సాక్షి, విజయవాడ: కరోనా వైరస్ కారణంగా ఎన్నికలు ఆరు వారాల పాటు వాయిదా వేస్తున్నామని ఎన్నికల కమిషన్ ప్రకటించడం దారుణమని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఏపీలో కరోనా వైరస్ ప్రభావం అంతగా లేదన్నారు. చంద్రబాబుతో ఎన్నికల కమిషనర్ రమేష్‌కుమార్ కుమ్మక్కయ్యారని ఆరోపించారు. ‘కరోనా’పై సంబంధిత శాఖాధికారులు, సీఎస్ తో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలన్నారు. అలా కాకుండా రహస్య ఎజెండా తో ఎలా నిర్ణయం తీసుకున్నారో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే విష్ణు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతోందన్నారు. శాంతి భద్రతలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు పటిష్టమైన ఏర్పాటు చేశారన్నారు. (రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌పై సీఎం జగన్ ఆగ్రహం)
ఎన్నికలు జరగకపోతే రాష్ట్రానికి రావాల్సిన ఐదువేల కోట్ల నిధులు ఆగిపోతాయని ఎమ్మెల్యే విష్ణు చెప్పారు. ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని మరింత ఆర్థికంగా ఇబ్బందులపాలు చేస్తున్నారని మండిపడ్డారు. పేదలకు ఇచ్చే ఇళ్ల పట్టాలకు అడ్డు తగలడం సరికాదన్నారు. చంద్రబాబు, రమేష్‌బాబు కలిసి వ్యవస్థనే భ్రష్టు పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పటికే గవర్నర్‌కు ఫిర్యాదు చేశారని.. స్థానిక సంస్థ ఎన్నికల వాయిదాపై ఆయన వెంటనే స్పందించాలని విష్ణు కోరారు
(చంద్రబాబు కనుసన్నల్లో రమేష్ కుమార్..)
Comments
Please login to add a commentAdd a comment