గవర్నర్‌ను ఆహ్వానిస్తున్న దానం, సుదర్శన్ తదితరులు
ముషీరాబాద్ (హైదరాబాద్): వినాయక చతుర్ధి సందర్భంగా ఈ నెల 17వ తేదీన నిర్వహించే తొలి పూజకు ఖైరతాబాద్ గణపతి ఉత్సవ నిర్వాహకులు గవర్నర్ నరసింహన్ దంపతులను ప్రత్యేకంగా ఆహ్వానించారు. 17వ తేదీ ఉదయం 9.45 నిమిషాలకు పూజా కార్యక్రమాలకు హాజరు కావడానికి గవర్నర్ నరసింహన్ అంగీకరించినట్లు ఉత్సవ సమితి అధ్యక్షుడు సుదర్శన్ తెలిపారు. గవర్నర్‌ను పూజకు ఆహ్వానించిన వారిలో గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షుడు దానం నాగేందర్ సహా పలువురు ఉన్నారు.