు భాగస్వాములు కావాలి. పాలకులకు ప్రజల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా ఉండాలి. ప్రజాక్షేమం కోసమే రాజ్యాలు, ప్రభుత్వాలు పనిచేయాలనేది బుద్ధుడి బోధన ఉద్దేశ్యం. ఇటువంటి పాలన కోసం ప్రపంచ చరిత్రలోనూ, భారత రాజకీయ ప్రస్తానంలోనూ ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. అటువంటి అనుభవాన్నే మనకు సామ్రాట్ అశోకుని పాలన కూడా అందించింది. అయితే చాలా వందల ఏళ్ళు మన దేశాన్ని నియంతృత్వం, అరాచకం రాజ్యమేలాయి. వాటన్నింటినీ దాటుకొని, అనేకానేక అవరోధాలను అధిగమించి ఈ రోజు భారతదేశం ప్రజాస్వామ్య వ్యవస్థలో తన మను గడను కొనసాగిస్తున్నది. అయితే ఇందులో కూడా అనేక లోపాలూ, పరిమితులూ ఉండవచ్చు కానీ ప్రజాస్వామ్య ఆలోచనలతో ఒక నిర్మా ణాత్మకమైన రాజ్యాంగం వెలుగులో మనం పాలన సాగిస్తున్నామన్నది మాత్రం వాస్తవం. అలాంటి ప్రజాస్వామ్య మనుగడకు ఎన్నికల ప్రక్రియ కీలకం. అందులో భాగంగానే మన దేశ పార్లమెంటులో భాగమైన లోక్ సభకు పదిహేడవ సారి ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో ఓటింగ్ ఒక ముఖ్యమైన అంశం. మన దేశంలో ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైన సమయంలో ఓటు హక్కు అందరికీ లేదు. అది కొందరి హక్కుగానే ఉండేది. మనదేశంలో మొదటిసారిగా 1920లో ఎన్నికలు జరిగాయి. అప్పుడు కేవలం విద్యావంతులూ, భూములూ, వ్యాపారాలూ, ఆస్తిపా స్తులూ ఉన్న వాళ్ళకు మాత్రమే ఓటు హక్కు ఉండేది. అయితే సామా న్యుడి ఓటు హక్కుకోసం సార్వత్రిక ఒటింగ్ (వయోజన ఓటింగ్) వచ్చేవరకూ నిరంతరం తపించిన మహానుభావుడు అంబేడ్కర్. భారత ప్రజలను పాలనలో భాగస్వాములను చేయాలనే ఉద్దే శ్యంతో బ్రిటిష్ పాలకులు సౌత్‌బరో అనే రాజకీయ నిపుణుని నాయ కత్వంలో 1919లో ఒక కమిటీని వేశారు. ఆ కమిటీ సిఫారసులకు అను గుణంగా బ్రిటిష్ పాలకులు 1920లో ఎన్నికలు నిర్వహించారు. అంట రాని కులాలలో పుట్టి అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయంలో ఉన్నత చదువును అభ్యసించి, తన జాతి రక్షణే జీవిత లక్ష్యంగా తుది శ్వాస వరకూ పోరాడిన వ్యక్తి డాక్టర్ బీ.ఆర్. అంబేడ్కర్. కేవలం 28 ఏళ్ల వయస్సులో తన జాతి జనుల విముక్తికోసమే కాక దేశంలోని అన్ని వర్గాల ప్రజలకోసం పరితపించారు అంబేడ్కర్. 1919లో సౌత్‌బరో కమి టీకి సమర్పించిన వినతిపత్రంలో యువ అంబేడ్కర్ తన ప్రజాస్వామ్య తాత్వికతకు పునాదులు వేశారు. ఆ పునాదులే భారతదేశ ప్రజాస్వామ్య సాధనమైన రాజ్యాంగాన్ని రచించడానికి ఆధారమయ్యాయి. అవే పునా దులు నేటికీ మన దేశ ప్రజాస్వామ్య సౌధాన్ని నిలబెట్టడానికి సాధనా లవుతున్నాయి. ప్రజాస్వామ్యమంటే ప్రజలకు ప్రాతినిధ్యం ఉండాలనీ, ఏదో కొద్ది మందికి మాత్రమే ఉండే ఓటు హక్కు నియంతృత్వానికి, కొద్ది మంది ఆలోచనల ప్రకారమే పాలన సాగించే నిరంకుశ విధానానికీ మాత్రమే ఉపయోగపడుతుందనీ అంబేడ్కర్ వాదించారు. అంతేకాకుండా, అంట రానితనం, వివక్షతో తరతరాలుగా దాస్యాన్ని అనుభవిస్తున్న అణగారిన వర్గాలకు ప్రాతినిధ్యం ఉండాలని కూడా ఆయన వాదించారు. కానీ సౌత్ బరో కమిటీ ఆ ప్రాధాన్యతలను తోసిపుచ్చింది. ఆ తర్వాత 1928లో బ్రిటిష్ ప్రభుత్వం సర్ జాన్ సైమన్ ఛైర్మన్‌గా మరొక కమిటీని భార తదేశానికి పంపించింది. ఆ కమిషన్‌ను కాంగ్రెస్ పార్టీ బహిష్కరిం చింది. అయితే స్వాతంత్య్రం రావాలనే లక్ష్యంతో పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీ నమూనా రాజ్యాంగాన్ని తయారు చేయడానికి మోతీలాల్ నెహ్రూ నాయకత్వంలో 1928 మే నెలలో ఒక కమిటీని వేసింది. అందులో అన్ని పక్షాలకు అవకాశాలను కల్పించారు. సర్ అలీ అమన్, తేజ్ బహదూర్ సఫ్రూ, సుభాష్ చంద్రబోస్ సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీకి జవహర్ లాల్ నెహ్రూ కార్యదర్శిగా పనిచేశారు. ఇదే కమిటీలో జయకర్, అనీబి సెంట్ కొంత ఆలస్యంగా చేరారు. అయితే ఈ కమిటీ రూపొందించిన ముసాయిదా రాజ్యాంగంలో 21 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఆ తరువాత ఆ విషయం గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. కానీ బీఆర్ అంబేడ్కర్ 1928లో మళ్ళీ ఒకసారి సైమన్ కమిషన్ ముందు హాజరై అందరికీ ఓటు హక్కు కల్పించాలనే విషయమై మరింత శక్తివంతంగా వినిపించారు. అంతే కాకుండా 1930, 31 సంవత్సరాలలో లండన్‌లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశాల్లో అణగారిన వర్గాలతోపాటు అందరికీ పాలనలో భాగస్వామ్యం దక్కాలని వాదించారు. అయినా బ్రిటిష్ ప్రభుత్వం అందరికీ ఓటు హక్కు అనే విషయాన్ని పట్టించుకోలేదు. 1935లో మొదటి సారిగా వచ్చిన ‘భారత చట్టం’లోనూ సార్వత్రిక ఓటింగ్‌కు అవకాశం రాలేదు. 1937లో, 1946లో జరిగిన ఎన్నికల్లో కూడా విద్యా వంతులకు, వ్యాపారులకు, భూస్వాములకు మాత్రమే ఓటు హక్కు కల్పించారు. వాళ్ళ ప్రతినిధులు మాత్రమే పార్లమెంటులో అసెంబ్లీలో అడుగుపెట్టారు. 1947లో భారతదేశం స్వాతంత్య్రం సాధించడంతో నూతన రాజ్యాంగాన్ని రూపొందించుకునే అవకాశం మనకు దక్కింది. అనేక దేశాల్లో వచ్చిన విప్లవాలు, మార్పులు, పరిణామాలను అర్థం చేసుకొని ఒక రాజ్యాంగం ఆవశ్యకతను గుర్తించి, దాన్ని యుద్ధప్రాతిపదికన లిఖిం చడం మొదలైంది. ఆ రాజ్యాంగ రచనకు అంబేడ్కర్ నాయకత్వం వహించే అవకాశం వచ్చింది. 1919 నుంచి ఎంతో తపనతో ప్రతి పాదిస్తూ వచ్చిన సార్వత్రిక ఓటింగ్ విధానానికి సుదీర్ఘకాలం తరువాత అవకాశం లభించింది. అంబేడ్కర్ ఆ ఓటింగ్ హక్కును ప్రాథమిక హక్కుల్లో ఉండాలని ప్రతిపాదించారు. కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి వాళ్ళు అందుకు ఒప్పుకోలేదు. కాంగ్రెస్ 1928లో రూపొందిం చిన రాజ్యాంగానికి భిన్నంగా పటేల్ వ్యవహరించారు. సార్వత్రిక ఓటింగ్ హక్కును ప్రాథమిక హక్కుల్లో చేర్చకుండా, ఆర్టికల్ 326గా ఉంచారు. దీనివల్ల కలిగిన నష్టాన్ని తరతరాలుగా సామాన్యుడు భరిస్తూ వస్తున్నాడు. దాని ఫలితాన్ని మనం ఈనాటికీ అనుభవించాల్సి వస్తోంద న్నది తాజా పరిస్థితులను చూస్తే అర్థం అవుతుంది. ఆ ఒక్కతప్పిదం కారణంగానే అధికారపక్షం ఇష్టారాజ్యంగా ఓట్లను గల్లంతు చేసే పరిస్థి తులేర్పడ్డాయి. కులం పేరుతోనో, మతం పేరుతోనో, తమ వర్గం కాదనో, తమ పార్టీకి చెందిన వాళ్ళు కారనో అవలీలగా వేల సంఖ్యలో ఓట్లను గల్లంతుచేసే దుస్సాహసానికి ఒడిగట్టేవారు కాదు. అసలీ దుర్మా ర్గపుటాలోచనలకు అవకాశం ఉండేదే కాదు. ఓటు హక్కును ప్రాథమిక హక్కుల్లో చేర్చి ఉంటే, రాజ్యాంగంలో 226వ ఆర్టికల్ ప్రకారం ఎవరైనా ఓటు హక్కును కోల్పోయి ఉన్నా ఓటరు లిస్టులో తమ పేరు గురించి హైకోర్టులో రిట్ పిటిషన్ వేసే అవకాశం ఉండేది. ప్రస్తుతం మనం చర్చించుకుంటున్న ఓట్ల గల్లంతు వివాదానికి న్యాయపరమైన పరిష్కారం లభించేది. మన రాజ్యాంగం ప్రకారం ప్రాథమిక హక్కుల్లో చేర్చిన విషయాలపట్ల మాత్రమే హైకోర్టు, సుప్రీంకోర్టులు బాధ్యత వహిస్తాయి. ఆనాడు అంబేడ్కర్ చేసిన ఆలో చనను ఈసారి కొలువుదీరే పార్లమెంటు చర్చించి, సార్వత్రిక ఓటింగ్‌ను ప్రాథమిక హక్కుల్లో చేర్చే ప్రయత్నం చేయాలి. వ్యాసకర్త : మల్లెపల్లి లక్ష్మయ్య , సామాజిక విశ్లేషకులు మొబైల్ : 81063 22077 -
ఐదుకోట్ల మంది.. ఆంధ్రులకు తలవంపులు
సాక్షి, శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): అవినీతిలో దేశంలోనే నెంబర్‌వన్‌గా రాష్ట్రాన్ని నిలిపిన ఘనుడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. అలా ప్రవర్తించి ఐదుకోట్ల మంది ఆంధ్రులకు చంద్రబాబు తలవంపులు తెచ్చారని వైఎస్సార్సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్ ధర్మాన ప్రసాదరావు ధ్వజమెత్తారు. శ్రీకాకుళం నగరంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మాన మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వెంటనే సీఎం ప్రెస్‌మీట్ పెట్టి ఐదేళ్లు తన ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చెప్పాల్సింది పోయి పనికిరాని కాకమ్మ కబుర్లు చెప్పడం సీఎం స్థాయి వ్యక్తికి సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒంటరిగానే పోటీ చేస్తానని ఇతరులతో జతకట్టనని ఎప్పుడో చెప్పారన్నారు. ఇతరులతో కలిసి పోటీ చేయడం గెలవడం..నాలుగేళ్ల పాటు కలిసి ఉండడం తరువాత వదిలేయడం చంద్రబాబుకు పరిపాటని విమర్శించారు. టీడీపికి బద్ధ శత్రువైన కాంగ్రెస్‌తో బాబు జతకట్టవచ్చు గానీ కేసీఆర్, మోడీలతో మాట్లాడితే లేనిపోని అభాండాలు వేసి ఇష్టం వచ్చినట్లు తన పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేల చేత పిచ్చికూతలు కూయించడం చంద్రబాబుకు అలవాటన్నారు. భ్రమ నుంచి బయటపడాలి టీడీపీ ఐదేళ్ల పాలనలో అవినీతి, అరాచకం, మోసం, దోపిడీ తప్ప మరే విధంగా అభివృద్ధి జరగలేదని పాలన అంతా వైఫల్యాలమయంగా మిగిలిపోయిందని 29రాష్ట్రాల్లో అత్యంత అవినీతిపరుడు చంద్రబాబేనని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కితాబిచ్చారని గుర్తు చేశారు. రాష్ట్ర అభివృద్ధిని గాలికొదిలేసి ఏదో ఒక విధంగా మళ్లీ అధికారం చేపట్టాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రజల ఎదుట మొసలికన్నీరు కారిస్తే ఓట్లు వేస్తారన్న భ్రమ నుంచి చంద్రబాబు బయటికి రావాలని హితవు పలికారు. వైఎస్సార్సీపీ ఓట్ల తొలగింపు అన్యాయం దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు జగన్మోహన్రెడ్డి ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు చేపట్టిన సుదీర్ఘ పాదయాత్రలో సంక్షేమ పథకాలను రూపొందించారన్నారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు వచ్చి ప్రజాదరణను చూసి ఓర్వలేక..ఏం చేయాలో తోచక వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించడం, సంక్షేమ పథకాలు ఇవ్వకుండా అవస్థల పలు చేయడం వంటివి చంద్రబాబుకు తగదన్నారు. ఇటువంటి కుళ్లు రాజకీయాలు చేసిన చంద్రబాబును ప్రజలు క్షమించరని జోస్యం చెప్పారు. చట్టాలను తమ చుట్టాలుగా మార్చుకుని ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్న బాబుకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని స్పష్టం చేశారు. విహార యాత్రలతో కాలక్షేపం ఐదేళ్లలో రాష్ట్రానికి ఎటువంటి అభివృద్ధి చేయకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇష్టం వచ్చినట్లు విమానయాత్రలు, బోటు షికార్ల పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా చేశారని ఆరోపించారు. దీంతో విసుగెత్తిన ప్రజలు ‘నిన్నునమ్మం బాబూ’ అని చెప్పకనే చెబుతున్నారన్నారు. ఎన్నికల్లో ఓడిపోతాననే భయంతో నాలుగున్నరేళ్లు గుర్తుకురాని సంక్షేమ పథకాలన్నింటినీ చివరి రెండు నెలల్లో ఇష్టం వచ్చినట్లు పంచిపెడితే ప్రజలు ఓట్లు వేస్తారనుకోవడం భ్రమ అని వ్యాఖ్యానించారు. జన్మభూమి కమిటీల దోపిడీ కేంద్రప్రభుత్వం విడుదల చేసిన కోట్లాది రూపాయల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో చేపట్టిన నీరు–చెట్టు, సిమెంట్ రోడ్ల పనుల పేరుతో జన్మభూమి కమిటీలు, టీడీపీ కార్యకర్తలు దోచుకున్నారని ఆరోపించారు. మోసకారి చంద్రబాబుకు జిల్లా ప్రజలు ఓట్లు వేయరన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. -
ఓట్ల తొలగింపు కేసులు...తలలు పట్టుకుంటున్న పోలీసులు
సాక్షి, ఎమ్మిగనూరురూరల్: ఆన్లైన్లో ఓట్లు తొలగించాలని వచ్చిన దరఖాస్తులపై ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఆర్డీఓ రాంమూర్తి టౌన్, రూరల్ పోలీస్ స్టేషన్లలో మంగళవారం ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదులో ఎవరి పేరు చెప్పకపోవడంతో అయోమయానికి గురువుతున్నారు పోలీసులు. మూడు వేల ఓట్లు తొలగించాలని ఫారం–7 కింద దరఖాస్తులు వచ్చినట్లు ఫిర్యాదులో చెప్పడంతో టౌన్, రూరల్ పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. అయితే ఇప్పటికే సంబంధం లేని వ్యక్తుల పేర్లపై ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులపై విచారణ చేసిన రెవెన్యూ అధికారులు వారితో మాకు ఎటువంటి సంబంధం లేదని సంతకాలు కూడా చేయించుకున్నారు. విచారణ ఎలా మొదలు పెట్టాలో అర్థం కాకా బుధవారం ఎన్నికల రిటర్నింగ్ అధికారిని కలవడానికి తహసీల్దార్ కార్యాలయానికి టౌన్, రూరల్ ఎస్ఐలు కె.శ్రీనివాసులు, కె.రామస్బుయ్య, ఏఎస్ఐ శర్మ, పోలీస్‌సిబ్బందితో వచ్చారు. ఈ విషయంపై పోలీస్ అధికారులను అడగగా రిటర్నింగ్ అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేస్తున్నాం అని చెప్పారు. -
ఓట్ల తొలగింపుపై అపోహలు తొలగించండి : అంబటి
సాక్షి, సత్తెనపల్లి: నియోజకవర్గంలో ఓట్ల తొలగింపులో వస్తున్న విమర్శలతో పాటుగా ఓటర్లకు ధైర్యం కలిగించేలా ఎన్నికల అధికారులు పనిచేసేలా చూడాలని వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త అంబటి రాంబాబు కోరారు. పట్టణంలోని తహసీల్దారు కార్యాలయంలో ఓట్ల తొలగింపు ప్రక్రియలోని అవకతవకలపై నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి బి.విజయ్‌కుమార్‌ను పార్టీ నేతలతో కలిసి మంగళవారం మాట్లాడారు. నియోజకవర్గంలో భారీగా ఓట్ల మార్పిడికి ఫామ్–7లు అధికంగా అందాయనే సమాచారం ఉందన్నారు. కొత్త ఓటర్ల కోసం దరఖాస్తులు కూడా అందాయనే సమాచారం ఉందన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ జరిపి ఓటర్లకు ఉన్న అపోహలను తొలగించాలని కోరారు. 2019 జనవరి 11న ఓటర్ల జాబితా విడుదల చేసిన నాటి నుంచి ఓట్ల నమోదు, తొలగింపులు, సవరణల కోసం వచ్చిన జాబితాలను అందించాలని కోరారు. ఓట్ల మార్పిడికి ఇప్పటివరకు కేవలం నియోజకవర్గం మొత్తం 88 మాత్రమే అందాయని, అలాగే నూతన ఓటు కోసం అర్జీలను పరిశీలించిన తర్వాత జాబితాలో చేరుస్తామన్నారు. తొలగింపునకు వైఎస్సార్సీపీ సానుభూతి పరుల పేర్లతోనే దరఖాస్తులు అందించి ఆపోహలు సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, దానిపై కూడా దృష్టి సారించాలని రాంబాబు కోరారు. ఫారం–7 అందిన తర్వాత వారం రోజుల గడువు ఉంటుందని, దరఖాస్తు అందించిన వారి వద్ద నుంచి డిక్లరేషన్ తీసుకుంటామని, అలాగే ఓటరు నుంచి కూడా అనుమతి పత్రం స్వీకరించిన తర్వాత తొలగింపు చేపడతామన్నారు. ఆ మేరకు బీఎల్ఓలకు ఆదేశాలు జారీ చేశామన్నారు. దీనిపై అపోహలు వద్దని రిటర్నింగ్ అధికారి సూచించారు.తొలగింపునకు ఆన్లైన్లో వచ్చిన ఐపీ అడ్రస్ ఆధారంగా గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే పట్టణంలో గుర్తించామని కేసులు నమోదుకు సిద్ధమవుతున్నట్లు సత్తెనపల్లి తహసీల్దార్ తెలిపారు. నా ఓటే తొలగించారు... నా ఓటే తొలగించారు.. ఎన్నికలు ముందు మరలా తొలగిస్తే ఏం చేయాలి...అప్పుడంటే సమయం ఉంది, గుర్తించాం ఎన్నికల సంఘం ఉన్నతాధికారులతో మాట్లాడి తిరిగి ఓటు తెప్పించుకోగలిగాం... మరలా అదే రీతిలో తొలగిస్తే.. అంత సమయం ఉండదు కాబట్టి ఎవరికి చెప్పుకోవాలో తెలియదు కదా అంటూ ఎన్నికల రిటర్నింగ్ అధికారి దృష్టికి అంబటి రాంబాబు సమస్యను తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన ఎన్నికల అధికారి అలా మరోమారు జరగ్గకుండా చూసుకుంటామని, ప్రతి ఓటు పరిశీలించిన తర్వాతే తొలగింపు జాబితాను తయారు చేసి ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఉంచుతామన్నారు. ప్రతి ఓటరుకు ధైర్యం కల్పించేలా చూడాలని అంబటి రాంబాబు అక్కడే ఉన్న తహసీల్దార్ లను కోరారు. డీఎస్పీని కలిసిన అంబటి రాంబాబు.... అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి పట్టణ మోడల్ పోలీస్‌స్టేషన్‌లో డిఎస్పీ కాలేషావలిని అంబటి రాంబాబు కలిసి ఓట్ల అవకతవకలపై నమోదైన కేసులపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని కోరారు. సానుకూలంగా స్పందించిన డీఎస్పీ అభియోగాలు ఉన్న వారంతా సహకరిస్తే విచారణ పూర్తి చేస్తామని చెప్పారు. అలాగే ఈ నెల 8న లక్కరాజుగార్లపాడులో జరిగే కావాలిజగన్–రావాలి జగన్ కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలంటూ డీఎస్పీని కోరారు. పార్టీ నాయకులు బాసులింగారెడ్డి, షేక్ నాగూర్‌మీరాన్, రాయపాటి పురుషోత్తమరావు, వేపూరి శ్రీనివాసరావు, ఆతుకూరి నాగేశ్వరరావు, కోడిరెక్క దేవదాస్, పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీ ఓట్లే లక్ష్యం
సాక్షి, అగనంపూడి: ప్రజాస్వామానికి మూలస్తంభం ఓటు హక్కు. నేడు ఆ ప్రజాస్వామ్యం పాలకపక్షం అక్రమాలతో ఖూనీ అవుతోంది. ప్రతిపక్ష పార్టీకి చెందిన ఓటర్లను తొలగించడం ద్వారా అధికార పగ్గాలు మళ్లీ చేపట్టాలనే కుతంత్రంతో టీడీపీ నాయకులు అడ్డగోలుగా జాబితాల నుంచి ఓట్లు డిలేట్ చేసేస్తున్నారు. ఓటర్ల డిక్లరేషన్ (అనుమతి) లేకుండా తొలగించే ప్రక్రియకు అధికారులు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకారం అందిస్తున్నారు. దీంతో ప్రైవేటు ఏజెన్సీలకు చెందిన సర్వే బృందం ఓట్లను అడ్డగోలుగా తొలగిస్తున్నారు. చేర్పులు, తొలగింపులను బాధ్యతాయుతమైన వ్యక్తులకు అప్పగించడంలో ఎన్నికల సంఘం విఫలం కావడంతో బీఎల్ఓల సహకారంతో సర్వేల పేరుతో వారికి నచ్చని ఓట్లు తొలగించేస్తున్నారు. మూడు నెలల్లో 500 ఓట్లు గల్లంతు.. ప్రజా వ్యతిరేకతను కూడగట్టుకున్న తెలుగుదేశం పార్టీ వచ్చే సాధారణ ఎన్నికల్లో అడ్డదారిలో గెలవడానికి ప్రతిపక్ష పార్టీ ఓట్ల తొలగింపునకు విఫలయత్నం చేస్తోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అరకోటి ఓట్లను తొలగించినట్టు ఒక స్వచ్ఛంద సంస్థ సర్వేలో వెల్లడైంది. గాజువాక నియోజకవర్గంలో సుమారు 23వేల ఓట్లు తొలగింపునకు గురవ్వగా, 53వ వార్డులో మూడు మాసాల్లో ఐదు వందల ఓట్లు గల్లంతు చేసేశారు. గత సెప్టెంబర్‌లో జిల్లా అధికారులు విడుదల చేసిన జాబితాలో 19712 ఓట్లు ఉండగా, జనవరి – ఫిబ్రవరిలో విడుదల చేసిన జాబితాలో 19200కు తగ్గాయి.ఈ తొలగించిన వాటిలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకుల ఓట్లే అధికంగా ఉన్నాయి. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు తెలుగుదేశం పార్టీ నాయకులు పురమాయించిన సర్వే బృందం వీటిని తొలగించింది. ముఖ్యమైన వారి ఓట్ల తొలగింపు తొలగించిన వాటిలో ఎక్కువగా వైఎస్సార్ సీపీ జిల్లా నాయకులకు చెందిన ఓట్లు ఉన్నాయి. కణితి కాలింగ వీధికి చెందిన దాకా రాజగోపాలరావు వైఎస్సారీసీపీలో కీలకంగా ఉన్నారు. ఆయన ఓటు తొలగించేశారు. అలాగే వైఎస్సార్సీపీ వార్డు అధ్యక్షుడు చిత్రాడ వెంకటరమణ సోదరుని కుమారుడు వెంకటేష్, వారి కుటుంబ సభ్యుల ఓట్లు కూడా తొలగించారు. అప్పికొండ ప్రాంతానికి చెందిన రొంగలి సూర్యప్రకాష్‌రావు, అతని భార్య కృష్ణవేణి ఓట్లను కూడా తొలగించారు. ఇలా ఐదు వందల వరకు ఓట్లు గల్లంతు కావడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆధార్‌తో అనుసంధానించాలి ఓటరుగా హక్కు పొందాలంటే విధిగా ఆధారతో అనుసంధానం చేయాలి. లేదా ఐరిష్ ద్వారా నమోదు చేయాలి. ఎన్నికల సంఘం ఈ విషయంలో పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోలేదు. ఒక వ్యక్తి ఓటు రెండు మూడు చోట్ల నమోదవుతుండడంతో వాస్తవ లెక్కలు తెలియడం లేదు. ఆధార్‌తో అనుసంధానంతో వీటికి కల్లెం వేయవచ్చు. – ప్రగడ వేణుబాబు, జిల్లా కార్యదర్శి, వైఎస్సార్సీపీ తొలగింపునకు మార్గదర్శకాలుండాలి ఒక వ్యక్తికి చెందిన ఓటు తొలగించే సమయంలో ఆ వ్యక్తి సమ్మతి ఉందా..? లేదా..?, సదరు ఓటును ఎందుకు తొలగించాల్సి వచ్చిందో..? వంటి ప్రకియ చేపడితే ఇలా అక్రమ తొలగింపులకు అవకాశం ఉండదు. ఓటరుగా నమోదు, తొలగింపునకు ఎవరికి పడితే వారికి అవకాశం కల్పించడం వల్లే అధికార పార్టీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంది. – చిత్రాడ వెంకటరమణ, వైఎస్సార్సీపీ వార్డు అధ్యక్షుడు తొలగించిన వారిని శిక్షించాలి యూజర్ ఐడీ, పాస్వర్డ్ లేకుండా తొలగింపు సాధ్యం కానప్పుడు ఎవరి యూజర్ ఐడీ, పాస్వర్డ్ ద్వారా ఓట్ల తొలగింపులు చేపట్టారో గుర్తించి వారిని జైలుకి పంపించాలి. కఠినంగా వ్యవహరిస్తే ఓటర్లకు టెన్షన్ తప్పుతుంది. లేకపోతే ఇష్టారాజ్యంగా అధికార పార్టీ వారికి నచ్చని ఓట్లను తొలగించుకుంటూ పోతే ఎన్నికల సంఘంపై నమ్మకం పోతుంది . – దుగ్గపు దానప్పలు, నిర్వాసితుల సంఘం నాయకులు -
ఓట్ల కోతకు స్కెచ్
సాక్షి ప్రతినిధి, కాకినాడ : తాజాగా అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలోని అల్లవరం, అమలాపురం, ఉప్పలగుప్తం మండలాల్లోని 263 పోలింగ్ బూత్‌ల పరిధిలోని ఐదు వేల ఓట్లు తొలగించేందుకు కొందరు అజ్ఞాత వ్యక్తులు ఆన్లైన్లో ఆది, సోమవారాల్లో దరఖాస్తు చేశారు. విచిత్రమేమిటంటే వైఎస్సార్సీపీ బూత్ కన్వీనర్ల పేరిట ఆన్లైన్ దరఖాస్తు చేశారు. ప్రతి పోలింగ్ స్టేషన్ నుంచి ఒట్ల తొలగింపు చేపట్టాలని ఆన్లైన్లోనే జాబితాలు పంపించారు. సదరు వైఎస్సార్సీపీ బూత్ కమిటీ కన్వీనర్లకు ఈ విషయమే తెలియదు. వారెటువంటి దరఖాస్తు చేయకుండానే ఈ కుట్రకు తెరదీశారు. మొన్నటికి మొన్న కాకినాడలోని దుమ్ములపేట, రేచర్లపేట, ఏటిమొగ, పర్లోవపేట, కొత్త కాకినాడ, ముత్తానగర్, చర్చి స్క్వేర్ సెంటర్ ప్రాంతాల నుంచి ఒకే రోజున 1500 నుంచి 2వేల వరకు కొత్త ఓట్లు అప్లోడ్ చేశారు. ఒకే ప్రాంతం నుంచి 150 నుంచి 200 వరకు బల్క్ లో ఎంట్రీలు చేశారు. మీ సేవ చిరునామాలతో ఓటర్ల నమోదు చేయడంతో అధికారులకు అనుమానం వచ్చి పరిశీలించే సరికి ఇక్కడేదో జరుగుతుందని నిర్ణయానికొచ్చారు. మీసేవ, ఇంటర్నెట్ సెంటర్ల నిర్వాహకులను పిలిచి అధికారులు గట్టిగా మందలించారు.ఈ ఘటన మరువక ముందే బుధవారం అమలాపురంలో బట్టబయలు. ∙ఆ మధ్య టీడీపీ కిరాయి మనుషులు జిల్లాలో విస్తృతంగా పర్యటించి తమకు వ్యతిరేకంగా ఉన్న ఓటర్ల వివరాలను తెలుసుకుని, వాటిని తొలగించేందుకు పావులు కదిపారు. పి.గన్నవరం, రాజోలు నియోజకవర్గాల పరిధిలోని మాచవరం, వాకలగరువు గ్రామాల్లో రెండు బృందాలుగా 11 మంది యువకులు ‘స్పా’ అనే సంస్థ పేరుతో తిరుగుతూ వైఎస్సార్సీపీ నేతలకు పట్టుబడ్డారు. టీడీపీ గుర్తింపు కార్డులు, మంత్రి నారా లోకేష్ ఫొటో ఉన్న ఐడెంటిటి కార్డులతో సంచరిస్తూ అడ్డంగా దొరికిపోయారు. వీరిని పోలీసు స్టేషన్‌కు అప్పగించారు. ఆ ముఠా బస చేసిన తాటిపాక లోని లాడ్జి వద్దకు వెళ్లేసరికి మరికొన్ని విషయాలు వెలుగు చూశాయి. కానీ అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో వారిని తర్వాత వదిలేశారు.ఇదంతా చూస్తుంటే ఓట్ల తొలగింపు, బోగస్ ఓట్లు చేర్పించే విషయంలో ఏ స్థాయిలో కుట్ర జరుగుతోందో అర్థమవుతుంది. జిల్లాలో వైఎస్సార్ సీపీ అనుకూల ఓట్లు తొలగించేందుకు, అధికార పార్టీ నాయకులకు తమకు అనుకూలంగా బోగస్ ఓట్లు చేర్పించేందుకు పథకం ప్రకారం వెళ్తున్నట్టుగా స్పష్టమవుతుంది. ఓటర్లు అప్రమత్తం కాకపోతే రానున్న ఎన్నికల్లో ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని ప్రజాస్వామ్యవాదులు హెచ్చరిస్తున్నారు. ఓటమి భయంతోనే... టీడీపీకి ఓటమి భయం పట్టుకుంది. తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో ఓట్ల కుట్రతో గెలవాలని చూస్తోంది. అందుకు కిరాయి మనుషులను రంగంలోకి దించింది. వీరు గ్రామాల్లో సంచరించి వైఎస్సార్సీపీ అనుకూల ఓటర్ల వివరాలను సేకరించారు. టీడీపీకి వ్యతిరేక ఓట్లను తొలగించేందుకు వ్యూహాత్మకంగా గుర్తించే కార్యక్రమాన్ని చేపట్టాయి. ఆ జాబితాకు అనుగుణంగా ఓట్లను తొలగించే పనిలో పడ్డాయి. దానికి ఉదాహరణ అమలాపురం నియోజకవర్గంలో తాజాగా వెలుగు చూసిన వ్యవహారాన్నే తీసుకోవచ్చు. అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో సుమారు ఐదు వేల ఓట్లు తొలగించేందుకు కుట్ర చేశారు. ఓటరు జాబితా నుంచి గ్రామంతరం, డెత్ ఓట్లు తొలగించేందుకు ఉపయోగించే ఫారమ్–7 ద్వారా ఓట్లు తొలగించేందుకు కిరాయి బృందాలు వ్యూహాత్మకంగా అడుగులు వేశాయి. నియోజకవర్గ పరిధిలోని 263 పోలింగ్ బూత్‌ల్లోని ఓట్లు తొలగించేందుకు వైఎస్సార్సీపీ బూత్ కమిటీ కన్వీనర్లు పేరుతో అజ్ఞాత వ్యక్తులు ఆన్లైన్లో దరఖాస్తు చేయించారు. ఈక్రమంలో సోమ, మంగళవారాల్లో తహసీల్దార్ కార్యాలయాలకు ప్రతి పోలింగ్ స్టేషన్ నుంచి 15 నుంచి 40 ఓట్లు తొలగించాలని ఆన్లైన్ దరఖాస్తులు వచ్చాయి. ఫారమ్–7 ద్వారా వైఎస్సార్సీపీ బూత్ కన్వీనర్ల పేరిట అజ్ఞాత వ్యక్తులు మోసానికి పాల్పడ్డారు. అల్ల వరం మండలంలో 1300 ఓట్లు, ఉప్పలగుప్తం మండలంలో 996 ఓట్లు, అమలాపురం మండలంలో 2,800 ఓట్లు తొలగించాలని ఆన్లైన్ దరఖాస్తులు అందాయి. ఇదే విషయమై ఎవరి పేరునైతే ఆన్లైన్లో తొలగింపు దరఖాస్తులు ఇచ్చారో వారిని అడిగితే తమకు తెలియదని, తమ పేరును ఎవరో ఇలా చేశారని, బూత్ కమిటీ కన్వీనర్లుగా ఉన్న తమ పేర్లను అజ్ఞాత వ్యక్తులు వాడుకున్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ అప్రమత్తమై ఆర్డీవోతో మాట్లాడారు. అజ్ఞాత వ్యక్తుల నుంచి ఆర్లైన్ల్లో వచ్చిన దరఖాస్తులపై విచారణ జరపాలని, తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీని వెనుకున్న కుట్రను వెలికి తీయాలని డిమాండ్ చేశారు. ఓట్ల తొలగింపును నిరసిస్తూ వైఎస్సార్ సీపీ ధర్నా ఏలేశ్వరం (ప్రత్తిపాడు) : వైఎస్సార్ సీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపును నిరసిస్తూ స్థానిక నగర పంచాయతీ కార్యాలయం వద్ద ఆ పార్టీ జిల్లా కార్యనిర్వహక కార్యదర్శి అలమండ చలమయ్య, పట్టణ అధ్యక్షుడు శిగడం వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అనంతరం నగర పంచాయితీ కమిషనర్‌కు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి బూత్‌లోని 20–50 ఓట్లు తొలగించాలని తమ పార్టీ బూత్ కన్వీనర్లు అర్జీలు పెట్టుకున్నట్లు బీఎల్ఓల ద్వారా తమకు తెలిసిందన్నారు.అలా తమ పార్టీ నుంచి ఎవరూ అర్జీలు పెట్టలేదన్నారు. అధికార పార్టీకి చెందినవారే తమ పేర్లతో 2 వేల ఓట్లు తొలగించేందుకు కుట్రపూరితంగా అర్జీలు పెట్టినట్లు అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై అధికారులు దర్యప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సామంతుల సూర్యకుమార్, తొండారపు రాంబాబు,మూది నారాయణస్వామి ,బదిరెడ్డి గోవిందు, దాకమర్రి సూరిబాబు, కర్రోతు గాంధీ, వసంత యోహాన్, వాగు బలరాం తదిరులు పాల్గొన్నారు. ఓట్ల తొలగింపు, పెద్ద సంఖ్యలో నమోదుకు పాల్పడితే జైలే: కలెక్టర్ కార్తికేయ మిశ్రా కాకినాడ సిటీ: రాష్ట్రంలో ఆన్లైన్విధానం ద్వారా ఓటర్ల జాబితాలో ఓట్ల తొలగింపునకు, ఓటర్ల నమోదుకు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నట్లు ఎన్నికల కమిషన్ దృష్టికి వచ్చిందని, ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్టు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కార్తికేయమిశ్రా బుధవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. కొంతమంది ఓటర్లకు తెలియకుండా ఫారమ్–7లో ఓటర్ల తొలగింపునకు,అదే విధంగా ఫారం–6లో ఓటర్ల నమోదుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు కమిషన్ దృష్టికి వచ్చిందన్నారు. ఇటువంటి చర్యలు చట్ట వ్యతిరేకమని, ఇటువంటి వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ పోలీసులకు ఆదేశాలిచ్చిందని కలెక్టర్ తెలిపారు. ఇటువంటి చర్యలకు పాల్పడే వారిపై ఫిర్యాదులు వస్తే వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓటర్లకు తెలియకుండా తొలగింపులకు, నమోదులకు పాల్పడే వారి సమాచారాన్ని తెలియజేయాలని కలెక్టర్ ఈ సందర్భంగా ప్రజలను కోరారు. ఓటర్ల జాబితాలో ఓటర్ల తొలగింపునకు సంబంధిత అధికారులు దరఖాస్తులను పరిశీలించి వాటిపై దర్యాప్తు చేసి అనంతరం రాష్ట్ర ఎన్నికల కమిషన్ అనుమతి లేకుండా తొలగింపు కుదరదని, ఈ మేరకు ఎన్నికల అధికారులు అప్రమత్తంగా ఉన్నారని మిశ్రా వివరించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి పార్టీ మండల అధ్యక్షుడు కొనుకు బాపూజీ ఆధ్వర్యంలో బుధవారం వైఎస్సార్సీపీ బూత్ కన్వీనర్లు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ చర్యలకు బాధ్యులైనవారిపై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందజేశారు. పార్టీ జిల్లా కార్యదర్శి యిళ్ల శేషారావు, ఎస్సీ సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నాతి శ్రీనివాసరావు, జిల్లా సంయుక్త కార్యదర్శి మెరికల శ్రీను, బీసీ సెల్ జిల్లా కార్యదర్శి గుత్తుల రాజు, బీసీ సెల్ అధ్యక్షుడు యల్లమిల్లి బోసు, రైతు విభాగ అధ్యక్షుడు బొక్కా శ్రీను, ఈతకోట సతీష్, గ్రామకమిటీ అధ్యక్షుడు పెచ్చెట్టి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఓట్ల తొలగింపునకు ఎలాంటి అభ్యర్థనలు చేయలేదు నేను అమలాపురం పట్టణంలో 49వ బూత్ కమిటీకి వైఎస్సార్ సీపీ కన్వీనర్‌గా ఉన్నాను. కన్వీనర్‌గా నా ప్రమేయం లేకుండా... నా సంతకం లేకుండా నా బూత్ పరిధిలో కొన్ని ఓట్ల తొలగింపులు జరుగుతున్నాయి. ఇదంతా తెర వెనుక ప్రభుత్వం చేస్తున్న కుట్రగా కనిపిస్తోంది. ఇలా ప్రతి బూత్ నుంచి వైఎస్సార్ సీపీకి చెందిన సగటున 50 ఓట్లు తొలగిస్తే నియోజకవర్గం మొత్తం మీద పది వేల ఓట్లకు గండి పడుతుందన్నది వాస్తవం. తమ పార్టీని దెబ్బతీసే ప్రయత్నం చంద్రబాబు ప్రభుత్వం చేస్తుందన్న అనుమానం కలుగుతోంది. –మట్టపర్తి నాగేంద్ర, 49వ బూత్ వైఎస్సార్ సీపీ కన్వీనర్, అమలాపురం ఇది ముమ్మాటికీ ప్రభుత్వం పనే... వైఎస్సార్ సీపీ బూత్ కన్వీనర్లే ఆన్లైన్లో ఓట్ల తొలగింపునకు అభ్యర్ధించినట్లుగా సృష్టించి ఎవరికీ అనుమానం రాకుండా ప్రభుత్వమే ఈ పనిచేసింది. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ కుట్రే. సకాలంతో మేము గుర్తించాం కాబట్టి కుట్ర బయటపడింది. తమ పార్టీని ఎదుర్కొనే సత్తా లేక ఇలా దొడ్డిదారిలో తమ పార్టీకి చెందిన ఓట్లు తొలగించే పని చేయడం సిగ్గుచేటు. అమలాపురం పట్టణంలోని 46వ బూత్ కమిటీ పార్టీ కన్వీనర్‌గా ఉన్న నాకు తెలియకుండానే నేనే ఓట్ల తొలగింపునకు అభ్యర్ధించినట్లు ఆన్లైన్లో కోరడం పచ్చి అబద్దం. దీనిపై చివరి దాకా పోరాడుతాం. – సంసాని నాని, అమలాపురం నియోజకవర్గ బూత్ కమిటీల వైఎస్సార్ సీపీ ఇన్చార్జి, అమలాపురంకుట్ర పూరితంగా ఇరికిస్తున్నారు ఫారమ్–7 ద్వారా బూత్ పరిధిలో ఓట్లు తొలగించాలని నా పేరున ఆన్లైన్లో దరఖాస్తు చేయడం ఆశ్చర్యానికి గురి చేసింది. బూత్ పరిధిలో ఓట్లు తొలగించాల్సిన అవసరం మాకేంటి...? బూత్ లెవల్ అధికారులు వచ్చి ఫారమ్–7లో ఇచ్చిన ఓటర్ల జాబితా వివరాలను విచారణ చేసి మా వద్ద నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు. – దాసరి అప్పలస్వామి, మాజీ సర్పంచి, తాడికోన, అల్లవరం మండలం వైఎస్సార్సీపీ బూత్ కన్వీనర్లను టార్గెట్ చేశారు వైఎస్సార్సీపీ బూత్ కన్వీనర్లను టార్గెట్ చేసుకుని వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించాలని అధికార పార్టీ ఈ పనికి పాల్పడింది. దేవగుప్తంలోని 174 పీఎస్‌లో 16 ఓట్లు, 175 పీఎస్‌లో 56 తొలగించాలని ఆన్లైన్లో మా పేరున, ముత్తాబత్తుల ఏడుకొండలు పేరున దరఖాస్తు చేశారు. అధికార పార్టీ ఈ ఆగడాలకు పాల్పడుతోంది. దీనిపై బూత్ లెవల్ అధికారులు విచారణ చేపట్టారు. – పోతుల చినబాబు, వైఎస్సార్ సీపీ బూత్ కన్వీనర్, దేవగుప్తం, అల్లవరం మండలం -
ఓట్..అవుట్!
విచ్చలవిడి అవినీతి, అక్రమాలతో ప్రజావ్యతిరేకతను మూటగట్టుకున్న అధికార తెలుగుదేశం పార్టీ రానున్న ఎన్నికల్లో అడ్డదారులు తొక్కైనా మళ్లీ గెలవాలనే లక్ష్యంతో పౌరుల ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తోంది. గత ఎన్నికల్లో వెంట్రుక వాసిలో అధికారాన్ని చేజిక్కించుకున్న టీడీపీ ఈ దఫా ఓటమి తప్పదని భావించి కుట్రలు చేస్తోంది. వైఎస్సార్సీపీ సానుభూతిపరులు, అభిమానుల ఓట్ల తొలగింపే లక్ష్యంగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. రెవెన్యూ అధికారులు (ఎన్నికల అధికారులు) వద్ద ఉండాల్సిన ‘కీ’ తమ పార్టీ కార్యకర్తల చేతికిచ్చి క్షేత్రంలోకి సర్వేల పేరుతో పంపించి రెప్పపాటులో ఓట్లను తొలగించేస్తున్నారు. ఓటర్లకు తెలియకుండా వారి ఓట్లు తొలగించమని ఆన్లైన్ ద్వారా అధికంగా ఫారం–7 దరఖాస్తులు చేస్తున్నారు. నెల్లూరు(పొగతోట): అధికార పార్టీపై ప్రజా వ్యతిరేకత, వైఎస్సార్సీపీపై ప్రజాదరణ రోజు రోజుకు పెరుగుతుండడంతో టీడీపీ నేతలు భారీ సంఖ్యలో ఓట్లు తొలగించే కుట్రకు క్షేత్రస్థాయిలో కుట్రలు పన్నుతున్నారు. ముఖ్యంగా నిరక్షరాస్యులైన పేదలతో పాటు వైఎస్సార్సీపీ అభిమానులు, కార్యకర్తల ఓట్లను అడ్డదారిలో తొలగిస్తున్నారు. ఎన్నికల కమిషన్ ఓట్ల చేర్పులు, మార్పుల కోసం ఇచ్చిన అవకాశాన్ని అధికార పార్టీ నాయకులు దుర్వినియోగం చేస్తున్నారు. ఈ నెల 23 నుంచి 27వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా ఓట్లు తొలగించమని 10 వేల ఫారం–7 దరఖాస్తులు వచ్చాయి. సుమారు 3 వేల ఫారం–7 దరఖాస్తులు బీఎల్ఓలకు అందజేశారు. కావలి నియోజకవర్గంలో 3,800, ఆత్మకూరులో 2,900 ఫారం–7 దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా అధికంగా వచ్చాయి. అధికార పార్టీ బోగస్ ఏజెంట్లను నియమించి వారి ద్వారా ఓట్లు తొలగించేలా ఆన్లైన్లో దరఖాస్తులు చేయిస్తున్నారు. చదువుకున్న వారు ఓటు ఉందో లేదో పరిశీలించుకునే అవకాశం ఉంది. చదువు రాని పేద ప్రజలు గుర్తింపు కార్డు ఉందని, ఓటు ఉంటుందనే ఆలోచనతో ఉంటారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే పేద వర్గాలకు మేలు చేకూర్చే విధంగా ఆ పార్టీ ప్రణాళికలు ప్రకటించడంతో నిరక్షరాస్యులు, పేదలు వైఎస్సార్సీపీకి ఓట్లు వేస్తారనే భయంతో ఆయా వర్గాల ఓట్లు తొలగించేలా అధికార పార్టీ కుటిలయత్నాలు చేస్తోంది. అధికార పార్టీకి తొత్తుల్లా అధికారులు అధికార పార్టీ నాయకుల ప్రయత్నాలకు అధికారులకు సహకారం అందించడంతో ఓట్ల తొలగింపు ప్రక్రియ చాపకింద నీరులా జరిగిపోతుంది. జిల్లా జనాభా 32 లక్షలకు పైగా ఉన్నారు. సుమారు 8.50 లక్షల కుటుంబాలు ఉన్నాయి. కుటుంబానికి మూడు ఓట్ల చొప్పున వేసుకున్న జిల్లాలో 25.50 లక్షల ఓట్లు ఉండాల్సి ఉంది. ప్రస్తుతం జిల్లాలో ఓటర్ల సంఖ్య 22,06,652 మాత్రమే ఉన్నాయి. 2015లో 22,78,313 మంది ఓటర్లు ఉంటే.. ప్రస్తుతం అధికారులు ప్రకటించిన జాబితాలను పరిశీలిస్తే 71,661 ఓట్లు తక్కువగా ఉన్నాయి. ఆ ప్రకారం పరిశీలిస్తే ఓటర్ల శాతం తక్కువగా ఉంది. ఒక పక్క ఓట్ల సంఖ్య పెంచేందుకు ఎన్నికల కమిషన్ చర్యలు చేపట్టింది. అర్హులైన వయోజనులు, 18 ఏళ్ల వయస్సు నిండిన వారందరూ ఓటు హక్కుకు దరఖాస్తులు చేసుకోమని ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించింది. పోలింగ్ కేంద్రాల్లో ఓటు నమోదుకు ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల్లో బీఎల్ఓలు అందుబాటులో ఉండి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ ప్రక్రియను అవకాశంగా తీసుకుని టీడీపీ జిల్లాలో 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. వీరు నిత్యం ప్రజలతో ఉంటూ వారి వివరాలు సేకరిçస్తూ ఓట్లు తొలగించేలా ఫారం–7ను ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేస్తున్నారు. ఇందుకు అధికారులు కూడా వారికి సహకరిస్తున్నారు. ఓట్లు కొల్లగొడుతున్న టీడీపీ సైబర్ దొంగలు క్షేత్రస్థాయిలో కొన్ని బృందాలు ఇలా తిరిగి ఓట్లు గల్లంతు చేస్తుంటే.. ఇంకొన్ని టీడీపీ సైబర్ దొంగలు బృందాలుగా ఐవీఆర్ఎస్ (ఇంట్రాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్) ప్రక్రియ ద్వారా ఓట్లు కొల్లగొట్టుతున్నారు. రాజధాని అమరావతి నుంచి ప్రజలకు ఐవీఆర్ఎస్ ఫోన్లు వస్తున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలన బాగుంటే 1 నొక్కండి.. లేదంటే 2 నొక్కండని వాయిస్ వినిపిస్తున్నారు. రెండు నంబర్ నొక్కిన వారి చిరునామా, డోర్ నంబర్లు సేకరించి ఓట్లు గల్లంతు చేస్తున్నారు. ఓట్లు తొలగిస్తున్నారనే సమాచారం బయటకు రావడంతో ఓటు పోతుందనే భయంతో కొందరు 1 నొక్కుతున్నామని చెబుతుండడం విశేషం. ఇలా జరగాలి.. కానీ ఇలా చేస్తున్నారు.. ఓట్ల చెర్పులు, తొలగింపుల కోసం వచ్చిన దరఖాస్తులను ఆయా మండలాల తహసీల్దార్లకు పంపుతారు. వాటిని డేటా ఎంట్రీ చేయాలి. దరఖాస్తులను క్షేత్రస్థాయిలో వీఆర్ఓలు, ఆర్ఐలు పరిశీలించి అర్హులు అయితే ఓటు హక్కు కల్పిస్తారు. తొలగింపు దరఖాస్తులు వస్తే.. వాటిని కొన్ని స్థాయిల్లో పరిశీలించి ఓటర్ల జాబితాల నుంచి పేర్లు తొలగిస్తారు. ఇటువంటి ప్రక్రియ చేయకుండానే ఓట్లు తొలగిస్తున్నారు. విషయం తెలియని వారు ఓటు ఉందని భావిస్తున్నారు. ఎన్నికల సమయంలో పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటు అడిగితే అధికారులు లేదని సమాధానం ఇస్తారు. ఓటు హక్కు కోసం దరఖాస్తులు చేసుకున్న వారికి ఇంత వరకు ఓటు ఇవ్వలేదు. ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు కాలేదు. -
ఇష్టారాజ్యం
సాక్షి, అమరావతి బ్యూరో: ఓటమి భయం వెంటాడుతుండడంతో అధికార పార్టీ నేతలు ఎన్నికల్లో గట్టెక్కేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. అధికార దర్పంతో కిందిస్థాయి ఉద్యోగులను బెదిరించి అవకతవకలకు అక్రమాలకు పాల్పడుతున్నారు. ఓటర్ల లిస్టుపై దృష్టి సారించి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుకూల ఓట్లను ఏదో రకంగా తొలగించడంతో పాటు దొంగ ఓట్లను నమోదు చేయించుకుంటున్నారు. గుంటూరు జిల్లాలో ఈ వ్యవహారం ఇష్టారాజ్యంగా సాగిస్తున్నారు. సర్వేల పేరుతో ఓటర్ల పేర్లు సేకరించి, వాటిని తొలగించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. జాబితాలో లేని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు కొత్తగా ఓటరు నమోదు కోసం ఫారం–6 ద్వారా దరఖాస్తు చేసుకున్నా, వాటిని నమోదు చేయకుండా బీఎల్వోలపై ఒత్తిడి చేస్తున్నారు. దీంతో ఓటర్ల జాబితాలో గందరగోళం నెలకొంది. ఇటీవల జిల్లాలో పర్యటించిన ఎన్నికల ఆడిట్ బృందం ఓటర్ల జాబితాలో అవకతవకలపై ఆరు నియోజకవర్గాల రికార్డులను పరిశీలించినట్లు సమాచారం. ప్రధానంగా డబుల్, ట్రిపుల్, అనుమానాస్పద ఓట్లపైనే ఎన్నికల కమిషన్ దృష్టి సారించింది. ఇందులో భాగంగా చిలకలూరిపేట నియోజకవర్గంలో ఓటర్ల జాబితాల మార్పులు, చేర్పుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించిన ఆరుగురు బీఎల్వోలపై సస్పెన్షన్ వేటు వేశారు. ముగ్గురు తహసీల్దార్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అధికార పార్టీ నేతలు బీఎల్వోలను తమకు అనుకూలంగా మలుచుకొని పెద్ద ఎత్తున ఓట్లు చేర్పించుకోవటంతో పాటు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుకూల ఓట్లను చేర్చకుండా అడ్డుకొంటున్నారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు ఇవే... వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలంలో వడ్డెకుంట, జయంతిరామపురంలో మల్లు వెంకటేశ్వర్లుతో పాటు 33 మంది ఇప్పటికి 4సార్లు ఓటుహక్కు కల్పించమని దరఖాస్తు చేసుకున్నారు. వీటిని జాబితాలో చేర్చే చర్యలు తీసుకోవడంలేదు. - బొల్లాపల్లి మండలంలోని వడ్డెకుంట, వెల్లటూరు, పేరూరులో డబుల్ ఎంట్రీ ఓట్లు అధికంగా ఉన్నాయి. రెడ్డిపాలెం గ్రామానికి చెందిన పేరం శ్రీనివాసరావు, కృపానాయక్, యర్రంశెట్టి మస్తాన్‌రావుతో పాటు మరో 16 మంది ఆ స్వగ్రామంతో పాటు, వేరే గ్రామాల్లోనూ ఓట్లు కలిగి ఉన్నారు. - గురజాల నియోజకవర్గంలో పోలింగ్ బూత్‌కు 50 ఓట్ల చొప్పున, వైఎస్సార్సీపీకి చెందిన 15 వేల అనుకూల ఓట్లను తొలగించేందుకు ప్రణాళిక రచించారు. మాచవరం మండలం సింగరాయపాలెం తండాకు చెందిన వైఎస్సార్సీపీ సానుభూతిపరులవి 66 ఓట్లను తొలగించాలని గ్రామానికి చెందిన అధికార పార్టీ నేత దరఖాస్తు చేయడం గమనార్హం. - జిల్లా వ్యాప్తంగా అనుమానాస్పద ఓట్లు 2,07,209 ఉండగా, అత్యధికంగా చిలకలూరిపేట నియోజక వర్గంలో 16,659 ఉన్నాయి. వీటిపై విచారణ జరపాలని పలువురు ఫిర్యాదు చేశారు. సత్తెనపల్లి నియోజక వర్గంలో ఇష్టారాజ్యంగా పోలింగ్ బూత్‌లను మార్చారు. - పొన్నూరు నియోజకవర్గంలో 4500 ఓట్లు తొలగించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దొంగ ఓట్లు 10 వేలకు పైగా ఉన్నట్లు ఫిర్యాదులు అందాయి. ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు... గురజాల నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ ఓట్లను తొలగించే కుట్ర సాగిందని, శాసనమండలి ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, గురజాల నియోజకవర్గ సమన్వయకర్త కాసు మహేష్‌రెడ్డి, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఇటీవల ఫిర్యాదు చేశారు. ఇంతకుమునుపు సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త పోలింగ్ కేంద్రాల మార్పుపై ఫిర్యాదు చేశారు. చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్త రజని ఓటర్ల జాబితాలో అవకతవకలు చోటు చేసుకున్నాయని అధికారులకు ఫిర్యాదు చేశారు. ఓటర్ల జాబితాలో చోటుచేసుకున్న అవకతవకలపై విచారణ జరిపి, న్యాయం చేయాలని కోరారు. నాడు చంద్రగిరి.. నేడు చిత్తూరులో ఓట్ల తొలగింపునకు అధికంగా ఫారం–7 దరఖాస్తులు చిత్తూరు కలెక్టరేట్ : చిత్తూరు జిల్లాలో ఓట్ల తొలగింపు కోసం ఆన్లైన్ ద్వారా అధికంగా దరఖాస్తులు నమోదవుతున్నాయి. ఇటీవల ఆ సమస్య చంద్రగిరి నియోజకవర్గంలో ప్రారంభమైంది. చిత్తూరు నియోజకవర్గంలో వేలాది మంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించాలని ఫారం–7 ద్వారా ఆన్లైన్ దరఖాస్తులు అందాయి. సోమవారం, మంగళవారం చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో తహసీల్దారు చంద్రశేఖర్‌తో పాటు ఎన్నికల డెప్యూటీ తహసీల్దారు, ఇతర రెవెన్యూ అధికారులు ఓట్ల నమోదు, మార్పులు చేర్పులు, తొలగింపులపై ఆన్లైన్లో వచ్చిన వినతులు చూసి షాక్‌కు గురయ్యారు. నియోజకవర్గ పరిధిలో 8,020 మంది కొత్తగా ఓటర్లు నమోదు చేసుకోవడానికి దరఖాస్తులు ఇవ్వగా సవరణల కోసం 1,019మంది, బూత్ మార్పు కోసం 439 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇదే సమయంలో 7 వేల మందికి పైగా ఓట్లను తొలగించాలని ఆన్లైన్లో దరఖాస్తులు ఇవ్వడం అనుమానాలకు తావిస్తోంది. -
ఒక్కో నియోజకవర్గంలో 10,000 ఓట్ల తొలగింపే లక్ష్యం
జలుమూరు: ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపే లక్ష్యంగా శ్రీకాకుళం జిల్లాలో బోగస్ సర్వేలు జరుగుతున్నాయి. ఈ వ్యవహారం వెనుక అధికా పార్టీ నేతల హస్తం ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓట్ల తొలగింపు కోసం సాంకేతిక పరిజ్ఞానం కలిగిన నిపుణులను కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల నుంచి రప్పిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా జలుమూరు, నరసన్నపేట, కొత్తూరు, పలాస తదితర మండలాల్లో శనివారం పలు బృందాలు సర్వే చేశాయి. జలుమూరు మండలం పెద్దదూగాం, టి.లింగాలుపాడు, నరసన్నపేట మండలం పారిశిల్లి, బసివలస, సుందరాపురం, బాలసీమ గ్రామాల్లో పలువురు యువకులు సర్వే చేస్తుండగా వైఎస్సార్సీపీ నేతలు ధర్మాన కృష్ణచైతన్య, మూకళ్ల సత్యం, వాన నాగేశ్వరరావు వారిని పోలీస్ స్టేషన్లో అప్పగించారు. సర్వే బృందం సభ్యులు పలు వివరాలు వెల్లడించారు. వైఎస్సార్ జిల్లాకు చెందిన బి.భాస్కర్ ఈ బృందానికి నాయకుడిగా వ్యవహారిస్తున్నాడు. గ్రామాల్లో సర్వే పేరిట ఓటర్ల్లను కలిసి వారు అధికార టీడీపీకి చెందిన వారయితే వారిని విడిచిపెట్టి, వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించడమే సర్వే లక్ష్యమని బి.భాస్కర్ చెప్పాడు. ఏ సమస్య వచ్చినా వారే చూసుకుంటారు తమకు ఇచ్చిన ట్యాబ్‌ల్లో పలు ప్రశ్నలు ఉంటాయని భాస్కర్ వెల్లడించాడు. ఓటర్లను ప్రశ్నించి, సమాధానాలు రాబట్టాల్సి ఉంటుందని చెప్పాడు. మీరు టీవీ చూస్తారా? గ్రామంలో ఉన్న సమస్యలు, రాష్ట్ర స్థాయిలో ప్రజా సమస్యలను ఎవరు పరిష్కరిస్తారు? సీఎం పనితీరుపై మీ అభిప్రాయం ఏంటి? గత ప్రభుత్వంతో పోల్చితే ప్రస్తుత ప్రభుత్వంలో అవినీతిపై మీ అభిప్రాయం? వైఎస్ జగన్ ఇచ్చిన హామీలు నెరవేరుస్తాడా? రానున్న ఎన్నికల్లో మీరు ఎవరికి ఓటు వేస్తారు? లాంటి ప్రశ్నలు 18 వరకూ ఉన్నట్లు సర్వే బృందం సభ్యులు చెప్పారు. సర్కారుకి వ్యతిరేకంగా సమాధానాలు చెప్పేవారి ఓట్లను తొలగించాలంటూ తమకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయన్నారు. ఒక్కో బూత్ నుంచి 25 నుంచి 50 ఓట్లు.. ఒక్కో నియోజకవర్గంలో 10 వేల ఓట్లను తొలగించడమే తమకు అప్పజెప్పిన పని అని బృంద నాయకుడు భాస్కర్ చెప్పాడు. తమకు పైన తిరుమలేశ్వరరెడ్డి, శ్రీరామ్‌రెడ్డి అనే బాస్‌లు ఉన్నారని, తమకు ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే ఫోన్‌ద్వారా వారికి సమాచారం చేరవేస్తామని, అంతా వారే చూసుకుంటారని అన్నాడు. వారిద్దరితో అప్పటికప్పుడే ఫోన్లో మాట్లాడాడు. మీకు వచ్చిన భయం ఏం లేదు, మీరు ఇప్పుడు ఎంతమంది పట్టుబడ్డారు, ఏ పోలీస్‌స్టేషన్‌లో ఉన్నారో చెప్పండి, మీ లోకేషన్ ఆధారంగా మిమ్మల్ని వేరే ప్రాంతానికి తరలిస్తామంటూ అటునుంచి సమాధానం వచ్చింది. సర్వేల పేరిట ఓట్లను తొలగిస్తున్నారంటూ వైఎస్సార్ïïసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికారుల ఆదేశాల మేరకు నిందితులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు. -
ఓట్ల గల్లంతు నిజం..
సాక్షి, కామారెడ్డి: ఓట్ల గల్లంతుపై ‘సాక్షి’ చెప్పిందే నిజమైంది. వేల సంఖ్యలో ఓటర్ల పేర్లు తొలగించారని ‘సాక్షి’ ఏడాది కిందట చెప్పింది. ఇప్పుడదే జరిగింది. తాజా ఎన్నికల్లో జిల్లాలో భారీ సంఖ్యలో ఓట్లు గల్లంతయ్యాయి. వేలాది ఓటర్లు తమ ఓ టు హక్కును వినియోగించుకోలేక పోయారు. ఒక్క కామారెడ్డి నియోజకవర్గంలోనే వేలాది ఓట్లు గల్లంతయ్యాయని ‘42 వేల ఓట్లు గల్లంతు’ శీర్షికన గతేడాది మార్చి 7న ‘సాక్షి’ ప్రముఖంగా ప్రచురించింది. శుక్రవారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఓటు వేయడానికి వెళ్లిన ఎంతో మంది జాబితాలో తమ పేర్లు లేవని తెలిసి విస్తుపోయారు. కామారెడ్డి నియోజకవర్గంతో పాటు జిల్లాలోని ఆయా నియోకజ వర్గాల్లో పెద్ద ఎత్తున ఓట్లు మాయమయ్యాయని గతేడాది ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చినప్పటికీ అధికార యంత్రాంగం పెద్దగా పట్టించుకోలేదు. దీంతో వేలాది ఓటర్లు ఓట్లు వేయలేక పోయారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటరు జాబితాల ప్రదర్శనతో చదువుకున్న వారు కొందరు తమ పేర్లు ఉన్నాయో, లేదో చూసుకున్నారు. జాబితాలో పేర్లు లేని వారు తిరిగి దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న వారిలో కూడా చాలా మందివి తిరిగి ఓటరు జాబితాలో పేర్లు రాకపోవడంతో ఖంగుతినాల్సి వచ్చింది. జాబితాల్లో పెద్ద ఎత్తున ఓట్లు గల్లంతయినపుడు అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాల్సి ఉండింది. కానీ, వారు పెద్దగా పట్టించుకోక పోవడంతో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోలేక పోయారు. గత ఎన్నికలకన్నా ఇప్పుడు పోలింగు శాతం పెరిగిందని సంబరపడుతున్నారే తప్ప ఓట్లు గల్లంతయిన విషయాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. త్వరలోనే పంచాయతీ, పార్లమెంట్ ఎన్నికలు.. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను వచ్చే నెలలోనే నిర్వహించే అవకాశం ఉంది. మరో నాలుగు నెలలు గడిస్తే పార్లమెంటు ఎన్నికలు కూడా రానున్నాయి. ఈ నేపథ్యంలో ఓటరు జాబితాల్లో పేర్లు లేని వారి విషయంలో జిల్లా యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే నిరక్షరాస్యులైన ఓటర్లే ఎక్కువ మంది తమ ఓటు కోల్పోయామని ఆవేదన చెందుతున్నారు. ఓట్ల గల్లంతు అటు రాజకీయ పార్టీల అభ్యర్థులను కూడా ఆందోళనకు గురిచేస్తోంది. తమకు ఓట్లు వేస్తారనుకున్న వారి పేర్లు జాబితాలో లేకపోవడంతో తమకు నష్టం జరిగిందన్న భావన అభ్యర్థుల్లో ఉంది. రాజకీయ పార్టీలు దృష్టి సారించాలి.. ఎన్నికలు వచ్చాయంటేనే ఓటర్ల వద్దకు వెళ్లి ఓటు కోసం దండం పెట్టే రాజకీయ నేతలు బాధ్యతగా ఓటరు జాబితాలను పరిశీలించాల్సిన అవసరం ఉంది. పోలింగు రోజున ఓట్లు గల్లంతయ్యాయని గొడవ పడే కన్నా ఓటరు జాబితాల ప్రదర్శన సందర్భంగా ఓట్లు లేని వారి పేర్లను గుర్తించి వారితో దరఖాస్తు చేయించాల్సిన బాధ్యత ఆయా పార్టీల నేతలు తీసుకుంటే ఈ పరిస్థితి దాపురించేది కాదు. -
పోలింగ్ అవాంతరాలు; ఓటర్ల అసహనం
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సంఘం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పోలింగ్‌లో ఇబ్బందులు తప్పడం లేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌లో పలుచోట్ల ఈవీఎంలు మొరాయించాయి. ఫలితంగా చాలా కోట్ల పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. పలుచోట్ల ఉదయం 9 గంటల వరకు కూడా పోలింగ్ ప్రారంభం కాలేదు. పోలింగ్ కేంద్రాల్లో వెలుతురు సరిగా లేకపోవండంతో ఎవరికి ఓటు వేస్తున్నామో తెలియకుండా ఉందని పలుచోట్ల ఓటర్లు ఫిర్యాదు చేశారు. తమ ఓట్లు గల్లంతయ్యాయని కొన్నిచోట్ల ఓటర్లు ఆందోళనకు దిగారు. జాబితాలో ఏజెంట్లు, అధికారుల పేర్లు లేకపోవడం పలుచోట్ల గందరోళ పరిస్థితులు తలెత్తాయి. సాంకేతిక సమస్యలతో గంటల తరబడి వరుసలో నిలబడిరావడంతో ఓటర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణ పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 220 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించినట్టు ప్రాథమిక సమాచారం. ► మెదక్ జిల్లా రెగోడ్ మండలంలోని జగిరీయల్ గ్రామంలో 20 పోలింగ్ బూత్‌లో ఈవీఎం మొరయించడంతో పోలింగ్ ఆగిపోయింది. ► పెద్దపల్లి జిల్లా గోదావరిఖని శాంతినగర్ ప్రజా పాఠశాలలో ఓట్లు గల్లంతు కావడంతో ఓటర్లు ఇబ్బంది పడ్డారు. ► నిజామాబాద్ డిచ్పల్లి మండలం ఘన్పూర్ గ్రామంలో 104, 105, 106 పోలింగ్ కేంద్రాల్లో 20 నిమిషాలు ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. ►నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో, పాలిటెక్నిక్ కళాశాల పోలింగ్ కేంద్రాల్లో గంట ఆలస్యంగా జరుగుతున్న పోలింగ్ ► సిద్దిపేట నియోజకవర్గం పోలింగ్ స్టేషన్లో కనపడని మహాకూటమి, బీజేపీ పోలింగ్ ఏజెంట్లు ►కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కౌటల మండలంలోని తలోడి గ్రామంలో 154 బూత్ సిబ్బందికి అవగాహన లేక ఉదయం తొమ్మిది గంటల వరకు పోలింగ్ ప్రారంభం కాలేదు. ఆసిఫాబాద్ మండలం ఎల్లరం, బెజ్జూరు మండల కేంద్రంలోని 188 పోలింగ్ కేంద్రం, మొర్లీగుడలో ఈవీఎంలు మొరకాయించడంతో 9 గంట వరకు పోలింగ్ ప్రారంభం కాలేదు. ► భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గ పరిధిలో నిజాంపేట, కంబాలపల్లి, లచ్చగూడెం, సత్యనారాయణపురం ఇంకా పలు చోట్ల ఈవీఎంలు మొరాయింపు ► జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు వెంకటాపూర్, గోవిందరావుపేట మండలాల్లోని పలు పోలింగ్ సెంటర్లలో విద్యుత్ సరిగా లేక ఇబ్బంది పడుతున్నఓటర్లు ► రాజన్న సిరిసిల్ల కొనారావుపేట్ మండలం నాగారంలో మొరాయిస్తున్న ఈవీఎం ► జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలోని నందగిరిలో మొరాయించిన ఈవీఎం ► కొమురంభీం జిల్లా తిర్యాణి మండల కేంద్రంలోని 131వ పోలింగ్ బూత్‌లో ఈవీఎం మొరాయించడంతో గంట అలస్యంగా పోలింగ్ మొదలైంది. పోలింగ్ సమయాన్ని గంట పొడిగించాలని అభ్యర్థులు కోరుతున్నారు. ►చంద్రాయణ గుట్ట, కుత్భుల్లాపూర్‌లో ఓట్లలో అవకతవకలు జరిగాయయని ఓటర్లు ఆందోళన చేపట్టారు. ఎలక్షన్ అధికారుల నిర్లక్ష్యం వల్ల తమకు ఓటరు స్లిప్పులు, ఐడీ కార్డులు అందలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ఈవీఎంలతో చెల్లని ఓట్లకు చెల్లు
సాక్షి, కాజీపేట: బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ ఉన్నప్పుడు చెల్లని ఓట్ల శాతం అధికంగా ఉండేది. బ్యాలెట్ పత్రాలపై స్వస్తిక్ ముద్రతో ఓటు వేసేవారు. అప్పుడు ఓటు రెండు గుర్తులపై పడడం, సరిగ్గా ముద్ర పడకపోవడం, ఓటు వేయకుండానే ఖాళీ బ్యాలెట్ పత్రాలను బాక్స్‌ల్లో వేసేవారు. ఇలాంటి వాటిని అధికారులు చెల్లని ఓట్లుగా పరిగణించేవారు. గతంలో పలు సందర్భాల్లో గెలిచిన అభ్యర్థులకు వచ్చిన ఓట్ల మెజార్టీ కన్నా చెల్లని ఓట్లే అధికంగా ఉన్న ఉదంతాలు చాలా ఉన్నాయి. సాంకేతికత పెరగడంతో ప్రభుత్వాలు ఎన్నికల కమిషన్ సూచన మేరకు ఈవీఎంలను ప్రవేశపెట్టాయి. ఈవీఎంల రంగప్రవేశంతో చెల్లని ఓట్లు లేకుండాపోయాయి. ప్రస్తుతం ఈవీఎంల్లో తాము ఓటు వేయదలుచుకున్న అభ్యర్థి ఫొటో లేదా గుర్తుకు ఎదురుగా మీటను నొక్కితే సరిపోతుంది. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు ఎవరూ నచ్చని పక్షంలో నోటాను ఎంచుకోవచ్చు. దీంతో చెల్లని ఓట్లు ఉండడం లేదు. నేడు ఎన్నికలకు ముందు ఉద్యోగులకు మాత్రమే బ్యాలెట్ పేపర్లు ఇస్తున్నారు. -
హైదరాబాద్‌లో చెక్ యువర్ ఓట్
-
అన్ని ఓట్లు ఎలా తగ్గాయి?
కర్నూలు(అగ్రికల్చర్): పాణ్యం నియోజకవర్గంలో భారీస్థాయిలో ఓట్లు ఎలా తగ్గాయని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ప్రశ్నించారు. ఓటర్లు పెరగాల్సింది పోయి తగ్గడమేంటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. శనివారం కలెక్టరేట్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాణ్యం నియోజకవర్గంలో 2014 ఎన్నికల్లో 2.80 లక్షల మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఇప్పుడు ఆ సంఖ్య 2.30 లక్షలకు తగ్గిందన్నారు. ఇందుకు కారణాలేమిటని ప్రశ్నించారు. కలెక్టర్ సమాధానమిస్తూ డీ డూప్లికేట్ సాఫ్ట్‌వేర్‌తో రెండు చోట్ల ఓటు కలిగిన వారందరినీ తొలగించామని, డోర్ టు డోర్ సర్వేకు వచ్చినప్పుడు ఇళ్లలో లేనివారిని కూడా తొలగించామని తెలిపారు. దీనివల్ల ఓటర్లు తగ్గారని చెప్పారు. ఓటరు నమోదు పెద్దఎత్తున చేపట్టేందుకు మునిసిపల్, తహసీల్దారు కార్యాలయాల్లో ప్రత్యేక సెంటర్లు ఏర్పాటు చేయాలని వైఎస్సార్సీపీ ప్రతినిధి తోట వెంకటకృష్ణారెడ్డి సూచించారు. ఓటరు నమోదుపై విస్తృత ప్రచారం చేయాలని, ముఖ్యంగా విద్యాసంస్థల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని కోరారు. కర్నూలు నగరంలోని పలు పోలింగ్ కేంద్రాలకు బీఎల్వోలుగా పొదుపు మహిళలను నియమించడాన్ని సీపీఎం నేతలు రాముడు, షడ్రక్ తప్పుబట్టారు. వీరు అర్హులైన వారిని ఓటర్లుగా నమోదు చేయడం లేదని, అక్రమాలకు తావిస్తున్నారని ఆరోపించారు. వీరిని తొలగించి అంగన్వాడీ కార్యకర్తలను నియమించాలని కోరారు. దేవనకొండ మండలం తెర్నేకల్ గ్రామంలో 20 ఏళ్ల క్రితం ఊరొదిలి వెళ్లిన వారు ఇప్పటికీ అక్కడ ఓటర్లుగా ఉన్నారని, ఇదెలా సాధ్యమని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి పెద్దారెడ్డి ప్రశ్నించారు. ఓటర్ల నమోదుకు అందరూ సహకరించాలి: కలెక్టర్ వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలు జరగనున్నందున అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటర్లుగా నమోదు చేసేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్ సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. గుర్తింపు పొందిన అన్ని పార్టీలు వెంటనే అన్ని పోలింగ్ కేంద్రాలకు బీఎల్ఏలను నియమించుకోవాలని సూచించారు. ఆ వివరాలను అక్టోబరు ఐదులోగా ఇవ్వాలన్నారు. ఓటర్ల జాబితా సవరణ అక్టోబరు 31 వరకు కొనసాగుతుందని, జనవరి నాలుగున తుది జాబితా ప్రకటిస్తామని తెలిపారు. తహసీల్దార్, మండల పరిషత్, మునిసిపల్ కార్యాలయాల్లో ఓటరు నమోదు దరఖాస్తులు వేసేందుకు ప్రత్యేక బాక్స్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జనవరి ఒకటి నాటికి 18 ఏళ్లు నిండే యువతీ యువకులు, జాబితాలో లేని ఇతరులను ఓటర్లుగా నమోదు చేయాలని సూచించారు. 18–19 ఏళ్ల యువత జిల్లాలో 1.80 లక్షల మంది ఉండగా.. 30వేల మంది మాత్రమే ఓటర్లుగా ఉన్నారని, యువ ఓటర్ల నమోదుకు రాజకీయ పార్టీలు సంపూర్ణ సహకారం ఇవ్వాలని కోరారు. 19 నుంచి 30 ఏళ్ల మధ్య వారు కూడా చాలామంది ఓటుకు దూరంగా ఉన్నారని, వీరిపైనా దృష్టి సారించాలని అన్నారు. చనిపోయిన వారు, గ్రామాలు వదిలి వెళ్లిన వారు ఓటర్లుగా ఉంటే ఫారం–7 ద్వారా తొలగింపునకు దరఖాస్తు చేయవచ్చని సూచించారు. అర్హత కలిగిన వారందరూ ఓటర్లుగా నమోదయ్యేందుకు స్వీప్ కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. విశ్వవిద్యాలయంతో పాటు డిగ్రీ కళాశాలలు, ఇతర వృత్తి విద్యాసంస్థల్లో స్వీప్ యాక్టివిటీ కింద అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ పూర్తి అయ్యిందని, దీనివల్ల పోలింగ్ కేంద్రాల సంఖ్య 3,780కి పెరిగిందని తెలిపారు. ఇంకా ఎక్కడైనా కొత్త పోలింగ్ కేంద్రం అవసరమనుకుంటే తమకు చెప్పవచ్చని, ప్రతిపాదనలు పంపుతామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్వీప్ కార్యాక్రమాలకు సంబంధించిన పోస్టర్లను కలెక్టర్ విడుదల చేశారు. ఓటరు నమోదు ప్రచార వాహనాలను కూడా జెండా ఊపి ప్రారంభించారు. సమావేశంలో డీఆర్వో వెంకటేశం, ఈఆర్వోలు శశీదేవి, సుధాకర్‌రెడ్డి, అనురాధ, సత్యం, జయకుమార్, కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ హరినాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఓట్లు మాయం
♦ ‘సాక్షి’ ముందే చెప్పింది ♦ ఒక్కో డివిజన్లో ఐదు నుంచి పదిశాతం గల్లంతు ♦ పట్టించుకోని యంత్రాంగం పోలింగ్‌శాతంపై ప్రభావం ♦ 64.78 శాతం మాత్రమే నమోదు ♦ ఆందోళనలో అభ్యర్థులు కాకినాడ : భార్యకు ఓటు ఉంటే.. భర్తకు లేదు. కుమారుడికి ఓటు ఉంటే తల్లికి లేదు. ఎన్నో ఎన్నికల్లో ఓటు వేసిన వయోవృద్ధులు ఈసారి ఓటుహక్కును వినియోగించులేకపోయారు. ఒకటి కాదు రెండు కాదు.. ఒక్కో డివిజన్ పరిధిలో ఐదు నుంచి పదిశాతం ఓట్లు గల్లంతయ్యాయి. ఈ విషయమై ‘సాక్షి’ ముందే హెచ్చరించింది. నగర పౌరులు పూర్తిస్థాయిలో ఓటుహక్కును వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేయడంలో అధికార యంత్రాంగం విఫలమైంది. ఫలితంగా ఎంతోమంది ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకోకుండానే నిరాశతో వెనుతిరిగాల్సి వచ్చింది. కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటరు జాబితాలు గందరగోళంగా తయారయ్యాయి. ఒక ఇంటిలో నలుగురు ఓటర్లుంటే ఇరువురికి మాత్రమే ప్రస్తుత జాబితాలో ఓటు ఉండడం, మిగిలిన వారి పేర్లు లేకపోవడం, జాబితాలో పేరున్నా డోరు నంబర్లు మారిపోవడం తదితర కారణాలతో వందలాది మంది ఓటర్లు ఓటు హక్కును కోల్పోవాల్సి వచ్చింది. ఒక్కో డివిజన్లో ఐదు నుంచి పదిశాతం వరకు ఓట్లు ఈ విధంగా గల్లంతయ్యాయి. ఈ విషయమై ఈనెల 28న ‘సాక్షి’ దినపత్రికలో కథనం ప్రచురితమైన విషయం విదితమే. సమస్యను పరిష్కరించే దిశగా అధికార యంత్రంగా చర్యలు చేపట్టడంలో పూర్తిగా విఫలమైంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటరు జాబితాలో సరిచూసుకునే వెసులుబాటు కల్పించలేదు. అభ్యర్థులు ఏర్పాటు చేసుకున్న శిబిరాలే దిక్కయ్యాయి. జాబితాల్లో తప్పులపై సమాధానం చెప్పే నాథులు కరువయ్యారు. దీంతో చేతిలో ఓటరు కార్డు ఉన్నా ఓటు వేసే వీలులేకపోవడంతో నగర పౌరులు నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. మూడు పర్యాయాలుగా ఓటుహక్కును వినియోగించుకుంటున్నానని, డోర్ నంబరు మార్పు చేయడంతో ఈ ఎన్నికల్లో ఓటు వేయలేకపోతున్నానని రెండో డివిజన్‌కు చెందిన ఎస్.నిరంజన్ ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్యకు మాత్రమే ఓటు ఉందని, తనకు మాత్రం రాలేదని ఐదో డివిజన్‌కు చెందిన వి. శ్రీనివాసరావు వాపోగా, 20 ఏళ్లుగా ఉన్న ఇంటి డోర్ నంబరు ఇప్పుడు మార్చేశారని ఓటే వేసే వీలులేకపోయిందని 26వ డివిజన్‌కు చెందిన దుర్గ తెలిపింది. పోలింగ్ స్టేషన్ల వద్ద సవరణ జాబితాలు ఏర్పాటుచేయలేదని పలువురు ఓటర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. డివిజన్ల పరిధిలోని ప్రాంతాలను మార్పు చేసినప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం, జాబితాలు సరిచేసినప్పుడు సాంకేతిక లోపాలు ఓటర్ల జాబితాలో తప్పులు దొర్లడానికి కారణమై ఉండవచ్చునంటున్నారు. నగరంలో దాదాపు 20 వేలకు పైబడి ఓట్లు గల్లంతై ఉండవచ్చునని భావిస్తున్నారు. పోలింగ్‌పై ప్రభావం.. ఆందోళనలో అభ్యర్థులు స్థానిక ఎన్నికల్లో ప్రతి ఓటూ కీలకం కావడంతో ఓట్లు గల్లంతవ్వడం అభ్యర్థులను బెంబేలెత్తిస్తోంది. 48 డివిజన్ల పరిధిలో మొత్తం ఓటర్లు 2,29,373 మంది ఉన్నారు. పోలింగ్ ప్రారంభం నుంచి అభ్యర్థులు ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. పోలింగ్ ముగిసే సమయం దగ్గరపడే కొద్ది ఇంకా ఎవరెవరు మిగిలి ఉన్నారో ఏజెంట్లు ద్వారా సమాచారం తెప్పించుకుని వారిని పోలింగ్ కేంద్రాలకు తీసుకువచ్చి ఓట్లు వేయించి పంపేందుకు ప్రాధాన్యమిచ్చారు. ఆయా కారణాలతో స్థానిక సంస్థల ఎన్నికల్లో 80 శాతానికి పైబడి పోలింగ్ జరుగుతుంది. కాగా కేవలం 64.78 శాతం మాత్రమే ఓట్లు పోలవ్వడం గమనార్హం. 1,48,598 మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. తమను బలపరుస్తారని భావించిన పలువురి ఓటర్లకు సంబంధించి జాబితాలో తప్పులు దొర్లడంతో అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. జాబితాలో తప్పులు కారణంగా తమకు సానుకూలమైన ఓట్లు కోల్పోయామని ఆందోళనవ్యక్తం చేస్తున్నారు. -
బ్రహ్మానందం దంపతుల ఓట్లు గల్లంతు
హైదరాబాద్ : బాధ్యత గల పౌరుడిగా ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని ప్రచారం చేసిన సినీ నటుడు బ్రహ్మానందంకు చేదు అనుభవం ఎదురైంది. బ్రహ్మానందం కుటుంబ సభ్యుల ఓట్లు గల్లంతు అయ్యాయి. దాంతో వారు తమ ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. ఓటు హక్కు వినియోగించుకోవాలని బ్రహ్మానందం ఎన్నికల సంఘం ప్రచారం చేసిన విషయం తెలిసిందే. బ్రహ్మానందం దంపతులు జూబ్లీహిల్స్‌లో ఓటు వేసేందుకు జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ పోలింగ్ కేంద్రానికి వచ్చారు. అయితే ఓటర్ల జాబితాలో తన ఓటు గల్లంతైపోయినట్టు తెలుసుకున్న ఆయన అవాక్కయిపోయాడు. మరోసారి పరిశీలించమని బ్రహ్మానందం ఎన్నికల సిబ్బందిని కోరారు. అయినా ఫలితం లేకపోవటంతో వారు ఓటు వేయకుండానే వెనుదిరిగారు.