నాగార్జునసాగర్: నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) నిపుణుల బృందం బుధవారం నాగార్జునసాగర్ డ్యామ్ దిగువన గల ప్రధాన, కుడికాల్వ విద్యుదుత్పత్తి కేంద్రాలను సందర్శించింది. బృందం సభ్యులు ముందుగా విజయవిహా ర్ బోర్డురూమ్‌లో సీడబ్ల్యూసీ డైరెక్టర్ రమేశ్‌కు మార్ అధ్యక్షతన సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా సాగర్ ప్రాజెక్టు నీటినిల్వ సామర్థ్యం, భద్రత, నీటి వినియోగం, విద్యుదుత్పత్తి, జలా శయంలో ఎంత నీరున్నపుడు కుడి కాల్వపై విద్యు త్ ఉత్పత్తి అవుతుంది, ప్రధాన విద్యుదుత్పాదన కేంద్రంలో టర్బైన్ల సంఖ్య, ఏయే టర్బైన్ నుంచి ఎంత విద్యుత్ ఉత్పత్తి అవుతుంది? దిగువ టెయిల్‌పాండ్‌లోకి నీటిని విడుదల చేస్తూ విద్యు దుత్పాదన అనంతరం తిరిగి నీటిని జలాశయంలోకి ఎత్తిపోసేందుకు టర్బైన్లను పంప్‌మోడ్‌కు ఎప్పుడు మార్చారు వంటి అంశాలపై చర్చించారు.
జెన్‌కో చీఫ్ ఇంజనీర్ మంగేశ్‌కుమార్ సభ్యు ల సందేహాలకు సమాధానాలు చెప్పారు. అనంతరం రూట్‌మ్యాప్‌తో జల విద్యుదుత్పాదన కేంద్రాలను సందర్శించారు. సాయంత్రం వారు లాంచీలో నాగార్జునకొండకు వెళ్లారు.
ఈ కార్యక్రమంలో సీడబ్ల్యూసీ మరో డైరెక్టర్ ఆశిశ్‌కుమార్, నేష నల్ డ్యామ్‌సేఫ్టీ అథారిటీ డైరెక్టర్ మహేంద్రసింగ్, డిప్యూటీ డైరెక్టర్ మహ్మద్‌జిషన్, సాంకేతిక నిపు ణులు రాకేశ్, స్టేట్‌డ్యామ్ సేఫ్టీ అథారిటీ చీఫ్ ఇంజనీర్ కుమార్, ఎస్‌ఈ మురళీకృష్ణ, ఆర్గనైజేషన్ సీఈ ప్రమీల, ఎస్‌ఈ శ్రీనివాసులు, ఈఈ విజ యలక్ష్మి, డీఈ సతీశ్, నాగార్జుసాగర్ ప్రాజెక్టు సీఈ అజయ్‌కుమార్, ఎస్‌ఈ నాగేశ్వర్‌రావు, ఈఈ మల్లికార్జున్‌రావు, ఆంధ్రప్రదేశ్ సీఈ మురళీ«ధర్ రెడ్డి, కృష్ణా రివర్‌బోర్డు ఎస్‌ఈ వరలక్ష్మీదేవి, ఈఈ హరి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment