సాక్షి,అనంతపురం: కుట్రలకు మారుపేరు చంద్రబాబు అని.. స్థానిక ఎన్నికలను ఆయనే వాయిదా వేయించారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ ప్రభంజనం చూసి చంద్రబాబు భయపడ్డారని తెలిపారు. ‘‘రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్‌కుమార్ చౌదరి చంద్రబాబు మనిషి. కావాలనే ఇంటిపట్టాల పంపిణీ ఆపించి వేశారు. ఏపీలో సంక్షేమ పథకాలు ప్రజలకు అందకుండా చంద్రబాబు సైంధవుడిలా అడ్డుకున్నారని’’ నిప్పులు చెరిగారు. చంద్రబాబు కనుసన్నల్లో పనిచేసే సీపీఐ నేతలు ముఖానికి మాస్క్‌లు కట్టుకుని నిన్ననే ప్రెస్ మీట్ పెట్టారన్నారు. కరోనా వైరస్‌పై ఎల్లో మీడియాతో ప్రముఖంగా వార్తలు రాయించారని విమర్శించారు. వ్యూహాత్మకంగానే స్థానిక ఎన్నికలను చంద్రబాబు వాయిదా వేయించారని ఆయన మండిపడ్డారు.
(కరోనాకు, ఎన్నికల వాయిదాకు సంబంధమేమిటి?)
దేశ ఎన్నికల చరిత్రలో చీకటి రోజు: తలారి రంగయ్య..
దేశ ఎన్నికల చరిత్రలోనే నేడు చీకటి రోజు అని..చంద్రబాబు డైరెక‌్షన్‌లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పనిచేయడం దురదృష్టకరమని ఎంపీ తలారి రంగయ్య అన్నారు. స్థానిక ఎన్నికలు జరిగితేనే ఏపీకి ఐదువేల కోట్లు వస్తాయని పేర్కొన్నారు. ఇళ్ల పట్టాల పంపిణీని ఆపే అధికారం ఎన్నికల కమిషనర్‌కు లేదన్నారు. సంక్షేమ పథకాలను ప్రజలకు అందకుండా చేయడానికి టీడీపీ కుట్రలు చేస్తోందని ధ్వజమెత్తారు. ఏపీ అభివృద్ధి చంద్రబాబుకు ఇష్టం లేదా.. వైఎస్సార్‌సీపీ మెజార్టీ స్థానాల్లో ఏకగ్రీవం అయితే ఎన్నికలు నిలిపేస్తారా అంటూ ఎంపీ రంగయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
(చంద్రబాబు కనుసన్నల్లో రమేష్ కుమార్.. )
Comments
Please login to add a commentAdd a comment