సాక్షి, అనంతపురం: సామాజిక దూరం పాటించమంటే.. ప్రతిపక్ష నేత చంద్రబాబు సమాజానికే దూరంగా ఉంటున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ ఇక్బాల్ విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు హైదరాబాద్‌లో ఉంటూ ఏపీ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతలు అపోహలు సృష్టించి.. ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు విద్వేషాలను రెచ్చగొడుతున్నారని నిప్పులు చెరిగారు. ఏపీని ఆర్థికంగా ఇబ్బందుల్లో పడేసిన ఘనుడు చంద్రబాబేనని తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు.
(కోవిడ్-19 నివారణ చర్యలపై సీఎం జగన్ సమీక్ష)
కరోనాపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వాస్తవాలు చెబుతున్నారని.. కరోనాతో జీవించాల్సిందేనని ఆయన నిర్భయంగా చెప్పారని తెలిపారు. నిపుణులు మాటలనే సీఎం వెల్లడిస్తున్నారని పేర్కొన్నారు. పాజిటివ్ కేసులు దాచిపెట్టాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. హెరిటేజ్ ఉద్యోగికి కరోనా వచ్చిన విషయాన్ని చంద్రబాబు ఎందుకు దాచిపెట్టారో సమాధానం చెప్పాలన్నారు. కరోనా వ్యాక్సిన్ వచ్చేవరకు చంద్రబాబు గడప దాటరా అంటూ ఆయన ఎద్దేవా చేశారు. కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించడంలో దేశంలోనే ఏపీ ప్రథమ స్థానంలో ఉందని ఎమ్మెల్సీ ఇక్బాల్ పేర్కొన్నారు.
(సీఎం జగన్ మాటలు అక్షర సత్యం: బుగ్గన)
Comments
Please login to add a commentAdd a comment