
సాక్షి, హైదరాబాద్: అనుమానాస్పద స్థితిలో మైనర్ బాలిక అదృశ్యమైంది. ఈ ఘటన జూబ్లీ హిల్స్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.ఎస్ఐ శేఖర్ తెలిపిన మేరకు...కార్మిక నగర్ బ్రాహ్మ శంకర్ నగర్ లో నివసించే మైనర్ బాలిక ఎం.శాంతి (17) ఈ నెల 17న తన మేనమామ బ్రాహ్మజీ ఇంటికి వచ్చింది. కొద్ది సేపటి తరువాత పని వుందంటూ బయటకి వెళ్లి తిరిగి రాలేదు. బ్రాహ్మజీ అన్ని ప్రాంతాల్లో గాలించాడు. బంధు మిత్రుల ఇళ్ళల్లో ఆరా తీసిన ఆచూకీ లభించలేదు. దీంతో పోలసులు కి ఫిర్యాదు చేశాడు. వివరాలకు 9490616589 ఫోన్ చేయాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment