online voting
-
మస్క్... నువ్వు మాకొద్దు!
వాషింగ్టన్: సామాజిక దిగ్గజ సంస్థ ట్విట్టర్‌కు సారథ్య బాధ్యతలు నిర్వర్తించడంలో విఫలమయ్యాడంటూ సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటున్న ఆ సంస్థ సీఈవో, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు మరో ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. మస్క్ అధికారిక ట్విట్టర్ ఖాతాకు ప్రపంచవ్యాప్తంగా 12.2 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. వీరిని ఉద్దేశిస్తూ మస్క్ ఆదివారం ఒక ట్వీట్‌చేశారు. ‘ ట్విట్టర్‌కు సీఈవోగా నేను తప్పుకోవాలా ?. ఈ పోలింగ్‌లో వచ్చే ఫలితాలకు అనుగుణంగా నడుచుకుంటా. మీ నిర్ణయాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి. మీరేం ఆశిస్తారో అదే మీకు దక్కుతుంది’ అని మస్క్ ఆదివారం ఒక ట్వీట్‌చేశారు. దీనిపై ట్విటర్ యూజర్లు వెంటనే భారీగా స్పందించారు. పోలైన ఓట్లలో 57.5 శాతం ఓట్లు మస్క్‌కు వ్యతిరేకంగా పడ్డాయి. మాకు మీరు అక్కర్లేదంటూ ‘యస్’ చెబుతూ ఓట్లు వేశారు. ఆదివారం సాయంత్రం మొదలైన ఈ ఓటింగ్ సోమవారం తెల్లవారుజామున ముగిసింది. మస్క్ పిలుపునకు స్పందనగా 1.7 కోట్లకుపైగా ఓట్లు పోల్ అయ్యాయని సీఎన్ఎన్ పేర్కొంది. ఓటింగ్ ఫలితంపై మస్క్ ఇంకా స్పందించలేదు. దాదాపు 44 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ట్విటర్‌ను హస్తగతం చేసుకున్నాక మస్క్ తీసుకున్న కఠిన నిర్ణయాలపై విమర్శలు కొనసాగుతుండటం తెల్సిందే. భారీగా సిబ్బంది కోతలకు సిద్దమవడం, ఎక్కువ గంటలు చెమటోడ్చి పనిచేయాలని ఒత్తిడి తేవడం వంటి నిర్ణయాలతో మస్క్ పేరు చెబితేనే ట్విటర్ సిబ్బంది హడలెత్తిపోతున్నారు. ట్విటర్ విధానపర నిర్ణయాల్లో మార్పులపైనా ఆన్లైన్ ఓటింగ్ చేపడతానని మస్క్ ప్రకటించారు. ఫేస్బుక్, ఇన్‌స్టా గ్రామ్, మాస్టోడోన్, ట్రూత్ సోషల్, ట్రైబల్, నోస్టర్, పోస్ట్ వంటి ఇతర సోషల్‌మీడియా సంస్థల ఖాతాలకు వాడుతున్న అవే యూజర్ఐడీలతో కొనసాగుతున్న/అనుసంధానమైన ట్విట్టర్ ఖాతాలను తొలగిస్తామని ట్విటర్ తెలిపింది. ‘ఇన్‌స్ట్రాగామ్‌లో నన్ను ఫాలో అవ్వండి’, ‘ఫేస్బుక్లో నా ప్రొఫైల్ చెక్ చేయండి’ వంటి వాటికీ ట్విట్టర్ చెక్ పెట్టనుంది. -
బహ్మరెడ్డి... ఓ ‘సర్కార్’!
సాక్షి, హైదరాబాద్: విజయ్ కథానాయకుడిగా వచ్చిన సర్కార్ సినిమా గుర్తుందా..? అందులో ఎన్నారై, బడా వ్యాపారవేత్త అయిన కథానాయకుడు తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఇక్కడికి వస్తాడు. అప్పటికే ఆ ఓటు ఎవరో వేసేశారని తెలుసుకుని న్యాయపోరాటం చేస్తాడు. దాదాపు ఇలాంటి ఉదంతమే నగరంలో చోటు చేసుకుంది. సినిమాలో ఓటు అంశం సాధారణ ఎన్నికలకు సంబంధించినదైతే... ఇక్కడ మాత్రం ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎల్రక్టానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీర్స్ గవర్నింగ్ కౌన్సిల్ది. సిటీ సైబర్ క్రైమ్ పోలీసుల కథనం ప్రకారం... ఖైరతాబాద్‌లోని ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ (ఇండియా) తెలంగాణ స్టేట్ సెంటర్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న బి.బ్రహ్మరెడ్డి న్యూఢిల్లీలోని ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీర్స్‌కు (ఐఈటీఈ) కార్పొరేట్ మెంబర్‌గా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆ సంస్థ గవర్నింగ్ కౌన్సిల్ ఎన్నికల్లో ఈయనకు ఓటుహక్కు ఉంది. దీనికి సంబంధించిన ఎన్నికలు ఈ ఏడాది జూన్‌లో జరిగాయి. ఆ నెల 30వ తేదీ రాత్రి 11.59 నిమిషాల వరకు ఆన్లైన్లో ఓటు వేసుకునేందుకు అర్హులకు అవకాశం ఇచ్చారు. ఈ ఆన్లైన్ ఓటింగ్ కోసం అర్హులైన ఐఈటీఈ ఓటర్లు తమ యూజర్ ఐడీ, పాస్వర్డ్ లేదా ఫోన్‌కు వచ్చే ఓటీపీ సహాయంతో అధికారిక వెబ్‌సైట్‌లోని ఎంటర్ కావాల్సి ఉంటుంది. ఆపై అక్కడ ఉన్న ఆప్షన్స్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఐఈటీఈ ఓటర్లు అంతా ఇలానే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. బ్రహ్మారెడ్డి జూన్ 30 మధ్యాహ్నం 2.10 గంటలకు ఓటు వేయడం కోసం అధికారిక వెబ్సైట్లోకి లాగిన్ అయ్యారు. అయితే అప్పటికే ఈ ఓటు వేరే వాళ్లు వేసినట్లు అందులో కనిపించింది. తన ఈ–మెయిల్ ఐడీ, యూజర్ ఐడీ తదతరాలను హ్యాక్ చేసిన దుండగులు ఇలా చేశారని ఆయన అనుమానించారు. దీంతో ఇటీవల సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా కేసు నమోదు చేసుకున్న అధికారులు సాంకేతిక దర్యాప్తు చేపట్టారు. ఆన్లైన్ ఓటింగ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు అందించాల్సిందిగా కోరుతూ ఐఈటీఈకి లేఖ రాశారు. ఆ ఎన్నికల్లో మహారాష్ట్రకు చెందిన వాళ్లు గెలిచారని, తన ఓటు కూడా ఆ రాష్ట్రంలోని అమరావతి నుంచే వేసినట్లు తెలుస్తోందని బ్రహ్మరెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ అంశాన్ని సైతం పరిగణలోకి తీసుకున్న సైబర్ క్రైమ్ అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు. (చదవండి: వచ్చేస్తున్నాయ్ వందేభారత్ రైళ్లు) -
ఓట్ల తొలగింపు కేసులు...తలలు పట్టుకుంటున్న పోలీసులు
సాక్షి, ఎమ్మిగనూరురూరల్: ఆన్లైన్లో ఓట్లు తొలగించాలని వచ్చిన దరఖాస్తులపై ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఆర్డీఓ రాంమూర్తి టౌన్, రూరల్ పోలీస్ స్టేషన్లలో మంగళవారం ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదులో ఎవరి పేరు చెప్పకపోవడంతో అయోమయానికి గురువుతున్నారు పోలీసులు. మూడు వేల ఓట్లు తొలగించాలని ఫారం–7 కింద దరఖాస్తులు వచ్చినట్లు ఫిర్యాదులో చెప్పడంతో టౌన్, రూరల్ పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. అయితే ఇప్పటికే సంబంధం లేని వ్యక్తుల పేర్లపై ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులపై విచారణ చేసిన రెవెన్యూ అధికారులు వారితో మాకు ఎటువంటి సంబంధం లేదని సంతకాలు కూడా చేయించుకున్నారు. విచారణ ఎలా మొదలు పెట్టాలో అర్థం కాకా బుధవారం ఎన్నికల రిటర్నింగ్ అధికారిని కలవడానికి తహసీల్దార్ కార్యాలయానికి టౌన్, రూరల్ ఎస్ఐలు కె.శ్రీనివాసులు, కె.రామస్బుయ్య, ఏఎస్ఐ శర్మ, పోలీస్‌సిబ్బందితో వచ్చారు. ఈ విషయంపై పోలీస్ అధికారులను అడగగా రిటర్నింగ్ అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేస్తున్నాం అని చెప్పారు. -
పోలింగ్ శాతంపై ప్రత్యేక దృష్టి
సాక్షిప్రతినిధి, కరీంనగర్: జిల్లాలో 2014 ఎన్నికల కంటే ఈసారి పోలింగ్ శాతం మరింత పెంచే దిశగా అధికారయంత్రాంగం చర్యలు ప్రారంభించింది. జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికా రి సర్ఫరాజ్ అహ్మద్ ఈ విషయమై ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ల సంఖ్య, పోలింగ్ కేంద్రాలు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు వివరాలపై ఒకటికి రెండు సార్లు పరిశీలన చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల్లోని అసౌకర్యాలతోపాటు ఆ కేంద్రాలకు వచ్చే ఓటర్ల ఇబ్బందులను తెలుసుకోవాలని ఆయన అధికారగణాన్ని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను తెలుసుకుంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై తగు చర్యలు తీసుకునే అవకాశముంటుందని అధికారులతో నిర్వహించిన సమావేశాల్లో సూచించారు. ఈ మేరకు జిల్లా అధికార యంత్రాంగం నియోజకవర్గాల వారీగా పోలింగ్ శాతం పెంపుపై దృష్టి సారించి ఏర్పాట్లను పరిశీలిస్తోంది. 2014 ఎన్నికలతో పోలిస్తే తగ్గిన ఓటర్లు.. సగటున 72.47 శాతం పోలింగ్.. 2014 ఎన్నికలతో పోలిస్తే ఓటర్ల సవరణ, నమో దు తర్వాత ఇటీవల ప్రకటించిన జాబితా ప్రకారం 42,305 ఓటర్లు తగ్గారు. గత ఎన్నికల పో లింగ్ నాటికి 9,32,534 ఓటర్లుండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 8,90,229గా ఉంది. ఆ ఎన్నికల్లో నాలుగు నియోజకవర్గాల్లో సగటున 72.47 శా తం నమోదు కాగా, అత్యధికంగా మానకొండూ రు నియోజకవర్గం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోగా, అత్యల్పంగా పోలింగ్ శా తం కరీంనగర్లో నమోదైంది. కరీంనగర్ నియోజకవర్గంలో 3,22,595 మంది ఓటర్లుంటే 1,89,580 మంది తమ ఓటుహక్కును వినియోగించుకోగా 58.77 శాతంగా నమోదైంది. హుజూ రాబాద్‌లో 2,09,783కు 1,62,675 మంది ఓటు వేయగా 77.54 శాతం, చొప్పదండి(ఎస్సీ)లో 2,04,776లకు 1,50,049 మంది ఓట్లేయగా 73.27 శాతంగా నమోదైంది. అదేవిధంగా మానకొండూరు(ఎస్సీ) నియోజకవర్గంలో 1,95,380 ఓటర్లకు గాను 1,56,907 మంది తమ ఓటుహక్కుని వినియోగించుకోగా 80.31 శాతంగా పో లింగ్ నమోదైంది. ఈ నేపథ్యంలో ఓటర్ల సంఖ్య తగ్గినా.. పోలింగ్ శాతం తగ్గకుండా చర్యలు తీసుకుంటున్నారు. కరీంనగర్, హుజూరాబాద్, మానకొండూరు, చొప్పదండి నియోజకవర్ల ఓటర్లనే జిల్లా ఓటర్లుగా పరిగణిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే పోలింగ్ కేంద్రాల గుర్తింపు పూర్తయ్యింది. అక్కడి సౌకర్యాల విషయంలోనూ సమగ్ర సమాచారాన్ని అధికారయంత్రాంగం సేకరించింది. ఈ క్రమంలో ఇటీవల కొత్తగా అన్ని మండలాలకు తహసీల్దార్లు విధుల్లో చేరారు. కిందటి ఎన్నికల్లో పోలింగ్ శాతం తక్కువగా నమోదు కావడాన్ని గమనించిన పాలనాధికారి మరోమారు పోలింగ్ కేంద్రాలను సందర్శించాలని వారిని ఆదేశించడంతో యంత్రాంగం అప్రమత్తమైంది. కరీంనగర్‌లోనే మరీ తక్కువ.. పోలింగ్ శాతంపై కసరత్తు.. నాలుగు నియోజకవర్గాలను పరిశీలిస్తే గత ఎన్నికల్లో కరీంనగర్ నియోజకవర్గంలో పోలింగ్ శాతం తక్కువగా నమోదైంది. ఈ నియోజకవర్గంలో 3,22,595 మంది ఓటర్లుంటే 1,89,580 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నా రు. పోలింగ్ సరళిని పరిశీలిస్తే చాలా తక్కువగా 58.77 శాతం మంది మాత్రమే ఓట్లు వేశారు. హుజూరాబాద్, చొప్పదండిలో ఫరవాలేదనిపించినా.. మానకొండూరులో అత్యధికంగా 80.31 శాతం నమోదైంది. ఈసారి నాలుగు నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం మరింత పెంచే దిశగా ఎదురయ్యే అవరోధాలను అధిగమించాలని పాలనాధికారి భావిస్తున్నారు. అవసరమైతే పోలింగ్ కేంద్రాన్ని ఒక చోటు నుంచి దగ్గరగా ఉన్న మరో చోటికి మార్చడం లేదంటే గుర్తించిన పోలింగ్ కేంద్రానికి రాని పరిస్థితి ఉంటే ఏం చేయాలన్న దానిపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికా రులను ఆదేశించడం చూస్తుంటే పాలనాధికారి పోలింగ్ నమోదుపై పక్కా ప్రణాళికతో వెళ్తున్నారన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా కొత్తగా వచ్చిన తహసీల్దార్లు సరైన నివేదికను, ప్రతిపాదనలు సరిగ్గా రూపొందిస్తేనే పాలనాధికారి సంకల్పం నెరవేరే అవకాశముంది. కాగా.. ఇటీవల ప్రకటించిన జాబితా ప్రకారం జిల్లాలో 8,90,229 మంది ఓటర్లుండగా ఇందులో 4,42,342 పురుషులు, 4,46,832 మహిళా ఓటర్లు, 55 మంది ఇతరులు ఉన్నారు. నియోజకవర్గాల వారీగా చూస్తే కరీంనగర్లో అత్యధికంగా మొత్తం ఓటర్లు 2,77,236 ఉండగా, అత్యల్పంగా 1,99,098 మంది మానకొండూరులో ఉన్నారు. చొప్పదండిలో 2,08,056, హుజూరాబాద్‌లో 2,05,839 మంది ఓటర్లు నమోదై ఉన్నారు. పోలింగ్ నాటికి స్వల్పంగా పెరిగే అవకాశం ఉన్నా.. ఇప్పుడున్న జాబితా ఆధారంగా పోలింగ్ శాతం పెంచడంపై అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. -
ఆర్డర్‌ఆఫ్ మెరిట్ అవార్డ్స్-2017కు ఆన్లైన్ ఓటింగ్
అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లాలోని వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లు, విద్యార్థులు ఆన్లైన్ ఓటింగ్‌లో పాల్గొనాలని సాంఘిక సంక్షేమశాఖ ఉప సంచాలకులు రోశన్న ఆదివారం ఓప్రకటనలో కోరారు. ఈ విద్యా సంవత్సరం (2017–18) నుంచి రాష్ట్రంలోని అన్ని కళాశాలలల్లో విద్యార్థుల ప్రవేశాలు, పోస్టుమెట్రిక్ ఉపకార వేతనాల మంజూరుకు జన్మభూమి వెబ్‌పోర్టల్‌ను ప్రభుత్వం ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే జన్మభూమి వెబ్‌పోర్టల్‌లో ఆర్డర్ ఆఫ్ మెరిట్ అవార్డ్స్–17 కోసం ప్రిన్సిపాళ్లు, విద్యార్థులకు ఆన్లైన్ ఓటింగ్ నిర్వహించనున్నారు. ట్విటర్ అకౌంట్ ద్వారా మాత్రమే ఓటింగ్ చేసే అవకాశం కల్పించారు. -
'ఆన్లైన్ ఓటింగ్ నిర్వహించాలి'
హైదరాబాద్: పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఆన్లైన్ ద్వారా ఓటింగ్ నిర్వహిస్తే బాగుంటుందని ఐటీ, పంచాయతీ శాఖ మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లో గురువారం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ల జాతీయ సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఇది తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. గ్రేటర్ ఎన్నికలలో పోలింగ్ చాలా తక్కువ శాతం నమోదైందని... ఆన్లైన్ ద్వారా ఓటింగ్ నిర్వహిస్తే ఓటింగ్ శాతం మరింత పెరిగే అవకాశముంటుందని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ల జాతీయ సదస్సు నిర్వహించడంపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి హర్షం వ్యక్తం చేశారు. ఈ సదస్సులో అన్ని సర్వీసు కమిషన్లకు కావాల్సిన నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. ఇలాంటి సదస్సు హైదరాబాద్‌లో తొలిసారి నిర్వహిస్తున్నందుకు గర్వపడుతున్నామని చక్రపాణి చెప్పారు.