తహసీల్దార్ కార్యాలయం వద్ద టౌన్, రూరల్ పోలీసులు
సాక్షి, ఎమ్మిగనూరురూరల్: ఆన్‌లైన్‌లో ఓట్లు తొలగించాలని వచ్చిన దరఖాస్తులపై ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఆర్డీఓ రాంమూర్తి టౌన్, రూరల్ పోలీస్ స్టేషన్లలో మంగళవారం ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదులో ఎవరి పేరు చెప్పకపోవడంతో అయోమయానికి గురువుతున్నారు పోలీసులు. మూడు వేల ఓట్లు తొలగించాలని ఫారం–7 కింద దరఖాస్తులు వచ్చినట్లు ఫిర్యాదులో చెప్పడంతో టౌన్, రూరల్ పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.
అయితే ఇప్పటికే సంబంధం లేని వ్యక్తుల పేర్లపై ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులపై విచారణ చేసిన రెవెన్యూ అధికారులు వారితో మాకు ఎటువంటి సంబంధం లేదని సంతకాలు కూడా చేయించుకున్నారు. విచారణ ఎలా మొదలు పెట్టాలో అర్థం కాకా బుధవారం ఎన్నికల రిటర్నింగ్ అధికారిని కలవడానికి తహసీల్దార్ కార్యాలయానికి టౌన్, రూరల్ ఎస్‌ఐలు కె.శ్రీనివాసులు, కె.రామస్బుయ్య, ఏఎస్‌ఐ శర్మ, పోలీస్‌సిబ్బందితో వచ్చారు. ఈ విషయంపై పోలీస్ అధికారులను అడగగా రిటర్నింగ్ అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేస్తున్నాం అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment