‘కొందరి రాజకీయాలతో ఆటకు ఈ స్థితి’
హైదరాబాద్: పాఠశాలల్లో ఆటలు ఆడించాల్సి ఉన్నా ఏ ఒక్క స్కూల్ ఆటలకు ప్రాధ్యాన్యత ఇవ్వడం లేదని గవర్నర్ నరసింహన్ వ్యాఖ్యానించారు. నగరంలో ఫుట్‌బాల్ అకాడమీ జింఖాన గ్రౌండ్‌లో నిర్వహిస్తున్న స్కూల్ ఫుట్‌బాల్ లీగ్‌ను ఆయన బుధవారం ప్రారంభించారు. పాఠశాలల్లో ఆటల నిర్వహణపై విద్యాధికారులు, స్పోర్ట్స్ అథారిటీ దృష్టి సారించాలని సూచించారు.
తల్లిదండ్రులు కూగా పిల్లల్ని చదువుతో పాటు ఆటలాడించేలా చూడాలన్నారు. గతంలో హైదరాబాద్ నుంచి ఫుట్‌బాల్‌లో ఏడుగురు ఒలింపియన్స్ ఉండేవారని, కొందరి రాజకీయాల వల్ల ఫుట్‌బాల్ ఈ స్థితిలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నగరానికి ఫుట్‌బాల్‌లో పూర్వ వైభవం రావాలని ఆయన కోరారు.
అంతర్జాతీయ ఆటగాళ్లను తయారు చేసేందుకు హైదరాబాద్ ఫుట్‌బాల్ అకాడమి చేస్తున్న కృషికి గవర్నర్ అభినందనలు తెలిపారు. ఈ లీగ్‌లో 12 స్కూల్ టీమ్స్ పాల్గొంటున్నాయి. ఈ పోటీలు ఎనిమిది వీకెండ్స్ జరగనున్నాయి.