
ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు
సాక్షి, తిరుపతి: ఎన్నికల కమిషనర్ రమేష్‌కుమార్‌ను దుష్టశక్తులు ఆవహించాయని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు విమర్శించారు. మంగళవారం ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికలను కరోనా సాకుతో వాయిదా వేయడాన్ని తప్పుబట్టారు. చంద్రబాబుతో ఈసీ కుమ్మక్కై వాయిదా నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ధ్వజమెత్తారు. అమరావతిలో గుంపు గుంపులుగా ధర్నాలు చేస్తున్నారని అక్కడ కరోనా లేదా అని శ్రీనివాసులు ప్రశ్నించారు.
‘ఆ నిర్ణయం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు’
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా వైఎస్సార్‌సీపీకి సహకరిస్తున్నారని తెలిపారు. రైల్వేకోడూరులో టీడీపీ మాజీ ఎమ్మెల్సీ దారుణాలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. వైఎస్సార్‌సీపీ దౌర్జన్యాలకు పాల్పడి ఉంటే టీడీపీ నేతలు ఇంత పెద్ద ఎత్తున నామినేషన్లు వేసేవారా అని ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం చిత్తశుద్దితో కృషి చేస్తున్న సీఎం వైఎస్ జగన్‌పై టీడీపీ విమర్శలను శ్రీనివాసులు ఖండించారు. (పల్లె ప్రగతికి విఘాతం )
Comments
Please login to add a commentAdd a comment