governor couple
-
ఖైరతాబాద్ గణపతి వేడుకలకు గవర్నర్ దంపతులు
-
ఖైరతాబాద్ గణపతి వేడుకలకు గవర్నర్ దంపతులు
ముషీరాబాద్ (హైదరాబాద్): వినాయక చతుర్ధి సందర్భంగా ఈ నెల 17వ తేదీన నిర్వహించే తొలి పూజకు ఖైరతాబాద్ గణపతి ఉత్సవ నిర్వాహకులు గవర్నర్ నరసింహన్ దంపతులను ప్రత్యేకంగా ఆహ్వానించారు. 17వ తేదీ ఉదయం 9.45 నిమిషాలకు పూజా కార్యక్రమాలకు హాజరు కావడానికి గవర్నర్ నరసింహన్ అంగీకరించినట్లు ఉత్సవ సమితి అధ్యక్షుడు సుదర్శన్ తెలిపారు. గవర్నర్‌ను పూజకు ఆహ్వానించిన వారిలో గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షుడు దానం నాగేందర్ సహా పలువురు ఉన్నారు. -
పుణ్యస్నానమాచరించిన గవర్నర్ దంపతులు
రాజమండ్రి : గవర్నర్ నరసింహన్ దంపతులు సోమవారం రాజమండ్రిలోని సరస్వతి పుష్కర ఘాట్ లో పుణ్యస్నానం చేశారు. సోమవారం ఉదయం గవర్నర్ దంపతులు హెలికాప్టర్లో హైదరాబాద్ నుంచి రాజమండ్రి చేరుకున్నారు. అధికారులు ఈ సందర్భంగా వారికి ఘనస్వాగతం పలికారు. సరస్వతీ ఘాట్‌లో పుష్కర స్నానమాచరించారు. అర్చకులు గోదావరి పుష్కర ప్రాశస్త్యాన్ని గవర్నర్ దంపతులకు వివరించారు. గవర్నర్ రాక సందర్భంగా రాజమండ్రిలో గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. రాజమండ్రి నుంచి గవర్నర్ భద్రాచలం బయలుదేరి వెళతారు. అక్కడ పవిత్ర స్నానం చేసి సీతారామస్వామిని దర్శించుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో హైదరాబాద్‌కు వస్తారు. -
ఓటు వేసిన గవర్నర్ దంపతులు
హైదరాబాద్ : రాష్ట్ర గవర్నర్ నరసింహన్ దంపతులు బుధవారం ఉదయం ఓటు వేశారు. గవర్నర్, ఆయన సతీమణి విమలా నరసింహన్ ఖైరతాబాద్ ఎంఎస్ మక్తాలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా నరసింహన్ ఓటు వేసే క్రమంలో ఈవీఎం మెరాయించటంతో అధికారులు ఈవీఎంను సరిచేసారు. అనంతరం గవర్నర్ దంపతులు ఓటు వేశారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ ఓటు హక్కు ఎంతో విలువైనదని, దాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. ఓటు హక్కు వినియోగించుకున్న పలువురు రాజకీయ నేతలు *ఖైరతాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయారెడ్డి ఫిల్మ్ నగర్లో ఓటు వేశారు. *చిక్కడపల్లిలో సీపీఎం నేత రాఘవులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. *బీజేపీ అభ్యర్థి డాక్టర్ లక్ష్మణ్ చిక్కడపల్లిలో ఓటు వేశారు. *బర్కత్‌పురాలో బీజేపీ నేత కిషన్ రెడ్డి ఓటు వేశారు. * డీజీపీ ప్రసాదరావు మసబ్ ట్యాంక్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.